సూర్యనారాయణకు దెబ్బ మీద దెబ్బ.. | Court examined the testimony of traders on Suryanarayana | Sakshi
Sakshi News home page

సూర్యనారాయణకు దెబ్బ మీద దెబ్బ..

Published Fri, Jun 16 2023 5:18 AM | Last Updated on Fri, Jun 16 2023 5:31 AM

Court examined the testimony of traders on Suryanarayana - Sakshi

సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణకు గురువారం న్యాయస్థానాల్లో దెబ్బ మీద దెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదా­యా­నికి గండికొట్టారంటూ విజయవాడ పటమట పోలీ­సు­­లు నమోదు చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు కొట్టేయా­ల­ని తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపివే­యా­లన్న సూర్యనారాయణ అభ్యర్థనను తోసిపు­చ్చిం­­ది. సూర్యనారాయణ తమతో కుమ్మక్కయినట్లు వ్యా­పారులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోకి తీ­సుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీకి విముఖత వ్యక్తంచేసింది.

ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసు­లను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టే­యా­లని కోరుతూ సూర్యనారాయణ హైకోర్టులో పిటి­షన్‌ దాఖలు చేశారు. తన అరెస్ట్‌తో సహా తదు­పరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశా­రు. ఈ అనుబంధ పిటిషన్‌­పై జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి గురు­వారం విచారణ జరి­పా­రు.

పోలీసుల తరఫున పబ్లిక్‌ పీపీ య­ర్రం­రెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ సూర్య­నారా­యణ ఉద్దేశపూర్వ­కంగా ప్రభుత్వ ఆదా­యా­నికి గండికొట్టారని, తద్వా­రా అవినీతికి పాల్ప­డ్డా­రని తెలి­పారు. వ్యాపారు­లతో కుమ్మక్కై నోటీసుల ప్రకారం వారు చెల్లించాల్సిన పన్ను కన్నా తక్కువ వసూలు చేశార­న్నా­రు. ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందన్నారు. సూర్యనా­రా­య­ణ ఏ రకంగా లబ్ధి చేకూర్చారో వ్యాపారులు వాం­గ్మూలం రూపంలో పూసగుచ్చినట్లు పోలీసులకు చె­ప్పారని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. పోలీసులు నమోదు చేసిన ఆ వాంగ్మూలాలను కోర్టు ముందుంచారు.

సూర్య­నా­రాయణ చాలా తీవ్రమైన నే­రా­­నికి పాల్ప­డ్డా­ర­న్నా­రు. అందుకు అన్ని ఆధారా­లు­న్నాయని వివరించా­రు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ దశ­లో ఎలాంటి మధ్యంతర ఉత్త­ర్వులు జారీ చేయ­వ­ద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతకు ముం­దు సూర్యనారాయణ తరఫున సీనియర్‌ న్యా­య­వా­ది వైవీ రవిప్రసాద్, న్యా­య­వాది పీవీజీ ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసులోని మిగిలిన నిం­దితులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లే­ద­న్నారు. ప్రభుత్వ ఉద్యోగు­ల సంఘం అధ్యక్షుడిగా ఉ­ద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందు­కు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు న­మో­దైం­దన్నారు.

పిటిష­నర్‌­ను అరెస్ట్‌ చేసి సస్పెండ్‌ చే­సేం­దుకే ఆయనకు బె­యిల్‌ రాకుండా అవినీతి నిరో­ధ­క చట్టం కింద కూ­డా కేసు పెట్టారన్నారు. వాద­నలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస­రెడ్డి.. వ్యాపా­రుల వాంగ్మూలాలను పరిశీలించిన తరు­వాత ఈ కేసులో పిటిషనర్‌ కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదన్నారు.

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కృతి
ఇదిలా ఉంటే, పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చే­యా­లని కోరుతూ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తోసిపుచ్చింది. సూర్యనా­రాయణపై అవినీతి నిరోధక చట్టం కింద పోలీసు­లు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, అతని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదని న్యాయాధికారి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement