
హైకోర్టులో శింబుకు చుక్కెదురు
తమిళసినిమా: నటుడు శింబుకు హైకోర్టులో చుక్కెదురైంది.బీప్ సాంగ్ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన నటుడు శింబుకు బెయిల్ రావడం కాస్త ఊరటనిచ్చినా తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చింది. వివరాల్లోకెళ్లితే బీప్‌సాంగ్ వ్యవహారంలో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ను శింబు తనపై ఇకపై కేసులు నమోదు చేయరాదని డీజీపీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు శింబు అభ్యర్థన పిటిషన్‌ను కొట్టివేసింది.శింబు పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య ఇలాంటి పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి చట్టంలో స్థానం లేదంటూ కొట్టివేశారు.