సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో చోరీ
Published Fri, Sep 6 2013 5:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : అరక్కోణం పట్టణంలోని నివాసముంటున్న తిరుత్తణి సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో చోరీ జరి గింది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు, నగదును చోరీ చేశారు. తిరుత్తణి సబ్‌రిస్ట్రార్ రాజేంద్రన్ అరక్కో ణం మాధవన్ నగర్‌లో నివాసముంటున్నారు. గురువారం ఆయన విధులకు వెళ్లారు. ఆయన భార్య మీనాక్షి ఉదయం పదిగంటలకు పక్కింటికి వెళ్లారు. రెండు గంటలు తర్వాత ఆమె ఇంటికి వచ్చారు. ఆసమ యంలో ఇంటి వెనుక తలుపులు తీసి ఉన్నాయి. గదిలో బీరువా తాళాలు పగులగొట్టి అందులోని వస్తువులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. బీరువాలో 13 సవర్ల బంగారు నగలు,కేజీ వెండి వస్తువులు, రూ. 3లక్ష లు నగదు చోరీ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపారు. వెంటనే సబ్‌రిస్ట్రార్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం,పోలీసులు పరిశీలించారు. పట్ట పగలే చోరీ జరగడం కలకలం రేపింది.
బంగారు నగల అపహరణ
తిరుత్తణి, న్యూస్‌లైన్ : తిరుత్తణి అరక్కోణం రోడ్డులోని జెజెనగర్‌లో నివాసముంటున్న లోకనాథన్ ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన జమున బుధవారం మధ్యాహ్నం స్కూలులో చదువుకునే తన పిల్లలకు అన్నం తీసుకుని వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి తొమ్మిది సవర్ల బంగారు నగలను, అరకిలో వెండి వస్తువులు అపహరించుకుపోయారు. ఈ విషయమై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Advertisement