![trains to get additional coaches - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/7/train.jpg.webp?itok=j9178T3v)
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి పీఆర్‌వో జేవీఆర్‌కే రాజశేఖర్ సోమవారం తెలిపారు. మచిలీపట్నం– యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నంబర్: 17211)కు ఈ నెల 8 నుంచి డిసెంబర్ 1 వరకు అదనంగా ఒక థర్డ్ ఏసీ బోగీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అలాగే యశ్వంత్‌పూర్– మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్(17212)కు ఈ నెల 9 నుంచి డిసెంబర్ 2 వరకు, మచిలీపట్నం–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12749)కు ఈ నెల 6 నుంచి 30 వరకు, సికింద్రాబాద్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్(12750)కు ఈ నెల 7 నుంచి డిసెంబర్ 1 వరకు థర్డ్ ఏసీ బోగీ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కాగా, సాంకేతిక కారణాల దృష్ట్యా ఈనెల 6– 12 వరకు విజయవాడ–భద్రాచలం–విజయవాడ రైలు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఈ తేదీల్లో విజయవాడ– భద్రాచలం రైలు (77292) ఉదయం 10కి బయలుదేరుతుందని చెప్పారు. భద్రాచలం– విజయవాడ రైలు (77291) మధ్యాహ్నం 3.45కు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment