సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో అప్పన్న బంగారు ఆభరణాల విక్రయం పేరిట జరిగిన మోసంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారి అజాద్ పర్యవేక్షణలో కమిటీ విచారణ చేపట్టింది. హైమావతికి సహకరించిన దేవాదాయశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు మధు, శేఖర్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. నెల్లూరు మహిళ శ్రావణి నుంచి ఆన్‌లైన్‌లో కోటి 40 లక్షలు తీసుకున్న విశాఖ మహిళ హైమవతిని విచారిస్తున్నామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఆజాద్ తెలిపారు. (చదవండి: అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా)
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని వెల్లడించారు. దేవస్థానం పేరుతో రసీదు ఎక్కడ ముద్రించారు?, ఆలయ సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆజాద్ వెల్లడించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment