తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అన్‌లాక్–4లో భాగంగా ప్రకటించిన విధంగా శనివారం నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైళ్లలో, అలాగే ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, హోం మినిస్ట్రీ సూచించిన ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
♦కేవలం కన్‌ఫర్మ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులు మాత్రమే రైలెక్కేందుకు స్టేషన్‌లోకి అనుమతిస్తారు.
♦ప్రయాణికులందరూ రైలెక్కేటప్పుడు, ప్రయాణంలోనూ కచ్చితంగా మాస్‌్క, ఫేస్ షీల్డ్ ఉపయోగించాలి.
♦ధర్మల్ స్క్రీనింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
♦ప్రయాణికులందరూ స్టేషన్‌లలో, రైలులోనూ భౌతిక దూరం పాటించాలి.
♦ఆయా గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులు ఆయా రాష్ట్ర్‌రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య నియమావళి (హెల్త్ ప్రోటోకాల్స్)ని అనుసరించాలి.
♦ప్రయాణికులు ప్రయాణ సమయంలో తమ సొంత బ్లాంకెట్స్‌ను వెంట తెచ్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment