ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడ్డ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడ్డ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండే డ్ మండలం మహ్మదాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.,.. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెల్ర గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి(31) తన సోదరుడు అనిల్(24)తో కలిసి మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన రెండు బైకులు పరిగి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడ్డాయి. దీంతో విజయలక్ష్మి, అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.