బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య | died child's mother committed suicide | Sakshi
Sakshi News home page

బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య

Published Mon, Jun 23 2014 11:41 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య - Sakshi

బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య

పళ్లిపట్టు: మగబిడ్డ పుట్టలేదని భర్త వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన మహిళ నాలుగు నెలల ఆడబిడ్డను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆర్‌కే పేట ప్రాంతంలో చోటుచేసుకుంది. పళ్లిపట్టు తాలూకా పరిధిలోని ఆర్‌కే పేట సమీపంలోని వెడియంగాడు దళితవాడకు చెందిన శరవణన్(30). అతని భార్య ప్రియ. వీరికి ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి స్వర్ణలక్ష్మి(4), ముల్లై(2) ఆడ పిల్లలు. మూడు నెలల కిందట ప్రియ మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడే నెలలకే ఆ బిడ్డ  మృతి చెందింది. దీంతో ప్రియను భర్త మగబిడ్డ పుట్టలేదని తరుచూ వేధించేవాడు.
 
 ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ప్రియా తన పెద్ద కూతురు స్వర్ణలక్ష్మి గొంతు నులుమి చంపి ఆ తరువాత తాను సైతం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన శరవణన్ భార్య, బిడ్డ మృతి చెందడాన్ని గుర్తించి దిగ్భ్రాంతి చెంది గ్రామస్తులకు తెలిపారు. తల్లీబిడ్డల మృతి పట్ల ఆర్‌కే,పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ నీలకంఠన్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని తల్లీ బిడ్డ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రియా తండ్రి అరుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement