డేటింగ్ యాప్ పరిచయం ఓ యువకుడి కొంప ముంచింది. బంబుల్‌యాప్‌లో పరిచయమైన గురుగ్రామ్‌కు చెందిన యువకుడికి మత్తుమందు ఇచ్చి మరీ మహిళ నిలువునా దోచేసింది. బంగారం, నగదు, లగ్జరీ ఐఫోన్‌తో పాటు, బ్యాంకు ఖాతాని ఖాళీ చేసేసింది. విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
గురుగ్రామ్ వ్యక్తికి బంబుల్ డేటింగ్ యాప్‌లో సాక్షి అలియాస్ పాయల్ అనే ఆ మహిళతో పరిచయం ఏర్పడిందని బాధితుడు రోహిత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ప్రకారం తాను ఢిల్లీకి చెందిన దాన్ననీ, అయితే గురుగ్రామ్‌లో తన అత్తతో నివసిస్తున్నాననిపాయల్ చెప్పింది. గత వారం పాయిల్‌కు ఫోన్ చేసి, కలుద్దామని రోహిత్‌ను కన్విన్స్ చేసింది. అనుకున్న ప్రకారం రోహిత్ వాళ్ల ఇంట్లో కలుసుకున్నారు. ఆ తరువాత దగ్గర్లోని దుకాణంలో మద్యం కొనుక్కుని ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత ఐస్ తీసుకురమ్మనే నెపంతో అతడి దృష్టి మళ్లించింది. అతడలా ఐస్ కోసం వెళ్లగానే డ్రింక్‌లో ఏ మత్తుమందు తెలిపిందో తెలియదు గానీ అది తాగిన వెంటనే రోహిత్ స్పృహ కోల్పోయాడు.
ఆ మత్తు ఎంత ప్రభావితం చేసిందంటే...అక్టోబర్ ఒకటోతేదీ రాత్రి స్పృహ కోల్పోతే..అక్టోబర్ 3వ తేదీ ఉదయం నిద్రలేచేంత.కళ్లు తెరిచి చూసే సరికి ఆమె ఇంట్లో లేదు. బంగారు గొలుసు, ఖరీదైన ఐఫోన్ 14 ప్రో, రూ. 10వేల నగదు, క్రెడిట్,డెబిట్ కార్డులు మాయం. ఇంతలో తన బ్యాంకు అకౌంట్‌నుంచి రూ. 1.78 లక్షలు విత్‌డ్రా అయినట్లు కూడా గుర్తించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment