Pallipattu
-
భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో
చెన్నై(పళ్ళిపట్టు): మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్తను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆర్.కే పేట సమీపం బాలాపురానికి చెందిన తమిళ్మణి (42) తాపీమేస్త్రి. అతని భార్య మంగళ. ఈ దంపతులకు శరవణన్ (14), ప్రతీప్ (12) అనే కుమారులున్నారు. భర్తతో గొడవల కారణంగా.. అయ్యనేరిలోని పుట్టింటికి వెళ్లి అక్కడే టైలర్ షాపు నిర్వహిస్తోంది. భార్యను కాపురానికి రావాలని అయ్యనేరికి వెళ్లి తమిళ్మణి గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మద్యం మత్తులో టైలర్ దుకాణం వద్దకు వెళ్లిన తమిళ్మణి భార్య మంగళపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. చదవండి: (ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య) -
నోట్ల కోసం పడిగాపులు
► ఇంకా తెరుచుకోని ఏటీఎంలు ► సామాన్యులకు తప్పని అవస్థలు పళ్లిపట్టు: కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో జనాలు ఒక్కసారిగా బ్యాంకులకు చేరుకుని తమ వద్ద ఉన్న నగదును (రూ.500,రూ.1000 నోట్లు)బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో రోజూ ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షించి తమఖాతాలో పెద్ద నోట్లను జమచేశారు. ఇదిలా ఉండగా శనివారం సైతం ఏటీఎం సేవలు అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యులకు చిల్లర కష్టాలు తప్పలేదు. నిత్యావసర వస్తువుల కోనుగోలుకు సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. పళ్లిపట్టు, పొదటూరుపేట, ఆర్కేపేట, అత్తిమాంజేరిపేట ప్రాంతాల్లోని బ్యాంకుల్లో శనివారం సైతం ఖాతాదారుల రద్దీ ఎక్కువగా కనిపించింది. కిక్కిరిసిన జనాలను అదుపు చేసేందుకు బ్యాంకు అధికారులు పోలీసుల సహాయం కోరారు. పోలీసులు పరిస్థితులను చక్కదిద్ది భారీ క్యూలైన్లు ఏర్పాటు చేసి పాత నోట్ల డిపాజిట్‌కు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. ఖాతాదారులు దాదాపు మూడు గంటలు వేచి ఉండి తమ వద్ద ఉన్న పాత నోట్లను ఖాతాలో జమచేయడంతో పాటు రూ.4వేలు(కొత్త నోట్లు /రూ.100 నోట్లు) పొందారు. ఏటీఎంలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే మళ్లీ మూతపడడంతో సామాన్యులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. పొదటూరుపేటలోని ఇండియన్ బ్యాంకు వద్ద వందలాది మంది మహిళలు డిపాజిట్ చేసేందుకు రావడంతో పోలీసులు ప్రత్యేక క్యూ పద్ధతి పాటించి బ్యాంకులోకి అనుమతించారు. బ్యాంకు సిబ్బంది పాత నోట్లు డిపాజిట్ చేసుకోవడంతో సరిపెడుతున్నారని కొత్త నోట్లు లేవని చేతులెత్తేస్తున్నట్లు వాపోయారు. తిరుత్తణిలోని అన్ని బ్యాంకుల్లో శనివారం ఖాతాదారుల సంఖ్య భారీగా కనిపించింది. పూర్తి స్థారుులో ఏటీఎంలు పనిచేయకపోవడంతో పాటు రూ.100, 500 అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా మారింది. -
వేధిస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు
పళ్లిపట్టు: నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నట్లు తొయిదావూర్ దళితులు తిరుత్తణి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి తాలూకాలోని తిరువాలాంగాడు మండలం తొయిదావూర్ దళితవాడలో దాదాపు 150 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 సంవత్సరాల పురాతన ఆదికుమరేశ్వరర్ ఆలయం దుస్థితికి చేరుకుని శిథిలావస్థలో ఉండేది. ఆ ఆలయాన్ని కొంత మంది మరమ్మతులు చేపట్టి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఆలయంలో విలువైన ఆభరణాలు ఉన్నందునే కొందరు పథకం ప్రకారం ఆలయాన్ని తమ చేతుల మీదకు తీసుకుని ఆలయానికి సమీపంలోని వున్న దళితుల ఇళ్లు కూల్చేందుకు కుట్ర పన్ని వేధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరుత్తణిలోని ఆర్డీవో కార్యాలయం చేరుకున్న దళిత కుటుంబాలవారు తమ నివాస ప్రాంతాలను తొలగించేందుకు కొందరు ఆలయం పేరిట కుట్ర చేస్తున్నట్లు ఆలయంలోని విలువైన ఆభరణాలు దోపిడీ చేసేందుకు వీలుగా కుట్ర చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఆర్డీవో విమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దళితుల ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
జయలలిత మళ్లీ సీఎం కావాలని స్వర్ణరథోత్సవం
పళ్లిపట్టు: జయలలిత మళ్లీ ముఖ్యమం త్రి పదవి స్వీకరించాలనే ఆశయంతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం నిర్వహించి పూజలు చేశారు. తిరుత్తణి నియోజకవర్గ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా జీవించాలని, అలాగే త్వర లో రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలనే ఆశయంతో ఆమె జన్మనక్షత్రం మహం నక్షత్రం సందర్భం గా మంగళవారం రాత్రి తిరుత్తణి ఆల యంలో విశిష్ట పూజలు, స్వర్ణరథోత్స వం నిర్వహించారు. వేడుకలకు నియోజకవర్గ అన్నాడీఎంకే కార్యదర్శి,తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల ఆవిన్పాల్ ఉత్పత్తిదారుల సహాకార సంఘం ఆధ్యక్షుడు వేలంజేరి చంద్రన్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ న్యూఢిల్లీ ప్రతినిధి పీఎమ్.నరసింహన్ సమక్షంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ఆ పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి పాడిపరిశ్రమ శాఖా మంత్రి బీవీ.రమణ పాల్గొన్నారు. ముం దుగా సుబ్రమణ్యస్వామికి విశిష్ట అభిషేక ఆరాధన పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు నడుమ ఆలయం నుంచి వల్లి దేవసేన సమేత ఉత్సవర్లు షణ్ముఖస్వామిని స్వర్ణరధంలో కొలువుదీర్చి హారంహర నామస్మరణ నడుమ మంత్రి ఇతర ప్రముఖులు రధాన్ని ఆలయ మాడ వీధుల్లో విహరించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన 200 మంది వృధ్దులకు చీర ధోవతులు పంపిణీ చేసి అన్నదానం పంపిణీ చేసారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం, యూనియన్ చైర్మన్లు ఆర్.ఇళంగోవన్, గుణాళన్, మున్సిపల్ చైర్మన్ సౌందర్‌రాజన్, పార్టీ శ్రేణులు జయరామన్, కరుణాకరన్, రాజపాండి, గ్రామ పంచాయతీ అధ్యక్షుల పెడరేసన్ అధ్యక్షులు సెల్వం, వేలాయుధం, రవి సహా భారీ సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొని పూజలు చేశారు. -
మృతుల కుటుంబాలకు రోజా సంతాపం
పళ్లిపట్టు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పళ్లిపట్టు దంపతుల కుటుం బాన్ని నగరి ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. పళ్లిపట్టుకు చెందిన అబ్దుల్‌ఖాదర్. ఇతని భార్య ఫరిదా బేగం, పిల్లలు బెనీజీర్, సదన్నబీ పిచ్చాటూర్ నుంచి కారులో పళ్లిపట్టుకు వస్తుండగా, కారు చెట్టును ఢీకొని దం పతులు అక్కడికక్కడే మృతి చెందా రు. మరో ఇద్దరికి ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ పిల్లలను, నగరి ఎమ్మెల్యే రోజా పరామర్శించి పళ్లిపట్టులోని వారి ఇంట్లో కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే రోజా వెంట నగ రి మాజీ మున్సిపల్ చైర్మన్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. అలాగే పళ్లిపట్టు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామన్ సహా స్థానికు లు పలువురు అబ్దుల్‌ఖాదర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
అమ్మ కోసం.... 2వేల మంది పాదయూత్ర
పళ్లిపట్టు : అమ్మ విడుదల కోసం రెండు వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు తిరుత్తణికి పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం జయలలిత కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. జయకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు 8 రోజులుగా విభిన్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టు తాలూకాలోని ఆర్కే.పేట నుంచి తిరుత్తణి కొండకు 2 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలతో పాదయాత్ర చేశారు. శుక్రవారం ఉదయం ఆర్కే.పేట బజారు నుంచి ప్రారంభమైన పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వ న్యూఢిల్లీ మాజీ ప్రత్యేక ప్రతినిధి నరసింహన్ అధ్యక్షత వహించారు. అన్నాడీఎంకే మద్దతు డీఎండీకే రెబెల్ ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం సమక్షంలో ఈ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భారీగా గ్రామీణ మహిళలు తరలిరావడంతో తిరుత్తణి షోళింగర్ రాష్ట్ర రహదారి కిక్కిరి సింది. తిరుత్తణికి చేరుకున్న వారు సుబ్రమణ్యస్వామికి విశిష్ట అభిషేక ఆరాధన పూజలు నిర్వహించారు. పాదయాత్రలో ఆ పార్టీ నాయకులు వేలంజేరి చంద్రన్, యూనియన్ చైర్మన్ ఇళంగోవన్, జిల్లా కౌన్సిలర్ పాండురంగన్, ఉత్తండన్, జయరామన్, బలరామన్, గ్రామ పంచాయతీల అధ్యక్షుల సంఘం అధ్యక్షుడు వేలాయుధం పాల్గొన్నారు. నిరాహార దీక్ష పళ్లిపట్టులో నిరాహార దీక్ష : జయలలితకు మద్దతుగా పళ్లిపట్టు యూ నియన్ అన్నా డీఎంకే ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల ప్రాంతంలో నిరాహార దీక్ష చేశారు. దీక్షకు ఆ పార్టీ యూనియన్ కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్ అధ్యక్షత వహించారు. యూని యన్ చైర్మన్ శాంతిప్రియా సురేష్ స్వాగతం పలికారు. ఇందులో 500 మందికి పైగా అన్నాడీఎంకే నాయకులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీనివాసన్ మాట్లాడుతూ రాజకీయ కక్షలతో జయలలితపై కేసు మోపి దోషిగా తీర్పు ఇచ్చి జైలు పాలు చేశారని విమర్శించారు. అయితే న్యాయస్థానం ద్వారానే అమ్మ నిర్దోషిగా బయటపడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీక్షలో యూనియన్ వైస్ చైర్మన్ జయవేలు, యూనియన్ కౌన్సిలర్లు కరుణాకరన్, ఏకాంబ రం, సెల్వి శరవణన్, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి షణ్ముగం, కరింబేడు కుమార్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు మేమయ్యా!
పళ్లిపట్టు :వినాయక ప్రతిమల తయారీ పళ్లిపట్టు ప్రాంతంలో జోరుగా సాగుతోంది. ఈ సారి కాలుష్య రహిత విగ్రహాల తయారీకే కార్మికులు మొగ్గుచూపుతున్నారు. ఈ నెల 29న వినాయక చతుర్థి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పళ్లిపట్టు సమీపంలోని కుమారాజుపేట ప్రాంతంలో బొజ్జ గణపయ్యల ప్రతిమల తయారీ పనులు ఊపందుకున్నాయి. ఇక్కడ మూడు నెలల నుంచి ప్రతిమలు తయారు చేస్తున్నారు. కాలుష్య రహిత గణపయ్యలు గణపతి చతుర్థి సందర్భంగా కాలుష్యరహిత గణపయ్యల ప్రతిమలు మాత్రమే చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేసేందుకు పోలీసులు అనుమతించారు. ఈ నేపథ్యంలో కొయ్యగంజపిండి, చాక్‌పీస్ పిండితో పాటు మైదా పిండితో గణపతి ప్రతిమలను తయారు చేస్తున్నారు. ఈ ప్రతిమలతో ఎలాంటి కాలుష్యం ఉండదని భావిస్తున్నారు. బాల గణపయ్యల నుంచి 20 అడుగుల వరకు బంక మట్టితో విగ్రహాలను తయా రు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు అడుగుల నుంచి 20 అడుగుల పొడవు గల ప్రతిమలు తయారుచేసి వాటికి వర్ణం వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. గణపయ్యల్లో సింహ వినాయకుడు, లింగ వినాయకుడు, నెమలి వినాయకుడు, అన్న వినాయకుడు, గజ వినాయకుడు ఇలా పదికి పైగా వాహన సేవల్లో కొలువుదీరిన వినాయకుని ప్రతిమలు తయారు చేశారు. సైజును బట్టి ప్రతిమల ధర నిర్ణయించారు. రూ.20 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. -
బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
పళ్లిపట్టు: మగబిడ్డ పుట్టలేదని భర్త వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన మహిళ నాలుగు నెలల ఆడబిడ్డను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆర్కే పేట ప్రాంతంలో చోటుచేసుకుంది. పళ్లిపట్టు తాలూకా పరిధిలోని ఆర్కే పేట సమీపంలోని వెడియంగాడు దళితవాడకు చెందిన శరవణన్(30). అతని భార్య ప్రియ. వీరికి ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి స్వర్ణలక్ష్మి(4), ముల్లై(2) ఆడ పిల్లలు. మూడు నెలల కిందట ప్రియ మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడే నెలలకే ఆ బిడ్డ మృతి చెందింది. దీంతో ప్రియను భర్త మగబిడ్డ పుట్టలేదని తరుచూ వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ప్రియా తన పెద్ద కూతురు స్వర్ణలక్ష్మి గొంతు నులుమి చంపి ఆ తరువాత తాను సైతం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన శరవణన్ భార్య, బిడ్డ మృతి చెందడాన్ని గుర్తించి దిగ్భ్రాంతి చెంది గ్రామస్తులకు తెలిపారు. తల్లీబిడ్డల మృతి పట్ల ఆర్కే,పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ నీలకంఠన్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని తల్లీ బిడ్డ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రియా తండ్రి అరుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్క, చెల్లెలు అరెస్ట్
పళ్లిపట్టు: కాంచీపురం జిల్లాలో వినూ త్న రీతలో చోరీకి పాల్పడిన అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాం చీపురం జిల్లా ఎస్పీ విజయకుమార్ ఆదేశాల మేరకు చెంగల్పపట్టు డీఎస్పీ కుమార్ నేతృత్వంలో ఓట్టేరి ఇన్స్పెక్టర్ వెంకటాచలం ఆధ్వర్యంలో పోలీసులు చోరీలను అరికట్టేందుకు వీలుగా ప్రత్యేక నిఘా ఉంచి వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఓట్టేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పద రీతిలో వెళుతున్న మహిళలు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వారు పోలీసులకు సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యూయి. ఇందులో ఓట్టేరికి చెందిన అనీష్కుమారి(25), ఆమె చెల్లెలు కలైవాణి ఓట్టేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనా లు,ఇళ్లలో వస్తువులు, సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి నుంచి ద్విచక్ర వాహనాలు, కెమెరాలు, సెల్ఫోన్లు, రెండు సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం పుళల్ మహిళా జైలుకు తరలించారు. -
సంక్రాంతి సంబరాల్లో స్టాలిన్ కుటుంబం
పళ్లిపట్టు, న్యూస్‌లైన్:గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా కాంచీపురం జిల్లా నందంపాక్కం ప్రాంతంలో డీఎంకే ఆధ్వర్యంలో సమత్తువ పొంగల్ వేడుకలు నిర్వహించారు. ఇందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పాల్గొని సంక్రాంతి వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ తన కుటుంబంతో పాల్గొని సమత్తువ పొంగల్‌ను కోలాహలంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి తమిళుడు జరుపుకునే పండుగ పొంగల్ అని అన్నారు. అనంతరం పేదలకు సహయకాలు పంపిణీ చేశారు. వేడుకల్లో భారీ సంఖ్యలో అన్ని మతాల సభ్యులు పాల్గొని పొంగల్ వేడుకలు విజయవంతం చేశారు. పళ్లిపట్టు, ఆర్కే.పేట ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి పండగ సందర్భంగా కళకళలాడాయి. జనం పొంగళ్లు పెట్టి పూజలు చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రతి ఇంటి ముందు వేసిన రంగురంగుల రంగోలీలు కనువిందు చేశాయి. పొంగళ్లు పెట్టి వేడుకలు జరుపుకున్నారు. -
సంక్రాంతి కానుకల పంపిణీ
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: పళ్లిపట్టు తాలూకాలో 59 వేల కుటుంబాలకు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కౌన్సిలర్ టీడీ.శ్రీనివాసన్ ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కిలో బియ్యం, చక్కెర, రూ.వందతో పాటు ఉచిత చీర ధోవతుల పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారాజుపేటలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి తహశీల్దార్ మనోహర్ అధ్యక్షత వహించారు. యూనియన్ చైర్మన్ శాంతిప్రియాసురేష్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా జిల్లా కౌన్సిలర్ టీడీ.శ్రీనివాసన్ పాల్గొని రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరికీ సంక్రాంతి కానుకలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ తమిళుల పండుగగా కీర్తి పొందిన పొంగల్ వేడుకలను పేదలు, ధనికుల అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జయలలిత ఇవి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుదారులందరూ ఈ వస్తువులను ఉచితంగా పొందాలని చెప్పారు. ఈ నెల 13వ తేదీ వరకు అన్ని రేషన్ దుకాణాల్లో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా కౌన్సిలర్లు కరుణాకరన్, ఏకాంబరం, సెల్వి శరవనన్, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు జానకిరామన్, సుబ్రమణ్యం రెడ్డి సహా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్కే.పేట యూనియన్ వేణుగోపాలపురం, ఆదివరాహపురం, గ్రామాల్లో నిర్వహించిన సంక్రాంతి వస్తువుల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరసింహన్ పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌కు వైద్య విద్యార్థి బలి
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: ర్యాగింగ్ భూతానికి వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయా డు. ఈ విషాదకర సంఘటన కాంచీపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణగిరికి చెందిన ముహుల్ రాజ్‌కుమార్(18) కాంచీపుర ంలోని మీనాక్షి ప్రయివేటు వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లోనే ఉంటున్నాడు. ముహుల్రాజ్ కుమార్‌ను సీనియర్లు తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. ఈ దృష్ట్యా బయట గది తీసుకుని చదువుకుంటానని తల్లిదండ్రులకు అతను చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన గదిలో ఉన్న చీకటీగల మందు తాగి స్పృహ కోల్పోయా డు. రాజ్‌కుమార్‌కు తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11 గంట ల సమయంలో అతను ప్రాణాలు విడిచాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రు ల రోదన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కాంచీపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ డీఎంకేలకు గుణపాఠం చెప్పాలి
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నాడీఎంకే నాయకుడు నరసింహన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకే 42 వ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా ఆర్కే.పేటలో శనివారం రాత్రి బహింరగ సభ నిర్వహించారు. సెరత్తూర్లో నిర్వహించిన సభకు ఆ పార్టీ యూనియన్ వ్యవసాయ విభాగం అదనపు కార్యదర్శి నారాయనన్ అధ్యక్షత వహించారు. గ్రామ కార్యదర్శి బాలయ్యన్ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా నరసింహన్ పాల్గొని ప్రసంగించారు. ప్రజల దీవెనలతో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికై సుపరిపాలన చేసిన ఎంజీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేకు నేడు 42 వసంతంలోకి ప్రవేశించిందన్నారు. ఎంజీఆర్ బాటలో ముఖ్యమంత్రి జయలలిత పయనిస్తూ పేదలు, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీలంకలో లక్షలాది తమిళులు హత్యకు సూత్రధారి కాంగ్రెస్ పార్టీ అని, వారికి తొత్తుగా డీఎంకే వ్యవహరించింది విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ప్రజలు గుణపాఠం నేర్పాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మూర్తి, బలరామన్, జయరాయన్ గ్రామ పంచాయతీ యూనియన్ వైస్ చైర్మన్ జయవేలు, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు వేలాయుధం, తాయార్ మునుస్వామితో సహా అనేక మంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ బస్సు, లారీ ఢీ : ఆరుగురి మృతి
పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : కాంచీపురం సమీపంలో ప్రభుత్వ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో మహిళ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై కోయంబేడు నుంచి తిరుపత్తూరుకు ప్రభుత్వ బస్సు బుధవారం వేకువ జామున బయలుదేరింది. సంతవేలూరు సమీపంలో లారీ డ్రైవర్ ప్రభుత్వ బస్సును అధిగమించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ సహా ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ అన్బు, పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను చేపట్టి కాంచీపురం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో చెన్నై తిరుముల్లైవాయిల్‌కు చెందిన శివశంకర్, చెన్నై తేనాంపేటకు చెందిన గోమతి, వాలాజా పెరియ కడంబూర్‌కు చెందిన సతీష్, తిరువళ్లూర్‌కు చెందిన శింగారవేల్, కాట్టుపాక్కం అరుణాచలం వాణియంబాడికి చెందిన రాజవేలుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ అన్బు, కృష్ణగిరికి చెందిన కవిత, తెప్పాచ్చి, చెన్నైకు చెందిన జయలక్ష్మి, మురుగయ్యన్ తదితరులు ఉన్నారు. వీరిని మంత్రి చిన్నయ్య, ఎమ్మెల్యేలు గణేశన్, పెరుమాళ్ పరామర్శించారు. షోళింగనల్లూర్ పోలీ సులు కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ రామమూర్తిని అరెస్ట్ చేశారు. -
దొంగ టీచర్ అరెస్ట్
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: అతనో బడిపంతులు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సంస్కర్త. అయితే వాటన్నింటినీ తుంగలో తొక్కి దొంగతనమే లక్ష్యంగా ఎంచుకుని కటకటాల పాలయ్యాడు. కాంచీపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల రాత్రి సమయాల్లో మహిళలు, ఒంటరిగా పయనిస్తున్న వారి వద్ద బంగారు నగలు చోరీ చేయడం శ్రుతిమించింది. తమ ఆస్తులు పోగొట్టుకుని పోలీసులను ఆశ్ర యిస్తున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీనిపై ఎస్పీ విజయకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ బాలచెందర్ ఆధ్వర్యంలో చిన్నకాంచీపురం ఇన్స్పెక్టర్ ప్రభాకర్ అధ్యక్షతన ప్రత్యేక పోలీసు బృందం నిఘా వేసింది. శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేసింది. ఆ మార్గంలో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆపి పరిశీలించారు. సదురు వ్యక్తి సక్రమంగా సమాధానం చెప్పక పోవడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. వేలూరు జిల్లా పేర్నాంబట్టుకు చెందిన మధన్మారన్(34) అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వరుస చోరీలకు పాల్పడి సస్పెండ్‌కు గురైనట్టు తేలింది. అంతటితో ఆగక కాంచీపురంలో ఆరు నెలలుగా ద్విచక్ర వాహనంలో హెల్మెట్ ధరించి ఒంటరిగా వెళుతున్న మహిళల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసుకెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఈ దొంగ టీచర్ వద్ద నుంచి 75 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల్లో పయనిస్తూ చోరీలకు పాల్పడ్డ కాంచీపురానికి చెందిన శివ(24),అబ్దుల్హ్రీమ్(24), కుమార్ తదితరుల వద్ద నుంచి రూ.27 లక్షల విలువగల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించిన పోలీసులను ఎస్పీ విజయకుమార్ అభినందించారు. -
సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో చోరీ
పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : అరక్కోణం పట్టణంలోని నివాసముంటున్న తిరుత్తణి సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో చోరీ జరి గింది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు, నగదును చోరీ చేశారు. తిరుత్తణి సబ్‌రిస్ట్రార్ రాజేంద్రన్ అరక్కో ణం మాధవన్ నగర్లో నివాసముంటున్నారు. గురువారం ఆయన విధులకు వెళ్లారు. ఆయన భార్య మీనాక్షి ఉదయం పదిగంటలకు పక్కింటికి వెళ్లారు. రెండు గంటలు తర్వాత ఆమె ఇంటికి వచ్చారు. ఆసమ యంలో ఇంటి వెనుక తలుపులు తీసి ఉన్నాయి. గదిలో బీరువా తాళాలు పగులగొట్టి అందులోని వస్తువులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. బీరువాలో 13 సవర్ల బంగారు నగలు,కేజీ వెండి వస్తువులు, రూ. 3లక్ష లు నగదు చోరీ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపారు. వెంటనే సబ్‌రిస్ట్రార్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం,పోలీసులు పరిశీలించారు. పట్ట పగలే చోరీ జరగడం కలకలం రేపింది. బంగారు నగల అపహరణ తిరుత్తణి, న్యూస్‌లైన్ : తిరుత్తణి అరక్కోణం రోడ్డులోని జెజెనగర్లో నివాసముంటున్న లోకనాథన్ ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన జమున బుధవారం మధ్యాహ్నం స్కూలులో చదువుకునే తన పిల్లలకు అన్నం తీసుకుని వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి తొమ్మిది సవర్ల బంగారు నగలను, అరకిలో వెండి వస్తువులు అపహరించుకుపోయారు. ఈ విషయమై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఉసురు తీసిన ఈత సరదా
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: ఈత సరదా ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది. కాంచీపురం సమీపంలోని చిట్టికారై గ్రామంలోని చెరువులో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు మృతి చెందారు. కాంచీపురం సమీపంలోని చిట్టికారై ప్రాంతానికి సమీపంలోని సిరువాలూర్ గ్రామానికి చెందిన రైతు కూలీ వెంకటేశన్ అతని కుమార్తె షాలిని కాంచీపురంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన భూపాలన్ కుమార్తె ధనలక్ష్మి ఏడవ తరగతి, ఏకాంబరం అనే వ్యక్తి కుమార్తె అజిత పారానత్తూర్లోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ముగ్గురు బాలికలు ఆవులను మేపేందుకు గ్రామానికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లారు.సరదగా ఈత కొట్టి స్నానం చేసేందుకు ముగ్గురు బాలికలు చెరువులోకి దిగారు. చెరువులో బంక మట్టి పేరుకుపోవడంతో బాలికల కాళ్లు బురదలో చిక్కుకున్నాయి. ఒకరిని ఒకరు కాపాడేందుకు ప్రయత్నించి ముగ్గురూ బరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం లో ఆ మార్గంలో వెళుతున్న గ్రామస్తులకు బాలికల దుస్తులు కనపించాయి. వారు అక్కడ కనిపించ లేదు. అనుమానం వచ్చి వారు చెరువు వద్దకు వచ్చి పరిశీలించారు. అక్కడ బంకమట్టిలో బాలికల మృతదేహాలు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు తెలిపారు. వారు చెరువుకట్ట వద్దకు వచ్చారు. పిల్లల మృతదేహాల చూసి విలపించారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.