ఇంటి ముందున్న మూడు బైక్‌లు దగ్ధం | Three bikes were burnt in front of the house | Sakshi
Sakshi News home page

ఇంటి ముందున్న మూడు బైక్‌లు దగ్ధం

Published Wed, Dec 30 2015 12:00 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Three bikes were burnt in front of the house

వరంగల్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని ఎల్బీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలిపి ఉంచిన మూడు బైక్‌లు, ఓ సైకిల్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో దగ్ధమయ్యాయి. బిజిగిరి అమర్‌నాథ్ సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి ఇంటి ఆవరణలో ఉన్న మూడు బైక్‌లు, ఓ సైకిల్‌కు అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా నిప్పంటించారా లేక షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement