సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై నిత్యం జరిగే ప్రమాదాల్లో అత్యధికంగా 35 శాతం మృతులు ద్విచక్ర వాహనదారులే కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఎటువంటి సంబంధం లేని పాదచారులు కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు, మృతులపై కేంద్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది.
ఆ నివేదిక ప్రకారం 18.6 శాతం రోడ్డు ప్రమాద మృతులు కార్లు, టాక్సీలు, వాన్లలో ప్రయాణించేవారేనని తేలింది. అలాగే 19.7 శాతం రోడ్డు ప్రమాద మృతులు ట్రక్కుదారులు, 4.9 శాతం బస్సుల్లో ప్రయాణించేవారు చనిపోతున్నారు. 2019లో జాతీయ రహదారులపై ప్రమాదాల్లో 53,872 మంది మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. హైవేలపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్ల డిజైన్లలో మార్పులు చేయడంతో పాటు వేగ నియంత్రణకు సంబంధిత కంట్రోల్ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని నివేదిక తెలిపింది.
వివిధ కేటగిరీల వారీగా జాతీయ రహదారులపై ప్రమాదాల్లో ఏ వాహనదారులు ఎంత శాతం మంది మృతి చెందారో వివరాలిలా ఉన్నాయి..
Comments
Please login to add a commentAdd a comment