rules followed
-
రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అన్‌లాక్–4లో భాగంగా ప్రకటించిన విధంగా శనివారం నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక రైళ్లలో, అలాగే ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, హోం మినిస్ట్రీ సూచించిన ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ♦కేవలం కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులు మాత్రమే రైలెక్కేందుకు స్టేషన్లోకి అనుమతిస్తారు. ♦ప్రయాణికులందరూ రైలెక్కేటప్పుడు, ప్రయాణంలోనూ కచ్చితంగా మాస్్క, ఫేస్ షీల్డ్ ఉపయోగించాలి. ♦ధర్మల్ స్క్రీనింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. ♦ప్రయాణికులందరూ స్టేషన్లలో, రైలులోనూ భౌతిక దూరం పాటించాలి. ♦ఆయా గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులు ఆయా రాష్ట్ర్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య నియమావళి (హెల్త్ ప్రోటోకాల్స్)ని అనుసరించాలి. ♦ప్రయాణికులు ప్రయాణ సమయంలో తమ సొంత బ్లాంకెట్స్‌ను వెంట తెచ్చుకోవాలి. -
నిబంధనలు పాటించాలి
మండపాల నిర్వాహకులకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచన సంగారెడ్డి టౌన్: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రాహాల ప్రతిష్ఠ, మండపాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన నియమ నిబంధనలు జారీ చేశామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని కోరారు. విగ్రహాల ప్రతిష్టాపన కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతులు పొందాలని సూచించారు. వివాదాస్పద స్థలాల్లో, రోడ్డు మధ్యలో మండపాలు నిర్మించొద్దన్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకుల వివరాలు, విగ్రహాలను తీసుకువెళ్ళే దారి, నిమజ్జన స్థలం తదితర వివరాలు అనుమతి పొందే సమయంలో సమర్పించాలని తెలిపారు. మైక్ అనుమతి తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాటిని ఉపయోగించాలన్నారు. మండలపాల వద్ద గుర్తు తెలియని వాహనాలు, వస్తువులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణసంచా కాల్చరాదని తెలిపారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా మతసామరస్యంతో వేడుకలు జరుపుకోవాలని కోరారు.