రైలు ప్రయూణికులకు ఊరట
న్యూఢిల్లీ: రైల్లో ప్రయూణిస్తున్నప్పుడు దొంగతనం, దోపిడీ లాంటి నేరం ఏదైనా జరిగితే ఇకపై ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రయూణంలో ఉండగానైనా లేదా ఆ తర్వాతైనా సరే ఏ ప్రాంతంలోనైనా మీరు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చు. అధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం రైలు ప్రయూణికులు ఏ స్టేషన్‌లోనైనా ‘జీరో ఎఫ్‌ఐఆర్’ దాఖలు చేసి తగు చర్యలు కోరవచ్చు. ఎఫ్‌ఐఆర్ స్వీకరించే సదరు పోలీస్‌స్టేషన్ వెనువెంటనే సంఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్‌స్టేషన్‌కు సదరు ఎఫ్‌ఐఆర్ ప్రతిని ఫ్యాక్స్ చేస్తుందని న్యూఢిల్లీ రేంజ్ జారుుంట్ పోలీస్ కమిషనర్ ముఖేశ్ మీనా తెలిపారు.
మీనా అధ్యక్షతన ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ఐజీలు సైతం పాల్గొన్న ఓ ఉన్నతస్థారుు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో నేరాలు జరిగినప్పుడు సంఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందనే అంశం బాధిత ప్రయూణికులకు పెద్ద సమస్యగా పరిణమిస్తున్న విషయం విదితమే.
ఇక ఏ ప్రాంతంలోనైనా ఎఫ్‌ఐఆర్
Published Sat, Mar 15 2014 1:54 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement