Kacheguda
-
16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
కాచిగూడ: కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో పార్లమెంటు వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఈబీసీ సంక్షేమ సంఘం ఏపీ చైర్మన్ చెన్నకృష్ణారెడ్డి, కృష్ణ, వెంకటేశ్, అంజి, రాజేందర్, అనంతయ్య పాల్గొన్నారు. -
టికెట్ ధరలు అలా ఉంటేనే ఇండస్ట్రీకి మంచిది: బాలకృష్ణ
సినిమా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటేనే చిత్రపరిశ్రమకు మంచిదని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో కాచిగూడలో తారకరామ థియేటర్‌ను ఆయన పునః ప్రారంభించారు. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, నందమూరి తారక రామారావుపై అభిమానంతో 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను పునరుద్ధరించారు. ఇవాళ 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను బాలకృష్ణతో పాటు ప్రొడ్యూసర్ శిరీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ' మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడైన ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా నా అభినందనలు. తారకరామ థియేటర్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. 1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ ప్రారంభించడం జరిగింది. సునీల్ నారంగ్ అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైన విషయం. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ ఉంది. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది.' అని అన్నారు సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. 'మహనీయుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ థియేటర్ ఉంది. బాలకృష్ణ థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. సరి కొత్త టెక్నాలజీతో థియేటర్ అద్భుతంగా నిర్మించాం. 600 సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రిజనబుల్గానే పెట్టాం. మా నాన్న, ఎన్టీఆర్ చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్‌లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
24న చలో ఢిల్లీ.. పార్లమెంట్ ముట్టడి
కాచిగూడ: దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని వేలాదిమందితో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం కాచిగూ డలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లా డారు. చట్ట సభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ రెండేళ్ల కితమే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిందని ఈ బిల్లుకు మద్దతుగా 14 పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. కానీ బీజేపీ మద్దతు ఇవ్వకపోవడంతో బిల్లు పాస్ కాలేదన్నారు. బీసీలంతా తమ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీపై ఆశలు పెట్టుకున్నారని, ఆయన హయాంలో బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. కార్యక్రమంలో నీలం వెంకటేష్, సి.రాజేందర్, అంగిరేకుల వరప్రసాద్, అనంతయ్య, రాజ్‌కుమార్, నిఖిల్, రాజు పాల్గొన్నారు. -
యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు యశ్వంత్‌పూర్–కాచిగూడ (16569/ 16570)స్పెషల్ ట్రైన్ ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. (క్లిక్: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
మానవ తప్పిదం వల్లే
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో నవంబర్ 11న ఎంఎంటీఎస్–ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్ క్రిపాల్ తేల్చారు. సిగ్నల్‌ను పట్టించుకోకుండా ఎంఎంటీఎస్ లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు తాజాగా నివేదిక సమర్పించారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమా దం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ఘటనాస్థలిలో రెండు రోజుల పాటు పరీక్షించారు. సిగ్నల్ వ్యవస్థ, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. సిబ్బంది, అధికారులను ప్రశ్నించారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణం కాదని తేల్చారు. లోకోపైలట్ చంద్రశేఖరే ప్రమాదానికి కారణమని గుర్తించి రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. కాగా, ఈ ఘటనలో లోకోపైలట్ మృతి చెందగా, రైలు గార్డు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాటి నుంచి ఆయన సెలవులోనే ఉన్నా రు. గార్డు కోలుకున్న తర్వాత దీనిపై ప్రశ్నిం చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ..
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైలు ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. బుధవారం (13న) ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. కాచిగూడ రైల్వేస్టేషన్లో రైళ్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకో పైలెట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసుల అంచనా వేస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే ఎంఎంటీఎస్ రైలును లోకోపైలట్ మూవ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సిగ్నల్‌ను విస్మరించడమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై ఇప్పటికే కాచిగూడ స్టేషన్ మాస్టర్‌తోపాటు మరో ఆరుగురి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక, రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్‌డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై కేసులను నమోదు చేశారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
మానవ తప్పిదమా..సాంకేతిక లోపమా..?
సాక్షి, హైదరాబాద్: కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదం మానవ తప్పిదమా,సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ మేనేజర్ కేవీ రావు మీడియాకు తెలిపారు. రైలు ప్రమాదంలో మొత్తం 15 మంది గాయపడ్డారని, వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఒకరి పరిస్థితి విషమం.. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రఫీ తెలిపారు. ముగ్గురిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. 12 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వారిలో శేఖర్ అనే వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉందన్నారు. మరో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయన్నారు. గాయపడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. -
రైలుబండి.. జగమొండి
గుంతకల్లు: ఆ రైలుకు అర్ధరాత్రి అంటే ఎంతో ఇష్టమున్నట్లుంది. అందుకే సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరుకోవాల్సిన ఈ రైలు... తన జీవిత కాలంలో ఏనాడూ సమయానికి గమ్యం చేరిన దాఖలాలు లేవు. విసిగి వేసారిన ప్రయాణీకులు అసహనంతో ఆ రైలుకు ఓ ముద్దు పేరు పెట్టారు. అదే దెయ్యాల బండి. ఈ బండిని ఎక్కాలంటే ప్రయాణీకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్లో ఉదయం 10.00 గంటలకు బయలుదేరే ఈ ప్యాసింజర్ రైలు... అనేక స్టేషన్లు దాటుకొని సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు చేరాల్సి ఉంది. అయితే స్టేషన్లో ప్లాట్‌ఫాంల కొరత, క్రాసింగ్‌లు, చైను లాగడాలు తదితర కారణాల వల్ల ఏనాడూ ఈ రైలు అనుకున్న సమయానికి గుంతకల్లుకు చేరలేదు. ఎటు తిరిగి సరిగ్గా అర్ధరాత్రి సమయానికి గుంతకల్లు రైల్వే జంక్షన్ చేరి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంది. దీంతో ముఖ్యంగా మహిళలు ఈ రైలు ఎక్కాలంటేనే భయపడిపోతారు. సిగ్నల్స్ అందక స్టేషన్ బయట పొలాల్లో గంటల తరబడి నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఊరి బయట చిమ్మచీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అసలే భద్రత కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైలులో ప్రయాణించే అరకొర ప్రయాణికులు రాత్రివేళ ఒకే పెట్టెలోకి చేరుకొని పరస్పర దైర్యం చెప్పుకునే ఘటనలు సర్వసాధారణంగా మారాయి. } గుంతకల్లు రైల్వే జంక్షన్ ఔటర్లో నిలిచిపోయిన కాచిగూడ ప్యాసింజర్ ఔటర్‌లోనే ఆగిపోతుంది కాచిగూడ నుంచి ఇప్పుడా..అప్పుడా అన్నట్లు పరిగెత్తుకు వచ్చే ఈ ప్యాసింజర్...గుంతకల్లు సమీపించే కొద్ది మారాం చేస్తుంది. సిగ్నల్స్ అందక గంటల కొద్దీ (డీఆర్ఎం కార్యాలయ సమీపంలో) ఔటర్‌లోనే నిలిచిపోతుంది. నిరీక్షించే ఓపిక నశించిన ప్రయాణికులు రైలు దిగి ముళ్లకంపల మధ్య నడుచుకుంటూ ఇళ్లకు వెళుతుంటారు. ట్రాక్‌పై కంకర మధ్య నడుచుకుంటూ జారిపడిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా 9.00 గంటలకు గుంతకల్లు సమీపానికి చేరుకున్న ఈ రైలు ఔటర్ నుంచి జంక్షన్లోకి 11.00 గంటలకు చేరింది. సుమారు 2 గంటలపాటు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ చిమ్మచీకట్లోనే గడిపారు. నరకం అనుభవించాం డోన్ నుంచి గుంతకల్లుకు ఈ రైలులో ప్రయాణం చేశా. సాయంత్రం 7.00 గంటలకు డోన్‌లో కదిలితే గుంతకల్లు ఔటర్‌కు 9.15 గంటలకు చేరుకుంది. మరో 10 నిమిషాల్లో ఇంటికెళ్లొచ్చు అని అనుకున్నా..కానీ గంటల కొద్దీ రైలును నిలిపి వేశారు. – రాజు, ప్రయాణికుడు ముళ్లపొదల్లో నడిచా కాచిగూడ ప్యాసింజర్ రైలును గుంతకల్లు పట్టణ సమీపాన నిలిపి వేశారు. గంటల కొద్దీ కదలకపోవడంతో రైలు దిగి మొనతేలిన కంకర రాళ్ల మధ్య నడుచుకుంటూ ముళ్ల కంపలను దాటుకుంటూ రోడ్డున పడ్డాను. –లక్ష్మీదేవి, ప్రయాణికురాలు -
కాచిగూడ–కాకినాడ ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ (07452/07453) ప్రత్యేక రైలు ఈ నెల 23న (శనివారం) సాయంత్రం 7.50 కి కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ (సోమవారం) రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు. -
కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–కాకినాడ (07425/07426) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2, 9, 16, 23 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో జూన్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 5.50కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి కాచిగూడ చేరుకుంటుంది. -
కృష్ణకు మదర్ థెరిస్సా పురస్కారం
కాచిగూడ: మథర్ థెరిస్సా జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడ ప్రాంతానికి చెందిన తెలంగాణ దళిత హక్కుల పరిరక్షణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి.కృష్ణకు సమాజిక సేవలో మదర్ థెరిస్సా అవార్డును అందజేశారు. కార్యక్రమంలో సౌత్ ఏషియా భిషఫ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఫెథరిన్ ఫ్రాన్సిస్, సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్‌నారాయణ ముదిరాజ్, జెఎన్టీయు ప్రొఫెసర్ రాములు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. -
రైల్వే ఉద్యోగిని బ్యాగ్ మాయం
రైలులో ప్రయాణిస్తున్న టీటీఈ(టికెట్ తనిఖీ అధికారి) హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. వివరాలివీ... సికింద్రాబాద్ రైల్వే టీటీఈ అనిత కుమారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అనంతపురం నుంచి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్ బయలుదేరారు. కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. దీనిపై బాధితురాలు గురువారం కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బ్యాగులో 12 గ్రాముల బంగారు గొలుసు, రూ.9వేల నగదు, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ ఆదిరెడ్డి తెలిపారు. -
యువకుడి దారుణహత్య
నగరంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలిఅడ్డలో పెయింటర్‌గా పనిచేస్తున్న అహ్మద్(28) అనే యువకుడిని హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో అతని పై దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాచిగూడ-టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ-టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాచిగూడలో జూన్ 6, 13, 20, 27 తేదీల్లో(సోమవారాలు) మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో... టాటానగర్‌లో జూన్ 7, 14, 21, 28 తేదీల్లో(మంగళవారాలు) రాత్రి 10.50కి బయలుదేరుతుంది. ఇవి మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, సుకింద రోడ్డు, జరోలి, బన్స్‌పానీ, చైబాసా స్టేషన్ల మీదుగా వెళ్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గౌలిగూడ చమన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్‌నాథ్ కుమారుడు జయరామ్ (35) కాచిగూడ - మలక్‌పేట రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. -
కొత్త రైళ్లు నిల్
కొత్త రైళ్లకు రెడ్‌సిగ్నల్ మూడు ప్రాజెక్టులతో సరి ఉమ్మడి ప్రాజెక్టులకే గ్రీన్‌సిగ్నల్ స్పష్టతలేని రైల్వేస్టేషన్ల అభివృద్ధి రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వేటర్మినళ్లు సిటీబ్యూరో: రైల్వే బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. మరోసారి నిరాశే మిగిలింది. ముచ్చటగా మూడు అరకొర ప్రాజెక్టులు తప్ప నగరానికి పెద్దగా ఒరిగింది శూన్యం. సికింద్రాబాద్ నుంచి జహీరాబాద్ తప్ప కొత్త లైన్ల ఊసే లేదు. సురేష్ ప్రభు బడ్జెట్ రైలు నగరంలో ఆగీ ఆగకుండానే పరుగులు పెట్టింది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపు లేదు. ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే అంశంలోనూ స్పష్టత లేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు గతంలో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. వరల్క్లాస్ స్టేషన్ స్థాయిని కాస్తా ప్రస్తుతం ఏ-1 కు హోదాకు పరిమితం చేశారు. మొత్తంగా రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు, రూ.80 కోట్లతో చర్లపల్లిలో 4వ రైల్వే టర్మినల్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వట్టి నాగులపల్లిలో 5వ రైల్వే టర్మినల్ ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో నగరానికి లభించాయి. ఈ మూడు ప్రాజెక్టుల్లోనూ దక్షిణమధ్య రైల్వే, రాష్ర్టప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేపడుతారు. అయ్యే ఖర్చులో రాష్ర్టం వాటాగా 51 శాతం, రైల్వే వాటాగా 49 శాతం చొప్పున భరిస్తాయి. మొత్తంగా రైల్వే బడ్జెట్ ఈసారి ఒకింత ఆశ..మరింత నిరాశనే మిగిల్చింది. యాదాద్రికి ఎంఎంటీఎస్... లక్షలాది మంది సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్ పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ కూడా ప్రాధాన్యతనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు చేపట్టిన రెండో దశ ఎంఎంటీఎస్ పనులు సాగుతుండగా... ఇప్పుడు మూడో దశ కింద ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల వరకు రైల్వేలైన్లను పొడిగించి విద్యుదీకరిస్తారు. రూ.330 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల్లో రాష్ర్టప్రభుత్వం తన వంతు వాటాగా 51 శాతం నిధులను సమకూర్చనుంది. ఈ ఆర్థిక సంవత్సరం పనులు ప్రారంభించి వచ్చే రెండు, మూడేళ్లలో దీనిని పూర్తి చే స్తారు. నగరంలోని ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశ పూర్తయిన అనంతరం మూడోదశ కింద యాదాద్రికి ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తారు. దీంతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులు సికింద్రాబాద్ నుంచి నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గంలో యాదాద్రికి వెళ్లవ లసి ఉంటుంది. నగరం నుంచి నేరుగా యాదగిరిగుట్టకు వెళ్లే రైల్వే సదుపాయం అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దశ పట్టనుంది. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కోరడంతో రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎంటీఎస్ పొడిగింపునకు అయ్యే ఖర్చులో రాష్ర్టం తన వంతు వాటాను భరిస్తుందని సీఎం స్పష్టం చేయడంతో రైల్వేశాఖ తన వంతు వాటాను కూడా అందజేసి ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఎంఎంటీఎస్ ప్రస్తానం ఇదీ... 2003లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-ఫలక్‌నుమా, తదితర మార్గాల్లో లోకల్ రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. {పస్తుతం ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. లక్షా 40 వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.హైదరాబాద్ నగర శివార్లను కలుపుతూ 2013లో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించారు. సికింద్రాబాద్-ఘట్కేసర్, మౌలాలి-సనత్‌నగర్, పటాన్చెరు-తెల్లాపూర్, ఫలక్‌నుమా-ఉందానగర్ తదితర మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి.ఉందానగర్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో పొడిగించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ విమానాశ్రయంలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి జీఎమ్మార్ నిరాకరించడంతో ప్రస్తుతానికి ఆ లైన్ నిర్మాణం వాయిదా పడింది. తగ్గనున్న భారం... ప్రతి రోజు సుమారు 250కి పైగా రైళ్లు నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 4 లక్షల మంది నిత్యం ఈ స్టేషన్లను సందర్శిస్తున్నారు. దీంతో ఈ మూడింటిపైన ఒత్తిడి బాగా పెరిగింది. ఔటర్ రింగురోడ్డుకు అందుబాటులో ఉన్న చర్లపల్లిలో రైల్వే టర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల విజయవాడ , కాజీపేట్ మీదుగా వచ్చేరైళ్లను చర్లపల్లిలో నిలుపుతారు. ఎఫ్‌సీఐ, ఎన్ఎఫ్సీ, హెచ్‌పీసీఎల్, ఐఓసీ వంటి భారీ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఉండడం రవాణా రంగం అభివృద్ధికి విస్తృత అవకాశంగా రైల్వే భావించింది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో కనీసం 150 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ, ముంబయి, విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. స్టేషన్ల అభివృద్ధికి నిధులే లేవు... దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ప్రకటించారు. కానీ ఇందుకోసం ఎలాంటి నిధు లు కేటాయించలేదు. 2010లో ప్రతిపాదించిన సికిం ద్రాబాద్ వరల్డ్‌క్లాస్ అంశాన్ని పక్కన పెట్టి రీ డెవలప్మెంట్ పేరుతో ఏ తరహా అభివృద్ధి చేస్తారనే అం శంలో స్పష్టత లేదు. నాంపల్లి రైల్వేస్టేషన్లో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేశారు. కొత్త రైళ్ల ఊసే లేదు... {పయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి పలు మార్గాల్లో కొత్త రైళ్లను నడపాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. మరోవైపు గతంలో ప్రకటించిన రైళ్ల ప్రస్తావన కూడా లేకుండానే ఈ బడ్జెట్ నగర ప్రయాణికులను నిరాశకు గురి చేసింది.సికింద్రాబాద్ నుంచి షిరిడీకి వెళ్లేందుకు ప్రస్తుతం మన్మాడ్ వరకు అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. సికింద్రాబాద్ నుంచి సాయినగర్ వరకు నేరుగా వెళ్లేందుకు మరో రైలు నడపాలనే ప్రతిపాదకు మోక్షం లభించలేదు.కాచిగూడ నుంచి బెంగళూర్‌కు ప్రస్తుతం రెండు రైళ్లే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 2 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన సైతం పట్టించుకోలేదు.హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రస్తావన లేదు. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ట్రైన్ ఊసు లేదు. చర్లపల్లిలో భారీ రైల్వే టర్మినల్.. చర్లపల్లి వద్ద భారీ రైల్వే టర్మినల్ మరో అతిపెద్ద ప్రాజెక్టు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.80 కోట్లు కేటాయించారు. మొదట 5 ప్లాట్‌ఫామ్‌లతో ప్రారంభించి దశలవారీగా 10 నుంచి 15 ప్లాట్‌ఫామ్‌ల వరకు అభివృద్ధి చేస్తారు. వీటిలో రైళ్లను శుభ్రం చేసేందుకు పిట్లైన్లు కూడా ఉంటాయి. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రాష్ర్టం తన వంతు వాటాను భరిస్తుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, వట్టినాగులపల్లిలో రైల్వే టర్మినళ్లు నిర్మించాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల తరువాత నగరంలో ఇది 4వ అతిపెద్ద రైల్వే టర్మినల్ కానుంది. 5వ టర్మినల్‌గా వట్టినాగులపల్లిలో 250 ఎకరాల్లో పీపీపీ మోడల్లో నిర్మిస్తారు. -
రైలు పట్టాలు రక్తసిక్తం...
కాచిగూడ/ సికింద్రాబాద్: నగరంలోని రైలుపట్టాలు మంగళవారం రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో పట్టాలు దాటుతున్న ఇద్దరిని రైలు ఢీకొనడంతో మృతి చెందారు. రైలు ఢీకొని మేస్త్రీ మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే సీఐ లింగన్న కథనం ప్రకారం... వనస్థలిపురానికి చెందిన మేస్త్రీ చిలుక శ్రీరాం(45) కాచిగూడ - మలక్‌పేట రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో ఆటో డ్రైవర్.... అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సాహెబ్రావు కథనం ప్రకారం... నేరేడ్మెట్ వినాయక్‌నగర్‌కు చెందిన బుక్క లక్ష్మణ్ (35) ఆటో డ్రైవర్. ఇతను మద్యానికి బానిస కావడంతో ఆరేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడంలేదు. కాగా, లక్ష్మణ్ సోమవారం మరోమారు అత్తగారింటి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె ససేమిరా అంది. తిరుగుప్రయాణంలో పీకలదాకా మద్యం తాగిన లక్ష్మణ్ మౌలాలి అమ్ముగూడ రైల్వేస్టేషన్ల పరిధిలో రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
డబుల్ డెక్కర్ రైలు సందడి
కాజీపేటరూరల్/మహబూబాబాద్/డోర్నకల్ : విజయవాడ-కాచిగూడ స్టేషన్ల మధ్య డబుల్ డెక్కర్ రైలు సోమవారం సందడి చేసింది. ఉదయం 11 గంటల సమయంలో విజయవాడ వైపు, సాయింత్రం 3.40 ప్రాంతంలో కాచిగూడ వైపు వెళ్తూ జిల్లాలోని ప్రధాన స్టేషన్లలో కొద్దిసేపు ఆగింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులెవరూ ఈ రైలుకు టికెట్ తీసుకోలేదు. డోర్నకల్‌లో మిగతా రైళ్లకు టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్లోకి ఎక్కగా టీసీలు ప్రయాణికులను దించేశారు. కాజీపేటలో మాత్రం టిక్కెట్ తీసుకుని ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ఎక్కారు. ఆర్టీసీ సమ్మె బంద్ అయ్యేంత వరకు ఈ రైలును నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. రైలు పూర్తిగా ఏసీ చైర్ కార్లతో ఉంది. కురవికి చెందిన ఎర్ర నాగేశ్వర్రావు అనే కాంట్రాక్టర్ రూ.250 వెచ్చించి వరంగల్ నుంచి మానుకోటకు వచ్చానని తెలిపారు. డబుల్ డెక్కర్ రైలు హాల్టింగ్ స్టేషన్లు కాచిగుడ-విజయవాడ మధ్య నడిచే డబల్ డెక్కర్ రైలుకు మల్కాజిగిరి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్లలో హా ల్టింగ్ ఇచ్చారు. 10 ఏసీ బోగిలు, 950 సీట్లతో ఈ డబుల్ డెక్కర్ రైలు నడుస్తుంది. కాగా డబు ల్ డెక్కర్ రైలును తిలకించి అందులో ప్ర యాణించి ప్రయాణికులు, పిల్లలు అబ్బురపడ్డారు. -
గుత్తిలో డబుల్ డెక్కర్ రైలు కూత
గుత్తి (అనంతపురం), న్యూస్‌లైన్ : దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి సారిగా ప్రవేశ పెట్టిన డబుల్ డెక్కర్ రైలు బుధవారం గుత్తి మీదుగా తిరుపతికి వెళ్లింది. ఉదయం 6.45 గంటలకు డబుల్ డెక్కర్ రైలు కాచిగూడ(హైదరాబాద్)నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12.45 గంటలకు గుత్తికి చేరింది. కొత్త రైలు.. అందులోనూ డబుల్ డెక్కర్ కావడంతో దాన్ని చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. డబుల్ డెక్కర్ రైలు చూడముచ్చటగా ఉందని చర్చించుకున్నారు. డబుల్ డెక్కర్ రైలులో సదుపాయాలు బాగున్నాయని ప్రయాణికులు చెప్పారు. రైల్లో కూర్చున్నట్లు లేదని బస్సులోనే కూర్చుని ప్రయాణించిన అనుభూతి కలిగిందని కొందరు వ్యాఖ్యానించారు. కాగా డబుల్ డెక్కర్ రైలు వారంలో ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే కాచిగూడ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం, ఆదివారాల్లో ఉదయం 5.45 గంటలకు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. చాలా అద్భుతంగా ఉంది: ముందుగా డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అభినందనలు. సాధారణ రైలు కంటే దీంట్లో అన్ని సదుపాయాలున్నాయి. అసలు ప్రయాణం చేసినట్లు కూడా అనిపించదు. చాలా అద్భుతంగా కూడా ఉంది. చూడముచ్చటగా కూడా ఉంది. అయితే వారానికి రెండు సార్లు కాకుండా ప్రతి రోజూ నడపాలి.ఇలాంటి రైళ్లు మరిన్ని ప్రారంభించాలి. - సుబ్రమణ్యం, ప్రయాణికుడు, కడప -
వైభవంగా ‘ఫాల్గుణి మేళా’