
సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయని కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీలో సమావేశం అయ్యాం. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పాను. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాను. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు అందించామన్నారు. ఏజెన్సీలను నిర్మాణం, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని అదేశించాను. ఏది చెప్పినా, ఎవరూ కమిషన్‌కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలి. ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని అదేశించాం’’ అనివ చంద్రఘోష్ పేర్కొన్నారు.
ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తాం. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నా’’ అని చంద్రఘోస్ వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తాను. కొంతమంది అధికారులు స్టేట్‌లో లేరు. వాళ్లను కూడా విచారణ చేస్తాం. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి.. వాళ్లను కూడా విచారణ చేస్తాం. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే మాకు తెలిసిపోతుంది’’ అని చంద్రఘోష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment