డబుల్ డెక్కర్ రైలు సందడి | Double-decker train between the stations on Vijayawada-Kacheguda | Sakshi
Sakshi News home page

డబుల్ డెక్కర్ రైలు సందడి

Published Tue, May 12 2015 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

Double-decker train between the stations on Vijayawada-Kacheguda

కాజీపేటరూరల్/మహబూబాబాద్/డోర్నకల్ : విజయవాడ-కాచిగూడ స్టేషన్ల మధ్య డబుల్ డెక్కర్ రైలు సోమవారం సందడి చేసింది. ఉదయం 11 గంటల సమయంలో విజయవాడ వైపు, సాయింత్రం 3.40 ప్రాంతంలో కాచిగూడ వైపు వెళ్తూ జిల్లాలోని ప్రధాన స్టేషన్లలో కొద్దిసేపు ఆగింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులెవరూ ఈ రైలుకు టికెట్ తీసుకోలేదు. డోర్నకల్‌లో మిగతా రైళ్లకు టికెట్ తీసుకున్న ప్రయాణికులు  రైల్లోకి ఎక్కగా టీసీలు ప్రయాణికులను దించేశారు. కాజీపేటలో మాత్రం టిక్కెట్ తీసుకుని ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ఎక్కారు. ఆర్టీసీ సమ్మె బంద్ అయ్యేంత వరకు ఈ రైలును నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. రైలు పూర్తిగా ఏసీ చైర్ కార్లతో ఉంది. కురవికి చెందిన ఎర్ర నాగేశ్వర్‌రావు అనే కాంట్రాక్టర్ రూ.250 వెచ్చించి వరంగల్ నుంచి మానుకోటకు వచ్చానని తెలిపారు.  
 

డబుల్ డెక్కర్ రైలు హాల్టింగ్ స్టేషన్లు
కాచిగుడ-విజయవాడ మధ్య నడిచే డబల్ డెక్కర్ రైలుకు మల్కాజిగిరి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్లలో హా ల్టింగ్ ఇచ్చారు. 10 ఏసీ బోగిలు, 950 సీట్లతో ఈ డబుల్ డెక్కర్ రైలు నడుస్తుంది. కాగా డబు ల్ డెక్కర్ రైలును తిలకించి అందులో ప్ర యాణించి ప్రయాణికులు, పిల్లలు అబ్బురపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement