bail petition rejection
-
జానీ మాస్టర్‌కు భారీ షాక్
-
బెయిల్‌పై ఉత్కంఠ.. ఢిల్లీకి KTR
-
కోర్టులో ఎంపీ కన్నీరు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మలివాల్ వాపోయారు. ఆమెపై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఉదంతంలో ఎంపీ కావాలనే సమస్యలు సృష్టించారని బిభవ్ న్యాయవాది వాదించారు. సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేనిచోట తనపై దాడి జరిగిందని ఆమె చెప్పడంలో దురుద్దేశం దాగుందన్నారు. దాంతో ఎంపీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్ ట్రోల్ ఆర్మీ తనను తీవ్రంగా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. బిభవ్‌కు బెయిలిస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదమని వాదించారు. ఈ ఉదంతంలో నిబంధనలను ఉల్లంఘించింది బిభవ్ కుమారేనని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ ఈనెల 13న తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ అరెస్టయ్యారు. ఫోన్‌ను ఫార్మాట్ చేసి, సీసీటీవీ ఫుటేజిని తొలగించిన బిభవ్ అమాయకుడు కాదని స్వాతి తరఫు లాయర్ వాదించారు. అనంతరం బిభవ్‌కు బెయిల్‌ను నిరాకరిస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సుశీల్ అనూజ్ త్యాగి పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి... తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. -
శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్‌కు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివ బాలకృష్ణ కేసులో ఆయన సోదరుడు నవీన్ కుమార్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మూడు రోజుల క్రితం శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను కూడా నాంపల్లి ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆయన బినామీలను కూడా ఏసీబీ అదికారులు విచారించారు. మరోవైపు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరాతీస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ -
శివబాలకృష్ణకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. మరోవైపు శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్ర పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ఏసీబీ అధికారులు చెప్పారు. ఇవీ ఆస్తులు... శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్‌తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్‌కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్‌గఢ్ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సుదీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్‌ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్ అయ్యాయన్నారు. అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సుదీంద్ర తెలిపారు. ఇది చదవండి: HMDA Siva Balakrishna Case: శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్.. -
చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
-
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. బెయిల్ పిటిషన్‌పై మూడు రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారమే ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి.. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించారు. అంతేకాదు.. చంద్రబాబును మరోసారి కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసిన సంగతి విదితమే. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని ఏపీ సీఐడీ తరపున వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. -
సూర్యనారాయణకు దెబ్బ మీద దెబ్బ..
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు గురువారం న్యాయస్థానాల్లో దెబ్బ మీద దెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు కొట్టేయాలని తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలన్న సూర్యనారాయణ అభ్యర్థనను తోసిపుచ్చింది. సూర్యనారాయణ తమతో కుమ్మక్కయినట్లు వ్యాపారులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీకి విముఖత వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం విచారణ జరిపారు. పోలీసుల తరఫున పబ్లిక్ పీపీ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ సూర్యనారాయణ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని, తద్వారా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వ్యాపారులతో కుమ్మక్కై నోటీసుల ప్రకారం వారు చెల్లించాల్సిన పన్ను కన్నా తక్కువ వసూలు చేశారన్నారు. ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందన్నారు. సూర్యనారాయణ ఏ రకంగా లబ్ధి చేకూర్చారో వ్యాపారులు వాంగ్మూలం రూపంలో పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పారని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. పోలీసులు నమోదు చేసిన ఆ వాంగ్మూలాలను కోర్టు ముందుంచారు. సూర్యనారాయణ చాలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్నారు. అందుకు అన్ని ఆధారాలున్నాయని వివరించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసులోని మిగిలిన నిందితులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేసి సస్పెండ్ చేసేందుకే ఆయనకు బెయిల్ రాకుండా అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు పెట్టారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి.. వ్యాపారుల వాంగ్మూలాలను పరిశీలించిన తరువాత ఈ కేసులో పిటిషనర్ కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కృతి ఇదిలా ఉంటే, పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తోసిపుచ్చింది. సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదని న్యాయాధికారి స్పష్టం చేశారు. -
లఖింపూర్ ఘటన.. కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్ నిరాకరణ
లక్నో: కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్టు. బెయిల్ కోరుతూ ఆశిష్ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆశిష్ మిశ్రా. నిరసనలు చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఈ దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గేతేడాది అక్టోబర్ 9నే అరెస్టయిన ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆశిష్ బెయిల్‌ను రద్దు చేసింది. మంత్రి కుమారుడు అయినందుకు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా అదే కారణంతో ఆశిష్‌కు బెయిల్ నిరాకరించింది. చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్ -
రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడుతాడేమో
ముంబై: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తరచుగా మత్తు పదార్థాలను వినియోగిస్తాడనే భావన కలుగుతోందని ముంబైలోని స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలోని క్రూయిజ్ నౌకలో మత్తు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టయిన ఆర్యన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, ఫ్యాషన్ మోడల్ మున్మున్ ధమేచల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను పరిశీలిస్తే డ్రగ్స్ విక్రేతలను తరచూ కలుస్తాడనే విషయం స్పష్టమవుతోందని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టాల సంబంధ కేసులను విచారించే కోర్టు స్పెషల్ జడ్జి వీవీ పాటిల్ వ్యాఖ్యానించారు. ‘కేసులో ఆధారాలుగా కోర్టుకు ఎన్సీబీ సమర్పించిన ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను గమనిస్తే ఇతనికి రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడే అలవాటుందని తెలుస్తోంది. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే బయటికొచ్చాక మళ్లీ ఈ తప్పు చేయబోడని మేం ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాం. అందుకే బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం’ అని కోర్టు ఉత్తర్వులో జడ్జి వ్యాఖ్యానించారు. ‘నౌకలో సోదాల సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ లేవు. కానీ స్నేహితులు అర్బాజ్, మున్మున్ల వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విషయం ఆర్యన్‌కు తెలుసు. సరదా కోసం, వినియోగం కోసం డ్రగ్స్ వెంట తెచ్చుకుంటామని అరెస్ట్ అయ్యాక ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆర్యన్, అర్బాజ్ ఒప్పుకున్నారు. డ్రగ్స్‌ను సరఫరా చేసే, విక్రయించే వ్యక్తులతో ఆర్యన్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నిషేధిత డ్రగ్స్‌తో సంబంధమున్న ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు కుదరదు’ అని జడ్జి తేల్చిచెప్పారు. దీంతో ఆర్యన్ తరఫు లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ముందు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. గత 18 రోజులుగా ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే గడుపుతున్నారు. -
ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ నిరాశే
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దసరా పండుగ సమయానికి ఇంటికి చేరుకుంటాడన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈ బెయిల్ పిటిషన్‌పై బుధ, గురువారాల్లో ఇరుపక్షాల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. ఆర్యన్ గత కొద్దికాలంగా డ్రగ్స్‌కి బానిసగా మారాడని, అతని వాట్సాప్ చాటింగ్‌లు చూస్తే ఈ విషయం తెలుస్తుందని, అందుకే అతడికి బెయిల్ మంజూరు చేయవద్దని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) తరపు న్యాయవాది అనిల్ సింగ్ కోరారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ ఏమీ లభించలేదు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వాలని వాదించడం సరికాదన్నారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నిందితుడి వద్ద డ్రగ్స్ లభించడం కీలకమైన అంశం కాదని చెప్పారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే తమ విచారణ ముందుకు సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా వయసులో చిన్న వాళ్లని, వారికి బెయిల్ ఇవ్వాలంటూ ఆర్యన్ తరఫు లాయర్ అమిత్ దేశాయ్ చేసిన వాదనలను అనిల్ సింగ్ వ్యతిరేకించారు. వీరంతా భావి భారత పౌరులని, మాదకద్రవ్యాలు సేవించడం చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా ఆ పని చేశారని ఆక్షేపించారు. మరోవైపు విదేశాల్లో ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు సేవించాడన్న అనిల్ సింగ్ వాదనల్ని అమిత్ వ్యతిరేకించారు. ఆర్యన్ ఇటీవల వెళ్లిన దేశాల్లో డ్రగ్స్ సేవించడం చట్టబద్ధమైన చర్యేనని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. సోషల్ మీడియాలో, కోర్టు వెలుపల షారుక్ ఖాన్ అభిమానులు ఆర్యన్‌కు మద్దతుగా నిలిచారు. అతనికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టు బయట నినాదాలు చేశారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఇన్నాళ్లూ క్వారంటైన్ బ్యారెక్‌లో ఉన్న ఆర్యన్ ఖాన్‌ను ఇతర ఖైదీలు ఉండే సెల్‌కి అధికారులు తరలించారు. కోవిడ్–19 పరీక్షల్లో ఆర్యన్ సహా ఇతర నిందితులందరికీ నెగెటివ్ రావడంతో వారిని సాధారణ సెల్లో ఉంచినట్టు జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్ చెప్పారు. బిస్కెట్లు తింటూ.. ఆర్థర్ రోడ్డు జైలులో ఆర్యన్ ఖాన్ కేవలం బిస్కెట్లు తిని రోజులు గడుపుతున్నాడని తెలుస్తోంది. ముంబైలో స్థానిక మీడియా రాస్తున్న కథనాల ప్రకారం జైలులో ఇచ్చే భోజనం తినడానికి ఆర్యన్ నిరాకరించాడు. జైలు క్యాంటిన్ నుంచి కొనుక్కుంటున్న బిస్కెట్లు తింటూ కాలం గడిపేస్తున్నాడు. తనతో పాటు తీసుకువెళ్లిన 12 మంచినీళ్ల బాటిల్స్ నీళ్లతోనే కాలం నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా అయిపోతున్నాయని, తమ కుమారుడి దుస్థితిని తలచుకొని షారుక్ ఖాన్, గౌరి దంపతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ముంబై మీడియా కథనాలు రాస్తోంది. -
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
ముంబై: పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ విచారణను తిరస్కరించిన కోర్టు.. అతడికి 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. రాజ్ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్‌ను ఊహించాడని.. ఈ క్రమంలో తన ఫోన్‌ను మార్చాడని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్‌ను కూడా నియమించుకున్నట్లు సమాచారం. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తూ.. వాటిని హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రెండు రోజుల క్రితం శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ కేసులో వియాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. అంతేకాక రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల రాకెట్టుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. జూలై 27, ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ కేసులో రియాకు షాక్
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రియాతోపాటు ఇదే కేసులు, ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరి పిటిషన్లపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్ విచారణ చేపట్టారు. తనను ఈ తప్పుడు కేసులో ఇరికించారని రియా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్సీబీ విచారణ సమయంలో చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనను ఈ కేసులో ఇరికించేలా బలవంతంగా ఒప్పించారని ఆరోపించారు. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం రియాకు, ఆమె సోదరుడు షోవిక్‌కు తెలుసుననీ, సుశాంత్ చెప్పిన మేరకు వారిద్దరూ డ్రగ్స్ కొనుగోలు, చెల్లింపులు చేసినందున ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని ఎన్సీబీ వాదించింది. సుశాంత్ సింగ్, రియా చెప్పిన విధంగానే సుశాంత్ పనిమనిషి దీపేశ్ సావంత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడనీ, ఈ విషయం అతడు కూడా అంగీకరించినట్లు ఎన్సీబీ పేర్కొంది. -
వరవరరావు బెయిల్‌ను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ముంబై: విరసం కవి, ఉద్యమకారుడు వరవరరావు (81) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని బాంబే హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాదించింది. ప్రస్తుతం ఆయనకు మంచి వైద్య సహాయం అందుతోందని, జైలు అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయనకు సరైన వైద్యసేవలు అందిస్తారని, అందువల్ల ఆయన బెయిల్ పిటిషన్‌ను ఆమోదించవద్దని కోరింది. ఎల్గార్ పరిషద్– కోరేగావ్ భీమా కుట్ర కేసులో వరవరరావును అరెస్టు చేశారు. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతినడం, కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని వరవరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అమ్జాద్ సయిద్ బెంచ్ ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వరవరరావుకు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ న్యాయవాది అనిల్‌సింగ్ వాదించారు. ఈ సందర్భంగా వరవరరావు తరఫు న్యాయవాది సత్యనారాయణ..గతనెల 31న చివరిసారిగా ఆయన కుటుంబసభ్యులతో వీడియోకాల్‌లో మాట్లాడించారని తెలిపారు. దీంతో ఆయనతో కుటుంబసభ్యులను వీడియోకాల్‌లో మాట్లాడించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 2వారాలు వాయిదా వేశారు. -
జైల్లోనే నీరవ్ మోదీ
లండన్/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కుచ్చుటోపీ, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు గురువారం అయిదోసారి తిరస్కరించింది. గతేడాది మార్చిలో అరెస్టయినప్పటి నుంచి నీరవ్ నైరుతీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి బాకీ ఉన్న పన్నుల వసూలుకు గాను ఆ సంస్థ వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాంలో నిందితుడి నీరవ్ మోదీకి చెందిన 3 ఆస్తులను అటాచ్ చేసింది. నీరవ్ బీఎంసీకి రూ. 9.5 కోట్ల పన్ను చెల్లించాలని, ఇందుకుగాను అతని 4 ఆస్తుల్లో మూడింటిని అటాచ్ చేసినట్లు బీఎంసీ తెలిపింది. రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులను వేలం వేయగా రూ. 51 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు వచ్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. వేలం వేసిన వస్తువుల్లో రోల్స్ రాయిస్ కారు, పలు ప్రముఖ చిత్రలేఖనాలు, డిజైనర్ బ్యాగు సహా మొత్తం 40 వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
చిదంబరం ఆరోగ్యం ఓకే..కానీ !
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చిదంబరంకు మినరల్ వాటర్‌తో పాటు ఇంటి ఆహారాన్నే సమకూర్చాలని కోర్టుకు మెడికల్ బోర్డు సూచించింది. ఈ నివేదిక ఆధారంగా చిదంబరానికి సురక్షిత పరిసరాలు ఉండేలా చూడటంతో పాటు దోమల నుంచి రక్షణ కల్పించాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఇక ఇదే కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్ ఈనెల 4న విచారణకు రానుంది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియాపై సీబీఐ కేసులో చిదంబరానికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. -
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
లండన్ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టులో బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టు తోసిపుచ్చింది. మోదీకి బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్ష్యాలకు అవరోధం కల్పించవచ్చనేందుకు ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. పీఎన్బీ స్కాంతో పాటు మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. మోదీ అప్పగింతపై విచారణ సాగుతున్న క్రమంలో దిగువ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నీరవ్ మోదీ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా మోదీ బెయిల్ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టు తిరస్కరించడం ఇది నాలుగవసారి కావడం గమనార్హం. నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
లండన్ : పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రూ 13,000 కోట్ల పీఎన్బీ స్కామ్, మనీల్యాండరింగ్ కేసుల్లో నిందితుడైన నీరవ్ మోదీ అప్పగింత ప్రక్రియపై భారత్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణను మే 24కు లండన్ కోర్టు వాయిదా వేసింది. గత నెలలో నీరవ్ మోదీ అరెస్టయిన తర్వాత లండన్‌లోని వ్యాండ్స్‌వర్త్ జైలులో గడుపుతున్నారు. కాగా గత నెలలో విచారణ సందర్భంగా నీరవ్ మోదీ సాక్షులను బెదిరించినట్టు, స్కామ్‌కు సంబంధించి కీలక ఆధారాలున్న సర్వర్, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. విజయ్ మాల్యా అప్పగింత కేసు తరహాలోనే నీరవ్ న్యాయవాదులు సైతం నీరవ్‌పై ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు బ్రిటన్‌లోనే తమ కేసు విచారణ సక్రమంగా సాగుతుందని కోర్టుకు నివేదించారు. పీఎన్బీ స్కామ్ వెలుగుచూడక ముందు గత ఏడాది జనవరిలో నీరవ్ మోదీ తన కుటుంబంతో కలిసి భారత్‌ను విడిచివెళ్లారు. -
నన్‌పై లైంగిక దాడి : బిషప్కు చుక్కెదురు!
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను బుధవారం కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. 2014 నుంచి 2016 మధ్య బాధితురాలిపై బిషప్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెల 20న కేరళ పోలీసులు మూడు రోజులు ప్రశ్నించిన అనంతరం బిషప్ ములక్కల్‌ను అరెస్ట్ చేశారు. కొట్టాయంలోని పాలా జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు ఎదుట హాజరు పరిచిన మీదట సెప్టెంబర్ 22న ములక్కల్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6వరకూ బిషన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని, తమకు, తమ ఆస్తులకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి రాష్ట్ర పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బిషప్ చర్చి పాస్టర్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. -
గోరఖ్‌పూర్ ఘటన: బెయిల్ పిటిషన్ తిరస్కరణ
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ పూర్ణిమా శుక్లా బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అలహాబాద్ హైకోర్టు తొమ్మిది మందిపై అభియోగాలు మోపింది. వారిలో డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ఇటివల అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీఆర్డీ మెడికల్ కాలేజీలో హోమియోపతి విభాగానికి చెందిన పూర్ణిమా శుక్లా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రా భార్య. ముందస్తు విడుదల కోరుతూ పూర్ణిమా శుక్లా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి యశ్వంత్ వర్మ విచారించారు. ప్రస్తుతం కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో వారికి బెయిల్ మంజూరు చేస్తే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. -
కార్తీకి మరో మూడు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టు, ఢిల్లీ స్థానిక కోర్టుల్లోనూ ఊరట లభించలేదు. ఆయన సీబీఐ కస్టడీని ఢిల్లీ స్థానిక కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. బెయిల్ పిటిషన్‌ను సైతం వాయిదా వేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కార్తీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మంగళవారం అతడిని సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయమూర్తి సునీల్‌రాణా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో కార్తీ పాత్రపై వాస్తవాలు తెలియాలంటే విచారణ తప్పనిసరి అని, అందువల్ల కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. కార్తీని ముంబై తీసుకువెళ్లి ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారించాల్సి ఉందని, ఈ కేసులో ఆమె వాంగ్మూలం ఓ కీలక ఆధారమని విజ్ఞప్తి చేసింది. -
హైకోర్టులో శింబుకు చుక్కెదురు
తమిళసినిమా: నటుడు శింబుకు హైకోర్టులో చుక్కెదురైంది.బీప్ సాంగ్ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన నటుడు శింబుకు బెయిల్ రావడం కాస్త ఊరటనిచ్చినా తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చింది. వివరాల్లోకెళ్లితే బీప్‌సాంగ్ వ్యవహారంలో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ను శింబు తనపై ఇకపై కేసులు నమోదు చేయరాదని డీజీపీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు శింబు అభ్యర్థన పిటిషన్‌ను కొట్టివేసింది.శింబు పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య ఇలాంటి పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి చట్టంలో స్థానం లేదంటూ కొట్టివేశారు. -
భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
కర్నూలు: వైఎస్ఆర్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను జిల్లా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ నెల 1వ తేదీన అరెస్ట్ అయిన నాగిరెడ్డి ఆనారోగ్యం కారణంగా ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. నాటకీయ పరిణామాల మధ్య భూమా నాగిరెడ్డిని ఈ నెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశం సందర్భంగా ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.. డోర్ వేయమని భూమా సైగ చేసినందువల్లే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శుక్రవారం(గత నెల 31) టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ భూమాపై మూడు కేసులు నమోదు చేశారు. భూమా ప్రోత్సాహంతోనే దాడులు జరిగాయని పేర్కొంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని, లొంగిపోవాలని ఎస్పీ హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వెంట రాగా భూమా శనివారం స్వయంగా ఎస్పీ రవికృష్ణ వద్ద లొంగిపోయారు. అదే రోజు రాత్రి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట భూమా నాగిరెడ్డిని పోలీసులు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు శనివారం రాత్రి భూమాని స్థానిక మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మంగళవారం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. **