
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో అక్రమంగా బంగారం (Gold) తరలిస్తూ పట్టుబడిన రన్యా రావుకు బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) ఆమెకు బెయిల్ తిరస్కరించింది.
బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు బెంగళూరు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె వెనక గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఉందనే అనుమానం వ్యక్తం చేసింది. .
డీఆర్‌ఐ అధికారుల విచారణ ముమ్మరం
ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో రూ.12.56కోట్లు విలువైన గోల్డు బార్స్‌ని స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)దర్యాప్తు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రన్యారావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.06కోట్లు విలువ చేసే బంగారం, రూ.2.67కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రన్యారావు కేసులో భర్త?
ఈ క్రమంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సైతం కేసు విచారణ చేపట్టారు. రన్యా రావు తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డును ఉపయోగించి బెంగళూరు నుండి దుబాయ్‌కు రౌండ్ ట్రిప్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అతని పాత్ర ఎంత? అనే దిశగా విచారణ ప్రారంభించారు.
రన్యారావు భర్తకు తాత్కాలిక ఊరట
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) బెంగళూరులోని హుక్కేరికి చెందిన పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో డీఆర్‌ఐ అధికారులు తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం హుక్కేరీని అరెస్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.
రన్యారావుకు ఫోన్ చేసింది ఎవరు?
డీఆర్‌ఐ విచారణలో రాన్యా రావుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. సదరు అగంతకులు రన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని ఆదేశించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రన్యారావును విచారించగా.. యూట్యూబ్‌లో చూసి బంగారం అక్రమంగా ఎలా తరలించాలో నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆమెను దుబాయ్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 3 aగేటు సమీపంలో ఓ వ్యక్తి వద్ద గోల్డ్‌ను తీసుకున్నానని, అంతకుముందు గోల్డ్ స్మగ్లింగ్ చేయలేదని చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment