inquiry committee
-
ట్యాక్సీ సేవల యాప్స్‌పై విచారణకు ఆదేశం
ట్యాక్సీ, ఆటో సేవల యాప్‌లు చార్జీల విషయంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలపై విచారణ(inquiry) జరపాలంటూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ(CCPA)ను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి తెలిపారు. ఆండ్రాయిడ్, యాపిల్(Apple) డివైజ్‌లపై ఒకే తరహా రైడ్‌కి సంబంధించి వేర్వేరు రేట్లు చూపిస్తుండటం అసమంజసమైన వాణిజ్య విధానమే అవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన జోషి పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు లభించాల్సిన పారదర్శకత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ, టికెట్ బుకింగ్ యాప్స్ తదితర రంగాలకు కూడా దీని పరిధిని విస్తరించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటున్నాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్(Tweet), ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024 -
బెయిల్ వస్తే ఓకే.. రాకుంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.మంగళవారం కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌లు న్యాయవాది మోహిత్‌రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్‌పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండిపీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.పీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. -
కాళేశ్వరం విచారణ.. జస్టిస్ చంద్ర ఘోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ 20 మందికిపైగా తాజా, మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు.ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ చంద్ర ఘోష్.. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు బ్యారేజీలు సంబంధించి సమాచారం తెలుసుకున్నానని తెలిపారు. 25 జూన్ లోపు విచారణకు వచ్చిన అందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలి అని చెప్పాను జరిగిన, తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని చెప్పాం. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు తేలితే చట్టపరంగా చర్యలు ఉంటాయి’’ అని చంద్ర ఘోష్ స్పష్టం చేశారు.ఇంజనీర్లతో నిన్న, ఈ రోజు(సోమ,మంగళ) సమావేశం జరిపాను.రేపటి నుంచి ఏం చేయాలన్నది అనే దానిపై లిస్టు రెడీ చేస్తాం. త్వరలో నిర్మాణ సంస్థలను పిలుస్తాం. ప్రతీ ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారులు ఉంటే వాళ్లకు నోటీసులు ఇస్తాము. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుంది. ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగిందనిపిస్తోంది. బ్యారేజీల వల్ల లాభం తప్ప నష్టం లేదు అని అనిపిస్తోంది. -
రాఘవులే రైట్...
సాక్షి, హైదరాబాద్: సీపీఎం అధిష్టానం బీవీ రాఘవులును బుజ్జగించింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో కొనసాగాలని ఆయన్ను కోరింది. దీంతో రాఘవులు రాసిన లేఖపై రెండు మూడు రోజులుగా నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లయింది. పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి తనను తప్పించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తానని బీవీఆర్ ఇటీవల పార్టికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కమిటీలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రాఘవులుపై ఒక వర్గం పొలిట్‌బ్యూరోకు ఫిర్యాదులు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ వివాదంపై పార్టీ పొలిట్‌బ్యూరో ఒక విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక కూడా పార్టికి చేరింది. రెండ్రోజుల పాటు జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశాల్లో రాఘవులు అంశం చర్చకు వచ్చింది. ఆయన్ను పార్టీ బుజ్జగించినట్లు తెలిసింది. దీంతో రాఘవులు కూడా మెత్తబడ్డారని అంటున్నారు. బయటకొస్తే క్యాడర్లో నైరాశ్యం... మతోన్మాదంపై వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్న రాఘవులు పార్టీ కీలక బాధ్యతల నుంచి బయటకు వస్తే ఆ ప్రభావం క్యాడర్‌పై ప్రభావం చూపుతుంది. పార్టీ ఐక్యతకు నష్టం వాటిల్లుతుంది. ఈ తరుణంలో పార్టిలో లుకలుకలు కనిపించడం మంచిది కాదని పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడినట్లు తెలిసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించాం. రాఘవులు వివాదం ముగిసిపోయింది. రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతారు. ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాలపై సమస్యలున్నాయి. వాటి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఏపీలో అమలు చేస్తాం’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాఘవులు కూడా పార్టీ విజ్ఞప్తికి ఒప్పుకోక తప్పలేదు. ఏపీలో అంతర్గత వివాదాల వల్ల తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పినట్టు తెలిసింది. ఇక నుంచి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని పార్టీ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పినట్లు సమాచారం. ఒక వెలుగు వ్చెలిగిన రాఘవులు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాఘవులు కార్యదర్శిగా ఉండి అనేక పోరాటాలు చేశారు. విద్యుత్ ఉద్యమం ఆయన హయాంలోనే జరిగింది. పోరాట పటిమగల నేతగా ఉన్నత స్థాయి పదవి పొలిట్‌బ్యూరో వరకు వెళ్లారు. ఆయన సింప్లిసిటీ కూడా క్యాడర్‌ను ఉత్తేజపరిచేది. అయితే తర్వాత తర్వాత ఆయన హయాంలోనే పార్టీ వెనుకపట్టు పట్టిందన్న విమర్శలున్నాయి. 10 టీవీ అమ్మడం వంటి విషయాల్లోనూ విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా కొద్దిరోజులుగా నలుగుతున్న రాఘవులపై అసమ్మతి వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణగడంతో సీపీఎం శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. -
ప్రసూతి మరణాలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ప్రసూతి మరణాలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పేట్లబురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అసలేం జరిగిందంటే ... నాగర్ కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమ పల్లికి చెందిన సిరివెన్నెల (23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని (24) మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారం కిందట సిజేరియన్ చేయించుకున్నారు. అనంతరం వారి ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు 13వ తేదీన మరణించారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణమన్న వాదనలు వినిపించాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా ఇన్ఫెక్షనే కారణమని తేలినట్లు సమాచారం. ఇందుకు ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించారు. కాగా, ఈ ఘటనలకు ముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. అందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో వారికి డయాలసిస్ చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, అధికార వర్గాలు వెల్లడించాయి. కొందరిని డిశ్చార్జి కూడా చేశామని చెబుతున్నారు. అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడారా? బాలింతలకు అధిక మోతాదు యాంటీబయోటిక్స్ వాడటం వల్లే ఇన్ఫెక్షన్కు దారితీసిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన పరికరాలను స్టెరిలైజేషన్ చేయడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ఆగస్టులో ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మరణించిన తర్వాత కూడా ఇటువంటి సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇబ్రహీంపట్నం మరణాల తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రి ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయిందనడానికి మలక్‌పేట సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. -
అచ్యుతాపురం గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ కమిటీ
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణ కమిటీని నియమిస్తూ పీసీబీ కార్యదర్శి విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు అధికారులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ సభ్యులుగా అనకాపల్లి జాయింట్ కలెక్టర్, పీసీబీ జేఈఈ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను ప్రభుత్వం నియమించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్ఈజెడ్) లోని బ్రాండిక్స్ అపరెల్ పార్కు సిటీలో శుక్రవారం ఉదయం విషవాయువు లీకైన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 178 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. -
‘కరోనా’ మూలాలపై అన్వేషణ!
జెనీవా: భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్ల గుట్టుని నిగ్గు తేల్చడానికి శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసింది. ఈ బృందం కరోనా వైరస్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్ల పుట్టుకపై అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా ఈ తరహా వైరస్ల పుట్టుకపై అధ్యయనాలు ఎలా చేయాలో సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కొన్ని మార్గదర్శకాలను సైతం రూపొందిస్తుంది. ఈ బృందంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 700 దరఖాస్తులు రాగా, అందులో 25 పేర్లను డబ్ల్యూహెచ్ఓ ఎంపిక చేసింది. బృంద సభ్యుల పేర్లతో త్వరలో తుది జాబితాను వెల్లడించనుంది. ఇదే ఆఖరి అవకాశం డబ్ల్యూహెచ్ఓ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్(సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్తకి సైతం చోటు లభించడం విశేషం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి గత ఏడాదే పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ డబ్ల్యూహెచ్ఓ బృందంలో పని చేసే అవకాశం ఉంది. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా రామన్‌కు పేరుంది. ఐసీఎంఆర్‌లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్‌లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కరోనాతో పాటు వివిధ వైరస్ల గుట్టుమట్లను తెలుసుకునేందుకు సైంటిస్టులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న డబ్ల్యూహెచ్ఓ వారిచ్చే సూచనల మేరకు నడుచుకోనుంది. కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ అధా్నమ్ ఘెబ్రాయసిస్ అన్నారు. గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఈసారి కూడా చోటు కల్పించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ విచారణలో ఏమైనా రాజకీయపరమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని చైనా హెచ్చరించింది. డబ్ల్యూహెచ్ఓ బృందానికి శాస్త్రీయంగా మద్దతు ఇస్తామే తప్ప రాజకీయం చేస్తే ఊరుకోబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ తేల్చి చెప్పారు. -
సింహాచలం భూముల అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వ్యవహారంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కమిటీని నియమించింది. ఈనెల 15లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్ పనిచేశారు. మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి. -
మాన్సాస్ భూముల వ్యవహారంపై విచారణ
సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్ భూముల వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదులపై విచారణకు ఆరు కమిటీలను ఏర్పాటు చేశారు. మాన్సాస్ భూముల రికార్డులు మొత్తం డిజిటైజేషన్, మాన్సాస్ భూముల సర్వే, భూముల రికార్డుల్లో వాస్తవాల పరిశీలన, మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలపై విచారణ, మాన్సాస్ కార్యాలయాల రికార్డుల తనిఖీలు చేపట్టడంతో పాటు, మాన్సాస్ విద్యాలయాల నిధుల వినియోగంపై మరో కమిటీ ఆరా తీయనుంది. నెల రోజులు గడువుగా నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మన్సాస్‌కు చెందిన 14 వేల ఎకరాల భూమితో పాటు సీతారామ వేణుగోపాలస్వామి అలయాలకు చెందిన ఆరు వేల ఎకరాల భూముల బదలాయింపుపై కూడా కమిటీ విచారణ చేపట్టింది. చదవండి: మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం -
నంద్యాల ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిత ఆత్మహత్యలపై ప్రత్యేక విచారణకు కమిటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసు విచారణకు అధికారులను నియమించారు. సమగ్ర విచారణ చేపట్టేందుకు డీఐజీ వెంకటరామిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం నంద్యాలకు చేరుకుంది. అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను, వన్‌టౌన్ పోలీసులను ప్రత్యేక అధికారుల బృందం విచారించనుంది. విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు. కాగా, నంద్యాలకు చెందిన అబ్దుల్సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదాఖలందర్, కుమార్తె సల్మా ఈ నెల 3వ తేదీన పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.పోలీసుల వేధింపుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అబ్దుల్సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను సీఎం జగన్ ఆదేశించారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. -
అంతర్వేది ఘటనపై అంతర్గత కమిటీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై జిల్లా యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జిల్లా అగి్నమాపక అధికారి రత్నకుమార్, అదనపు ఎస్పీ కరణం కుమార్, అంతర్వేది ఆలయ ఈఓ చక్రధరరావులతో ఈ కమిటీ ఏర్పాటైంది. నాలుగైదు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం) ఈ సంఘటనలో కుట్ర కోణం ఉన్నట్లుగా ఎక్కడా ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి కొంతకాలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ, చెత్తను పోగు చేసి మంట పెడుతున్నట్టు గుర్తించారు. రథం దగ్ధం సంఘటన జరిగిన శనివారం రాత్రి ఆ వ్యక్తి మంటలు.. మంటలు.. అంటూ కేకలు వేస్తూ వెళ్లాడని అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనలో కుట్రకోణం ఏమీ లేదని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఒకపక్క పోలీసులు, మరోపక్క రెవెన్యూ అధికారులు ఈ మిస్టరీని ఛేదించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ధ్రువీకరించారు. (చదవండి: కూతురు ఫోన్ రికార్డుతో బయటపడ్డ మర్డర్ స్కెచ్) -
అప్పన బంగారం మోసం కేసు: విచారణ కమిటీ
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో అప్పన్న బంగారు ఆభరణాల విక్రయం పేరిట జరిగిన మోసంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారి అజాద్ పర్యవేక్షణలో కమిటీ విచారణ చేపట్టింది. హైమావతికి సహకరించిన దేవాదాయశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు మధు, శేఖర్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. నెల్లూరు మహిళ శ్రావణి నుంచి ఆన్లైన్లో కోటి 40 లక్షలు తీసుకున్న విశాఖ మహిళ హైమవతిని విచారిస్తున్నామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఆజాద్ తెలిపారు. (చదవండి: అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని వెల్లడించారు. దేవస్థానం పేరుతో రసీదు ఎక్కడ ముద్రించారు?, ఆలయ సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆజాద్ వెల్లడించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సబ్‌ప్లాన్ నిధుల అవినీతిపై నోడల్ ఏజెన్సీతో విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గిరిజన సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి.. దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక పాలన జరుగుతుందన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేస్తున్నామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. -
సీజేఐ వేధింపుల కేసుపై విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో విచారణను ముగ్గురు జడ్జీల అంతర్గత కమిటీ శుక్రవారం ప్రారంభించింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల కమిటీ ఎదుట ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని విచారణకు హాజరయ్యారు. జస్టిస్ బాబ్డే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. మాజీ ఉద్యోగినితోపాటు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కమిటీ విచారణకు వచ్చారు. అయితే విచారణ సమయంలో జడ్జీల ముందు మహిళ మాత్రమే ఉన్నారు. ఇది సాధారణ న్యాయ విచారణ కానందున న్యాయవాదులను విచారణ సమయంలో మహిళతోపాటు ఉండేందుకు అనుమతించబోమని జస్టిస్ బాబ్డే ఇంతకుముందే స్పష్టం చేయడం గమనార్హం. ఈ విచారణను ముగించేందుకు నిర్దిష్ట గడువు కూడా ఏదీ లేదని జస్టిస్ బాబ్డే గతంలోనే చెప్పారు. ఈ విచారణలో వెలుగుచూసే అంశాలను కూడా రహస్యంగానే ఉంచనున్నారు. ఆరోపణలు చేసిన మహిళ గతంలో సీజేఐ ఇంట్లోని కార్యాలయంలో పనిచేసేది. గతేడాది అక్టోబర్‌లో సీజేఐ తనను లైంగికంగా వేధించారనీ, ఖండించినందుకు తనను ఉద్యోగంలోనుంచి తీసేయడంతోపాటు హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తన భర్త, మరిదిలను సస్పెండ్ చేయించారని ఆరోపిస్తూ 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆమె లేఖలు పంపారు. -
జోహ్రిపై విచారణకు కమిటీ
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్ శర్మ, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ శర్మ, ఢిల్లీ మహిళా హక్కుల సంఘం మాజీ చైర్పర్సన్ బర్ఖాసింగ్ ఇందులో ఉన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. -
అంతా గందరగోళం
దివంగత సీఎం, అమ్మ జయలలితకు అపోలో ఆస్పత్రిలో అందించిన వైద్య చికిత్సలకు సంబంధించిన నివేదిక అంతా గందరగోళంగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ ఈ గందరగోళాన్ని గుర్తించింది. వైద్య రికార్డులను పర్యవేక్షిస్తున్న ఆస్పత్రి ప్రతినిధి గోవిందరాజన్ వద్ద మంగళవారం విచారణ నిర్వహించారు. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం మిస్టరీని నిగ్చు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విచారణ పరిధిలోకి అమ్మ జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతో సన్నిహితంగా ఉన్న వాళ్లే కాదు, అనేక మంది అధికారులు, అపోలో ఆస్పత్రి వర్గాల్ని తీసుకొచ్చారు. వీరందరి వద్ద విచారణ సాగుతోంది. అలాగే, శశికళ తరఫున న్యాయవాది రాజచెందూర్ పాండియన్ విచారణకు హాజరవుతున్న వాళ్లను క్రాస్ ఎగ్జామిన్ సైతం చేస్తున్నారు. ఈ విచారణ సమయంలో అనేక అంశాలు, అనేకానేక కొత్త వివరాలు వెలుగులోకి వస్తుండడం చర్చకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అపోలో ఆస్పత్రి సమర్పించిన నివేదిక అంతా గందరగోళంగా ఉన్నట్టు కమిషన్ గుర్తించడం మరో హాట్ టాపిక్‌గా మారింది. హాట్ టాపిక్‌గా గందరగోళం :2016 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు 75 రోజుల పాటు అమ్మ జయలలితకు అపోలోలో చికిత్స సాగింది. ఈ కాలంలో ఆమెకు అందించిన వైద్య చికిత్సలు, పర్యవేక్షించిన డాక్టర్లు, ఇలా అన్ని రకాల వివరాలతో కూడిన నివేదికను ఆసుపత్రి వర్గాలు కమిషన్ ముందు ఎప్పుడో ఉంచాయి. వీటన్నింటి మీద పరిశీలన ప్రస్తుతం సాగుతున్నట్టుంది. అపోలో ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది వద్ద సాగిన విచారణతో పాటు, వారు అందించిన వివరాల మేరకు ఆ నివేదిక అంతా గందరగోళం అన్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఆర్ముగస్వామి కమిషన్ గుర్తించింది. అసలు అమ్మ వైద్య చికిత్స వివరాలను సక్రమంగా నమోదు చేయనట్టు తేల్చి ఉన్నట్టు సమాచారం. అందుకే కాబోలు నివేదిక అంతా గందరగోళం అన్నట్టు మారడంతో వాటిని పర్యవేక్షిస్తున్న ఆసుపత్రి ప్రతినిధి గోవిందరాజన్ను కమిషన్ విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆయన్ను మంగళవారం కమిషన్ విచారించగా, అనేక ప్రశ్నలకు సమాధానాల కరువుతో న్యాయమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోజూవారీగా జయలలితకు అందించిన వైద్యం, ఆమెకు ఇచ్చిన మందులు, అందించిన ఆహారం, వైద్య పరంగా ఇచ్చిన సలహాలు సూచనలు, ఇతర పరిశోధనలుఇలా అనేక వివరాలను గుర్తు చేస్తూ కమిషన్ ప్రశ్నల్ని సంధించింది. అనేక ప్రశ్నలకు ఆసుపత్రి ప్రతినిధి మౌనం వహించడంతో నివేదిక గందరగోళం అన్న నిర్ధారణకు కమిషన్ వచ్చినట్టు తెలిసింది. అంతే కాదు, ఏదో మొక్కుబడిగా అత్యవసరంగా ఈ నివేదికను తమ ముందు ఉంచినట్టుగా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ దృష్ట్యా, తదుపరి విచారణ ఎలా సాగనుందో ఉత్కంఠ బయలు దేరింది. ప్రధానంగా జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లు ఇచ్చిన సమాచారాలు కూడా ఆ నివేదికలో సక్రమంగా లేని దృష్ట్యా, అపోలో వర్గాల్ని మళ్లీ విచారణకు పిలిపించడమా లేదా సమగ్ర నివేదికకు ఆదేశించడమా అన్న దిశగా కమిషన్ చైర్మన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. -
‘ఓజోన్’ ఉచ్చు ఎవరి మెడకు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో పెను ప్రకంపనలు సృష్టించిన ఓజోన్ వేలీ కుంభకోణంపై మళ్లీ విచారణ మొదలు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతంలో వుడా ఉన్నతస్థాయి అధికారులతో పాటు దిగువ స్థాయి ఉద్యోగులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమందిపై చర్యలు తీసుకున్నా కీలక సూత్రధారులు, పాత్రధారులూ తమ పలుకుబడి, ప్రాపకంతో తప్పించుకున్నారు. పరదేశిపాలెంలోని ఓజోన్ వేలీ సహా రుషికొండ, మధురవాడ, ఎంవీపీసెక్టార్–1,2,3, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, ఆదిభట్లనగర్, ఎండాడల్లోని పది లేఅవుట్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు 2010లోనే తేటతెల్లమైంది. వుడా తొలిసారిగా చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వ, జిరాయితీ, డి.పట్టా భూములను సేకరించారు. ఇందులో డి.పట్టా యజమానుల నుంచి సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. అంతకుముందు రూరల్ ఎమ్మార్వోగా పనిచేసి వుడా ఎస్టేట్ అధికారిగా, కార్యదర్శిగా పనిచేసిన జగదీష్ ఈ కుంభకోణంలో కీలకపాత్రధారిగా గుర్తించారు. రూరల్ ఎమ్మార్వో పరిధిలో తనకున్న అనుభవాన్ని లేఅవుట్ల బాగోతంలో రంగరించినట్టు అప్పట్లో తేల్చారు. ల్యాండ్‌పూలింగ్ సంగతిని ముందుగా తెలుసుకున్న ఆయన డి.పట్టాదారులతో మంతనాలు సాగిం చి వారి నుంచి కొంతమంది బినామీల పేరిట జీపీఏ రాయించుకోవడం.. నిబంధనల ప్రకా రం ఎకరానికి 1200 బదులు 1500 గజాలు ఇచ్చేలా జీవో ఇప్పించడం.. కోరుకున్న చోట్ల ఈ జాగాను ఇప్పించడం.. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసేయడం.. ఈ వ్యవహారంలో సహకరించిన అప్పటి మున్సిపల్ మంత్రికి, 15 వేల గజాలకు బదులు 12 వేలిచ్చినట్టు ఆరోపణలు రావడం.. అందులో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. వీసీ విష్ణుపై అభియోగాలు.. ఈ అక్రమాలకు అప్పటి వీసీ వీఎన్ విష్ణు సహకారం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన తర్వాత వీసీగా వచ్చిన కోన శశిధర్ ఈ కుంభకోణం లోతుకెళ్లి విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై 2014లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ లేఅవుట్లలో అక్రమాలు నిజమేనని నిగ్గుతేల్చారు. ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీనికి బాధ్యులైన నలుగురు వుడా ఉద్యోగులను, బినామీలను, మరికొందరు బాధ్యులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి కీలకపాత్రధారిగా భావిస్తున్న జగదీష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వీసీగా పనిచేసిన విష్ణు తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయారు. ఇంకొందరు పదవీ విరమణ చేశారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులను వదిలేశారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్, విజిలెన్స్ జాయింట్ కమిషనర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సీసీఎల్ఏ జాయింట్ డైరెక్టర్ శారదాదేవి నేతృత్వంలో రెండ్రోజులు (గురు, శుక్రవారాలు) ఈ కమిటీ ఈ లేఅవుట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించింది. వివాదాస్పద లేఅవుట్లను త్వరలో స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులను కమిటీ సభ్యులు పరిశీలనకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కమిటీ ప్రాథమిక పరిశీలనను ముగించినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
అమ్మ కోసం ఒకే ఒక్కడు!
సాక్షి, చెన్నై : అమ్మ మరణంపై నిజాలు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను పన్నీర్ వర్గం లేవనెత్తగా.. దానికి పళని ఓకే చెప్పటంతోనే ఆ రెండు వర్గాలు ఒకయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. జయ ఆస్పత్రిలో చేరేందుకు దారితీసిన పరిస్థితుల దగ్గరి నుంచి ప్రతీ విషయాన్ని ఈ మాజీ న్యాయమూర్తి ఒక్కడిగానే దర్యాప్తు చేయనుందన్న మాట. అయితే కీలకమైన ఈ అంశంలో ఆయన ఒక్కడే ఏం చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే.. అమ్మ మృతి వ్యహారంలో అనుమానాలు నివృత్తి చేయటంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే తాను మాత్రం విచారణను చాలా పారదర్శకంగా చేపడతానని అర్ముగస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలో ఆయన తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అమ్మ అనారోగ్యం, ఆస్పత్రిలో 75 రోజుల చికిత్సకు సంబంధించిన పూర్తి విషయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. -
పావని మృతిపై జేసీ విచారణ
కడప అర్బన్ : చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని పావని మృతిపై విచారణ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్వేత తేవతీయ సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 7:30 గంటల వరకు తన చాంబర్లో విచారణ చేపట్టారు. విచారణలో పావని తల్లిదండ్రులైన శివమ్మ, మల్లేశ్వరరెడ్డిల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు శోభారాణి, ఆనంద్‌కుమార్, చింతకొమ్మదిన్నె ఎస్ఐ హేమకుమార్‌లను విచారణ చేసి వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. కాగా, ఇప్పటికే నారాయణ కళాశాల వద్దకు వెళ్లి అక్కడి విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని ఈనెల 13 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు విచారించారు. -
కన్హయ్యను బహిష్కరించాలి
మరో ఐదుగురిని కూడా; జేఎన్‌యూ ఘటనపై విచారణ కమిటీ సిఫారసు న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో గత నెలలో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో పోషించిన పాత్రకు గాను.. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, ఉమర్‌ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు సహా ఐదుగురిని బహిష్కరించాలని (రస్టికేషన్) వర్సిటీ ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయితే.. సిఫారసులను క్షుణ్ణంగా పరిశీలించాక వీసీ ఎం.జగదీశ్‌కుమార్, చీఫ్ ప్రొక్టార్ ఎ.దిమ్రీలు నిర్ణయం తీసుకుంటారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. అఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. నాటి ఘటనపై ఏర్పాటైన విచారణ కమిటీ.. 21 మంది విద్యార్థులు వర్సిటీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించారని నివేదికలో పేర్కొంది. నివేదికపై సోమవారం చర్చించిన పాలకవర్గం ఆ 21 మందికి షోకాజ్ నోటీసులు జారీచేసి, జవాబిచ్చేందుకు ఈ నెల 16 వరకు గడువు ఇచ్చింది. నేడు పార్లమెంటుకు ర్యాలీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, ఎస్ఏఆర్ గిలానీల విడుదల కోరుతూ జేఎన్‌యూ విద్యార్థులు మంగళవారం పార్లమెంటు దాకా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏది జాతీయవాదమో, ఏది జాతి వ్యతిరేకమో తేల్చేందుకు దీనిపై జాతీయ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని జేఎన్‌యూ అధ్యాపక సంఘం డిమాండ్ చేసింది. దళితులు, ముస్లిం అధ్యాపకులు దేశ వ్యతిరేకులంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్న సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్ విభాగం అధిపతి అమితాసింగ్ను జేఎన్‌యూ పాలకవర్గం వివరణ కోరింది. రోహిత్‌కు ఇరోమ్ షర్మిల స్కాలర్షిప్: హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ వేముల (మరణానంతరం)కు, జేఎన్‌యూ ఎస్‌యూకు సంయుక్తంగా ఇరోమ్ షర్మిల-2016 స్కాలర్షిప్ను ప్రకటించారు. స్కాలర్షిప్ చెక్కులను వీరి తరఫున కన్హయ్య అందుకున్నారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ నందిని సుందర్ 2012 నుంచి ఈ స్కాలర్షిప్ను అందిస్తున్నారు. దీనికింద రూ.50 వేలు (ఉమ్మడిగా ఉంటే రూ.60వేలు) ఇస్తారు. -
మరణానికి కారణాలేవి?
* నారాయణ విద్యార్థినుల మృతిపై ప్రభుత్వానికి నివేదిక * వెల్లడి కాని అసలు కారణాలు సాక్షి, హైదరాబాద్/తిరుచానూరు: అనుకున్నదే నిజమైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప సమీపంలోని సీకే దిన్నె నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్థినుల మృతికి గల కారణాలపై నియమించిన విచారణ కమిటీ.. సరైన కారణాలు లేకుండానే తన నివేదికను సమర్పించింది. కమిటీ సభ్యులు ప్రొఫెసర్ విజయలక్ష్మి (పద్మావతి మహిళా వర్సిటీ రిజిస్ట్రార్), సులోచన (కడప డీఆర్వో), మాణిక్యం (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) సోమవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తిరుపతిలో ఆ నివేదికను సమర్పించారు. ఫ్యాక్సు ద్వారా విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు ఒక కాపీ పంపించారు. అయితే మంత్రి నారాయణ కాలేజీ కావడంతోనే విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై విచారణ కమిటీ లోతుగా విచారణ చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కమిటీ వల్ల నిజాలు తేలవన్న పలువురి అనుమానాలకు బలం చేకూర్చేలానే నివేదిక ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకే గదిలో ఒకేసారి ఉరివేసుకుని మరణించడంపై అనేక అనుమానాలు రేకెత్తగా, కమిటీ నివేదిక లో ఆ అంశాలేమీ లేవని తెలుస్తోంది. కాలేజీ నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయాక విచారణ జరిపారనీ, దీంతో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులేవీ వెలుగుచూడలేం దంటున్నారు.కాలేజీ ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది, పోలీసులు, పోస్టుమార్టం చేసిన డాక్టర్ల నుంచి వివరాలు సేకరించి కమిటీ నివేదిక రూపొందించింది. ఇద్దరు విద్యార్థినులు సాయంత్రం 5:36 ప్రాంతంలో మరణించారని పోస్టుమార్టం నివేదికలో ఉంది. అయితే 5:30 గంటలకు ఆ రూము వద్దకు మరో విద్యార్థిని వచ్చి వారిద్దరితో మాట్లాడి వెళ్లిందని, మరో అరగంట తరువాత ఇంకో విద్యార్థిని రూము వద్దకు వెళ్లగా ఇద్దరూ ఉరివేసుకొని కనిపించారని సిబ్బంది తెలిపినట్లు నివేదికలో పొందుపర్చారు. అరగంట వ్యవధిలోనే వారిద్దరూ ఉరివేసుకొని ఉండవచ్చని కమిటీ పేర్కొంది. చనిపోయిన ఆరుగంటల లోపు పోస్టుమార్టం చేసి ఉంటే ఎప్పుడు చనిపోయారో సరిగ్గా తేలేదని, మరునాడు పోస్టుమార్టం చేయడం వల్ల డాక్టర్లు తమ నివేదికలో మృతి సమయంపై స్పష్టతనివ్వలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రక్తంతో రాసినట్లున్న పేపర్లోని రాత ఎవరిది? రక్తం ఎవరిదన్న అంశాలపై ఫోరెన్సిక్ నివేదిక రావలసి ఉంది. -
రిషితేశ్వరి కేసుపై విచారణ కమిటీ నివేదిక
గుంటూరు:నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసుకు సంబంధించిన నివేదికను విచారణ కమిటీ శనివారం ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సర్క్యులేట్ చేయడం వల్లే రిషితేశ్వరి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు వర్శిటీలో కుల సంఘాలు, వాటి కార్యాలయాలు ఉండటం కూడా ఆమె ఆత్మహత్యపై ప్రభావం చూపినట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక అందిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు చర్చించారు. దీనిపై గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రిషితేశ్వరి ఘటనపై చంద్రబాబుతో చర్చించామని.. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మరణం తరువాత ఏపీలో ర్యాగింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తానని తాను చంద్రబాబుకు తెలిపినట్లు పేర్కొన్నారు. ర్యాగింగ్ పై అన్ని యూనివర్శిటీలు, కళాశాలల్లో అవగాహన పెంచే చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.