Refund status
-
ఆన్లైన్లో రిఫండ్ స్టేటస్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు తాము రద్దు చేసుకున్న టికెట్ల రిఫండ్ స్టేటస్‌ను ఆన్లైన్లో తెలుసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం ట్ఛజunఛీ.జీnఛీజ్చీnట్చజీ ఠ్చీy.జౌఠి.జీn సైట్లోకి లాగిన్ అయ్యి పీఎన్ఆర్ నమోదు చేస్తే సరిపోతుంది. ఈ సదుపాయం ఆన్లైన్లో తీసుకున్న టికెట్లతోపాటు టికెట్ కౌంటర్ల వద్ద కొనుగోలు చేసిన టికెట్లకూ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. పారదర్శకతను ప్రోత్సహించేందుకు, వాపసయ్యే సొమ్ము కోసం ప్రయాణికులు ఎదురుచూడకుండా ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డ్ పబ్లిసిటీ డైరెక్టర్ వేద ప్రకాశ్ తెలిపారు. టికెట్లను ఆన్లైన్లో రద్దు చేసుకుంటే ఐదు రోజుల్లోగా ప్రయాణికుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుందనీ, అలాగే, కౌంటర్లలో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసుకు వారం రోజుల సమయం పడుతుందని అన్నారు. -
appకీ కహానీ...
క్లియర్ ట్యాక్స్ ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ రిఫండ్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు రూపొందించిన యాప్ ‘క్లియర్ ట్యాక్స్’. ఒక్క నిమిషంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టేటస్‌ను పొందొచ్చు. అలాగే ఎంత మొత్తంలో పన్ను మినహాయింపు పొందవచ్చో తెలుసుకోవచ్చు. ‘క్లియర్ ట్యాక్స్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు యాప్‌పై క్లిక్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్, ట్యాక్స్ కాలిక్యులేటర్ అనే ఆప్షన్లు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్లోకి వెళ్లి పాన్, పుట్టిన తేదీ సహా తదితర వివరాలను నమోదు చేసి ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్‌ను కనుక్కోవచ్చు.ట్యాక్స్ కాలిక్యులేటర్ ఆప్షన్ లోకి వెళ్లి సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేసి ఎంత మొత్తంలో పన్ను చెల్లించాలో ఒక అంచనాకు రావచ్చు.ఐదేళ్ల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అవసరం లేదు.యూజర్ల సమాచారానికి పూర్తి రక్షణ. బ్యాంక్ గ్రేడ్ హెచ్‌టీటీపీఎస్ భద్రత.