train passengers
-
వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
న్యూఢిల్లీ: వాట్సాప్ నంబర్‌తో కావాల్సిన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసే సౌకర్యం రైలు ప్రయాణీకులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బోట్ ప్రయాణికులకు మీల్స్‌ను బుక్ చేస్తుంది. ఈ కేటరింగ్ సేవల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్సైట్ www.catering.irctc.co.in తోపాటు ఈ–కేటరింగ్ యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపింది. ఇ–టికెట్ బుక్ చేసుకుని, ఇ–కేటరింగ్ సేవలకు ఆప్షన్ ఇచ్చిన ప్రయాణికులకు వాట్సాప్ నంబర్ నుంచి మెసేజీ వెళ్తుంది. దాని ద్వారా ఆ మార్గంలోని స్టేషన్లలో నచ్చిన రెస్టారెంట్లలో మీల్స్ బుక్ చేసుకోవచ్చు. -
ఆర్ఏసీ.. ఉండదిక వెయిట్ అండ్ సీ
సాక్షి, అమరావతి: రైళ్లలో రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తరువాత ఆర్ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) జాబితాలో ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లను పారదర్శకంగా కేటాయించేందుకు, కొందరు టీసీల అవినీతికి చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం రైల్వే టీసీలకు ‘హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (హెచ్‌హెచ్‌టీ)’ ట్యాబ్‌లు అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్ పరిధిలోని 16 రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. టీసీలకు హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించింది. ఆ రైళ్లలో రిజర్వేషన్ రద్దు, ఆర్ఏసీ జాబితాలో ఉన్నవారికి బెర్త్‌ల కేటాయింపు పక్కాగా చేసేందుకు మార్గం సుగమమైంది. సాధారణంగా టికెట్ రిజర్వ్ చేసుకున్న రైలు ప్రయాణికులకు ఆర్ఏసీ వస్తే ఒకటే కంగారు పుడుతుంది. ఎవరు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకున్నారో.. ఆ బెర్త్ ఎవరికి కేటాయిస్తారో కూడా తెలీదు. దాంతో రైల్వే స్టేషన్లో అడుగుపెట్టిన క్షణం నుంచీ బెర్త్ కన్ఫర్మేషన్ కోసం టీసీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. టీసీ ప్లాట్‌ఫామ్ మీద ఉన్నా.. రైలులో ఉన్నా ఆయన వెంటపడుతూనే ఉంటారు. అయితే.. ఎందరు రిజర్వేషన్లు రద్దు చేసుకున్నారో.. వాటిని ఎవరికి ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. ఈ విషయంలో రైల్వే కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులకు సైతం నిర్దిష్టమైన సమాచారం ఉండదు. దానివల్ల వాటి కేటాయింపు అంతా టీసీల ఇష్టం మీద ఆధారపడి ఉంటోంది. కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుని ప్రాధాన్యత క్రమంలో లేని వారికి కూడా బెర్త్‌లు కేటాయిస్తూ ఉంటారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికే హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. త్వరలో మరిన్ని రైళ్లలో.. గతంలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని టీసీలకు ఈ ట్యాబ్‌లను అందించారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 రైళ్లలో టీసీలకు వీటిని అందించారు. రెండువైపులా తిరిగే 3 దురంతో ఎక్స్‌ప్రెస్‌లు (సికింద్రాబాద్–విశాఖ, సికింద్రాబాద్–నిజాముద్దీన్, సికింద్రాబాద్–లోకమాన్య తిలక్ టెర్మినల్), 5 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు (శాతవాహన, పినాకిని, రత్నాచల్, కాగజ్ నగర్, విజయవాడ ఇంటర్ సిటీ)లలో వీటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరిన్ని రైళ్లలోని టీసీలకూ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పారదర్శకత కోసమే.. ► ఈ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లతో టీసీలు బెర్త్‌ల కేటాయింపును పరిశీలిస్తారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వస్తే ఆ ట్యాబ్‌లోనే టిక్ పెడతారు. ఆ వివరాలన్నీ రైల్వే జోనల్, డివిజనల్ కార్యాలయాలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ► రిజర్వేషన్ రద్దు చేసుకున్న వివరాలు కూడా ఆ ట్యాబ్‌లలో అందుబాటులో ఉంటాయి. ► రద్దు చేసుకున్న బెర్త్‌లను ఆర్ఏసీలో వరుస క్రమంలో ఉన్నవారికే కేటాయించాలి. ఆ వెంటనే ట్యాబ్‌లో టిక్ పెట్టాలి. ► ఎవరైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జోనల్, డివిజనల్ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా గుర్తిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారు. ► ఈ విధానంతో బెర్త్‌ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా లంచాలకు.. ఇతర అక్రమాలకు అవకాశం ఉండదు. ► రిజర్వేషన్ బోగీలలో అనధికారికంగా ఎవరూ ప్రయాణించడానికి అవకాశం ఉండదు. ఎవరూ ఎలాంటి సాకులు చెప్పేందుకు కూడా వీలుండదు. ► ఆర్పీఎఫ్ సిబ్బంది తరచూ తనిఖీలు చేస్తూ రిజర్వేషన్ బోగీలలో అనధికారికంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారు. -
రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అన్‌లాక్–4లో భాగంగా ప్రకటించిన విధంగా శనివారం నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైళ్లలో, అలాగే ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, హోం మినిస్ట్రీ సూచించిన ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ♦కేవలం కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులు మాత్రమే రైలెక్కేందుకు స్టేషన్లోకి అనుమతిస్తారు. ♦ప్రయాణికులందరూ రైలెక్కేటప్పుడు, ప్రయాణంలోనూ కచ్చితంగా మాస్్క, ఫేస్ షీల్డ్ ఉపయోగించాలి. ♦ధర్మల్ స్క్రీనింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. ♦ప్రయాణికులందరూ స్టేషన్లలో, రైలులోనూ భౌతిక దూరం పాటించాలి. ♦ఆయా గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులు ఆయా రాష్ట్ర్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య నియమావళి (హెల్త్ ప్రోటోకాల్స్)ని అనుసరించాలి. ♦ప్రయాణికులు ప్రయాణ సమయంలో తమ సొంత బ్లాంకెట్స్‌ను వెంట తెచ్చుకోవాలి. -
కరోనా: ప్రయాణ చరిత్ర పరిశీలన
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అలాగని ప్రభుత్వం, అధికారులు తేలికగా తీసుకోవడం లేదు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మరింత లోతుగా పరిశీలన చేస్తున్నారు. ప్రయాణాల చరిత్ర ఆ«ధారంగా ట్రాక్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ప్రతి పది మందికీ ఒక కోవిడ్ ఆఫీసర్‌ను నియమించారు. వారిని పర్యవేక్షించేందుకు మండలానికో స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పా టు చేయగా, జిల్లా స్థాయిలో కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. విదేశాల నుంచి 1445 మంది రాక కరోనా ప్రభావం పెరిగిన నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు 1445 మంది వచ్చారు. వారందర్నీ ప్రత్యే క క్వారంటైన్‌లోనూ, హోమ్ క్వారంటైన్లో పెట్టా రు. లక్షణాలు ఉన్న వారికి ఎప్పటికప్పుడు శాంపి ల్స్ తీసి పరీక్షలు చేశారు. ఇంతవరకైతే విదేశాల నుంచి వచ్చిన వారెవరికీ పాజిటివ్ రాలేదు. దా దాపు శాంపిల్స్ అన్నీ నెగిటివ్ ఫలితాలొచ్చా యి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అంతా దాదాపు 14 రోజులకు పైగా క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. దీంతో వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కని్పంచడం లేదు. ప్రయాణ చరిత్ర ఆధారంగా.. విదేశాల నుంచి వచ్చిన వారినే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి విమానాలు, రైళ్ల ద్వారా జిల్లాకు వచ్చిన వారి వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విమానయాన, రైల్వే శాఖ వచ్చిన వివరాలు ఆధారంగా సంబంధిత వ్యక్తులను గుర్తిస్తున్నారు. కొందర్ని ఫోన్లో ఆరా తీయగా, మరికొందర్ని చిరునామాల ఆ«ధారంగా చేసుకుని గుర్తిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, వలంటీర్లు, మెడికల్ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మొ త్తానికి ఫిబ్రవరి నెల నుంచి ట్రావెల్ హిస్టరీ చూస్తున్నారు. ఏ ఒక్కర్నీ విడిచి పెట్టడం లేదు. లాక్డౌన్ తర్వాత జిల్లాలోకి 5009 మంది లాక్డౌన్ అమలు తర్వాత జిల్లాలోకి 5009 మంది వచ్చినట్టు సమాచారం. వేర్వేరు మార్గాల ద్వారా వారంతా జిల్లాలోకి ప్రవేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి వచ్చిన సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిలో ముంబై నుంచి 600 మంది, ఢిల్లీ నుంచి 400 మంది వచ్చిన వారు ఉన్నారు. మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చారు. వారందర్నీ అధికారులు ఇ ప్పటికే గుర్తించారు. వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఇలా వచ్చిన 10 మందికి ఒక కోవి డ్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తున్నారు. కేటాయించిన 10మంది వద్దకు ప్రతి రోజూ కోవిడ్ ఆఫీసర్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వారి వద్దకు వెళ్లాలంటే తప్పనిసరిగా స్కాన్ చేయాలి. అక్కడ చేసిన స్కాన్ జిల్లా అధికా రుల వద్ద అప్డేట్ అవుతుంది. దీంతో కోవిడ్ ఆఫీ సర్లు వారికి కేటాయించిన 10మంది వద్దకు వెళ్తున్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు వేలల్లో ఉండటంతో వారందరి కోసం వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసు కుంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు గానీ కనిపిస్తే వెంటనే నోట్ చేస్తున్నారు. నోట్ చేసినవన్నీ వైద్యాధికారుల లాగిన్లోకి వచ్చేస్తున్నాయి. వాటి ఆధారంగా త దుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శాంపిల్స్ సేకరణలో కూడా జోరు పెంచారు. సో మవారం ఒక్కరోజే 135 శాంపిల్స్ తీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో శాంపిల్స్ తీశారు. ఇకపై శాంపిల్స్ ఫలితాలు కూడా వేగంగా రానున్నాయి. ఇంతవరకు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు పరీక్షల కోసం పంపించారు. తాజాగా విశాఖపట్నంలో కూ డా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం కావడంతో సుదూర ప్రాంతమైన కాకినాడకు కాకుండా విశాఖపట్నంకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాల వెల్లడి కూడా వేగవంతం కానుంది. -
కరోనా: తొలగిన ఢిల్లీ టెన్షన్
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అధికారులు, ప్రజలకు కరోనా వ్యాధికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రయాణించిన వారి విషయంలో ఉత్కంఠ తొలగిపోయింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ మత ప్రచార సభలో పాల్గొన్న వారికి ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున జిల్లా మొత్తం ఆందోళనకు గురైంది. జిల్లా నుంచి ఎవరూ ఆ సభకు హాజరు కానప్పటికీ వారు వచ్చిన రైళ్లలో జిల్లాకు చెందిన సుమారు 76 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో జిల్లా అధికారులు ప్రయాణించిన 76 మందిని గుర్తించారు. వీరందరికీ దశల వారీగా పరీక్షలు జరపగా అందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సా యంత్రానికి 135 మందికి సంబంధించిన నమూనాలు పంపించగా 102 రిపోర్టులు నెగెటివ్‌గా తేలా యి. 33 రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో దాదాపు 15 నమూనాలు ఆదివారం సాయంత్రం పంపించారు. జిల్లా వాసులు ఏప్రిల్ 30వ తేదీ వరకు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్న ధీమా వద్దని ఇదే పంథాను కొనసాగించి జిల్లాలో వ్యాధి ప్రవేశించకుండా చూడాలని వారంటున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వస్తుండటం వల్ల వాటిని కూడా పూర్తిగా కడిగి, ఎండలో ఉంచిన తర్వాతనే వినియోగించాలని సూచిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి బయటే స్నానం చేసి సబ్బును రెండు సార్లు రాసుకోవాలని చెబుతున్నారు. వ్రస్తాలను కూడా స్నానానికి ముందే తడిపివేయాలని, పసుపు, వేప రాసుకోవడం ద్వారా క్రిమికీటకాలను దూరంగా ఉంచవచ్చని ఆయుర్వేద, ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన 350 మందికి పైగా మత్స్యకారులు, ఇతరులు పడవల ద్వారా జిల్లాకు చేరుకున్నారని, వారిపై దృష్టిసారించి పరీక్షలు జరపాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు సమాచారమందింది. వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం సరికి 350 మందిని గుర్తించి వారికి క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు జరిపించాలని అధికారులు నిర్ణయించారు. వారం రోజులుగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వివరాలు తెలిస్తే, చుట్టుపక్కల వారు జిల్లాలొ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు, 104 కు తెలియజేయాలని జిల్లా అధికారులు ప్రజలను కోరుతున్నారు. -
టికెట్ల బుకింగ్‌కు ఇక ఏజెంట్లతో పనిలేదు: గోయల్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు టికెట్ల కోసం ప్రైవేట్ విక్రేతలు, ఏజెంట్లపై ఆధారపడే అవసరం ఇకపై ఉండదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో రైల్వే శాఖ గ్రాంట్ల డిమాండ్‌పై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే అక్రమమార్గాల్లో బుక్ చేసుకునే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్ఫోన్ల సాయంతో ప్రయాణికులే స్వయంగా టికెట్లను బుక్ చేసుకుంటున్నందున ఇకపై ఏజెంట్ల అవసరం లేకుండా చేస్తామన్నారు. సొంతంగా బుక్ చేసుకోలేని వారు ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లవచ్చని తెలిపారు. రైల్వేల్లోకి ప్రైవేట్ భాగస్వామ్యంతో వచ్చే 12 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. -
వారానికి 5వేల మంది చొప్పున ప్రయాణికులు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోకు సిటీజనుల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ప్రతివారం సరాసరిన మెట్రో ప్రయాణీకుల సంఖ్యలో 5వేల మేర పెరుగుదల నమోదవుతోందని మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్న విషయం విదితమే. ఈ మార్గంలో నిత్యం సుమారు 3లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నాయి. ఖైరతాబాద్ మహాగణపతిని వీక్షించేందుకు వేలాది మంది మెట్రో రైళ్లలోనే తరలివస్తున్నారని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఆదివారం అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో సుమారు 70వేల మంది ప్రయాణికులు ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యారని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య, నిర్వహణ సిబ్బంది సంఖ్యను పెంచామన్నారు. ప్రతి నాలుగున్నర నిమిషాలకో మెట్రో రైలు ఈ రెండు రూట్లలో అందుబాటులో ఉందన్నారు. చివరి మెట్రో రైలు అమీర్‌పేట్ నుంచి రాత్రి 11:30 గంటలకు ఎల్బీనగర్, నాగోల్ మార్గాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 4లక్షల మార్కును చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని, అక్టోబర్‌లో హైటెక్‌సిటీ–రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. -
రైల్వే ప్రయాణికులు తీవ్ర నిరాశ..
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల తర్వాత తిరిగి మొదలైన ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీలతో ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్స్‌పై వెనకడుగు వేస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం సర్వీస్ చార్జీలను తొలగించడంతో ఆన్లైన్ బుకింగ్స్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని వర్గాల ప్రయాణికులు ఆన్లైన్లోనే టికెట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రధాన బుకింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రయాణికులు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా సొంతంగా టికెట్లను బుక్ చేసుకున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు రైల్వే చేపట్టిన డిజిటలైజేషన్‌కు సైతం ఊతమిచ్చింది. కానీ ఇటీవల మళ్లీ సర్వీస్ చార్జీలను అమల్లోకి తేవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆన్లైన్లోనే 65శాతం... దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు రిజర్వేషన్లపై రాకపోకలు సాగిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్ల నుంచి ప్రతిరోజు సుమారు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య నడుస్తాయి. ఏసీ, స్లీపర్ కోచ్‌లకు ఉన్న డిమాండ్ మేరకు సాధారణంగా ప్రయాణికులు 3 నెలల ముందే బుక్ చేసుకుంటారు. పండగలు, వరుస సెలవుల లాంటి ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ మరింత పెరుగుతుంది. నగరంలోని అన్ని ప్రధాన స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ డిమాండ్‌కు తగిన కౌంటర్లు లేకపోవడం, సిబ్బంది కొరత, పని గంటలు తదితర సమస్యల దృష్ట్యా ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు విక్రయించే రిజర్వేషన్ టికెట్లలో 65శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ కావడం గమనార్హం. కేవలం 35శాతం టికెట్లు కౌంటర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రయాణికులు ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుంటే చాలు... క్షణాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తాజాగా 10శాతం తగ్గుదల... రెండేళ్ల క్రితం తొలగించిన సర్వీస్ చార్జీలను తిరిగి విధించడంతో ప్రయాణికులు ప్రస్తుతం ఒక్కో స్లీపర్ టికెట్ బుకింగ్‌కు రూ.18, ఒక్కో ఏసీ టికెట్ బుకింగ్ కోసం రూ.40 చెల్లించాల్సి వస్తోంది. మొదటి నుంచి ఆన్‌లైన్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తిరిగి అమల్లోకి వచ్చిన భారాన్ని యథావిధిగా భరిస్తున్నప్పటికీ.. ఈ రెండేళ్లలో కొత్తగా ఆన్లైన్ పరిధిలోకి వచ్చినవాళ్లు మాత్రం కౌంటర్ల వైపు మళ్లుతున్నారు. ఇటీవల కాలంలో సుమారు 10 శాతం మంది ప్రయాణికులు ఆన్లైన్ బుకింగ్‌ల నుంచి కౌంటర్ బుకింగ్‌లకు మళ్లినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8వరకు పని చేస్తాయి. ఆదివారం మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే ఉంటాయి. కానీ చాలా చోట్ల సిబ్బంది కొరత కారణంగా ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా కౌంటర్లు పని చేయడం లేదు. ఐఆర్సీటీసీ ఆన్లైన్లో రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 12:15 వరకు అంటే 30 నిమిషాలు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉండదు. మిగతా అన్ని సమయాల్లోనూ ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉన్న ఆన్లైన్ బుకింగ్‌లపై తాజాగా విధించిన సర్వీస్ చార్జీలను శాశ్వతంగా తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఇందూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
సాక్షి, నిజామాబాద్ అర్బన్: అయ్యప్ప భక్తుల కోసం రైల్వేశాఖ రెండు ప్రత్యేక రైలు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 07613 నిజామాబాద్– కొల్లాం రైలు డిసెంబర్ 6న నిజామాబాద్ నుంచి మధ్యహ్నం 12.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 చేరుకుంటుంది. ఈ రైలు కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుత్తని, కట్పాడి, వినయంబడి, జోలర్‌పెట్టాయి, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, ఒట్టపాలేం, త్రిసూర్, అలువా, ఎర్నకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగునూర్, మవేలికర, కల్యకులం మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది. ఈ రైలులో సెకండ్, థర్డ్‌క్లాస్ ఏసీ బోగిలు, ఏసీ చైర్‌కారు, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగిలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఔరంగాబాద్– కొల్లాం మధ్య.. వచ్చేనెల 7న ఔరంగాబాద్– కొల్లాం రైలు నం.07505 నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు డిసెంబర్ 7న ఔరంగాబాద్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేరి కొల్లాంకు డిసెంబర్ 9న ఉదయం 4.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జాల్నా, సేలు, పర్బణి, పూర్ణ, నాందేడ్, ముత్కేడ్, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వినయంబడి, జోలర్‌పెట్టాయి, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, ఒట్టపాలేం, త్రిసూర్, అలువా, ఎర్నకులం టౌన్, కొట్టాయం, చెంగచెర్రి, తిరువల్ల, చెంగునూర్, మవేలికర, కల్యకులం మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది. తిరుపతి– ఔరంగాబాద్ మధ్య... తిరుపతి– ఔరంగాబాద్ మధ్య డిసెంబర్ 11న ప్రత్యేక రైలు నడుపనున్నారు. రైలు నం.07410 తిరుపతిలో డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు బయలుదేరి కాచిగూడకు రాత్రి 11.25 గంటలకు, ఔరంగాబాద్‌కు డిసెంబర్ 12న ఉదయం 10.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కోడూర్, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, ముద్దనూర్, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూల్ సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ, మల్కాజిగిరి, బొల్లారం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మబాద్, ముత్కేడ్, నాందేడ్, పూర్ణ, పర్బణి, జల్నా మీదుగా ఔరంగాబాద్‌కు చేరుకుంటుంది. అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని కోరారు. -
త్వరలో రైళ్లలో ‘జీరో–ఎఫ్ఐఆర్’
న్యూఢిల్లీ: వేధింపులు, దొంగతనం, మహిళలపై నేరాల వంటివి రైళ్లలో చోటుచేసుకున్నప్పుడు ప్రయాణికులు ఉన్నపళంగా మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇలా వచ్చిన ఫిర్యాదులను ‘జీరో ఎఫ్ఐఆర్’గా పేర్కొంటారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే రైల్వే రక్షక దళ (ఆర్పీఎఫ్) సిబ్బంది స్పందించి దర్యాప్తు ప్రారంభిస్తారని ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ చెప్పారు. ప్రస్తుతం ఏదైనా నేరం జరిగితే ప్రయాణికులు ఫిర్యాదు చేయాలంటే సంబంధిత పత్రాన్ని టీటీఈ నుంచి తీసుకుని, నింపి తర్వాతి స్టేషన్లో ఆర్పీఎఫ్ లేదా జీఆర్పీ సిబ్బందికి అందజేయాల్సి ఉంది. ఈ జాప్యాన్ని నివారించి, నేరం రైల్లో ఎప్పుడు, ఏ ప్రదేశంలో జరిగినా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ యాప్‌ను రైల్వే తీసుకొస్తోంది. ఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), టీటీఈ, టీసీ తదితరులకు ఈ యాప్ అనుసంధానమై ఉంటుంది. ఆఫ్లైన్లోనూ పనిచేసే ఈ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా పానిక్ బటన్ కూడా ఉంటుంది. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం : ప్రయాణీకులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రయాణీకులకు భారీ షాక్ ఇచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉచిత బీమాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం చేపట్టిన ఉచిత బీమా సౌకర్యాన్ని త్వరలో నిలిపివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. రైల్వేలు సెప్టెంబర్ 1నుంచి ప్రయాణీకులకు ఉచితంగా ప్రయాణ బీమాను నిలిపివేయనుందనీ, "బీమా ఐచ్ఛికం" అని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రైల్వే ప్రయాణికులు వెబ్ సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అయితే ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా 2017,డిసెంబరు నుంచి ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సాహించేందుకు ఐఆర్సిటిసిద్వారా రైల్వేశాఖ ఈ ఉచిత బీమాను తీసుకొచ్చింది. రైలు ప్రమాదాలు లేదా ఇతర సంఘటనల్లో గాయపడినవారు లేదా చనిపోయినవారి కుటుంబీకులకు పరిహారం అందిస్తారు. రైలు ప్రయాణం సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు గరిష్టంగా 10 లక్షల రూపాయలు, వికలాంగుడయితే 7.5 లక్షల రూపాయలు, గాయపడినట్లయితే రూ. 2 లక్షలు అందిస్తోంది. అలాగే మృతదేహాలను తరలించేందుకు రూ. 10వేలు కూడా అందిస్తుంది. కాగా ఉచిత బీమా సౌకర్యం వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీమా కంపెనీల నుంచి రూ. 3.5 కోట్లు పంపిణీ చేసినట్టు ఇటీవల రైల్వే శాఖ వెల్లడించింది. -
ఆన్లైన్లో రిఫండ్ స్టేటస్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు తాము రద్దు చేసుకున్న టికెట్ల రిఫండ్ స్టేటస్‌ను ఆన్లైన్లో తెలుసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం ట్ఛజunఛీ.జీnఛీజ్చీnట్చజీ ఠ్చీy.జౌఠి.జీn సైట్లోకి లాగిన్ అయ్యి పీఎన్ఆర్ నమోదు చేస్తే సరిపోతుంది. ఈ సదుపాయం ఆన్లైన్లో తీసుకున్న టికెట్లతోపాటు టికెట్ కౌంటర్ల వద్ద కొనుగోలు చేసిన టికెట్లకూ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. పారదర్శకతను ప్రోత్సహించేందుకు, వాపసయ్యే సొమ్ము కోసం ప్రయాణికులు ఎదురుచూడకుండా ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డ్ పబ్లిసిటీ డైరెక్టర్ వేద ప్రకాశ్ తెలిపారు. టికెట్లను ఆన్లైన్లో రద్దు చేసుకుంటే ఐదు రోజుల్లోగా ప్రయాణికుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుందనీ, అలాగే, కౌంటర్లలో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసుకు వారం రోజుల సమయం పడుతుందని అన్నారు. -
ప్రయాణికులు పోగొట్టుకున్న బ్యాగు అందజేత
వికారాబాద్: రైలులో ఓ బ్యాగు అనుమానస్పదంగా కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాగును పరిశీలించి ప్రయాణికులు దానిని పోగొట్టుకున్నట్టు గుర్తించి చివరికి వారికి అందజేశారు. వికారాబాద్ ఆర్పీఎఫ్ ఎస్సై ఎంబీ. రాథోడ్ కథనం ప్రకారం వివరాలు.. విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్లే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం మధ్యాహ్నం సమయంలో కాజీపేట రైల్వేస్టేషన్లో భార్గవ్ కుటుంబం ముంబయి వెళ్లడానికి రైలు ఎక్కింది. వీరు బీ2లో సీట్లు బుక్ చేసుకోగా రైలు ఎక్కిన సమయంలో బీ1లో ఎక్కారు. అక్కడి నుంచి బీ2లోకి వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. ఈ క్రమంలో లగేజ్‌లో నుంచి ఒక బ్యాగును బీ1లోనే మరిచిపోయారు. రైలు సికింద్రాబాద్ దాటి వికారాబాద్ వస్తుండగా కొందరు ప్రయాణికులు బ్యాగ్ అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్‌కు రైలు చేరుకోగానే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో పది తులాల వరకు బంగారు ఆభరణాలు, దుస్తులతోపాటు ఓ వివాహ ఆహ్వాన పత్రిక లభించింది. పెండ్లికార్డులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి బ్యాగు పోగొట్టుకున్న వారి వివరాలు సేకరించారు. అనంతరం వారికి ఫోన్ చేసి బ్యాగు వికారాబాద్ పీఎస్‌లో ఉందని వారికి తెలియజేశారు. దీంతో వారు మంగళవారం వికారాబాద్ ఆర్పీఎఫ్ పీఎస్‌కు చేరుకోగా పోలీసులు భార్గవ్‌కు చెందిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా భార్గవ్ పోలీసులకు «కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. రైలులో ప్రయాణిస్తున్నపుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై రాథోడ్ సూచించారు. -
రైలు ప్రయాణికులకు ఊరట
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ సోమవారం తెలిపారు. మచిలీపట్నం– యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నంబర్: 17211)కు ఈ నెల 8 నుంచి డిసెంబర్ 1 వరకు అదనంగా ఒక థర్డ్ ఏసీ బోగీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే యశ్వంత్‌పూర్– మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్(17212)కు ఈ నెల 9 నుంచి డిసెంబర్ 2 వరకు, మచిలీపట్నం–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12749)కు ఈ నెల 6 నుంచి 30 వరకు, సికింద్రాబాద్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్(12750)కు ఈ నెల 7 నుంచి డిసెంబర్ 1 వరకు థర్డ్ ఏసీ బోగీ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, సాంకేతిక కారణాల దృష్ట్యా ఈనెల 6– 12 వరకు విజయవాడ–భద్రాచలం–విజయవాడ రైలు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఈ తేదీల్లో విజయవాడ– భద్రాచలం రైలు (77292) ఉదయం 10కి బయలుదేరుతుందని చెప్పారు. భద్రాచలం– విజయవాడ రైలు (77291) మధ్యాహ్నం 3.45కు బయలుదేరుతుందని పేర్కొన్నారు. -
రైళ్లలో మరిన్ని ఆర్ఏసీ బెర్తులు!
దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లు రిజర్వేషన్ చేయించుకుందామంటే వెయిటింగ్ లిస్టు లేదా ఆర్ఏసీ కనిపిస్తుంది. ఆర్ఏసీ అంటే ఎంతో కొంతవరకు బెర్తు కన్ఫర్మ్ అవుతుందనే ఆశ ఉంటుంది. లేకపోయినా.. ఎలాగోలా ప్రయాణం చేయొచ్చని భావిస్తారు. ఇప్పుడు అలాంటివాళ్ల కోసం రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. మొత్తం అన్ని రైళ్లలోను ఆర్ఏసీ (రిజర్వేషన్ ఎగైనెస్ట్ కాన్సిలేషన్) కింద మరిన్ని బెర్తులను అందుబాటులోకి తేనుంది. స్లీపర్ బోగీలలో ప్రస్తుతం ఐదు ఆర్ఏసీ బెర్తులు మాత్రమే ఉండగా, దాన్ని ఏడుకు పెంచాలని నిర్ణయించింది. సాధారణంగా పూర్తిగా బెర్తు కన్ఫర్మ్ కాకుండా ఆర్ఏసీలోనే ఉండిపోతే.. మనకు కనీసం కూర్చోడానికి సీటు దొరుకుతుంది. ఇలా ఇన్నాళ్లూ ఐదు బెర్తులు అంటే.. పది మందికి సీట్లు ఇస్తుండగా, దాన్ని ఏడు బెర్తులకు.. అంటే 14 సీట్లకు పెంచారు. సైడ్ లోయర్ బెర్తులో ఎదురెదురుగా ఇద్దరి చొప్పున కూర్చోవచ్చు. ఈ నిర్ణయం 2017 జనవరి 16వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఇక థర్డ్ ఏసీ బోగీలలో అయితే ఇప్పుడున్న రెండు బెర్తుల నుంచి నాలుగు బెర్తులకు ఆర్ఏసీ కోటా పెంచారు. అలాగే సెకండ్ ఏసీ బోగీలలో ఇప్పుడున్న రెండు నుంచి మూడు బెర్తులకు ఈ కోటా పెంచారు. కూర్చోడానికి మాత్రమే అవకాశం ఇచ్చినా, ఇందులో పూర్తి చార్జి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మరింతమందికి రైలు ప్రయాణం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు 139కి ఫోన్ చేసి కూలీ, ట్యాక్సీలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ల నుంచి ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సేవలు నిర్ణీత రుసుముపై లభిస్తారుు. టికెట్లు రిజర్వు చేసుకునే సమయంలో పై సేవలు అందుబాటులో ఉన్న రైళ్లు, స్టేషన్ల వివరాలు కనబడుతాయని ఐఆర్సీటీసీ చైర్మన్ ఏకే మనోచ తెలిపారు. -
రైలు ప్రయాణికులకు మరో సౌకర్యం
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు 92 పైసలకే ప్రమాద బీమా అందిస్తున్న ఐఆర్సీటీసీ ఇప్పుడు మరో బీమా పథకం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రైలు ప్రయాణికుల వద్ద ఉన్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్స్‌కు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ అధికారులు, బీమా అధికారులకు మధ్య తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తప్పుడు దావాలపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయని, తాము వారితో తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నామని ఐఆర్సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా గురువారమిక్కడ తెలిపారు. తొలి దశలో ఈ బీమా సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది. -
సరిపడ లేని రైళ్లు ప్రజలకు తిప్పలు
-
సిగ్నల్ బ్లాక్ చేసి రైలులో దోపిడి
ఒంగోలు: ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెం- టంగుటూరు స్టేషన్ల మధ్య గురువారం రైళ్లలో దోపిడీ గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తపంథాలో జరిగిందని గుంతకల్లు రైల్వే ఎస్పీ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.దోపిడీకి పాల్పడిన వారు బీహార్ గ్యాంగ్ సభ్యులు అయి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిగ్నల్ బ్లాక్ చేసి ఈ దోపిడీకి పాల్పడ్డారని సుబ్బారావు వివరించారు. ఈ దోపిడిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిగ్నల్ వ్యవస్థను బ్రేక్ చేయటంతో సెన్సార్లు ఫెయిలయ్యాయని...దీంతో ఆకుపచ్చ లైట్లు వెలగకుండా ఎర్రలైట్లు వెలిగాయి. దాంతో రైలు ఆగింది. రైలులోకి దుండగులు ప్రవేశించి దోపిడికి పాల్పడ్డారని వివరించారు. -
రైలు ప్రయాణికులకు బీమా అవకాశం ఉందా?
ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి ప్రస్తావన సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖపై భారం తగ్గేలా ఏవైనా బీమా కంపెనీల భాగస్వామ్యంతో రైలు ప్రయాణికులకు ప్రమాద బీమా కల్పించే యోచన ఏదైనా ఉందా? అంటూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని సోమవారం ప్రశ్నించారు. అలాంటి సౌకర్యం లేనిపక్షంలో ప్రమాదాల్లో ప్రాణాలు, సామాన్లు కోల్పోయిన ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ఆయన లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమాధానమిస్తూ అలాంటి యోచనేదీ ప్రభుత్వానికి లేదని వివరించారు. బీమా అంశంతో సంబంధం లేకుండా ప్రస్తుతం పరిహారం అందజేస్తున్నట్టు తెలిపారు. -
రైలు చార్జీల మోత
ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రైల్వే ప్రయాణికులపై చార్జీల బాంబు పేలింది. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సర్కారు నెల తిరగకముందే రైల్వే చార్జీలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరిపైనా చార్జీల భారం మోపింది. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టటానికి కొద్ది రోజుల ముందుగా అన్ని తరగతుల ప్రయాణ చార్జీలనూ, సరకు రవాణా చార్జీలనూ పెంచేసింది. రైలు ప్రయాణ చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచగా.. రైల్వే రవాణా చార్జీలను 6.5 శాతం పెంచింది. తద్వారా ఏటా రూ.8వేల కోట్ల మేర ప్రజ లపై నేరుగా భారం మోపింది. పెరిగిన చార్జీలు ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రయాణ చార్జీల పెంపు ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుండగా.. రవాణా చార్జీల పెంపు ప్రభావం పారిశ్రామిక రంగంతో పాటు.. అన్ని రకాల నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీయటం ద్వారా పరోక్షంగా భారాన్ని మరింత పెంచనుంది. రైలు చార్జీల పెంపును ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇంత భారీగా చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపటం నేరపూరితమని ఎన్డీఏ సర్కారుపై మండిపడ్డాయి. చార్జీలను పెంచే ముందుగా పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదని ప్రశ్నించాయి. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రకటించాక.. చార్జీల పెంపు నిర్ణయాన్ని తీసుకోవటంలో ఔచిత్యమేమిటని నిలదీశాయి. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్న వారం రోజుల్లోనే రైల్వే చార్జీల పెంపును ప్రకటించటం గమనార్హం. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన మే 16వ తేదీనే రైల్వేశాఖ చార్జీల పెంపును ప్రకటించింది. పెంపు అదే నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కూడా చెప్పింది. అయితే ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో పెంపు ప్రకటన చేయటం పట్ల తీవ్ర విమర్శలు రావటంతో.. చార్జీల పెంపు అమలుపై రైల్వేబోర్డు వెనక్కు తగ్గింది. చార్జీల పెంపుకు సంబంధించిన వ్యవహారాన్ని తర్వాత రాబోయే ప్రభుత్వానికే అప్పగించాలని రైల్వేబోర్డుకు నిర్దేశిస్తూ నాటి యూపీఏ సర్కారులోని రైల్వేమంత్రి మల్లిఖార్జునఖర్గే ప్రకటన జారీచేశారు. ఈ మేరకు చార్జీల పెంపును నిలిపివేస్తున్నట్లు రైల్వేబోర్డు ఆ వెంటనే అధికారికంగా ప్రకటించింది. ‘నిలిపివేత’ను ఉపసంహరిస్తున్నానంతే... తాజాగా శుక్రవారం రైలు చార్జీల పెంపును ఢిల్లీలో ప్రకటించిన కొత్త రైల్వే మంత్రి సదానంద్గౌడ.. ‘‘మా ముందరి మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేయక తప్పని పరిస్థితి. చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను మాత్రమే నేను ఉపసంహరిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. గత (యూపీఏ) ప్రభుత్వం సమర్పించిన తాత్కాలిక బడ్జెట్లో.. మే 16వ తేదీన ప్రకటించిన చార్జీల పెంపు ప్రాతిపదికగా ఆదాయాన్ని అంచనా వేసిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఖరారు చేసిన చార్జీలను పెంచనిదే వార్షిక వ్యయాన్ని పూర్తిచేయటం సాధ్యం కాదన్నారు. కాబట్టి.. సవరించిన ప్రయాణ చార్జీలు, రవాణా చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నట్లు వివరించారు. దీంతో.. ఈ నెల 25వ తేదీ నుంచి పెంచిన ప్రయాణ, రవాణా చార్జీలు అమలులోకి వస్తాయని తెలిపారు. రైల్వేకు ప్రయాణ విభాగంలో ఏటా 900 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. చమురు ధరలు తగ్గితే ఎఫ్‌ఏసీని సమీక్షిస్తాం: రైల్వేశాఖ చార్జీల పెంపుపై తీవ్ర విమర్శలు రావటంతో రైల్వేశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తాజా పెంపుపై వివరణ ఇచ్చింది. రైల్వే ప్రయాణ చార్జీలను 10 శాతం, రవాణా చార్జీలను 5 శాతం చొప్పున పెంచామని.. అయితే ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఏసీ) కూడా కలవటంతో ఈ పెంపు 14.2 శాతానికి, 6.5 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల ప్రకారం రిటైల్ పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ ధరలను సవరించినట్లు.. ప్రతి ఆరు నెలలకోసారి రైల్వే కూడా ఎఫ్‌ఏసీని సవరిస్తుందని వివరించింది. చమురు ధరల కారణంగా పెంచిన ఎఫ్‌ఏసీని.. చమురు ధరలు తగ్గిన పక్షంలో సమీక్షించటం జరుగుతుందని తెలిపింది. గత ప్రభుత్వం కూడా రెండు పర్యాయాలు ఎఫ్‌ఏసీని అమలు చేసిందని.. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్‌లో దీనిని అమలు చేసిందని ఉటంకించింది. ముందే తీసుకున్న టికెట్లకూ పెరిగిన చార్జీలు వర్తిస్తాయి ప్రయాణ చార్జీలను అన్ని తరగతుల్లోనూ 10 శాతం మేర పెంచగా.. ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఏసీ) రూపంలో అదనంగా మరో 4.2 శాతం పెంచారు. మొత్తంగా 14.2 శాతం మేర అన్ని తరగతుల చార్జీలూ భారం కానున్నాయి. లోకల్ రైలు టిక్కెట్లు, నెలవారీ పాస్‌ల పైన కూడా చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు ఈ నెల 25 (బుధవారం) అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. 25వ తేదీ అర్ధరాత్రి తర్వాత ప్రయాణం చేయటం కోసం.. పెరిగిన చార్జీల కన్నా ముందే ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను తీసుకుని ఉంటే.. పెరిగిన చార్జీల మేరకు తేడాను టికెట్ కౌంటర్లలో కానీ, ప్రయాణ సమయంలో రైళ్లలో టీటీఈలకు గానీ చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. రిజర్వేషన్ చార్జీలు, సూపర్‌ఫాస్ట్ చార్జీలను పెంచలేదు. ఇదా మీ సానుభూతి?: కాంగ్రెస్ ‘‘ప్రభుత్వంలోకి వచ్చాక.. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా.. శ్వేతపత్రం విడుదల చేయకుండా.. రైల్వే బడ్జెట్ కోసం ఆగకుండా.. రైల్వే ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదం టూ.. చార్జీలను పెంచేశారు. నిన్నటివరకూ సామాన్యుడి ఆందోళనలను ఎలా పరిష్కరించాలనే దానిగురించి మాట్లాడిన వీరు.. తమకు ఓటేసి అధికారంలోకి తీసుకువచ్చిన అదే సామాన్యుడిపై ఇప్పుడు భారం మోపటం మొదలుపెట్టారు.. సామాన్యుడిపై చూపుతున్న సానుభూతి ఇదా?’’ అని కాంగ్రెస్ నేత మనీశ్‌తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరపూరితం.. ఉపసంహరించాలి: సీపీఎం ‘‘రైల్వే చార్జీల అనూహ్య పెంపును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే అదుపులేని ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై రైలు చార్జీల పెంపు పెను భారంగా మారుతుంది. ఇది నేరపూరితం. చార్జీల పెంపును ఉపసంహరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అసలీ ప్రభుత్వ కపటత్వాన్ని చూడండి.. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల మధ్య, బడ్జెట్‌కు ముందు చార్జీలు పెంచితే.. ఎంత అప్రజాస్వామికమోనని వారు అంటారు. మోడీ సర్కారు సరిగ్గా అదే అప్రజాస్వామికంగా పార్లమెంటును అధిగమించి చార్జీలు పెంచింది’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు. సరకు రవాణా చార్జీలు 6.5% సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచగా.. ఇందులో 1.4 శాతం ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఏసీ)గా రైల్వే పేర్కొంది. సరకుల వర్గీకరణను కూడా 4 తరగతుల నుంచి 3 తరగతులకు తగ్గించారు. ఇప్పటి వరకు సరకు రవాణాకు కనీస దూరం 100 కిలోమీటర్లు కాగా.. దీనిని ఇప్పుడు 125 కిలోమీటర్లకు పెంచారు. సరకు రవాణా చార్జీల పెంపు పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా ఉక్కు, సిమెంటు, విద్యుత్, ఎరువులు, రసాయనాలు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల ధరలూ పెరగనున్నాయి. పెరిగిన రైల్వే చార్జీలు ఇవీ.. సాక్షి, హైదరాబాద్/విజయవాడ/విశాఖపట్నం/తిరుపతి: రైల్వే చార్జీల పెరుగుదల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల చార్జీలను తట్టుకోలేక రైళ్లను ఆశ్రయిస్తున్న జనానికి.. ఇప్పుడు ఆ చార్జీలు కూడా భారీగా పెరగటం ఇబ్బందికరంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతినిత్యం 709 రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీరందరిపైనా చార్జీల ప్రభావం ఉండనుంది. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే సుమారు రెండు లక్షల మంది నిత్యం రాకపోకాలు సాగిస్తారని అంచనా. 300 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణానికి స్లీపర్ క్లాస్ అయితే సుమారు రూ. 30 నుంచి రూ. 50 మేర చార్జీ పెరిగింది. ఏసీ త్రీ టైర్, టు టైర్ అయితే రూ. 50 నుంచి రూ. 100 మధ్య పెరిగింది. వరుసగా రెండేళ్లు భారీ వడ్డనలు.. యూపీఏ హయాంలో గతేడాది రైల్వే చార్జీలు భారీగా పెరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మరోసారి చార్జీల భారం మోపింది. కేవలం ఏడాది కాలంలోనే ప్రజలపై రెండు సార్లు రైల్వే చార్జీల భారం పిడుగుపాటులా పడడం గమనార్హం. అంతకుముందు పదేళ్ల పాటు రైల్వే చార్జీల్లో ఎగువ స్థాయి తరగతుల్లో ఒకటీ అరా పెంపు తప్ప ఎలాంటి మార్పులూ లేవు. అయితే.. 2012 ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్‌త్రివేది రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రూ. 4000 కోట్ల మేర చార్జీల పెంపు ప్రకటించారు. కానీ తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సమయంలో త్రివేది మంత్రి పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. కానీ ఆ మరుసటి ఏడాది.. అంటే గత ఏడాది 2013 జనవరి 21న అప్పటి రైల్వే మంత్రి బన్సల్ చార్జీలు పెంచారు. యూపీఏ-2 పాలనా కాలం పూర్తయ్యే వరకు కూడా చార్జీలు పెంచొద్దని భావించినప్పటికీ నష్టాలు, నిర్వహణ భారం దృష్ట్యా చార్జీల పెంపు అనివార్యమైందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ఏడాది ప్రజలపైన రూ. 6,600 కోట్ల మేర భారం పడింది. -
ఇక ఏ ప్రాంతంలోనైనా ఎఫ్ఐఆర్
రైలు ప్రయూణికులకు ఊరట న్యూఢిల్లీ: రైల్లో ప్రయూణిస్తున్నప్పుడు దొంగతనం, దోపిడీ లాంటి నేరం ఏదైనా జరిగితే ఇకపై ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రయూణంలో ఉండగానైనా లేదా ఆ తర్వాతైనా సరే ఏ ప్రాంతంలోనైనా మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. అధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం రైలు ప్రయూణికులు ఏ స్టేషన్లోనైనా ‘జీరో ఎఫ్ఐఆర్’ దాఖలు చేసి తగు చర్యలు కోరవచ్చు. ఎఫ్ఐఆర్ స్వీకరించే సదరు పోలీస్‌స్టేషన్ వెనువెంటనే సంఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్‌స్టేషన్‌కు సదరు ఎఫ్ఐఆర్ ప్రతిని ఫ్యాక్స్ చేస్తుందని న్యూఢిల్లీ రేంజ్ జారుుంట్ పోలీస్ కమిషనర్ ముఖేశ్ మీనా తెలిపారు. మీనా అధ్యక్షతన ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ఐజీలు సైతం పాల్గొన్న ఓ ఉన్నతస్థారుు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో నేరాలు జరిగినప్పుడు సంఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందనే అంశం బాధిత ప్రయూణికులకు పెద్ద సమస్యగా పరిణమిస్తున్న విషయం విదితమే.