సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ 20 మందికిపైగా తాజా, మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు.
ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ చంద్ర ఘోష్.. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు బ్యారేజీలు సంబంధించి సమాచారం తెలుసుకున్నానని తెలిపారు. 25 జూన్ లోపు విచారణకు వచ్చిన అందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలి అని చెప్పాను జరిగిన, తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని చెప్పాం. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు తేలితే చట్టపరంగా చర్యలు ఉంటాయి’’ అని చంద్ర ఘోష్ స్పష్టం చేశారు.
ఇంజనీర్లతో నిన్న, ఈ రోజు(సోమ,మంగళ) సమావేశం జరిపాను.రేపటి నుంచి ఏం చేయాలన్నది అనే దానిపై లిస్టు రెడీ చేస్తాం. త్వరలో నిర్మాణ సంస్థలను పిలుస్తాం. ప్రతీ ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారులు ఉంటే వాళ్లకు నోటీసులు ఇస్తాము. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుంది. ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగిందనిపిస్తోంది. బ్యారేజీల వల్ల లాభం తప్ప నష్టం లేదు అని అనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment