Sub-Registrar
-
కోట్లు పలుకుతున్న కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టు
కావలి సబ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా అధికారానికి, అహంకారానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. లంచం లేనిదే సంతకం పెట్టని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలకు తావులేదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కావలిలోనే కాక, ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ శాఖలో అవినీతికి తావులేదని చెప్పిన ఆ ప్రజాప్రతినిధే.. మూడు నెలలు తిరగక ముందే ప్లేటు ఫిరాయించి ఆ పోస్టుకు బహిరంగ వేలం పెట్టడంతో సబ్ రిజిస్ట్రార్ vs ప్రజాప్రతినిధిగా మారింది. సెలవు పెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే ఎలా పనిచేస్తావో చూస్తానన్న సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి.. ఆ సబ్ రిజిస్ట్రార్ తన పలుకుబడితో అదే సీటులో కూర్చొని పనిచేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి సబ్ రిజిస్ట్రార్ సీటు.. భలే హాటుగా మారింది. ఈ పోస్టు వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్ అయింది. అధికారం, రాజకీయం ఆధిపత్యం కొనసాగుతోంది.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ ద్వారా అదనపు వసూళ్లు లేకుండా కాగితం కదలని పరిస్థితి. అలాంటి సబ్ రిజిస్ట్రార్కార్యాలయం ఎదుట లంచాలకు తావులేదని, ప్రభుత్వ రుసుములు చెల్లిస్తే చాలని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద సంచలనంగా మారింది. నిత్యం క్రయవిక్రయాల్లో రూ.లక్షల్లో చేతులు మారే కార్యాలయంలో ఉన్న పళంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారం వెనుక అధికారి నిజాయితీ ఉందనుకుంటే పొరపాటే. రూ.కోట్లు పలికే ఆ పోస్టులో సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి కూర్చొన్న సదరు మహిళా అధికారి భవిష్యత్ ప్రమాదానికి భయపడి ఆ బోర్డు ఏర్పాటు చేసినట్లుగా చర్చ సాగుతోంది. నెలకు రూ.50 లక్షల ఆదాయం జిల్లాలో నెలవారీ ముడుపుల ఆదాయంలో నెల్లూరు తర్వాత కావలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే. కావలి చుట్టూ రామాయపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం ఇలా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు దూసుకుపోతున్న కావలిలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఈ ప్రాంతంలో భూ క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే భూ వివాదాలు ఉన్న ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కీలకంగా మారింది. నిబంధలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే రూ.లక్షల్లో ముడుపులు అందుతాయి. నెలవారీగా సబ్ రిజిస్ట్రార్ ఆదాయం రూ.50 లక్షలకుపై మాటే ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ దఫా సాధారణ బదిలీల్లో భాగంగా ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకుని ఓ మహిళా అధికారి ఈ పోస్టును పట్టేసింది. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ లేకుండానే ఆ పోస్టులో కూర్చొంది. రెండు నెలల పాటు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయంలో కాసులు గలగలాడాయి. దీంతో ఆ పోస్టుపై కన్నేసిన ప్రజాప్రతినిధి సదరు అ«ధికారిణి దందా వ్యవహారంపై ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ఆమె కొద్ది రోజులు సెలవుపై వెళ్లడం చకచకా జరిగిపోయాయి. పోస్టుకు బహిరంగ వేలం.. కావలి సబ్‌రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లడంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి ఈ పోస్టుకు వేలం పెట్టినట్లు తెలుస్తోంది. నెలవారీగా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆ పోస్టుకు గతంలో పని చేసిన ఓ అధికారి, నెల్లూరులో పనిచేసి వెళ్లిన మరో అధికారి పోటీ పడుతున్నారు. రెగ్యులర్ పోస్టు అయితే.. రూ.2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యుటేషన్‌పై వచ్చేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. రూ.కోటి వరకు బేరం కుదిరింది. లోకల్ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో భారీ ఆఫర్లతో పోస్టు కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తన పోస్టుకు ఎసరు పెడుతున్న విషయాన్ని తెలుసుకున్న సదరు అధికారిణి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఉన్నతాధికారులకు రెకమెండ్ చేయించుకుని వెను వెంటనే విధుల్లో జాయిన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని సందర్శించిన సదరు ప్రజాప్రతినిధి ఇక్కడ అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పారు. మూడు నెలలు తిరగక ముందే ఆ పోస్టుకు వేలం పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీటు వదలాల్సిందే.. కదిలే ప్రసక్తే లేదు.. కావలి సబ్ రిజిస్ట్రార్ గా విధుల్లో జాయిన్ అయిన అధికారిణి స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు ఇతరులను రాజీ రాయబేరానికి పంపించారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రజాప్రతినిధి ఆమె ఆ సీటులో ఎన్ని రోజులు కూర్చుంటుందో నేను చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆ సీటు వదలాల్సిందేనని సదరు ప్రజాప్రతినిధి హుంకరిస్తుంటే.. కదిలే ప్రసక్తే లేదంటూ సబ్ రిజిస్ట్రార్ మొండికేస్తున్నారు. అధికారి, ప్రజాప్రతినిధి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో రాజకీయంగా ఉచ్చు బిగిసే అవకాశం ఉండడంతో ఆ సబ్ రిజిస్ట్రార్ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రజాప్రతినిధికే సవాల్ విసురుతూ ఎదురొడ్డుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీని అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావించిన సదరు అధికారిణి కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు, చలనాలు మాత్రమే చెల్లించాలని, దళారులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని బోర్డు పెట్టించడమే కాకుండా క్రయ, విక్రయ దారులను ఎవరికి అదనపు రుసుములు చెల్లించవద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆ కార్యాలయ ఉద్యోగులకు నచ్చడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కావలి కార్యాలయానికి బదిలీపై వస్తే లంచాలు రాకుండా ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తమకు వచ్చే ఆదాయాన్ని అడ్డుకుంటుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేసిన సదరు అధికారిణిపై అనేక ఆరోపణలున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అధికారిణి కావలికి వచ్చేసరికి ఇలా బోర్డులు ఏర్పాటు చేయడంపై ఆ శాఖలోనే హాట్ టాపిక్‌గా మారింది. -
నచ్చిన వారికి మెచ్చిన చోటు!
వరంగల్ స్థానికత కలిగిన ఓ సబ్ రిజిస్ట్రార్ మెదక్‌లో పనిచేస్తుండేవారు. ఆయన 317 జీవో కింద మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లారు. ఆ సబ్ రిజిస్ట్రార్ జీవిత భాగస్వామి కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో తనను స్పౌజ్ కోటా కింద పరిగణనలోకి తీసుకుని స్టేషన్ కేటాయించాలని, లేదంటే తనకు స్టేషన్ అవసరం లేదని, చిట్స్కయినా, ఆడిట్కయినా పంపాలని ఆ సబ్ రిజిస్ట్రార్ కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానానికి 100 కిలోమీటర్ల అవతలకు బదిలీ చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ జీవిత భాగస్వామి అదే జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులోని నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా తనను స్పౌజ్ కోటా కింద పరిగణనలోకి తీసుకుని తగిన స్థానం ఇవ్వాలని సదరు సబ్ రిజిస్ట్రార్ కోరారు. కానీ ఆయన్ను హైదరాబాద్‌కు మరింత దగ్గరగా బదిలీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ల యూనియన్ పేరుతో చెలామణి అవుతున్న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లకు వరుసగా మూడోసారి ఫోకల్ పోస్టింగులిచ్చి ఏ గ్రేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు బదిలీ చేశారు. ఏసీబీ ట్రాప్ రికార్డులు కూడా పట్టించుకోకుండా కావాల్సిన స్థానానికి బదిలీ చేయడం గమనార్హం.సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీల్లో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన బదిలీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు అధికారుల కనుసన్నల్లో ఈ బదిలీల తంతు జరిగిందని, బదిలీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు విని్పస్తుండగా, తాజాగా నిఘా వర్గాల నివేదికతో బదిలీలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. ఆప్షన్లు ఒకచోటుకు పెడితే మరో చోటుకు బదిలీ చేశారని, సింగిల్ డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను పంపి, జిల్లా కేంద్రాల్లో సీనియర్ అసిస్టెంట్లతో సరిపెట్టారని, స్పౌజ్ కేసులను పట్టించుకోలేదని, జీరో సరీ్వసు అంటూ అందరినీ బదిలీ చేస్తామని చెప్పి చివరకు పరిపాలనా అవసరాలంటూ పది స్టేషన్ల వరకు బదిలీలు చేయలేదని పలువురు సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు.తమకు నచ్చిన వారికి మాత్రం వరుసగా మూడోసారి ఫోకల్ పోస్టింగులు ఇచ్చారని, చార్మినార్ జోన్ పేరుతో కొందరు సబ్ రిజిస్ట్రార్లను ఏ గ్రేడ్ స్టేషన్ల చుట్టూనే తిప్పుతున్నారని, ఇందుకోసం డబ్బులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. డీఐజీల స్థాయిలో సిద్ధమైన జాబితాకు, విడుదలైన బదిలీల జాబితాలకు పొంతన లేకుండా పోయిందని, ఆ ఇద్దరు అధికారులు చక్రం తిప్పి తమ ఇష్టారాజ్యంగా పేర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పైరవీలకు అస్కారమివ్వకుండా రిజి్రస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులకు బాధ్యత అప్పగిస్తే, అడ్డగోలుగా బదిలీలు చేసి అంతా బాగానే జరిగినట్టు ఆయన్ను నమ్మించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. బదిలీలకు కొద్దిరోజుల ముందే వచ్చిన కమిషనర్‌ను కూడా బురిడీ కొట్టించి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.ఆప్షన్లు ఎందుకు అడిగినట్టో..? సాధారణ బదిలీల్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్లను ఆప్షన్లు అడిగారు. ఈ ఆప్షన్ల వారీగా వారి ప్రాధాన్యతలను తెలుసుకోవడం ఎప్పుడూ జరిగే ప్రక్రియే. కాగా సబ్ రిజిస్ట్రార్లందరూ తమ అభీష్టం మేరకు ఆప్షన్లు ఇచ్చి ఆయా స్టేషన్లపై ఆశలు పెట్టుకున్నారు. తీరా బదిలీల జాబితా చూస్తే ఆప్షన్లు ఇచ్చిన స్టేషన్లకు, తమను బదిలీ చేసిన స్టేషన్‌కు అసలు పొంతన లేకపోవడంతో విస్తుపోవడం బాధిత సబ్ రిజిస్ట్రార్ల వంతయింది. నోడల్ జిల్లా రిజిస్ట్రార్లుగా జూనియర్ అసిస్టెంట్లు! రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు జిల్లా రిజిస్ట్రార్లు లేరు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా రిజిస్ట్రార్లు పనిచేస్తుండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే సబ్ రిజిస్ట్రార్లు నోడల్ జిల్లా రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి జిల్లా కేంద్రాలకు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా పంపడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు జిల్లా కేంద్రాలతో పాటు, కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన మరో జిల్లా కేంద్రానికి బదిలీల తర్వాత కూడా ఇన్చార్జులే సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగుతుండగా, రోజుకు ఒకటో, రెండో డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు మాత్రం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను పంపారనే విమర్శలు ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్లుగా సన్నిహితులు! బదిలీల్లో అక్రమాలు, అన్యాయాల మాట అటుంచితే.. సాధారణ బదిలీల గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీగా ఉన్న ఏడెనిమిది కార్యాలయాలకు తమకు నచ్చిన జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను పంపడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రం, హైదరాబాద్ తూర్పు దిక్కున అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే స్టేషన్, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇంకో స్టేషన్‌తో పాటు ఖాళీగా ఉన్న స్టేషన్లకు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా డిప్యుటేషన్‌పై పంపారని, వీరంతా బదిలీల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన అధికారులకు సన్నిహితులేననే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. సబ్ రిజిస్ట్రార్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్ల విషయంలోనూ ఇష్టారాజ్యంగా బదిలీలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. -
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
లంచం కేసులో సబ్‌రిజిస్ట్రార్ అరెస్ట్
పళ్లిపట్టు: ల్యాండ్ వ్యాల్యుయేషన్ రిపోర్టు కోసం రూ. 35 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆర్కేపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా విరుదాచలంకు చెందిన సెల్వరామచంద్రన్(39) విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్కేపేట విలక్కనాంపూడి పుదూర్‌కు చెందిన ఆంజనేయన్ అతని కుటుంబీకులకు చెందిన 70 సెంట్ల భూమిని రాణిపేట జిల్లా మలైమేడు ప్రాంతానికి చెందిన నరసింహన్ అనే వ్యక్తి తిరుత్తణి మండలం మద్దూరుకు చెందిన జయశంకర్(53) మధ్యవర్తిగా వ్యవహరించి జనవరి 22న ఆర్కేపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. 70 సెంట్ల ఖాళీ స్థలానికి సంబంధించి ల్యాండ్ వ్యాల్యుయేషన్ రిపోర్ట్ కోసం సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం సెల్వ రామచంద్రన్ రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు, చివరికి రూ. 35 వేలకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే అంత డబ్బులు లంచంగా ఇచ్చేందుకు ఇష్టం లేని స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి తిరువళ్లూరులోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కలైసెల్వన్ సూచనల మేరకు మంగళవారం సాయంత్రం మధ్యవర్తి జయశంకర్ రూ. 35 లంచం నగదు తీసుకుని రిజిస్ట్రార్‌కు ఇస్తుండగా పక్కనే వున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద ఇవ్వమని చెప్పగా అతను ఆ డబ్బును తీసుకుంటున్న సమయంలో అక్కడే వేచివున్న ఏసీబీ సీఐ తమిళ్‌సెల్వి సిబ్బంది ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రిజిస్ట్రార్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను అరెస్ట్ చేశారు. -
సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
సింగరాయకొండ/ఆత్మకూరు రూరల్(నంద్యాల) : జగనన్న సురక్ష క్యాంపులు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇటీవల ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడగా, తాజాగా ఓ మహిళ గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వైకే నందకిషోర్ రోజూ నెల్లూరు నుంచి ఒంగోలుకు ఉద్యోగం నిమిత్తం వస్తుంటారు. ఈ నెల 5న రైల్లో వస్తుండగా కావలి దాటగానే స్వల్పంగా గుండెనొప్పి వచ్చింది. మొదట గ్యాస్ సమస్య అని మందులు వేసుకున్నా.. నొప్పి తగ్గకపోవడంతో వెంటనే తనకు రైల్లో పరిచయం ఉన్న సింగరాయకొండ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉజ్వలకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఉజ్వల.. సింగరాయకొండ గ్రామ సచివాలయం–2 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం మెడికల్ క్యాంపు జరుగుతోందని, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు క్యాంపులో ఉన్నారని.. సింగరాయకొండలో దిగాలంటూ స్టేషన్‌కు 108ను పంపించి సురక్ష క్యాంపునకు తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వంశీధర్‌లు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించి.. రిపోర్టును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వరరావు.. రిజిస్ట్రార్ కు గుండె నొప్పి వచ్చిందని నిర్ధారించి వెంటనే ప్రథమ చికిత్స చేయించి తర్వాత ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కిమ్స్‌లోని డాక్టర్లు రిజిస్ట్రార్ నందకిషోర్‌కు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి రెండు వాల్వస్ దెబ్బతిన్నాయని గుర్తించి.. వెంటనే స్టంట్ వేసి చికిత్స చేశారు. సకాలంలో అక్కడకు రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయని కిమ్స్ డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించి తన భర్త ప్రాణాలు కాపాడారని అతని భార్య విజయలక్ష్మి.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఉన్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ సోమవారం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న సురక్ష కా>్యంపులో 35 మందికి ఈసీజీ పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి గుండె సమస్యలున్నట్టు తేలిందని చెప్పారు. ఓ మహిళను కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీపతిరావుపేటలో సోమవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ మహిళను కాపాడింది. జయలక్ష్మీదేవి కొద్దిగా ఆయాసం ఉందంటూ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చింది. వైద్యులు ఆమెకు గుండె పరీక్షలు చేసి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం చేసి హుటాహుటిన అక్కడే ఉన్న అంబులెన్స్‌లో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. -
మహిళా సబ్ రిజిస్ట్రారును బెదిరించిన టీడీపీ నేత
ప్రొద్దుటూరు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామలక్షుమ్మను బెదిరించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వరదరాజులరెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బందిని బయటికి రావాలని బెదిరించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపలే ఉండి బయటికి రాలేనని బోరున విలపించారు. మీకూ ఆడ పిల్లలున్నారు కదా.. అని ఆమె ప్రాధేయపడ్డారు. రాజకీయాలతో తమకేం సంబంధం లేదని తెలిపారు. అయినా వినకుండా వరదరాజులరెడ్డి.. నువ్వు ఏడ్చినా వదిలేదిలేదు.. బయటకు రావాల్సిందే.. అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. విధిలేని పరిస్థితిలో సబ్ రిజిస్ట్రార్ ఏడ్చుకుంటూ బయటకొచ్చారు. మహర్షి స్కూల్ స్థలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వరద చెప్పినట్టు సబ్ రిజిస్ట్రార్ వినలేదు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో సబ్ రిజిస్ట్రార్ దానిని రిజిస్టర్ చేయకపోవడంపై వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి కప్పం కట్టాలా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాదాపు అరగంట పాటు విధులకు ఆటంకం జరిగి లావాదేవీలు నిలిచిపోయాయి. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించడమేంటని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లు.. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ అరెస్టు
చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్: ఓ స్థలానికి సంబంధించి యజమాని ఒకరైతే.. వాళ్లకే తెలియకుండా మరొకరి పేరిట రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను గత నెలలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ ఐ.సుబ్రహ్మణ్యం, సబ్ రిజిస్ట్రార్ జె.శ్రీధర్ గుప్తా, వీఆర్వోలు ధనుంజయ, ఎం.శివనారాయణ, కె.బాబును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో దాదాపు రూ.50 కోట్లకుపైగా విలువ చేసే భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో సురేంద్రబాబు తదితరులు ఓ ముఠాగా ఏర్పడి వేరేవారికి కట్టబెట్టారు. దీంతో సురేంద్రబాబుతో పాటు మొత్తం ఏడుగురిని సెప్టెంబర్ 30న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని అక్రమాలు జరిగినట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయించారు. అక్రమాలు బయటపడింది ఇలా.. చిత్తూరుకు చెందిన బాలగురునాథంకు చెందిన ఐదెకరాల స్థలాన్ని సురేంద్రబాబు ముఠా.. యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినైజర్, పూపతమ్మ, మురళి, శివకుమార్, చిట్టిబాబు, చిత్తూరుకు చెందిన నితీష్‌కు రూ.75 లక్షలకు అమ్మేశారు. తాము మోసపోయామని, ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా విలువైన స్థలాలను తమకు రిజిస్ట్రేషన్ చేసి ఏమార్చారని ఎబినైజర్ గత నెల 25న యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన పోలీసులు ఎబినైజర్ కొన్న స్థలం బాలగురునాథంకు చెందిందిగా గుర్తించారు. ఈ భూమిని గ్రామకంఠం భూమిగా పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో రెండేళ్ల క్రితం చిత్తూరు తహసీల్దార్‌గా పనిచేసి, ప్రస్తుతం పుత్తూరు తహసీల్దార్‌గా ఉన్న ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు వీఆర్వోలు ధనంజయ, కె.బాబు, శివనారాయణ కీలకపాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఈకేవైసీ చేయడం, ఉద్యోగుల లాగిన్, పాస్‌వర్డ్‌తోపాటు ప్రభుత్వ సమాచారాన్ని దళారులకు ఇవ్వడంలో ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారులు నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పెద్ద మొత్తంలో నగదు రూపేణా లబ్ధి పొందినట్టు ఆధారాలు సేకరించారు. ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని, మరికొంతమంది హస్తం ఉందని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.. చిత్తూరు అర్బన్ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ గిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పందించిన ఆయన జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణలో శ్రీధర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చిత్తూరు దాటివెళ్లవద్దని ఆదేశించారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జమ్ము వెంకట వరప్రసాద్ కార్యాలయం, ఇల్లు, తదితర ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఆత్రేయపురంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు రాజమహేంద్రవరంలోని ఆయన ఇల్లు, కాకినాడ, విజయవాడ, తెలంగాణలోని మేడ్చల్ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, కుటుంబ సభ్యుల పేరిట రెండు ఫ్లాట్లు, ఒక భవనం, రెండు ఇళ్ల స్థలాలు, ఒక కారు, మోటార్ సైకిల్, బంగారం, విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు, భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ మొత్తం రూ.2.5 కోట్లు ఉంటుందని తేల్చారు. వరప్రసాద్ దాదాపు రూ.1.4 కోట్ల మేర అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. విశాఖపట్నానికి చెందిన వరప్రసాద్ తండ్రి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ 1982లో మరణించారు. కారుణ్య నియామకం కింద వరప్రసాద్ 1989లో ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. గత ఆగస్టు నుంచి ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. అక్రమ ఆస్తుల నేపథ్యంలో వరప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఇన్చార్జ్ అడిషనల్ ఎస్పీ సౌజన్య, డీఎస్పీ రామచంద్రరావు, సీఐ పుల్లారావు, తిలక్ పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
పాకాల (చిత్తూరు జిల్లా): మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలను ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న ఓ సబ్–రిజిస్ట్రార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ అల్లాభక్ష్ తెలిపిన వివరాల మేరకు.. పూతలపట్టు మండలం పేటమిట్టకు చెందిన గల్లా దామోదరప్రసాద్ తన 6.69 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన వి.నానిప్రసాద్ వద్ద రూ.46 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. గత నెల 31వ తేదీన రిజిస్ట్రేషన్ అనంతరం నానిప్రసాద్‌కు మార్టిగేజ్ పత్రాలను ఇచ్చేందుకు పాకాల సబ్‌రిజిస్ట్రార్ దామోదరం రూ.2 లక్షల లంచాన్ని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.1 లక్షా 50 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే.. నానిప్రసాద్ గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నానిప్రసాద్ సబ్–రిజిస్ట్రార్‌కు నగదు అందజేశాడు. ఆ నగదును డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకు ఇచ్చి సబ్–రిజిస్ట్రార్ దాచమన్నాడు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రాంబాబును పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సబ్–రిజిస్ట్రార్‌ను, డాక్యుమెంట్ రైటర్‌ను అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ అల్లాభ„Š తెలిపారు. ఏసీబీ డీఎస్పీ జనార్దన్‌నాయుడు, ఇన్స్పెక్టర్ తనీమ్, ఎస్ఐ విష్ణువర్థన్, సిబ్బంది శ్రీనివాస్, సారథి పాల్గొన్నారు. -
ఇంటికి ఇంత.. ప్లాటుకు అంత.. అక్కడంతా 'రైటర్ల'రాజ్యం!
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రానికి చెందిన పి.మధుకర్‌రెడ్డి (పేరు మార్చాం) స్థానికంగా ఓ వెంచర్లో 300 గజాల ప్లాటు కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. దాని రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల రూపంలో రూ.8,800 చెల్లించాడు. అయితే రిజిస్ట్రేషన్ చేయించినందుకు మధ్యవర్తి (డాక్యుమెంట్ రైటర్)కి చెల్లించిన ఫీజు రూ.4,000. ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కింద కట్టిన ఫీజుకు సగం అదనంగా మధ్యవర్తికి చెల్లించడం గమనార్హం. డాక్యుమెంట్ ప్రిపరేషన్, కార్యాలయంలోని వ్యవహారాన్ని చకచకా పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినా ఎదురయ్యే పరిస్థితి ఇది. ఇండ్లు, ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లలో డాక్యు మెంట్ రైటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్నారు. సొమ్ము ముట్టజెపితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా, ఎలాంటి అవాంతరాల్లేకుండా జరిగిపోతుంది. ఏవైనా పేపర్లు లేకపోవడం, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా.. అరగంటలోనే ‘పని’ పూర్తవుతుంది. కాకపోతే దీనికి మరికొంత ఎక్కువ చేతిలో పెట్టాల్సి వస్తుంది. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఓ కొర్రీతో రిజిస్ట్రేషన్లు ఆలస్యం కావడమో, ఒక్కోసారి మొత్తంగా ఆగిపోవడమో జరుగుతున్న పరిస్థితి ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సిబ్బందికీ ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ లున్నాయి. దీనిపై కొనుగోలు/ అమ్మకందారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధన చేపట్టింది. పలు ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పరిస్థితిని నేరుగా పరిశీలించి.. ఏం జరుగుతోందన్నది గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. రైటర్లదే హవా! ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లినా.. అక్కడికి కొంత దూరంలో అటూఇటూ ఒకట్రెండు టేబుళ్లు, కంప్యూటర్లు పెట్టుకుని, ఐదారు కుర్చీలున్న చిన్న చిన్న షాపులు కనబడతాయి. పొద్దంతా ఏదో హడావుడి కనిపిస్తుంటుంది. చూడటానికి సింపుల్ గానే ఉన్నా ఇండ్లు, ఫ్లాట్లు, భూములు.. ఇలా ఏ రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఆ చిన్న దుకాణాలు, వాటిని నిర్వహించే డాక్యుమెంట్ రైటర్లే కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్నా 90 శాతం పని ఈ డాక్యుమెంట్ రైటర్ల వద్దే అయిపోతుంది. ముందే అంతా ‘సెట్ రైట్’ అవుతుంది. ఆఫీసులోకి వెళ్లాక అంతా ఫటాఫట్‌గా పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి కొనుగోలు/అమ్మకం దారులు, సాక్షులు మినహా ఇతర ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదు. కానీ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ సిబ్బంది కంటే.. ఈ ‘మధ్యవర్తుల’ హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. అనధికారికంగానే అంతా.. నిజానికి డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి లైసెన్సు లేదు. ఆ వ్యవస్థపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు. డాక్యుమెంట్ సిద్ధం చేయడం నుంచి, రిజిస్ట్రేషన్ పూర్తయి కాపీ బయటికి వచ్చేదాకా.. మొత్తం పని కొర్రీలు లేకుండా, త్వరగా పూర్తిచేస్తామంటూ ఈ డాక్యుమెంట్ రైటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రెడీ చేసేందుకు కొంత, ఏ కొర్రీలూ రాకుండా పని అయిపోయేందుకు ఆఫీసులో ఇవ్వాల్సింది ఇంకొంత అంటూ వేలకువేలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సుమారు 2000 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్టు అంచనా. రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ అనధికార డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికి.. ప్రభుత్వ జవాబుదారీతనం ఉండేలా మరో వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా.. అది కార్యరూపంలోకి రావడం లేదు. కరోనా తర్వాత మరింత దూకుడు కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ తర్వాతి పరిస్థితుల్లో డాక్యుమెంట్ రైటర్లు వసూళ్లు మరింతగా పెంచారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పట్లో డాక్యుమెంట్‌కు ఇంత అని పక్కాగా డిమాండ్ చేసేవారు కాదని.. అవకాశం, అవసరం, చేయించాల్సిన పనిని బట్టి తీసుకునే వారని అంటున్నారు. ఇప్పుడు పక్కాగా డిమాండ్ చేసి, వసూలు చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగే ఆస్తుల విలువలో ఇంత శాతమని నిర్ణయించి వసూలు చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఏదో ఓ కొర్రీ పెడతారని.. రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతోందని.. ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉందని ఆరోపణలున్నాయి. ఏవో సాంకేతిక సమస్యలున్నాయని, డాక్యుమెంట్లలో తప్పులున్నాయని చెబుతూ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది తిప్పుకుంటున్నారని అమ్మకం/కొనుగోలు దారులు చెప్తున్నారు. డబ్బులన్నీ తామే తీసుకోవడం లేదని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుందని కొందరు డాక్యుమెంట్ రైటర్లు బహిరంగంగానే అంటుండటం గమనార్హం. అయితే క్రయవిక్రయదారుల రూపంలో వస్తున్న సామాన్య ప్రజల విషయంలోనే రైటర్లు డాక్యుమెంట్ డీలింగ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల నిర్వాహకులు, బడాబాబులు నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బందితోనే ‘మాట్లాడుకుని’ పని చక్కబెట్టుకుంటున్నారని అంటున్నారు. కొత్త విధానం వచ్చినట్టే వచ్చి.. కరోనా తర్వాత రాష్ట్ర సర్కారు తెచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో అసలు డాక్యుమెంట్ రైటర్ల అవసరమే లేకుండా పోయింది. కానీ కొన్ని కారణాలతో ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టింది. దీంతో రైటర్ల దందా మళ్లీ మొదలైంది. గతం కంటే ఎక్కువగా రేటు నిర్దేశించి మరీ తీసుకోవడం పెరిగింది. ఇలా వారు డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటున్నా.. స్థానిక సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు వసూళ్లు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందికి వాటా సొమ్ము ఇస్తున్నారని.. దీంతో రైటర్లను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా వందల కోట్లు జేబుల్లోకి.. రైటర్లు డాక్యుమెంట్ తయారు చేస్తామనే కారణం చూపెట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. చూడటానికి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు మూడు, నాలుగు వేల రూపాయలేగా అన్నట్టు ఉన్నా.. మొత్తంగా చూస్తే కోట్ల రూపాయల్లోకి వెళుతున్నాయి. ఉదాహరణకు.. ఈనెల 20న (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా 5,500కుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. తక్కువలో తక్కువగా డాక్యుమెంట్‌కు రూ.1,000 చొప్పున లెక్కేసుకుంటే.. ఒక్కరోజు రైటర్లు వసూలు చేసింది రూ. 55 లక్షలు. నెలకు 15 కోట్లపైమాటే.. అదే ఏడాదికి లెక్కిస్తే రూ.180 కోట్లు. ఇది కేవలం నామమాత్రపు సొమ్ము మాత్రమే. నిజానికి అడ్డగోలుగా వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ సిబ్బంది వాటా కింద వసూలు చేస్తున్నది కలిపితే.. రూ.వెయ్యి కోట్లకుపైనే అవుతుందని అంచనా. ఏటా ఇంత సొమ్ము దళారుల పాలవుతోంది. ఎక్కడ చూసినా అదే దందా! – రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు పెద్ద ఎత్తున కమీషన్లు్ల వసూలు చేస్తున్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్ చార్జ్, చలానా, మ్యూటేషన్ కలిపి రూ.18,800 తీసుకుంటున్నారు. మిగతా ప్లాట్లకు కూడా రూ.15వేల దాకా తీసుకుంటున్నారు. డాక్యుమెంట్ తయారుచేయడం నుంచి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేదాకా తాము చూసుకుంటామని చెప్తున్నారు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ల వద్దకు వెళితే.. ఏదో ఓ కొర్రీ పెడుతున్నారని, అక్కడి సిబ్బంది కూడా రూ.1,500 నుంచి రూ.2 వేలదాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. – నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సగటున 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తుల వద్ద డాక్యుమెంట్ రైటర్లు తమ ఫీజు కింద రూ.1,000, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇచ్చేందుకని మరో వెయ్యి, రెండు వేలదాకా వసూలు చేస్తున్నారు. పని త్వరగా పూర్తవుతుందని చెబుతున్నారు. వివాదాలున్న డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసేందుకైతే.. రూ.5వేల నుంచి రూ.10వేల దాకా తీసుకుని ‘పని’ చక్కబెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. – సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చుపై అదనంగా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు చెల్లించక తప్పని పరిస్థితి. వారు అడిగినంత ముట్టజెప్పకపోతే ఏదో ఓ లిటిగేషన్ పేరిట రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వివాదాలున్న ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల కోసమైతే.. పది వేల వరకు ముట్టజెప్పాల్సిందే. ఇదంతా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందికి వాటా ఇవ్వడం కోసమేనని రైటర్లు చెప్తుండటం గమనార్హం. – రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్లు రూ.2,500 దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ సిబ్బందికి సగం వాటా ఇవ్వాలని ఓపెన్‌గానే చెప్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇక్కడ డబ్బుల వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఓ ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకోవడం గమనార్హం. – గిరిజనులు అధికంగా ఉండే మహబూబాబాద్ జిల్లాలో కూడా డాక్యుమెంట్ రైటర్ల దందా సాగుతోంది. ఇక్కడి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ ప్రిపరేషన్ పేరుతో రూ.3–4 వేల వరకు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఇవ్వాలంటూ మరికొంత వసూలు చేస్తున్నారు. (చదవండి: వెంట్రుకలపై క్రేజ్: చైనాకు జుట్టు అక్రమ రవాణా) -
విధినిర్వహణలో కుప్పకూలిన సబ్ రిజిస్టార్
సాక్షి, కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు సబ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్న ఆకాశం శారదాదేవి మంగళవారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఆమె గత డిసెంబర్లో చింతలపూడి నుండి కొవ్వూరుకు బదిలీపై వచ్చారు. రానున్న ఏప్రిల్ నెలలో ఆమె పదవీవిరమణ చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన శారదాదేవి.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తుంది అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సిబ్బంది ఆమెను వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శారదాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా. శారదాదేవి మాత్రం కొవ్వూరులో ఉంటూ సబ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు చెప్పినట్లు కుమారులు చెప్పారు. ఆమె ఆకస్మిక మృతిపట్ల సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
అమరావతి: స్థలం రిజిస్ట్రేషన్ చేయటానికి లంచం అడిగిన అమరావతి సబ్‌రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కిన సంఘటన మంగళవారం అమరావతిలో చోటుచేసుకుంది. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా జి.కొండూరుకు చెందిన మేడసాని శుభాకర్‌కు అమరావతి మండలం వైకుంఠపురంలో సర్వే నంబరు 6–83లో 29.5 సెంట్ల భూమి ఉంది. ఆ భూమికి అతని చెల్లెలుకు రిజిస్ట్రేషన్ చేయటానికి అమరావతి సబ్ రిజిస్ట్రార్ సయ్యద్ బాజిద్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో సదరు రిజిస్టర్ చేయటానికి 4 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అందుకు శుభాకర్ ఒప్పుకుని సోమవారం రిజిస్ట్రార్ పూర్తిచేసుకున్నారు. మంగళవారం రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ తీసుకోవటానికి వచ్చేటప్పుడు లంచం చెల్లించాల్సి రావటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. విజయవాడకు తరలింపు ఏసీబీ అధికారులు ముందుగా వేసిన పథకం ప్రకారం శుభాకర్ నుంచి సబ్‌రిజిస్ట్రార్ బాజిద్ సూచన మేరకు ఆయన ప్రైవేట్ అటెండర్ చింతాబత్తిన ప్రసాద్‌కు లంచం ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. చింతాబత్తిన ప్రసాద్ లంచం తీసుకోవటం రుజువు కావటంతో అందుకు కారణమైన సబ్‌రిజిస్ట్రార్ బాజిద్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి ఇద్దరిని విజయవాడకు తరలిం చారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ ఫిరోజ్, సిబ్బంది పాల్గొన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడు మేడసాని శుభాకర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అమరావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2010 సెప్టెంబరు 16వ తేదీన అప్పటి సబ్ రిజిస్ట్రార్ డీవీ అప్పారావు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
తహసీల్దార్లు ఇక సబ్రిజిస్ట్రార్లు
కరీంనగర్‌సిటీ: భూముల రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా చేపట్టేందుకు భూముల రిజిస్ట్రేషన్లు చేసే అధికారం తహసీల్దార్లకు అప్పగించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించింది. సోమవారం నుంచే హైదరాబాద్‌లో తహసీల్దార్లకు ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పాసుపుస్తకాలను పట్టాదారులకు అందజేసే ప్రక్రియను ఆరంభించనున్న క్రమంలో మార్చి 12 నుంచి తహసీల్దార్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు యథావిధిగానే పనిచేయనున్నాయి. ఉమ్మడి జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాలన్నింటిలో తహసీల్దార్లకు సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూ తగాదాలు, సమస్యలకు చెక్ పెడుతూనే లెక్కలు పక్కాగా ఉండేందుకు సర్కారు మరో నిర్ణయానికి అంకురార్పణ చేస్తోంది. ఇప్పటికే భూ లెక్కలు పక్కాగా ఉండాలని ముందడుగు వేసిన ప్రభుత్వం భూ రికార్డుల శుద్ధీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలకు భూ రికార్డుల ప్రక్షాళన ముగింపు పలికింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. జిల్లాల విభజన అనంతరం శాఖలను కూడా విభజించినప్పటికీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను మాత్రం ఉమ్మడిగానే ఉంచారు. ఏటా ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు 180 నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. అయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ కొన్ని సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల్లోనూ ఎనీవేర్ రిజిస్ట్రేషన్లతో అక్రమాలు జరగడంతో పలు సమస్యలు ఎదురయ్యాయి. మియాపూర్ కుంభకోణం అనంతరం ప్రభుత్వం ఎనీవేర్ ప్రక్రియను రద్దు చేసింది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటున్న ప్రభుత్వం చిన్నచిన్నగా సబ్రిజిస్ట్రార్ల అధికారాలకు కోత పెట్టే విధంగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాంపుల రిజిస్ట్రేషన్ యాక్టు 6 ప్రకారం స్థిర, చరాస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉండగా తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. కరీంగనగర్ జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, తిమ్మాపూర్, గంగాధరలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. జగిత్యాల జిల్లాలో మల్యాల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ, సిరిసిల్లలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. భీమదేవరపల్లి వరంగల్ జిల్లాలో, హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కలిసిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లతోపాటు వివాహ నమోదు, ఎన్‌కంబర్స్‌మెంట్, గిఫ్ట్‌డీడ్, భాగస్వామ్య ఒప్పందాల వంటి దాదాపు 30 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నాయి. అయితే.. వీటిలో ముఖ్యవైనవి భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్లు మాత్రమే. నిబంధనల ప్రకారం ఆస్తిని విక్రయించి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే పేరు మార్పిడికి సంబంధిత తహసీల్దార్ లేదా మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఆన్లైన్ అనుసంధానం ద్వారా సమాచారం బదిలీ జరగాలి. నిర్ణీత గడువులోగా మ్యుటేషన్ చేసి ఆస్తిమార్పిడి, పట్టామార్పిడి వంటివి పూర్తి చేయాలి. అయితే.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన లావాదేవీలకు పేరు మార్పిడి చేయడంలో ఆలస్యమవుతోంది. ప్రభుత్వానికి ఆస్తిమార్పిడి వ్యవసాయ భూముల పట్టా మార్పిడికి తగిన రుసుములు చెల్లించినా.. ఫలితం ఉండడం లేదు. ఈ కారణంగా ఆస్తులను విక్రయించిన వ్యక్తులు తిరిగి విక్రయాలు జరపడంతో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. అమాయకులు మోసపోతున్నారు. ఒకే భూమికి రెండు, మూడు సార్లు రిజిస్ట్రేషన్లు చేయడం, అక్రమంగా ఒకే భూమిని ఇద్దరికి, ముగ్గురికి మ్యుటేషన్లు జరపడంతో సర్వే నెంబర్లలో వాస్తవ విస్తీర్ణం కంటే రికార్డుల్లో అధికంగా నమోదవుతోంది. ఇటువంటి విషయాలే ప్రభుత్వం జరుపుతున్న భూ శుద్ధీకరణలో వెలుగుచూడడంతో సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ల బాధ్యతను తహసీల్దార్లకే అప్పగించి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండల కేంద్రాల్లో మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 62 మండలాలుండగా 14 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా అన్ని మండల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాద్యతలు నిర్వర్తించనున్నారు. మోయలేని భారమంటున్న తహసీల్దార్లు.. ఉమ్మడి జిల్లాలో 16 మండలాలకు తహసీల్దార్లుండగా వారందరికీ రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగిస్తే సబ్రిజిస్ట్రార్లకు చాలా వరకు పనితగ్గిపోనుంది. అయితే ప్రస్తుతం సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ కొనసాగుతోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ నిషేధం ఉన్నా అమలవ్వడం లేదు. ఈ వ్యవస్థ అనధికారికంగా కొనసాగుతూనే ఉంది. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లోనూ డాక్యుమెంట్ల స్కానింగ్‌ను, ఇతర పనులకు ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగిస్తే ఏ మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో సేవలందుతాయనేది వేచి చూడాల్సిందే. అయితే.. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉండే సర్వర్‌కు అనుగుణంగా ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఆన్లైన్ అనుసంధానం ఉంది. కొత్తగా మండల కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగిస్తే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏ విధంగా సౌకర్యాలున్నాయో వాటన్నింటినీ కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తహసీల్దార్లు కార్యాలయాల ద్వారా 60 రకాల సేవల్లో తలమునకలై ఉన్నారు. కొత్త అధికారాలతో తమపై అధిక భారం పడనుందని పలువురు తహసీల్దార్లు ఆందోళనతో ఉన్నారు. రైతులకు ప్రయోజనం.. భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగిస్తే ఎంతో ప్రయోజనమని రైతులు భావిస్తున్నారు. ప్రస్తుతం భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతోంది. భూ కొనుగోలుదారుడు తన డాక్యుమెంట్లను ఆన్లైన్లో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వీఆర్వో, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ దాదాపు నెల రోజులపాటు విచారణ జరిపి, ఉత్తర్వులను సిద్ధం చేసి 15 రోజుల్లో ఆర్డీవోకు నివేదిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తారు. నిబంధనల ప్రకారమే ప్రక్రియ పూర్తవ్వడానికి 45 రోజులు పడుతుంది. అధికారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి పట్టాదారు పాసుపుస్తకాల జారీ జరుగుతోంది. కొత్త విధానంలో తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అదే రోజు మ్యుటేషన్‌ను ఆన్లైన్లో పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడానికి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్‌రిజిస్ట్రార్
లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్ జిల్లా): లక్కిరెడ్డిపల్లి మండల సబ్‌రిజిస్ట్రార్ సర్వేశ్వర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రామాపురం మండలం గోపగూడపల్లెకు చెందిన రేఖం నారాయణ అనే రైతు ఇటీవల 46 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమి రోడ్ల విస్తరణలో కొంత భాగం పోనుంది. రిజిస్ట్రేషన్ కాకపోతే ప్రభుత్వం నుంచి పరిహారం రాదని చెప్పడంతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు లక్కిరెడ్డిపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. రూ.10 వేల లంచం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా సర్వేశ్వర్ రెడ్డిని అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భీమిలి సబ్‌రిజిస్ట్రార్ సంజీవయ్య అరెస్ట్
-
పోలీసుల అదుపులో గుట్ట సబ్ రిజిస్ట్రార్.
నయీమ్ అక్రమ రిజిస్ట్రేషన్లలో పాత్రపై విచారణ భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు అక్రమ భూ రిజిస్ట్రేషన్లు చేయడానికి సహకరించాడన్న ఆరోపణలతో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఎండీ వహీద్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలిసింది. నయీ మ్ అతని అనుచరులకు అనుకూలంగా రిజి స్ట్రేషన్లు చేయడంలో వహీద్ పాత్రపై అనుమానాలున్నారుు. భువనగిరి, మోత్కూరు, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వహీద్ వివిధ హోదాల్లో పనిచేస్తూ నయీమ్ అనుచరుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడిపై వచ్చిన అభియోగాల్ని విచారించడానికి సిట్ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు రాసింది. పూర్తి సమాచారంతో విచారణకు రావాలన్న సిట్ ఆదేశంతో రికార్డులను తీసుకుని ఆయన పోలీసులకు లొంగి పోయారు. దీంతో సిట్, స్థానిక పోలీసులు వహీద్‌ను సోమవారం నుంచి విచారిస్తున్నారు. బక్రీద్ పండుగ ప్రార్థనల కోసం మంగళవారం ఉదయం పోలీస్ ఎస్కార్ట్‌తో అతడిని వదిలిపెట్టారు. తిరిగి అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వెలుగు చూస్తున్న వాస్తవాలు నయీమ్ ప్రధాన నేరాల్లో ఒకటైన భూ రిజిస్ట్రేషన్లలో పలు అంశాలు వెలుగు చూస్తున్నారుు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. డాక్యుమెంట్ రైటర్ సహకారంతో భూముల క్రయవిక్రయ వివరాలను ఎప్పటికప్పుడు నయీమ్ అనుచరులకు తెలపడం, వాటి మార్కెట్ విలువ వివరాలు, ఎకరాల్లో, ప్లాట్లలో కొన్న భూముల యజమానుల వివరాలు అందజేయడం వంటి విషయాలపై ఆరోపణలున్నాయి. దీంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడంలో వహీద్ సహకరించాడని రికార్డుల్లో తేలినట్లు సమాచారం. ఉన్నతాధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయకుంటే వార్ని నయాన్నో, భయాన్నో బెదిరించి పను లు పూర్తి చేరుుంచినట్టు తెలుస్తోంది. కాగా నయీమ్ కుటుంబసభ్యులను సిట్ పోలీ స్లు విచారిస్తున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్‌కు వారిని రప్పించినట్టు తెలుస్తోంది. -
అటెండర్ నుంచి సబ్‌రిజిస్ట్రార్ వరకు లంచం
-
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
మరో అవినీతి చేప ఏసీబీ వల్లో చిక్కింది. విధుల నుంచి ఇటీవల సస్పెండ్ అయిన అక్కయ్య పాలెం సబ్ రిజిస్ట్రార్ కృష్ణదాస్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ పట్టణం రవీంద్రనగర్ లో సబ్ రిజిస్ట్రార్ కృష్ణదాస్ ఇంటిలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ ఇంటి తో పాటు.. అతని బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అతడి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అక్కయ పాలెం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన కృష్ణదాస్ అవినీతి ఆరపణలతో ఇటీవలే ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. -
ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్
-
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
- రూ.10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం - మరో ఇద్దరిపైనా కేసు - డీఎస్పీ ఆర్కెప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నక్కపల్లి: ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ నక్కపల్లి సబ్‌రిజిస్ట్రార్ ఐ.ఉమామహేశ్వరరావు శుక్రవారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికిపోయారు. రాంబిల్లికి చెందిన లక్ష్మీనరసింహ తన సోదరి విజయలక్ష్మికి ఉపమాకలో ఉన్న రెండు ఎకరాలను ఆమె కుమారైతసునీత పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గురువారం సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదించాడు. మార్కెట్ విలువ ప్రకారం స్టాంపుడ్యూటీ చెల్లించడంతోపాటు అదనంగా రూ.పదివేలు లంచం సబ్‌రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని లక్ష్మీనరసింహ వాపోయాడు. ఇస్తేతప్ప రిజిస్ట్రేషన్ చేయనని సబ్‌రిజిస్ట్రార్ తెగేసి చెప్పాడు. దీంతో శుక్రవారం రూ.10వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. డబ్బు ఇచ్చిన రోజునే రిజిస్ట్రేషన్ చేద్దామని రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు బాధితునికి నగదు ఇచ్చి పంపారు. లక్ష్మీనరసింహ సబ్‌రిజిస్ట్రార్‌కు రూ. పదివేలు ఇవ్వబోగా టేబుల్ సెల్ఫ్‌లో పెట్టాలని సూచించారు. ఆమేరకు సెల్ఫ్‌లో పెట్టిన అనంతరం అక్కడే ఉన్న మరోవ్యక్తి యర్రాసత్తిబాబుని పిలిచి రూ. పదివేలు నగదు సరిపోయిందో లేదో చూడాలని రిజిస్ట్రార్ చెప్పారు. సరిచూసిన అనంతరం ఆ సొమ్మును కొత్త సందీప్ అనే వ్యక్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. లంచం తీసుకున్న సబ్‌రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుతోపాటు, ఈవ్యవహారంతో ప్రమేయం ఉన్న యర్రాసత్తిబాబు, కొత్తసందీప్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసినట్లు డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. అధికారుల గుండెల్లో రైళ్లు ఈ సంఘటనతో పాయకరావుపేట నియోజకవర్గంలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి. ఈ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ప్రతి చిన్నపనికి రూ.వేలల్లో గుంజుతారన్న వాదన వ్యక్తమవుతోంది. గతంలోనూ పలువురు మండలస్థాయి అధికారులు ఏసీబీకి చిక్కిన సంఘటనలు ఉన్నాయి. రెండేళ్లక్రితం పాయకరావుపేట తహశీల్దార్ లింగయ్య, ఆర్ఐ మురళిలు చనిపోయిన వీఆర్వో కుటుంబానికి వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నాలుగేళ్ల క్రితం నక్కపల్లి ఈవోఆర్డీగా పనిచేసిన కృష్ణ వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం రూ.వెయ్యి తీసుకుంటూ దొరికిపోయారు. రెండేళ్ల క్రితం ఎస్.రాయవరం మండలానికి చెందిన పంచాయతీరాజ్ వర్క్ఇన్స్పెక్టర్, వీఆర్వోలు ఇలానే ఏసీబీకి చిక్కారు. -
రిజిస్ట్రేషన్ ఆదాయ లక్ష్యం రూ.4 వేల కోట్లు
సబ్ రిజిస్ట్రార్ల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది రూ.4వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజలకు మెరుగైన సేవలందించడం ద్వారా లక్ష్యా న్ని చేరుకోవాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సబ్- రిజిస్ట్రార్లను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సబ్-రిజిస్ట్రార్ల సంఘం రూపొందించిన కరదీపికను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బ్రోకర్లను నియంత్రించి, ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందు కు ‘హెల్ప్’ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
జీపీఏ కలకలం
సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్ కంభంపాటి కాబట్టి చర్యలు బలిపశువు చేశారంటున్న అధికారులు విశాఖపట్నం : మహావిశాఖలో జీపీఏ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుకు చెందినదిగా చెబుతున్న 11.50 ఎకరాలను వేరొకరిపేరిట జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఎ) ఇవ్వడం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో అక్కయ్యపాలెం సబ్‌రిజిస్ట్రార్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. లీగల్ లిటిగేషన్ వ్యవహారంలో ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శ వినిపిస్తోంది. న్యాయస్థానంలో పరిష్క రించాల్సిన వివాదంలో కిందిస్థాయి అధికారులపై వేటు వేశారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైన ప్పటికీ తాజా పరిణామం మాత్రం విశాఖలో పెచ్చుమీరుతున్న భూ బాగోతాలకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఆయన కాబట్టి... మర్రిపాలెం భూ వ్యవహారంలో కంభంపాటి రామ్మోహన్‌రావుకు రాజకీయ పరపతి ఉండటంతో వెంటనే స్పందించగలిగారు. హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తీసుకు వచ్చారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకున్నారు. అదే పరిస్థితి సామాన్యుడికి ఎదురైతే ఎవరూ పట్టించుకునేవారే కాదన్నది సుస్పష్టం. -
అధికారుల గుండెల్లో దడ!
కొల్లాపూర్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి సబ్‌రిజిస్ట్రార్ కుర్చీ పక్కన చెత్తబుట్టలో రూ.10వేల నగదు స్వాధీనం రికార్డులు పరిశీలించిన అధికారులు.. కేసు నమోదు కొల్లాపూర్: ఏసీబీ దాడులతో కొందరు అధికారులకు దడ పు ట్టింది. కొల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవా రం సాయంత్రం ఏసీబీ అధికారుల బృందం ఆకస్మికంగా త నిఖీలు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ టి.రాందాస్‌తేజ నేతృత్వంలో రెండుగంటల పాటు ఈ సోదాలు కొనసాగించారు. ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న బి.నవీన్‌కుమార్ వద్ద రూ.630తో పాటు ఆయన కుర్చీ పక్కనే ఉన్న చెత్తబుట్టిలో పడేసిన రూ.10,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయ రికార్డులు పరిశీలించారు. అక్కడే విధుల్లో ఉన్న పలువురి నుంచి వివరాలు సేకరిం చారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాందాస్‌తేజ విలేకరులతో మాట్లాడారు. తాము కార్యాలయంలోకి వస్తుండగానే త మను చూసి సబ్‌రిజిస్ట్రార్ నవీన్‌కుమార్ రూ.10,600 నగదు ను చెత్తబుట్టిలో పడేశారని తెలిపారు. ఆ డబ్బులను స్వా దీనం చేసుకున్నామని చెప్పారు. నవీన్‌కుమార్ జేబులో రూ. 630 ఉన్నాయని, కార్యాలయ రిజిస్ట్రేషన్ల ఫీజులకు సంబంధించిన చలాన్లు లభించాయని వివరించారు. దొరికిన నగదు లెక్కలు తేలడం లేదన్నారు. కేసు నమోదుచేసి విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తిరుపతిరాజు, గోవిందరెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
బదిలీలపై న్యాయ పోరాటం
ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సబ్ రిజిస్ట్రార్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విజయవాడ : ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఇటీవల చేసిన బదిలీలపై పలువురు సబ్ రిజిస్ట్రార్లు న్యాయపోరాటానికి దిగారు. అక్రమ బదిలీలను ఆకస్మికంగా చేశారంటూ జిల్లాకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు బదిలీలకు సంబంధించి సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆకస్మిక బదిలీలతో ఇబ్బందులే.. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30 తేదీన రాష్ట్రవ్యాప్తంగా జీరో సర్వీసు జీవో ప్రకారం మూకుమ్మడిగా సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో 30 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. వారు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా బదిలీచేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. కౌన్సెలింగ్ జరపకుండా ప్రభుత్వం ఇష్టానుసారం బదిలీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. నందిగామ, కంకిపాడుల్లో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేసిన రాంబాబు, రాఘవరావుతో పాటు పలువురు శుక్రవారం ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. వీటిని ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. బదిలీల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలను వచ్చే బుధవారంలోగా సమర్పించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఏలూరు డీఐజీ సాయిప్రసాద రెడ్డిని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ అనంతరం ట్రిబ్యునల్ నుంచి తీర్పు వెలువడనుంది. ఇదిలాఉంటే.. జిల్లాలో పది మంది సబ్ రిజిస్ట్రార్లు బదిలీ జరిగినప్పటికీ చార్జి అప్పగించకుండా, బదిలీ అయిన ప్రదేశానికి వెళ్లలేదని సమాచారం. దీనివల్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతోంది. బదిలీలు అస్తవ్యస్తంగా జరిగాయని కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ సిటిజన్ శుక్రవారం హైకోర్టులో పిల్ వేశారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. బదిలీలు రద్దు? ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో జరిగిన బదిలీలు రద్దవుతాయని తెలుస్తోంది. ప్రభుత్వం రూపొందించిన జీరో సర్వీసు నిబంధన చట్టవిరుద్ధమని, బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే జరగాల్సి ఉండగా సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి ఉత్తర్వులు జారీ చేయడం తగదని పలువురు పేర్కొంటున్నారు. వచ్చే వారంలో బదిలీలన్నీ రద్దవుతాయని పెద్దఎత్తున ప్రచారం నడుస్తోంది. -
సబ్ రిజిస్ట్రార్లకు స్థాన చలనం
కాకినాడ లీగల్ :రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లాలో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1 ఎం.విజయజీవన్బాబును రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1గా, రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1 జయమణిని ఏలూరు డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. రాజానగరం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసబాబును రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్-2గా, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ రమేష్‌బాబు రాజానగరానికి బదిలీ అయ్యారు. కొత్తపేట సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాద్ పిడింగొయ్యికి, కాకినాడ సబ్ రిజిస్ట్రార్-2 డి.సుబ్రహ్మణ్యం మచిలీపట్నానికి బదిలీ కాగా, కొవ్వూరు నుంచి కాకినాడ సబ్ రిజిస్ట్రార్-2గా రామారావు రానున్నారు. తుని సబ్ రిజిస్ట్రార్ కె.సుందరరావు సామర్లకోట బదిలీ కాగా, అమలాపురం సబ్ రిజిస్ట్రార్ సుబ్బారెడ్డి తునికి బదిలీ అయ్యారు. అనపర్తి సబ్ రిజిస్ట్రార్ రమేష్‌బాబుకు అమలాపురం బదిలీ అయింది. తాళ్లరేవు నుంచి కేవీఎస్ కుమారి సర్పవరం సబ్‌రిజిస్ట్రార్‌గా, సర్పవరం సబ్‌రిజిస్ట్రార్ డి.నరసింహరాజు పశ్చిమ గోదావరి గునుపూడికి బదిలీయ్యారు. కాకినాడ డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్ పీఎస్ఆర్ మూర్తి తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్‌గా, కొత్తపేట సబ్‌రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు పిడింగొయ్యికి, పెద్దాపురం సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం అంబాజీపేటకు బదిలీపై వెళ్లనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అనంతపల్లి సబ్‌రిజిస్ట్రార్ శేఖర్‌బాబు పెద్దాపురానికి, సామర్లకోట నుంచి లక్ష్మి సీతానగరానికి బదిలీ అయ్యారు. పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ రమేష్ రాజానగరానికి, ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ ఇ.లక్ష్మి కాకినాడ చిట్స్ రిజిస్ట్రార్‌గా బదిలీపై వెళ్లనున్నారు. పిఠాపురం నుంచి కె.శ్రీనివాస్ ప్రత్తిపాడుకు, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కె.దుర్గారాణి పిఠాపురానికి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్‌రిజిస్ట్రార్ ఎ.ఆదినారాయణ బిక్కవోలుకు, ఇక్కడి నుంచి ఎన్ఎన్వీ త్రినాథరావు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు. అంబాజీపేట సబ్ రిజిస్ట్రార్ కేఎస్ఎస్ ప్రసాద్ రాజోలుకు, అల్లవరం నుంచి రత్నాబాయి జగ్గంపేటకు, జగ్గంపేట నుంచి సూర్యనారాయణ అనపర్తికి బదిలీ అయ్యారు.