
ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌పై హైకోర్టు ధర్మాసనం
ఈ దిశగా మార్గదర్శకాలున్నాయా అంటూ ప్రభుత్వానికి ప్రశ్న
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా స్థిరాస్తులను రిజి్రస్టేషన్ చేసుకునే విధానం (ఎనీవేర్ రిజి్రస్టేషన్) కింద ప్రజలు సమరి్పంచిన డాక్యుమెంట్ల విషయంలో సబ్ రిజిస్ట్రార్లు్ల సకాలంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. లేని పక్షంలో అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. రిజి్రస్టేషన్ కోసం ప్రజలు సమర్పించే డాక్యుమెంట్లను సకాలంలో పరిష్కరించేందుకు సబ్ రిజిస్ట్రార్లకు ఏవైనా మార్గదర్శకాలు జారీ చేశారా? లేదా? చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనీవేర్ రిజి్రస్టేషన్ విధానం కింద ఆస్తుల రిజి్రస్టేషన్‌లో రిజిస్ట్రా్టర్లు జాప్యం చేస్తున్నారంటూ నెల్లూరుకి చెందిన పి.దుర్గేష్ బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నిమ్మగడ్డ రేవతి వాదనలు వినిపిస్తూ, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత, ఆ ఆస్తులు ఎక్కడున్నాయో ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లపై ఆమోదం కోరడం జరుగుతుందన్నారు.
ఆస్తులున్న ప్రాంత సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తెలిపితేనే డాక్యుమెంట్లు సమర్పించిన చోట ఉన్న సబ్ రిజిష్ట్రార్ ఆస్తులను రిజిష్టర్ చేస్తున్నారని వివరించారు. అంతేకాక జాయింట్ రిజిష్ట్రార్, సబ్ రిజిష్ట్రార్లను వ్యక్తిగతంగా కలిసిన తరువాతే రిజి్రస్టేషన్లు అవుతున్నాయని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారిని కలవకుంటే పని కావడం లేదన్నారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకునేందుకు నిర్థిష్ట కాల వ్యవధిని ఖరారు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment