
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు తాము రద్దు చేసుకున్న టికెట్ల రిఫండ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం ట్ఛజunఛీ.జీnఛీజ్చీnట్చజీ ఠ్చీy.జౌఠి.జీn సైట్‌లోకి లాగిన్ అయ్యి పీఎన్‌ఆర్ నమోదు చేస్తే సరిపోతుంది. ఈ సదుపాయం ఆన్‌లైన్‌లో తీసుకున్న టికెట్లతోపాటు టికెట్ కౌంటర్ల వద్ద కొనుగోలు చేసిన టికెట్లకూ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. పారదర్శకతను ప్రోత్సహించేందుకు, వాపసయ్యే సొమ్ము కోసం ప్రయాణికులు ఎదురుచూడకుండా ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డ్ పబ్లిసిటీ డైరెక్టర్ వేద ప్రకాశ్ తెలిపారు. టికెట్లను ఆన్‌లైన్‌లో రద్దు చేసుకుంటే ఐదు రోజుల్లోగా ప్రయాణికుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుందనీ, అలాగే, కౌంటర్లలో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసుకు వారం రోజుల సమయం పడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment