Two-wheelers
-
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్‌లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్‌ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్‌లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్‌నగర్‌లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్‌తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
ఎలక్ట్రిక్ టూ–వీలర్ సంస్థలకు భారీ నష్టం
న్యూఢిల్లీ: పేరుకుపోయిన బాకీలు, గతేడాది సబ్సిడీల నిలిపివేత వల్ల మార్కెట్ వాటాను కోల్పోవడం తదితర కారణాలతో విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం) నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణంగా ఏడు సంస్థలు ఏకంగా రూ. 9,000 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) మంత్రి మహేంద్ర నాథ్ పాండేకి రాసిన లేఖలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (ఎస్ఎంఈవీ) చీఫ్ ఎవాంజెలిస్ట్ సంజయ్ కౌల్ ఈ విషయాలు తెలిపారు. అసలే కష్టకాలంలో ఉంటే.. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తాలను వాపసు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు. 2022లో సదరు సంస్థలకు భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీలను నిలిపివేసినప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలు, వడ్డీ, రుణం, మార్కెట్ వాటాపరమైన నష్టం, ప్రతిష్టకు భంగం కలగడం, పెట్టుబడి వ్యయాలపరంగా కంపెనీలకు రూ. 9,075 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ఎస్ఎంఈవీ ఆడిట్లో తేలినట్లు కౌల్ తెలిపారు. ఫలితంగా కొన్ని కంపెనీలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చని, కొన్ని మూతబడవచ్చని పేర్కొన్నారు. దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 1 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో పరిశ్రమ చర్చలు జరుపుతున్న తరుణంలో దాదాపు దానికి సరిసమానమైన స్థాయిలో నష్టాలు నమోదవడం చిత్రమైన పరిస్థితి అని కౌల్ వ్యాఖ్యానించారు. రోజూ పెరిగిపోతున్న నష్టాల కారణంగా తయారీ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయండి.. ఓఈఎంలకు గత 18–22 నెలల సబ్సిడీ బాకీలు రావాల్సి ఉందని కౌల్ తెలిపారు. పైపెచ్చు పాత సబ్సిడీలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడం, కొత్త మోడల్స్‌ను ఎన్ఏబీ పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి అనుమతించకపోవడం వంటివి ఆయా సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ప్రధాన ఉద్దేశం సదరు సంస్థలను శిక్షించడం మాత్రమే అయితే, ఇలా సమస్య పరిష్కారం కాకుండా జాప్యం జరుగుతూ ఉండటం వల్ల అవి పూర్తిగా మూతబడే పరిస్థితి వస్తోందని కౌల్ తెలిపారు. ఇలాంటి శిక్ష సరికాదని పేర్కొన్నారు. మూసివేత అంచుల్లో ఉన్న ఓఈఎంలకు ఊపిరి పోసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. తక్కువ వడ్డీపై రుణాలు, గ్రాంట్లు లేదా ఆ తరహా సహాయాన్ని అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిర్దిష్ట స్కీము నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు పొందాయంటూ హీరో ఎలక్ట్రిక్ సహా ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటర్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటోపై ప్రభుత్వం విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు మేడిన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలి. అయితే, ఈ ఏడు సంస్థలు దిగుమతి చేసుకున్న పరికరాలను వినియోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంగించాయని ఆరోపణలు ఉన్నాయి. -
ఈ–టూవీలర్ల కోసం రేస్‌ఎనర్జీ, హాలా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ సంస్థ రేస్‌ఎనర్జీ, రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ హాలా మొబిలిటీ తాజాగా జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు ఎలక్ట్రిక్ టూ–వీలర్లను డెలివరీ సర్వీసుల కోసం వినియోగంలోకి తేనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి తొలి దశ కింద కొన్ని వాహనాలు వినియోగంలోకి రానున్నట్లు సంస్థలు తెలిపాయి. విస్తృతమైన రేస్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ .. తమ మార్కెట్, కస్టమర్ల బేస్‌ను మరింతగా పెంచుకునేందుకు సహాయకరంగా ఉండగలదని హాలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ–ఆటో మార్కెట్లో తాము పటిష్టంగా ఉన్నామని, హాలాతో జట్టు కట్టడం ద్వారా మిగతా విభాగాల్లోకి కూడా గణనీయంగా విస్తరించగలమని రేస్‌ఎనర్జీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్ శ్రేయాస్ పేర్కొన్నారు. -
భారత్‌లో సుజుకీ కటానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లో కటానా స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.13.61 లక్షలు. పూర్తిగా తయారైన బైక్‌ను భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. 999సీఎం3 ఫోర్ స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్సీ, ఇన్లైన్–ఫోర్ ఇంజన్, ఫ్లోటింగ్ టెయిల్ సెక్షన్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కంట్రోల్స్‌తో కూడిన సుజుకీ ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. -
వాహనాలపై లైఫ్ ట్యాక్స్ మోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల జీవిత పన్నును ప్రభుత్వం పెంచింది. వాహనాల ధరను బట్టి గతంలో ఉన్న రెండు శ్లాబులను నాలుగుకు పెంచి.. వేర్వేరు పన్ను శాతాలను ఖరారు చేసింది. ద్విచక్ర వాహనాలకు వేరుగా రెండు శ్లాబుల్లో పన్ను శాతాలను నిర్ణయించింది. ఈ కొత్త చార్జీలు సోమవారం నుంచే అమలు చేస్తున్నట్టుగా పేర్కొంటూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు శ్లాబులుగా.. ద్విచక్ర వాహనాలకు రూ.50వేల లోపు ధర ఉన్నవి, ఆపై ధర ఉన్నవిగా రెండు శ్లాబులను ఖరారు చేశారు. మూడు, నాలుగు చక్రాల వాహనాలకు.. రూ.5లక్షలలోపు, రూ.5–10లక్షలు, రూ.10–20 లక్షలు, రూ.20 లక్షలపైన అనే 4 శ్లాబులుగా విభజించి.. ఒక్కో శ్లాబుకు ఒక్కో పన్ను నిర్ణయించారు. ఇక నాన్ ట్రాన్స్‌పోర్టు కేటగిరీలో కంపెనీలు, సంస్థలు, సొసైటీలకు చెందిన 10 సీట్ల వరకు ఉండే వాహనాలకు ఆయా శ్లాబుల్లో 15శాతం, 16 శాతం, 19 శాతం, 20 శాతం పన్నును నిర్ధారించారు. పెరగనున్న ఆదాయం దాదాపు పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను సవరించారు. రూ.10 లక్షలలోపు ఉన్నవాటిని సాధారణ వాహనాలుగా, అంతకంటే ఎక్కువ ధర ఉంటే ఖరీదైన వాహనాలుగా పరిగణించి రెండు శ్లాబుల్లో పన్ను విధించారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా పన్ను శ్లాబులు, శాతాలను పెంచారు. దీనితో ఈ పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల వాహనాలు కలిపి.. సగటున రోజుకు ఆరు వేల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై బదిలీ చేసుకుంటే.. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై.. తెలంగాణకు బదిలీ అయిన వాహనాలకు వాటిని కొన్నకాలం ఆధారంగా పన్నులను నిర్ణయించారు. రాష్ట్రంలో రిజిస్టరయ్యే వాహనాల శ్లాబ్‌లకు తగినట్టుగా.. ద్విచక్ర వాహనాలకు వేరుగా.. 3, నాలుగు చక్రాల వాహనాలకు వేరుగా పన్ను శాతాలను ఖరారు చేశారు. ద్విచక్ర వాహనాలైతే.. ♦రూ.50వేలలోపు ధర ఉన్నవాటికి.. వాటిని కొని 2 ఏళ్లకు మించకుంటే 8శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒకశాతం టాక్స్ తగ్గుతూ వస్తుంది. అంటే కొని రెండేళ్లు దాటితే 7శాతం, మూడేళ్లు దాటితే 6 శాతం.. ఇలా తగ్గుతూ వస్తుంది. చివరిగా కనీసం ఒకశాతం పన్ను వసూలు చేస్తారు. ♦రూ.50 వేలు, ఆపై ధర ఉంటే.. కొని రెండేళ్లకు మించకుంటే 11 శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒక్కో శాతం ట్యాక్స్‌ను తగ్గుతూ ఉంటుంది. చివరిగా కనీసం 4 శాతం పన్ను వసూలు చేస్తారు. మూడు, నాలుగు చక్రాల వాహనాలకు.. ♦కొని రెండేళ్లు మించని వాహనాలకు.. రూ.5లక్షల లోపు ధర ఉన్నవాటికి 12 శాతం; రూ.5–10 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 13శాతం; రూ.10–20 లక్షల మధ్య ధర ఉన్నవాటికి 16శాతం; రూ.20 లక్షలపై ధర ఉన్నవాటికి 17శాతం పన్ను వసూలు చేస్తారు. ♦ఆయా వాహనాలు కొని ఒక్కో ఏడాది పెరిగిన కొద్దీ పన్ను శాతాన్ని ఒక శాతం, అర శాతం చొప్పున తగ్గిస్తూ ఖరారు చేశారు. ‘లైఫ్ ట్యాక్స్’ లెక్కలివీ.. ♦ఇప్పటివరకు వాహనం ఏదైనా.. రూ.10 లక్షల లోపు ధర ఉంటే 12%.. ఆపై ధర ఉంటే 14% లైఫ్ ట్యాక్స్‌ను విధించేవారు. ♦తాజాగా ద్విచక్ర వాహనాలకు వేరుగా.. మిగతా వాహనాలకు వేరుగా నిర్ధారించారు. ♦ద్విచక్ర వాహనాల ధర రూ.50 వేలలోపు ఉంటే 9శాతం, ఆపై ధర ఉంటే 12 శాతం పన్ను వసూలు చేస్తారు. -
దూకుడుతో నష్టం.. భవిత ఎంతో కష్టం
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులు, పట్టణ రోడ్లమీద.. గల్లీల్లోను కుర్రాళ్ల దూకుడు ప్రాణాల మీదకు తెస్తోంది. దూకుడుతో పాటు ద్విచక్ర వాహనంలో స్పీడుగా వెళ్లడమనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీనివల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు.. అనేకమంది శాశ్వత వైకల్య బాధితులుగానూ మారుతున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు నాన్నా జాగ్రత్త.. నాన్నా జాగ్రత్త అంటూ తల్లిదండ్రులు పదేపదే చెబుతుంటారు. కానీ యువకులు ఇలాంటివి పెడచెవిన పెడుతున్నారు. ఉదాహరణకు 2020 సంవత్సరంలో విశాఖపట్నం లోని కింగ్‌జార్జి ఆస్పత్రి ట్రామాకేర్‌లో 613 మంది ప్రమాద బాధితులు నమోదు కాగా.. అందులో 40 ఏళ్లలోపు వారే 325 మంది ఉన్నారు. అంటే 50 శాతం కంటే ఎక్కువ. ఆ ఏడాది ఇదే ఆస్పత్రిలో 137 మంది మృతిచెందారు. వీరిలో 82 మంది కుర్రాళ్లే. 80 శాతం మంది ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదానికి గురైనవారే. హైవేల్లోనే కాకుండా గల్లీల్లో కూడా ఇలాంటి వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి. 18 ఏళ్ల లోపు వారికీ తల్లిదండ్రులు బైకులిస్తుండటం కూడా ప్రమాదాలు పెరగడానికి కారణమవుతోంది. లైసెన్సు రాకముందే.. చాలాప్రాంతాల్లో ప్రమాదానికి గురైన వారిలో 18 ఏళ్లలోపు వారూ ఉన్నారు. ఎక్కువగా వీళ్లు 150 సీసీ బైకుల్లో రైడింగ్ చేయడం, బ్యాలెన్సు చేయలేక పడిపోవడం వంటివి జరుగుతున్నాయి. చదువుకునే వయసులోనే ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు ఫ్రాక్చర్లు చేసుకుంటున్న ఘటనలున్నాయి. అనేకమంది హెల్మెట్ కూడా లేకుండా డ్రైవ్ చేసి, తలకు గాయాలై తీవ్ర ప్రమాదంలో పడుతున్నారు. ప్రమాదానికి గురైన వారిలో 30 శాతం మందికి మేజర్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది. విచిత్రమేమంటే 2020 మార్చి నుంచి కోవిడ్ ఉంది. అయినా సరే 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు గతంలో లాగా కాకపోయినా ఓ మోస్తరు ప్రమాదాలు జరిగాయి. ఇందులో కుర్రాళ్లే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదానంతరం శస్త్రచికిత్సలు చేయించుకున్నా గతంలో వలె ఉండలేకపోతున్నారు. కొందరు శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నారు టీనేజీలో గుర్తింపు సమస్య చాలామంది టీనేజీ కుర్రాళ్లలో ఐడెంటిటీ క్రైసిస్ (గుర్తింపు సమస్య) ఉంటుంది. నన్ను అందరూ చూడాలి, అందరికంటే నేనే గొప్ప.. ఇలాంటివి. దీనివల్ల ఏదో ఒకటి చేసి వాళ్లు గుర్తింపు కోరుకోవడం అన్నమాట. ఇలాంటివాళ్లలో బైక్‌రైడింగ్ చేసేవాళ్లు ఎక్కువ. వాళ్లు స్పీడుగా నడిపితే వాళ్లవైపు అందరిచూపు ఉంటుందని అనుకుంటారు. మరికొందరిలో నార్సిస్టిక్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే సెల్ఫ్ ఐడెంటిటీ అంటారు. ఇలాంటి వారిలో ఏదో ఒక మానసికమైన జబ్బు ఉంటేనే ఇలాంటివి చేస్తుంటారు. వీరికి బాగా కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ వెంకటరాముడు, మానసిక వైద్యనిపుణులు, కడప సర్వజనాస్పత్రి -
35 శాతం మృతులు ద్విచక్ర వాహనదారులే
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై నిత్యం జరిగే ప్రమాదాల్లో అత్యధికంగా 35 శాతం మృతులు ద్విచక్ర వాహనదారులే కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఎటువంటి సంబంధం లేని పాదచారులు కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు, మృతులపై కేంద్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం 18.6 శాతం రోడ్డు ప్రమాద మృతులు కార్లు, టాక్సీలు, వాన్లలో ప్రయాణించేవారేనని తేలింది. అలాగే 19.7 శాతం రోడ్డు ప్రమాద మృతులు ట్రక్కుదారులు, 4.9 శాతం బస్సుల్లో ప్రయాణించేవారు చనిపోతున్నారు. 2019లో జాతీయ రహదారులపై ప్రమాదాల్లో 53,872 మంది మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. హైవేలపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్ల డిజైన్లలో మార్పులు చేయడంతో పాటు వేగ నియంత్రణకు సంబంధిత కంట్రోల్ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని నివేదిక తెలిపింది. వివిధ కేటగిరీల వారీగా జాతీయ రహదారులపై ప్రమాదాల్లో ఏ వాహనదారులు ఎంత శాతం మంది మృతి చెందారో వివరాలిలా ఉన్నాయి.. -
హెల్మెట్లకు బీఐఎస్ లేకుంటే జరిమానాలు
సాక్షి, అమరావతి: ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు స్టాండర్డ్ మార్క్ హెల్మెట్లనే ధరించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ స్పష్టం చేసింది. బైక్‌లపై వెళ్లేటప్పుడు హెల్మెట్ విధిగా ఉండాలని, వాటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు లేకుంటే భారీగా జరిమానాలు విధించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఫేస్ షీల్డ్తోనే ప్రయాణాలు చేస్తున్నారని, ప్రమాదం జరిగితే ఫేస్ షీల్డ్ తలకు సరైన భద్రత కల్పించలేకపోతుందని అందులో పేర్కొన్నారు. -
యూట్యూబ్‌లో చూసి.. చోరీలు చేసి!
హైదరాబాద్: యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ బాలుడు పోలీసులకు పట్టుబడ్డాడు. మూడు నెలల్లో పదిహేను స్పోర్ట్స్ బైక్‌లను మాయం చేశాడు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ చక్రవర్తి వివరాలను వెల్లడించారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలో నివాసముండే అబ్దుల్ ఖాదర్ కుమారుడు(15) ద్విచక్ర వాహనాలను దొంగిలించే వీడియోలను ఈ ఏడాది మార్చిలో యూట్యూబ్‌లో చూశాడు. తర్వాత కొద్ది రోజులకు స్నేహితుడి వాహనాన్నే దొంగిలించాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలబాట పట్టాడు. స్థానికంగా ఉండే పాత నేరస్తుడు, ఎలక్ట్రీషియన్ మొహమ్మద్ సోహైల్(19), మరో ఇద్దరు స్నేహితులతో కలసి చోరీలకు పాల్పడుతు న్నాడు. ఈ దొంగలు కేవలం స్పోర్ట్స్ బైక్‌లు, బుల్లెట్లు, రాయల్‌ఎన్‌ఫీల్డ్, 200 సీసీ పైన ఉన్న పల్సర్ వాహనాలనే చోరీ చేసేవారు. కేవలం రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే తాళం విరగ్గొట్టి ఎంతటి వాహనాన్నైనా సునాయాసంగా తస్కరించేవారు. ఈ వాహనాలను విక్రయించిన సొమ్ముతో షికార్లు చేయడం, మండి బిర్యాని తినడం వంటివి చేసేవారు. దొరికింది ఇలా..... ఈ నెల 10న కాళీమందిర్ ప్రాంతానికి చెందిన అక్షయ్ తన కేటీఎం స్పోర్ట్స్ బైక్‌పై అత్తాపూర్‌లోని స్నేహితున్ని కలవడానికి వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మొఘల్‌నగర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే వాహనంలో పెట్రోల్ అయిపోయింది. సమీపంలో ఉన్న క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద బైక్ పార్కు చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయాన్నే వచ్చి చూడగా వాహనం కనిపించకపోవడంతో లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సాలార్జంగ్ కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ దొంగలను కానిస్టేబుళ్లు మనీష్‌కుమార్ తివారి, నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ విషయాలు బయటపడ్డాయి. ముగ్గురు మైనర్ బాలురతోపాటు మొహమ్మద్ సోహైల్(19), మొహమ్మద్ గఫూర్ ఖాన్(20)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుండి 4 రాయల్ ఎన్ఫీల్డ్లతోపాటు 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. -
లేని వాహనానికి వేతనం కట్
సాక్షి, పెద్దపల్లి: ఎవరైనా వాయిదా పద్దతిన వాహనాలు కొనుగోలు చేస్తే.. తీసుకున్న నెల నుంచి చెల్లింపులు మొదలవుతాయి. ఇది సాధారణం. కానీ అసలు వాహనమే లేకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల విచిత్ర వ్యవహారం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. ప్రభు త్వం రాయితీపై ఇస్తున్న ద్విచక్రవాహనాలు పొందకుండానే, 3 నెలలుగా ఏఎన్ఎంల జీతం నుంచి వాయిదాలు కట్ అవడం చర్చనీయాంశమైంది. రాయితీపై ద్విచక్రవాహనాలు: పల్లెల్లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏఎన్ఎంలకు రాయితీతో కూడిన, సులభ వాయిదా పద్ధతిలో చెల్లించేలా ద్విచక్రవాహన సౌకర్యం కల్పించాలని గతంలో నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న ఏఎన్ఎంలకు రూ.15 వేలు సబ్సిడీ ఇస్తారు. మిగతా మొత్తాన్ని సంబంధిత ఏఎన్ఎంల జీతం నుంచి సులభ వాయిదా పద్దతిలో నెలవారీగా కట్ చేసుకుంటారు. మూడు నెలలుగా జీతంలో కోత పెద్దపల్లి జిల్లాలో ఏఎన్ఎంలను ఎంపిక చేసినా.. ఇప్పటి వరకు ద్విచక్రవాహనాల పంపిణీ మొదలు కాలేదు. ద్విచక్రవాహనాలను ఇవ్వకున్నా ఎంపికైన ఏఎన్ఎంల జీతం నుంచి మాత్రం ఇన్స్టాల్మెంట్ పేరిట కట్ చేస్తున్నారు. గత మే నుంచి జూలై వర కు 3 నెలలు జిల్లాలోని ఏఎన్ఎంల జీతాల నుంచి కోత విధించారు. ఇన్‌స్టాల్‌మెంట్‌ను మినహాయిం చుకొని ఏఎన్ఎంల జీతాలు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏఎన్ఎంలు, రెండో ఏఎన్ఎంలు 148 మంది ద్విచక్రవాహనాలకు దర ఖాస్తు చేసుకొన్నారు. ఇందులో మొదటి దశలో 86 మందికి ద్విచక్రవాహనాలు మంజూరయ్యాయి. ప్రభుత్వ పరంగా మంజూరైన సబ్సీడీ రూ.10 వేలు కూడా ఆయా షోరూంల్లో చెల్లించారు. బ్యాంక్ ప్రక్రియనూ పూర్తి చేసుకొన్నారు. దీంతో వీళ్లకు వాహనాలు అందకపోయినా, నెలవారీ ఇన్స్టాల్మెంట్ మాత్రం కోతపడుతోంది. నాలుగు రోజుల్లో పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు ఏఎన్ఎం, రెండో ఏఎన్ ఎంలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. 3 మాసాల క్రితమే ఆ వాహనాలు షోరూంకు సైతం చేరుకున్నాయి. మరో 4 రోజుల్లో ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారు. ఇన్స్టాల్మెంట్ కట్ అవుతున్నది వాస్తవమే, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తా. - ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి -
టూ వీలర్లకూ నావిగేషన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాలకు నావిగేషన్ వ్యవస్థ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా త్వరలోనే ఇది భారత్‌లో సాకారం కానుంది. లొకేషన్ టెక్నాలజీ కంపెనీ మ్యాప్ మై ఇండియా ఈ మేరకు ఓ ద్విచక్ర వాహన కంపెనీతో చేతులు కలిపింది. కొద్ది రోజుల్లో నావిగేషన్ వ్యవస్థ కలిగిన టూ వీలర్లు రోడ్డెక్కనున్నాయని మ్యాప్ మై ఇండియా ఎండీ రాకేశ్ వర్మ తెలిపారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివాలిక్ ప్రసాద్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహన కంపెనీకి తాము సాఫ్ట్వేర్, మ్యాప్స్ అందిస్తామని చెప్పారు. వాహన కంపెనీ పేరు ఇప్పుడే వెల్లడించలేనన్నారు. అయితే హీరో మోటోకార్ప్ ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టినట్టు సమాచారం. మ్యాప్ మై ఇండి యా సహకారం అందించిన నావిగేషన్ వ్యవస్థ 30 లక్షలకుపైగా కార్లలో ప్రస్తుతం వినియోగంలో ఉంది. నూతన ఫీచర్లతో... స్మార్ట్ పర్సనల్ సేఫ్టీ ఉపకరణం ‘సేఫ్‌మేట్’ ఈ ఏడాదే కొత్త ఫీచర్లతో రానుందని రాకేశ్ వర్మ తెలిపారు. ‘సిమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 7 రోజులు వచ్చేలా డిజైన్ చేస్తున్నాం. అత్యవసర సమయాల్లో బటన్ నొక్కితే నిక్షిప్తం అయి ఉన్న నాలుగు నంబర్లకు ఫోన్ కాల్ వెళుతుంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటి నంబర్లతోసహా రియల్ టైం లొకేషన్ తెలుస్తుంది. లొకేషన్‌తో కూడిన అలర్టులు ఎస్ఎంఎస్, ఈమెయిల్ రూపంలో వెళ్తాయి. ఈ ఉపకరణం ఉన్నవారి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. సేఫ్‌మేట్ సేవలు పొందాలంటే కస్టమర్లు నెలకు రూ.100 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఉపకరణం ధర రూ.4,000 ఉండొచ్చు’ అని వివరించారు. గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆధునీకరించిన సేవలను త్వరలో పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. -
జల్సాల కోసం బైక్‌ల చోరీ
పోలీసులకు చిక్కిన ఆరుగురు నిందితులు 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం గణపురం : జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. వారి నుంచి పోలీసులు 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి కథనం ప్రకారం.. గణపురం మండల కేంద్రానికి చెందిన పరకాల రవీందర్(పెయింటర్), మహమ్మద్ ముజాహిద్(మెకానిక్), సురాసి పృథ్వీ(పెయింటర్), గౌరిశెట్టి సాయితేజ(పెయింటర్)తోపాటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ముషం శివ, అదే జిల్లాకు చెందిన కమాన్‌పూర్ గ్రామానికి చెందిన మంతిని మహేష్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇంటి ముందు నిలిపిన బైక్‌లను తమ వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో స్టార్ట చేసుకొని తీసుకెళ్లేవారు. ఇలా హుజురాబాద్‌లో 3, జమ్మికుంటలో 2, మంచిర్యాలలో 1, గూడురులో 1, కమలాపురంలో 1, పరకాలలో 1, హన్మకొండ భీమారం లో 1, గణపురంలో 1 బైక్ దొంగిలించారు. ఈ క్రమంలో గణపురం పోలీసు లు, సీసీఎస్ పోలీసులు గాంధీనగర్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి తాళాలు తీసే పద్ధతిని స్వయంగా చూపించారు. ఈ కీతో ఎలాంటి బండివైనా తాళం తీయవచ్చని తెలిపారు. ఇలా అపహరించిన బైక్‌లను అతితక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారని విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ములుగు సీఐ శ్రీనివాసరావు, గణపురం ఎస్సై విజయ్‌కుమార్, క్రైం సీఐ బాబురెడ్డి, ఏఎస్సై రమణారెడ్డి,సీసీఎస్ పోలీసులు పాల్గొన్నారు. -
ఖర్చు చేస్తే ఆదా అవుతుంది
కాస్త జాగ్రత్త పడితే వాహన బీమాలోనూ ఆదా గత మూడేళ్లుగా ప్రీమియం ధరలు చూస్తే.. కారు బీమా ప్రీమియంలు 20 శాతం వరకు, ద్విచక్ర వాహనాలకైతే 15 శాతం వరకూ పెరిగాయి. అందుకే బీమా ప్రీమియం నుంచి కొంతైన ఉపశమనం పొందాలంటే కాసింత అప్రమత్తంగా... తెలివిగా వ్యవహరించాలి. * మనం బీమా కట్టేదే వాహనానికి ఏదైనా జరిగితే క్లెయిమ్ చేయడానికే. ఇందులో మరో మాట లేదు. కాకపోతే క్లెయిమ్ చేసే ముందు కొంత ముందు చూపు అవసరం. అదేంటంటే.. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే సంబంధిత బీమా సంస్థ మరుసటి ఏడాది ప్రీమియంలో ఎంత మొత్తాన్ని తగ్గిస్తుందనేది ముందుగా తెలుసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే.. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కంటే తక్కువగా ఉందనుకోండి. మీరు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది కదా!!. అదీ మ్యాటర్. * మీ కారు కనక ఐదేళ్లకు మించిందనుకోండి... నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ అనే యాడ్ కవర్‌ను తీసుకోవటం మరింత మంచిది. దీంతో క్లెయిమ్ చేసినా కూడా మీ నో క్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. అదెలాగంటే.. మీ పాలసీపై 40 శాతం వరకు ఎన్సీబీ ఉందనుకుందాం. కానీ, మీరు క్లెయిమ్ చేశారనుకోండి. దీంతో వాస్తవానికి మీ ఎన్సీబీ మొత్తం పోవాలి. కానీ, మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉండటంతో మీ దగ్గరున్న 40 శాతం ఎన్సీబీలోంచి 10 శాతం పోయి మీ దగ్గర 30 శాతం ఎన్సీబీ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉంది... పెపైచ్చు క్లెయిమ్ కూడా చేయలేదనుకుందాం. ఇప్పుడేమవుతుందంటే.. మీ దగ్గరున్న ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్సీబీలో మరో 10 శాతం అదనంగా కలుస్తుంది. అంటే అప్పుడు మీ ఎన్సీబీ 50 శాతానికి చేరుతుందన్నమాట. * ఒక్క ముక్కలో చెప్పాలంటే మన దగ్గర ఎంత ఎన్సీబీ ఉంటే ప్రీమియం అంత తగ్గుతుందన్నమాట. అయితే ఎంత తగ్గుతుందనేది మాత్రం ఏడాదిలో ఎన్నిసార్లు వాహనాన్ని క్లెయిమ్ చేశామనేదాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చిన్న చిన్న రిపేర్లు, డ్యామేజీల వంటివి సాధ్యమైనంత వరకు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది. జేబులోంచి కొంత ఖర్చు చేస్తేనే బెటర్. కారు డ్యామేజీ అయితే ముందుగా మీరు చేయాల్సిన పనేంటంటే.. కారు రిపేరుకు ఎంత ఖర్చువతుందో అంచనా వేయాలి. స్థానికంగా ఉండే రిపేరింగ్ సెంటర్లలో చేయించొచ్చేమో చూడండి. దీంతో దాదాపు 20 శాతం వరకు రిపేరింగ్ ఖర్చులు తక్కువయ్యే అవకాశముంది. రూ. 5 వేల బిల్లు అయితే మీరు బేరసారాలు ఆడి కొంతలో కొంతైన తగ్గించుకునే అవకాశముంటుంది. * చాలా వెబ్సైట్ల ద్వారా ఏ బీమా సంస్థ ఎంత ప్రీమియం ఉందో తెలుసుకునే వీలుంది. ఆయా బీమా సంస్థల క్లెయిమ్‌ల ఆధారంగా కంపెనీ కంపెనీకి మధ్య ప్రీమియంలో తేడాలుంటాయి మరి. అందుకే ముందుగా తెలుసుకోవటం మంచిది. ఏడాది బీమా పాలసీలు కాకుండా లాంగ్ టర్మ్ పాలసీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలకు రెండు మూడేళ్ల పాలసీతో పాటూ 24ఇంటు7 రోడ్ అసిస్టెన్స్ సేవలందిస్తున్నాయి కొన్ని కంపెనీలు. సింగిల్ ప్రీమియంలతో పోల్చుకుంటే వీటి ఖర్చు తక్కువగా ఉంటుంది. పెపైచ్చు 20-35 శాతం వరకూ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. మరోవైపు ప్రతి ఏటా పాలసీని రెన్యూవల్ చేయించాలనే టెన్షనూ ఉండదు. * మీరు వాహనాన్ని విక్రయిస్తున్నప్పుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్సీబీ సర్టిఫికెట్‌ను తీసుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్సీబీ జతపడింతో తెలుస్తుంది. వాహనాలకు యాంటీ థెఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవ కాశం ఉంది. - విజయ్‌కుమార్ చీఫ్ మోటార్ టెక్నికల్ ఆఫీసర్, బజాజ్ అలయెంజ్ -
మహిళలు, టూ వీలర్స్‌కు ఎగ్జెంప్షన్ ఎందుకు?
న్యూఢిల్లీ: హస్తినలో జనవరి 1 నుంచి అమలుచేయనున్న 'సరి-బేసి' ట్రాఫిక్ నిబంధనల నుంచి మహిళలు, ద్విచక్ర వాహనదారులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం వివరణ కోరుతూ.. తదుపరి విచారణనను జనవరి 6కు వాయిదా వేసింది. ఢిల్లీలో నెలకొన్న వాయుకాలుష్యాన్ని నియంత్రించడానికి 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల వాహన నిబంధనలను జనవరి 1 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తోంది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం వాహనాలను రోడ్లపైకి అనుమతించాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధనల నుంచి మహిళా డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తారో చెప్పాలంటూ హస్తిన ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ చైనాలోని బీజింగ్ తరహాలో 'సరి-బేసి' పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. -
ఇంటి ముందున్న మూడు బైక్‌లు దగ్ధం
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని ఎల్బీనగర్లో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలిపి ఉంచిన మూడు బైక్‌లు, ఓ సైకిల్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో దగ్ధమయ్యాయి. బిజిగిరి అమర్నాథ్ సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి ఇంటి ఆవరణలో ఉన్న మూడు బైక్‌లు, ఓ సైకిల్‌కు అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా నిప్పంటించారా లేక షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళా సర్పంచ్ మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడ్డ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండే డ్ మండలం మహ్మదాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.,.. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెల్ర గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి(31) తన సోదరుడు అనిల్(24)తో కలిసి మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన రెండు బైకులు పరిగి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడ్డాయి. దీంతో విజయలక్ష్మి, అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
దర్జాగా దోచేస్తున్నారు
- జిల్లాలో జోరందుకున్న హెల్మెట్ల వ్యాపారం - ఇప్పటి వరకు 65 వేలకు పైగా అమ్మకాలు - జిల్లాలో మొత్తం ద్విచక్ర వాహనాలు 2.3 లక్షలు మదనపల్లె: జిల్లాలో వాహనదారులను హెల్మెట్ల వ్యాపారులు దోచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ల వ్యాపారం జోరందుకొంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.30 లక్షల వరకూ ద్విచక్రవాహనాలు ఉన్నట్లు మోటారు వాహనాల శాఖ అధికారుల అంచనా. ద్విచక్ర వాహనదారులకు జూలై ఒకటో తారీఖు నుంచి హెల్మెట్లు తప్పని సరి కావడంతో వాహనదారులు వీటిని కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2.30 లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు, 60 వేలకు పైగా కార్లు ఉన్నాయి. వీరిలో ఇదివరకూ ఏ ఒక్కరో, ఇద్దరో తప్ప హెల్మెట్లు కానీ, సీటు బెల్టులు కానీ కచ్చితంగా వాడుతున్న దాఖలాలు లేవు. అయితే హెల్మెట్ల వాడకం తప్పని సరికాడంతో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 67 వేలకుపైగా హెల్మెట్లను వాహనదారులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక అంచనా. కాగా మదనపల్లె మోటారు వెహికల్ శాఖ పరిధిలోని మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, బి.కొత్తకోట, పీటీఎం, పెద్దమండ్యం, వాల్మీకిపురం, కురబలకోట, రా మసముద్రం, నిమ్మనపల్లె, పుంగనూరు, పెద్దపంజాణి, చౌడేపల్లెతో కలిపి మొత్తం 14 మండలాల పరిధిలో దాదాపుగా 70 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 25 వేల వరకూ కార్లు, జీపులు ఉన్నాయి. కేవలం డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో దాదాపుగా 50 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 15 వేలకుపైగా కార్లు, జీపులు ఉన్నాయి. మదనపల్లెలో 10 వేల హెల్మెట్ల అమ్మకాలు డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో బెంగళూరు రోడ్డు, కదిరిరోడ్డు, సీటీఎం రోడ్డు, అవెన్యూ రోడ్డు, పుంగనూరు రోడ్డు, నీరుగట్టువారిపల్లె, బెంగళూరు బస్టాండు ప్రాంతాలతో పాటు పలువురు ఆటోమొబైల్ షాపులతో కలిపి మొత్తం 23 చోట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. అందుబాటులో లేని హెల్మెట్లు గత నెలతో పోల్చితే ఈ నెలలో కొంత అమ్మకాలు పెరిగాయని, అయితే డిమాం డ్కు తగ్గట్టుగా హెల్మెట్లు అందుబాటులో లేవని వ్యాపారులు అంటున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా తదితర పెద్ద నగరాల నుంచి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వంటి నగరాలకు దిగుమతి చేసుకోవాల్సి ఉందని, అక్కడి నుంచి మన ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉందన్నారు. దోచుకుంటున్న వ్యాపారులు జిల్లావ్యాప్తంగా హెల్మెట్ల విక్రయించే కొందరు వ్యాపారులు వాహనదారులను దోచుకొంటున్నారు. రూ.450 విలువ చేసే ఫుల్ హెల్మెట్ రూ.750కి, రూ.200 విలువ చేసే హాఫ్ హెల్మెట్ రూ.300కి విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఐఎస్ఐ మార్కువైతే ప్రస్తుతం అధికంగా అందుబాటులో లేకపోవడంతో పోలీసుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏదో ఒకటని కొనక తప్పడం లేదు. -
శిరస్త్రాణం.. శిరోధార్యం!
♦ జులై 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి ♦ హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలెన్నో.. శిరస్త్రాణం నిబంధన అమలుకు ఇంకా పది రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారుల్లో ఈ నిబంధనపై ఉన్న అవగాహన ఎంత.. అసలు ఎంతమంది స్వచ్ఛందంగా శిరస్త్రాణం ధరిస్తున్నారు అని ఆరా తీస్తే ప్రతి వంద మందిలో కేవలం ఐదుమంది మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలు నిలుపుతుందని తెలిసినా చాలా మంది హెల్మెట్ ధరించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. కడప అర్బన్ : మనిషి దైనందిన జీవితంలో రోజురోజుకు వేగం పెరుగుతోంది. ప్రజలు తమ అవసరాల రీత్యా కార్లు, ద్విచక్ర వాహనాలను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో హెల్మెట్, సీటు బెల్ట్ లాంటి వాటిని ధరించకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించిన వారు.. అందులోనూ ప్రత్యేకించి హెల్మెట్ వాడని వారే మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన ప్పటికీ హెల్మెట్ ధరించడం శిరస్త్రాణం.. శిరోధార్యం! వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు జులై 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్‌ను వాడాల్సిందే. లేకపోతే జరిమానాలు, శిక్షలు తప్పవు. హెల్మెట్ ధరించడం వల్ల.. హెల్మెట్ పూర్వకాలంలో యుద్ధాలతోపాటు ప్రస్తుత కాలంలో కర్మాగారాలలో అధికారులు, కార్మికులు సైతం తలకు రక్షణగా వాడుతున్నారు. దీనివల్ల ఏ ప్రమాదం సంభవించినప్పటికీ తలకు దెబ్బ తగలకుండా ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకోవచ్చు. సింగరేణి లాంటి బొగ్గు గనుల్లోనూ, ఐఓసీ లాంటి కర్మాగారాలు, సిమెంటు ఫ్యాక్టరీల్లో, విధుల్లో ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్, అగ్నిమాపకశాఖ వారు హెల్మెట్ ధరిస్తూ ఉంటారు. అలాగే మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతోపాటు చట్టాన్ని గౌరవించిన వారవుతారు. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే సెక్షన్ 177 ప్రకారం ఎంవీ యాక్టు వారిపై ప్రయోగించి గతంలో రూ. 100 జరిమాన విధించేవారు. ఆ చట్టంలో మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వం హెల్మెట్ ధరించకపోతే రూ. 500 జరిమాన, మరలా అదే నిబంధన పాటించక పట్టుబడితే కేసులు కూడా నమోదు చేయవచ్చని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కోల్పోయిన ప్రాణాలు - కడప నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. - కడప నగరంలోని తాలూకా కానిస్టేబుల్ మద్దూరు లక్ష్మిరెడ్డి (పీసీ నెం. 1994) మే 5వ తేది రాత్రి విధి నిర్వహణలో భాగంగా మోటారు సైకిల్‌పై వెళుతుండగా మరియాపురం సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. - పబ్బాపురం వంతెన సమీపంలో మార్చి 9న రాంబాబు తన భార్య రాధ మోటారు సైకిల్‌పై వెళుతూ రోడ్డు ప్రక్కన నిలబడి ఉండగా రాయచోటి వైపు నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందారు. - అదేనెల 17వ తేదీ షేక్ అన్వర్‌బాషా (17) అనే యువకుడు ద్విచక్ర వాహనంలో రాజంపేట నుంచి అలంఖాన్‌పల్లెకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆలంఖాన్‌పల్లె వద్ద పాల లారీ ీకొనడంతో మృతి చెందాడు. - ఈనెల 16వ తేదీన రామచంద్రయ్య కాలనీకి చెందిన షేక్ బాషా అలియాస్ మహబూబ్‌పీర్ (45) తన ఇంటి నుంచి టీవీఎస్‌లో వస్తుండగా లగేజీ ఆటో వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. - కడప డీటీసీలో శిక్షణ కోసం తన మోటారు బైక్‌లో బయలుదేరిన మైదుకూరు ఎస్ఐ మోహన్ మూడు నెలల క్రితం ఖాజీపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయన హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వ్యక్తిగత భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరి వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాల్సిందే. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ఎవరు హెల్మెట్ ధరించకపోయినా, సీటు బెల్ట్ ధరించకపోయినా ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమాన విధిస్తాం. రెండవసారి పట్టుబడితే శిక్షార్హులవుతారు. - భక్తవత్సలం, ట్రాఫిక్ డీఎస్పీ, కడప. జులై 1 నుంచి ఖచ్చితంగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాల్సిందే. ఆ నిబంధన పాటించకపోతే పోలీసులు, ఎంవీఐ అధికారులు తనిఖీలు చేసినపుడు అన్ని రికార్డులతోపాటు హెల్మెట్‌ను చూస్తారు. అలా హెల్మెట్ ధరించకపోతే రూ. 500 నుంచి రూ. 1000 జరిమాన విధించే అవకాశముంది. - మల్లెపల్లె బసిరెడ్డి, డీటీసీ, కడప -
రోజూ ఐదు బైక్‌ల చోరీ
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలో ప్రతీరోజు సగటున ఐదు ద్విచక్రవాహనాలు (బైక్‌లు)చోరీకి గురవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ రెండేళ్ల కాలంలో బైక్ చోరీ సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. తూర్పు, పశ్చిమ ఉపనగరాల్లోనే బైక్‌లు అధికంగా చోరీ అవుతున్నట్లు పోలీసు గణాంకాలు తెలుపుతున్నాయి. జుహూ, ఖార్, శాంతాక్రుజ్, బోరివలి, పొవాయి తదితర ధనవంతులుండే ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబంలో కనీసం రెండు లేదా మూడుకుపైనే బైక్లుంటాయి. వారుంటున్న సొసైటీ ఆవరణలో తగినంత స్థలం లేకపోవడంతో అత్యధిక శాతం వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. దీన్ని అలుసుగా తీసుకున్న చిల్లర దొంగలు రాత్రి వేళల్లో వాటిని తస్కరిస్తున్నారు. బైక్‌లతోపాటు అప్పుడప్పుడు కార్లు కూడా చోరీ అవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక్కడ చోరీ చేసిన వాహనాలను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. వాహనాలు ముఖ్యంగా అర్థరాత్రి 2-5 గంటల మధ్య చోరీకి గురైతున్నాయి. 2013లో ముంబై నుంచి 3,807, 2014లో 3,494 ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇలా ఏడు సంవత్సరాల కాలంలో 19,351 బైక్‌లు, 9,575 ఫోర్ వీలర్స్, 3,757 ఇతర వాహనాలు చోరీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇలా చోరీకి గురైన వాటిలో 2013లో 1,203, 2014లో 1,825 వాహనాలను పోలీసులు కనుగొన గలిగారు. చోరీ ఇలా జరుగుతుంది వాహన దొంగలు ఏదైనా వాహనాన్ని తస్కరించాలనుకుంటే దానిపై రెండు, మూడు రోజులు కన్నేసి ఉంచుతారు. అర్థరాత్రి 2-5 గంటల మధ్య పోలీసుల గస్తీ అంతగా ఉండదు. దీన్ని అదనుగా చేసుకుని దొంగలు అక్కడే నకిలీ తాళాలు తయారుచేసి కారు డోరు తెరుస్తారు. ఈ పనంతా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే జరిగిపోతుంది. తరువాత అదే ఆర్టీఓ నంబరుపై వాహనాన్ని ముంబై దాటిస్తారు. నిర్ధేశించిన స్థలానికి చేరవేసి అక్కడ భద్రపరుస్తారు. అందుకు కారు ఖరీదును బట్టి వీరికి రూ.50 వేల నుంచి రూ.లక్షా వరకు దళారులు ముట్టజెపుతారు. ఆ తరువాత నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తారు. -
అక్క, చెల్లెలు అరెస్ట్
పళ్లిపట్టు: కాంచీపురం జిల్లాలో వినూ త్న రీతలో చోరీకి పాల్పడిన అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాం చీపురం జిల్లా ఎస్పీ విజయకుమార్ ఆదేశాల మేరకు చెంగల్పపట్టు డీఎస్పీ కుమార్ నేతృత్వంలో ఓట్టేరి ఇన్స్పెక్టర్ వెంకటాచలం ఆధ్వర్యంలో పోలీసులు చోరీలను అరికట్టేందుకు వీలుగా ప్రత్యేక నిఘా ఉంచి వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఓట్టేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పద రీతిలో వెళుతున్న మహిళలు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వారు పోలీసులకు సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యూయి. ఇందులో ఓట్టేరికి చెందిన అనీష్కుమారి(25), ఆమె చెల్లెలు కలైవాణి ఓట్టేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనా లు,ఇళ్లలో వస్తువులు, సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి నుంచి ద్విచక్ర వాహనాలు, కెమెరాలు, సెల్ఫోన్లు, రెండు సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం పుళల్ మహిళా జైలుకు తరలించారు. -
పందేల జాతర
సాక్షి ప్రతినిధి, ఏలూరు :కాళ్లకు కత్తులతో కోళ్లు కొట్లాడుకుంటున్నాయి. చుట్టూ వేలాదిగా చేరిన జనం కేరింతల కొడుతున్నారు. చేతిలో డబ్బు కట్టలు. పక్కనే పేకాట శిబిరాలు. మరోవైపు గుండాట బోర్డు లు. ఇంకోవైపు టెంట్లలో మద్యం అమ్మకాలు. బిర్యానీ నుంచి కోడి పకోడి వరకూ తినుబండారాల స్టాళ్లు.. వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు.. తిరునాళ్లను తలపించే రీతిలో కోడి పం దేలు సాగుతున్నాయి. జిల్లాలో మూడు రోజులుగా బరితెగించి మరీ పందేలు కడుతున్నారు. బరుల వద్ద ఇతర జూద క్రీడలకూ అంతు లేకుండాపోయింది. వినోదం పేరుతో గ్రామాల్లో అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న జూదాల్లో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి ఉన్నత కుటుంబాలకు చెందినవారు, విద్యావంతులు సైతం సంప్రదాయం పేరుతో పందేల్లో తలమునకలవుతున్నారు. జిల్లాలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా కోడి పందేలు సాగా. పందెం బరులు వేయని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఐ.భీమవరం, భీమవరం ఆశ్రం తోటల్లో ఎప్పటిమాదిరిగానే పందేలు తిరునాళ్లను తలపించాయి. ఈసారి ఆ రెండు ప్రాంతాలను తలదన్నేలా భీమవరం మండలం వెంపలో పందేలు నిర్వహించారు. పెదవేగి మండలం కొప్పాకలోనూ అదే స్థాయిలో పందేలు జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీగా పందేలు వేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లింగపాలెంలోనూ పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. ఇవికాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ 40 నుంచి 50 ప్రాంతాల్లో పందేలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేల బరుల వద్ద లక్షలాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి. రూ.500 మొదలుకుని రూ.50 లక్షల వరకూ పందేలు కాస్తున్నారు. రెండు లక్షలు పైబడి భారీస్థాయిలో జరిగే పందేల సుమారు పదికిపైగా జిల్లాలో జరిగాయి. అక్కడ ఒక్క పందెం విలువే రూ.30 నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. మిగిలినచోట్ల రూ.5 లక్షలు ఆ పైబడి ఉంటోంది. విచ్చలవిడిగా జూదం.. మద్యం.. కోడి పందేలతోపాటు పేకాట, గుండాడ, కోతాట ఇతర జూదక్రీడలు బరుల వద్ద యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేల కంటే ఎక్కువగా ఈ క్రీడల వద్దే జనం ఉంటున్నారు. డబ్బు చెలామణి కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతోంది. కోడి పందేల మొత్తం కంటే ఈ జూదాల దగ్గర జరగే టర్నోవర్ రెట్టింపు మొత్తంలో ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు మద్యం అమ్మకాలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. బరుల వద్ద మినీ బార్లు వెలిశాయి. టెంట్లు వేసి మద్యం దుకాణాల మాదిరిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆ లోపలే బల్లలు వేసి బార్ల మాదిరిగా మద్యం సరఫరా చేస్తున్నారు. ప్రముఖుల సందడి మరోవైపు ఈ పందేలు జరిగే చోట ప్రముఖుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. డెల్టాలో పందేలకు సినీ జనం తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ వంటివారు పందేలకు రావడం గమనార్హం. అలాగే చిన్న సినిమాల హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక మంది మంది బరుల వద్ద కనిపించారు. అన్నింటికీ మించి ఈసారి రాజకీయ నాయకుల హడావుడి కూడా ఎక్కువైంది. ఆయా ప్రాంతవాసులను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. వారు కూడా పందేల్లో పాల్గొన్నారు. పత్తాలేని పోలీసులు జిల్లా అంతటా మూడురోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొన్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూసినపాపాన పోలేదు. పండగకు ముందు రెండు రోజులపాటు హడావుడి చేసినా ఆ తర్వాత ఏ పోలీసు అధికారి నోరు మెదపలేదు. పోలీసులు కనీస విధులు కూడా నిర్వర్తించకపోవడంతో పందెగాళ్లు అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించారు. పందేల గురించి లోకాయుక్త హెచ్చరించినా పోలీసులు తమకు పట్టనట్టే వ్యవహరించారు. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎంత ఉన్నా పూర్తిగా పందేలరాయుళ్లను వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు భారీ ఎత్తున మామూళ్లు ముట్టిన విషయం బహిరంగ రహస్యంగానే ఉంది.