సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో నవంబర్ 11న ఎంఎంటీఎస్–ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్ క్రిపాల్ తేల్చారు. సిగ్నల్‌ను పట్టించుకోకుండా ఎంఎంటీఎస్ లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు తాజాగా నివేదిక సమర్పించారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమా దం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ఘటనాస్థలిలో రెండు రోజుల పాటు పరీక్షించారు. సిగ్నల్ వ్యవస్థ, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. సిబ్బంది, అధికారులను ప్రశ్నించారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణం కాదని తేల్చారు. లోకోపైలట్ చంద్రశేఖరే ప్రమాదానికి కారణమని గుర్తించి రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. కాగా, ఈ ఘటనలో లోకోపైలట్ మృతి చెందగా, రైలు గార్డు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాటి నుంచి ఆయన సెలవులోనే ఉన్నా రు. గార్డు కోలుకున్న తర్వాత దీనిపై ప్రశ్నిం చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment