తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను బుధవారం కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. 2014 నుంచి 2016 మధ్య బాధితురాలిపై బిషప్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెల 20న కేరళ పోలీసులు మూడు రోజులు ప్రశ్నించిన అనంతరం బిషప్ ములక్కల్‌ను అరెస్ట్ చేశారు.
కొట్టాయంలోని పాలా జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు ఎదుట హాజరు పరిచిన మీదట సెప్టెంబర్ 22న ములక్కల్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6వరకూ బిషన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని, తమకు, తమ ఆస్తులకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి రాష్ట్ర పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బిషప్ చర్చి పాస్టర్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment