అక్క, చెల్లెలు అరెస్ట్
పళ్లిపట్టు: కాంచీపురం జిల్లాలో వినూ త్న రీతలో చోరీకి పాల్పడిన అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాం చీపురం జిల్లా ఎస్పీ విజయకుమార్ ఆదేశాల మేరకు చెంగల్పపట్టు డీఎస్పీ కుమార్ నేతృత్వంలో ఓట్టేరి ఇన్‌స్పెక్టర్ వెంకటాచలం ఆధ్వర్యంలో పోలీసులు చోరీలను అరికట్టేందుకు వీలుగా ప్రత్యేక నిఘా ఉంచి వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఓట్టేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పద రీతిలో వెళుతున్న మహిళలు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వారు పోలీసులకు సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యూయి. ఇందులో ఓట్టేరికి చెందిన అనీష్‌కుమారి(25), ఆమె చెల్లెలు కలైవాణి ఓట్టేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనా లు,ఇళ్లలో వస్తువులు, సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి నుంచి ద్విచక్ర వాహనాలు, కెమెరాలు, సెల్‌ఫోన్లు, రెండు సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం పుళల్ మహిళా జైలుకు తరలించారు.