
సాక్షి, హైదరాబాద్: కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదం మానవ తప్పిదమా,సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ మేనేజర్ కేవీ రావు మీడియాకు తెలిపారు. రైలు ప్రమాదంలో మొత్తం 15 మంది గాయపడ్డారని, వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
ఒకరి పరిస్థితి విషమం..
ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ రఫీ తెలిపారు. ముగ్గురిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. 12 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వారిలో శేఖర్ అనే వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉందన్నారు. మరో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయన్నారు. గాయపడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు.