Vijaya Lakshmi
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కారు దిగనున్న కడియం, కేకే, అల్లోల
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు. ఎప్పుడు చేరేది అతిత్వరలో వెల్లడిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వరంగల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించాక కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. కాగా కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతుండటం, చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తోంది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో తమ కుమార్తెలతో సహా బీఆర్ఎస్ను వీడనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
ఆ విషయంలో చాలా హర్ట్ అవుతాడు
-
ఫతేనగర్ వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ విజయలక్ష్మీ
-
జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి.. కౌన్సిల్ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వాటర్ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్ చేశారు. వివరాల ప్రకారం.. నగరంలో వర్షాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమావేశాలకు కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు నిలిచి సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్‌కాట్ చేయడం ఇదే మొదటిసారి. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగతే అధికారుల పారిపోయారని ఎద్దేవాచేశారు. పిల్లలు చనిపోతున్నారని నిరసన తెలిపితే మాపై కేసులు పెడతారా?. అధికారులు మమ్మల్ని కాదు.. మేయర్‌ను అవమానించారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. అధికారులకు సిగ్గులేదా? అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం.. -
తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి
థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ అదరగొడుతోంది బలగం సినిమా. మార్చి 3న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు రావడంతో పాటు పెద్దపెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కొమురయ్య చెల్లి పోశవ్వ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూనే అందరినీ ఓ కంట కనిపెడుతూ, అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలంటూ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. ఈ పాత్రలో అద్భుతంగా నటించిన విజయలక్ష్మి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'నేను నాటకాలు వేస్తుంటాను. నంది సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా చెప్పేదాన్ని. నేను చేసిన తొలి చిత్రం బలగం. ఇది యదార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంతమంచి పేరు రావడానికి కారణం వేణుగారే. ఈ సినిమా సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. నా భర్త చనిపోయాక నా పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదమది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం, ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు వదలడంతో ఎంతో బాధపడ్డాను. ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నాను' అంటూ ఎమోషనలైంది విజయ లక్ష్మి. -
శుభాల్లో, అశుభాల్లో మేనత్త! అచ్చం ‘బలగం’ సినిమాలో పోచవ్వలాగానే! కరీంనగర్ కోడలు..
ఇప్పుటి సంగతి ఏమోగాని ఒకప్పుడు ప్రతి ఇంట్లో మేనత్తల అజమాయిషీ ఉండేది. శుభాల్లో, అశుభాల్లో మేనత్త వచ్చి దగ్గర ఉండి మంచీ చెడ్డకు నిలిచేది. అనుబంధాల ఆనవాలు చెప్పేది. ‘బలగం’ సినిమా చూసి అందులో మేనత్త పోచవ్వగా నటించిన నటి విజయలక్ష్మిలో అందరూ తమ మేనత్తలను పోల్చుకుంటున్నారు. సురభి ఆర్టిస్టయిన 65 ఏళ్ల విజయలక్ష్మికి ఇదే తొలి సినిమా. ఇంతకాలం గ్రాంథిక సంభాషణలు మాత్రమే పలికిన ఆమె పోచవ్వగా తెలంగాణ నుడికారాన్ని మెరిపించారు. ఆమె గొప్ప హరికథా కళాకారిణి కూడా. విజయలక్ష్మి పరిచయం. ‘తల వెంట్రుకంత అదృష్టమైనా తల చూపాలి కదా’ అన్నారు సురభి విజయలక్ష్మి. 65 ఏళ్లకు ఆమెకు అదృష్టం తల చూపిందనే అనుకోవాలి. సురభి ఆర్టిస్టుగా స్టేజ్ మీద ఎంత పేరున్నా, భాగవత కళాకారిణిగా ఎంత గుర్తింపున్నా ఇప్పుడు ‘బలగం’ సినిమాలో పోచవ్వగా చేసిన పాత్రే ఆమెకు ఎక్కువ పేరు, గుర్తింపు, ఉనికి ఇచ్చింది. పల్లెటూరి పెద్ద వయసు స్త్రీల విసురు, కసురు, మాట విరుపు, ఆర్ద్రత, అన్నింటినీ పోచవ్వ పాత్రలో రక్తి కట్టించడమే కారణం. ఆమె ఉద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ‘మా సురభి పరివారమంతా చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా రంగం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇదంతా చాలా కొత్తగా ఉంది’ అన్నారామె. హైదరాబాద్ చందా నగర్‌లోని సురభి కాలనీలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఒక రకంగా రంగస్థలంపైనే పుట్టారు. ఆమె తల్లి ప్రఖ్యాత నటి కమలాదేవి. తండ్రి నాగభూషణం. అయితే ఆరుగురు అక్కచెల్లెళ్లలో విజయలక్ష్మి మాత్రమే నటిగా స్టేజ్ మీద కొనసాగారు. ‘మూడేళ్ల వయసు నుంచే నాటకాల్లో పాత్రలు చేశాను. కృష్ణుడు, లోహితాస్యుడు... వయసు వచ్చాక దేవకి, సావిత్రి, అనసూయ, కాంతామతి... ఈ పాత్రలన్నీ పోషించేదాన్ని. సురభిలో ఏ పాత్రైనా ఎవరైనా చేయాలని రూలు. అందువల్ల మగవేషాలు కూడా వేశాను. కృష్ణుడిగా, బాలనాగమ్మలో మాయల పకీరుగా నటించాను’ అన్నారు విజయలక్ష్మి. కరీంనగర్ కోడలు యుక్త వయసు రాగానే కరీంనగర్‌కు చెందిన బంధువుల కుర్రాడు కేశవరావుతో వివాహం జరిగింది. అతను కూడా నటుడు. భార్యాభర్తలిద్దరూ కలిసి నాటక సమాజం నడిపారు. అయితే పిల్లల చదువుల కోసం సురభీ నటీనటులు వేరే చోట్లకు వెళ్లిపోతుండటంతో అందరూ కలిసి సంచారం చేసే పరిస్థితి పోయింది. ‘నేను చిన్నప్పటి నుంచి బాగా పాడేదాన్ని. హరికథలంటే ఆసక్తి ఉండేది. హరికథ నేర్చుకుంటే నేనొక్కదాన్నే ప్రదర్శన ఇవ్వొచ్చు. అలా హరికథా కళాకారిణిగా మారాను. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ... ఈ నాలుగు జిల్లాల్లో నేను తిరగని పల్లెటూరు లేదు. మహాభారతాన్ని 18 రోజులు ఒకే ఊరిలో ఉండి చెప్పేదాన్ని. నవరాత్రులొస్తే రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకూ నా హరికథ ఉండేది.’ అంటారామె. తెలంగాణ పలుకుబడి ‘బలగం సినిమాలో పోచవ్వ పాత్ర కోసం ఆర్టిస్టులను వెతుక్కుంటూ దర్శకుడు వేణు సురభి కాలనీకి వచ్చారు. అందరూ ఆడిషన్స్ ఇస్తుంటే నేనూ ఇచ్చాను. ఆశ్చర్యంగా నన్నే సెలెక్ట్ చేశారు. ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలలో నటించినా నాకంటూ అసలు డైలాగు లేదు. ఇదే తగిన నిడివి ఉన్న మొదటి సినిమా. కాని తెలంగాణ మాండలికం. నేనేమో జీవితమంతా రంగస్థలం మీద, హరికథల్లోనూ గ్రాంథికం మాట్లాడతాను. రోజువారి జీవితంలో కూడా నా భాష గ్రాంథికంలా ఉంటుంది. కాని హరికథలు చెప్పడానికి తెలంగాణ పల్లెలకు వెళ్లినప్పుడు అక్కడి స్త్రీలను గమనించిన అనుభవం నాకు ఉపయోగపడింది. డైలాగులను ఆ స్త్రీలు చెప్పినట్టుగా చెప్పాను. నేను నిజంగా అక్కడి ప్రాంత స్త్రీ అని, ఊరిలోని స్త్రీ చేత ఆ పాత్ర చేయించారని అనుకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు’ అని నవ్వారామె. సినిమాలో మేనత్తగా ఆమె ముఖ్యపాత్రల మధ్య వైషమ్యాలు తొలిగేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు. అందువల్ల చాలామంది విజయలక్ష్మిలో తమ మేనత్తను వెతుక్కున్నారు. ‘మన సమాజంలో మేనత్తకు ఎప్పటికీ ఇంటి ఆడబిడ్డ స్థానం ఉంటుంది. సోదరులు ఆమెను గౌరవించాల్సిందే. వదిన అయినా, మరదలు అయినా ఇంటి ఆడపడుచుకు తల వొంచాల్సిందే. ఆ అధికారం నా పాత్రలో చూపించాను’ అన్నారు విజయలక్ష్మి. సినిమా నటీమణుల్లో శాంతకుమారిని ఇష్టపడే విజయలక్ష్మి ఒక రకంగా కొత్త ప్రయాణం మొదలెట్టారు. ఆమె ఇద్దరు కొడుకులు, కూతురు జీవితాల్లో స్థిరపడ్డారు కనుక నటనకు ఎక్కువ సమయం ఇవ్వాలనుకుంటున్నారామె. పోచవ్వకు ఆల్ ది బెస్ట్. చదవండి: బంగారంలాంటి ఆలోచన -
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్‌తోపాటు మ్యూజిక్‌ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్‌తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్‌కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్‌నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్‌కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్‌తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్‌టీఏ – వాకా మంజులారెడ్డి. -
ప్రేమ కోసం ప్రేమగా
ధనం వృద్ధి ΄పొందటానికి కొంత సమయం పడుతుంది. విత్తనాన్ని భూమిలో నాటితే ఫలం చేతికి అందటానికి సమయం పడుతుంది, కానీ క్షణంలో ఫలితాన్ని అందజేసేది ప్రేమ ఒక్కటే. ప్రేమతో కూడిన ఒక్క మాట, ఒక చర్య అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రేమకు వయసుతో పనిలేదు. రక్తసంబంధం ఉండాలని నియమం లేదు. కుల మతాల ప్రసక్తే లేదు.మరో గొప్ప విషయం ఏమిటీ అంటే ఇచ్చేవారికీ, పుచ్చుకునే వారికీ సంతోషం కలిగించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. ఒక్కసారి ప్రేమ గొప్పతనం అర్థం అయ్యాక, ప్రేమను పంచటంలోని మాధుర్యం అనుభవం అయిన తరువాత కఠినంగా కఠోరంగా ఉండటం సాధ్యం కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు కావాలని కఠినంగా ఉండాలని ప్రయత్నించినా రాతి అడుగున దాగిన నీటి బుగ్గలాగా పెల్లుబికి వస్తుంది ప్రేమ. మట్టితో కూడిన చెరువు నీటికుండలో చిన్న పటిక ముక్క వేస్తే మట్టి విడిపో యి స్వచ్ఛమైన నీరు తయారవుతుంది. అనేక సమస్యలు, ఒత్తిడులతో మనశ్శాంతికి దూరం అయిపో తున్న నేటి సమాజంలో శాంతిని చేకూర్చగల ఏకైక మార్గం ప్రేమ. కేవలం యువతీ యువకుల మధ్య కలిగేదే ప్రేమ అనే భ్రమ నుంచి బయటపడితే ప్రతిజీవి తోటి వారి అందరిపట్ల పశుపక్ష్యాదుల పట్ల, ప్రకృతి పట్ల చూపించేది అంతా ప్రేమే. ఒక కర్మాగారం చాలా చిక్కు సమస్యలలో మునిగి పో యింది. కార్మికుల మధ్య తగులాటలు, శత్రుత్వాలు. అప్పటివరకు ఉన్న అధికారి ఆ ఒత్తిడిని తట్టుకోలేక పదవికి రాజీనామా చేసి వెళ్లిపో యాడు. అతని స్థానంలో మరొక అధికారిని నియమించారు. కొద్దికాలంలోనే కర్మాగారం పరిస్థితి చక్కబడింది. మునుపటి శత్రుత్వం నిండిన వాతావరణం మారిపో యి చక్కని వాతావరణం ఏర్పడింది. పైవారు కొత్త అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి మార్పు కోసం ఆ కొత్త అధికారి ఉపయోగించిన ఏకైక ఆయుధం ప్రేమ. ఉదయం రాగానే అందరినీ ఒక్కొక్కరినీ పిలిచి ప్రేమగా పలకరించేవాడు. వారి యోగక్షేమాలను విచారించేవాడు. మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి నేను ఉన్నాను. మనందరం ఒక కుటుంబం అని ప్రేమగా మాట్లాడేవాడు. ఆ చిన్న పని వల్ల ఆయన అందరికీ ఆత్మీయుడిగా మారిపో యాడు.ఆయన సంతోషం కోసం అందరూ గొడవలు మానేసి పరస్పరం స్నేహంగా ఉండటంప్రా రంభించారు. మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ సమాజంలోఅన్నీ వుండి కూడా కాస్తంత ప్రేమ కోసం అలమటించే వారు ఎందరో ఉన్నారు. అయిన వారందరూ దూర్రప్రాం తాలకు తరలిపో గా ఒంటరితనంతో బాధపడుతూ కాస్తంత ఆప్యాయత కోసం, తపించి పో యే వారికి ఊరట కలిగేలా మనకు ఉన్న సమయంలో కొద్ది సమయం ఇటువంటి వారికోసం కేటాయించి ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడితే వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. జీవితం పట్ల ఆసక్తి నశించిపో యి జీవించే వారికి జీవితం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు, ప్రేమను చవిచూసిన వారు ఇతరులకు ప్రేమను పంచగలుగుతారు. మన దైనందిన జీవితంలో మనకు సేవలందించే వారిపట్ల ప్రేమతో నాలుగు మంచి మాటలు మాట్లాడితే, వారంతా మనకు మరింత దగ్గరవుతారు. వారితోపాటు మన జీవితం కూడా ఆనందమయంగా మారుతుంది. – పొత్తూరి విజయలక్ష్మి -
భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మల్లేష్ తెలిపిన మేరకు.. శ్రీనివాసులు, టి.విజయలక్ష్మి(35)లు గోల్నాక తిరుమలనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో కూడా టైలర్ పని చేస్తుంటాడు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) ఇందులో భాగంగా శనివారం భార్య కోసం జాకెట్‌ను కుట్టాడు. తది నచ్చలేదని భార్య చెప్పింది. దీంతో శ్రీనివాస్ బ్లౌజ్ కుట్లు విప్పి నువ్వే నచ్చినట్టు కుట్టుకో అని చెప్పాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయలక్ష్మి బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. యధావిధిగా శ్రీనివాసులు తన పనిలో నిమగ్నమయ్యాడు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు మధ్యాహ్నం వచ్చి తలుపు తట్టగా తల్లి స్పందించలేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అద్దె చెల్లించని నటి.. అర్ధరాత్రి నడిరోడ్డుపైకి పడేశారు
సాక్షి, చెన్నై: నటి విజయలక్ష్మిని సినిమా కష్టాలు వీడటం లేదు. అద్దె చెల్లించలేదంటూ ప్లాట్ మేనేజర్ ఆమె సామాన్లు బయట పడేశాడు. రోడ్డున పడ్డ ఆమె అర్ధరాత్రి వేళ చేసిన హంగామాతో చివరకు పోలీసులు ప్రత్యామ్నాయం కల్పించారు. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్ తనను మోసం చేశారంటూ గతంలో నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మహత్యాయత్నాలు చేయడం వంటి పరిణామాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సీమాన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో నామ్ తమిళర్ కార్యకర్తలు పలుమార్లు ఆమెకు బెదిరింపులు కూడా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అంటూ సినిమా కష్టాలు విజయలక్ష్మిని వీడటం లేదు. చదవండి: (కారులో నగ్నంగా వీడియో తీసి వేధిస్తున్నాడు!) సామాన్లు బయట పడేశారు! టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్మెంట్లో విజయలక్ష్మి, ఆమె సోదరి ఉన్నారు. ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం రాత్రి డిశ్చార్జ్ కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు షాక్ తప్పలేదు. తమ ప్లాట్‌లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్‌లో రాజకీయ నేత హరినాడర్ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. కాసేపు తన దైన శైలిలో ఆమె హంగామా సృష్టించారు. తామేమీ ఆమె సామాన్లు బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, తమ ప్లాట్ సిబ్బంది శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేనేజర్ విఘ్నేశ్వరన్ పేర్కొన్నారు. హరినాడర్‌కు ఈ ప్లాట్‌కు సంబంధం లేదని, ఆమెను జావెద్ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఈ వ్యవహారం ముదరడంతో పాటు సీమాన్ నువ్వయినా ఆదుకో అంటూ విజయలక్ష్మి కన్నీటి పర్యంతం కావడంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. తేనాంపేట పోలీసులు విచారించి విజయలక్ష్మికి ప్రత్యామ్నాయం కల్పించారు. అయితే ఇది తాత్కాలికం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సీమాన్‌ను నోటికి వచ్చినట్టు దుమ్మెత్తి పోసిన విజయలక్ష్మి తాజాగా తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. -
నకిలీ ఐఏఎస్ అరెస్ట్
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): నకిలీ ఐఏఎస్ అధికారి అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న పెద్దాడ విజయలక్ష్మి అనే ఓ కిలాడీ లేడి కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్‌నంటూ వసూళ్లు చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం విలేకరులకు వెల్లడించారు. రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావుగా నమ్మించి... గుంటూరు జిల్లా మంగళగిరిలోని మన్యం వారి వీధికి చెందిన పెద్దాడ విజయలక్ష్మి... పద్మభూషణ్ కేఎల్ రావు కుమార్తె, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.సుజాతరావు పేరుతో పలువురిని నమ్మించి కేఎల్ రావు విగ్రహ ఏర్పాటు పేరుతో వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఎలా చిక్కిందంటే.. హనుమాన్‌జంక్షన్‌లోని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావుకు చెందిన సీతామహాలక్ష్మి నర్సింగ్ హోంకు ఈ నెల 8వ తేదీన ఓ కారులో వచ్చిన విజయలక్ష్మి తాను ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్కరణల కమిటీ చైర్మన్ సుజాతరావునని, తాను తిరుపతి వెళుతున్నానని, పూజల కోసం రూ.3,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానించిన రామచంద్రరావు తనయుడు రవిశంకర్ నేరుగా కె.సుజాతరావుకు ఫోన్ చేయగా, తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ఆమె చెప్పారు. నకిలీ అధికారి ఫోటోలు తీసేందుకు యత్నించటంతో వెంటనే పరారయ్యారు. ఆ తర్వాత ఎస్పీ రవీంద్రబాబుకు కె.సుజాతరావు ఫోన్ చేసి నకిలీ అధికారిని పట్టుకోవాలని కోరారు. రవిశంకర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి ఆమెను విజయవాడలో పట్టుకున్నారు. టీడీపీతో కిలాడీ లేడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో దిగిన ఫోటో ఆమె వద్ద పోలీసులకు లభించింది. -
కడపలో విజయలక్ష్మిగారిల్లు...
శరన్నవరాత్రులకు చాలామంది ఇళ్లలో అమ్మవార్లతో పాటు బొమ్మలు కూడా కొలువు తీరడం మామూలే. ఆ ‘బొమ్మల సభ’లోకి చుట్టుపక్కలవాళ్లకు, చుట్టాలకూ సాదర ఆహ్వానం ఉంటుంది. దేవుళ్లు, రాక్షసులు, వాగ్గేయకారులు, మహానాయకులు.. ఎందరెందరో సభలో కొలువై కనిపిస్తారు. జ్ఞానకాంతులను విరజిమ్ముతూ, జీవన వేదాలను సందేశపరిచే ఇలాంటి బొమ్మల కొలువులలో కడపలోని విజయలక్ష్మిగారింటి కొలువు గురించి మరీ మరీ చెప్పుకోవాలి. వీలు చేసుకుని చూసి రావాలి. కడప జిల్లా కడప పట్టణంలోని ప్రకాష్‌నగర్ క్లాసిక్ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు విజయలక్ష్మి. ఈ ఏడాది శరన్నవరాత్రులకు ఆమె తన ఇంట్లో తొమ్మిది మెట్ల మీద దేవతల బొమ్మల్ని కొలువుదీర్చారు. వాగ్గేయకారులనూ గళం విప్పించి కూర్చోబెట్టారు. ఒక మూల ‘వివాహ భోజనంబు’ అంటూ ఘటోత్కచుడు లడ్లు తింటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఏడుకొండలవాడు, గోశాల.. ఒకటేమిటి, ఒకరేమిటి! అనేక ఘట్టాలను, ఘటికులను సృష్టికి ప్రతి సృష్టి చేశారు విజయలక్ష్మి కృష్ణయ్యర్, ఆమె భర్త చంద్రశేఖరరావు. దసరా పండుగ అంటే వీరికి బొమ్మల ప్రతిష్ఠే. విజయలక్ష్మి ఎం.కామ్ చదివారు. ఇద్దరూ చరిత్రకారులు. పదకొండేళ్లుగా ఇంట్లో అందమైన బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ‘‘చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ బొమ్మల కొలువు పెట్టేవారు. వివాహమైన కొన్ని సంవత్సరాల తరవాత కడపలో మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలనే ఆలోచన కలిగింది. వెంటనే బొమ్మలు సేకరించడం ప్రారంభించాను. కంచి, చెన్నై, మధురై ప్రాంతాల నుంచి చాలా బొమ్మలు తెప్పించాను’’ అంటూ తాను సేకరించిన బొమ్మల గురించి చెప్పారు విజయలక్ష్మి. యాత్రాస్థలాలకు వెళ్లినప్పుడు అక్కడ తన మనసుకి నచ్చిన బొమ్మలు తెచ్చుకోవటంతో పాటు.. బంధువులు, స్నేహితులు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారితో కూడా బొమ్మలు తెప్పించుకునేవారు. అలా చాలా బొమ్మలు సమకూర్చుకోగలిగారు విజయలక్ష్మి దంపతులు. ‘‘బొమ్మల కొలువుకి అన్నీ మట్టితో చేసిన బొమ్మలే కొంటాను. ప్లాస్టిక్‌వి, ఫైబర్‌వి నాకు ఇష్టం లేదు’’ అని చెప్పారు విజయలక్ష్మి.విజయలక్ష్మి ఐదు వరుసలతో ప్రారంభించిన ఈ బొమ్మల కొలువు ఇప్పుడు తొమ్మిది వరుసలకు చేరింది. అరుణాచల గిరి ప్రదక్షిణ, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యభగవానుడు, రావణ దర్బారు, ఆంజనేయస్వామి తోక మీద కూర్చోవడం, స్తంభం పగల గొట్టుకుని వచ్చిన నరసింహావతారం, కామాక్షి వ్రతం చేసే మహిళలు, సత్యనారాయణ వ్రతం, పెళ్లి తంతుతో కూడిన బొమ్మలు, కృష్ణుడు గోపికలు, బృందావనం, గుహుడు... ఇలా రకరకాల బొమ్మలను కొని అమర్చారు విజయలక్ష్మి. ‘‘బొమ్మల కొలువు కేవలం కాలక్షేపం కోసం కాదు, ఇతరులకు విజ్ఞానాన్ని పంచడం కోసం కూడా. మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ ఈ బొమ్మలకు సంబంధించిన కథలు చెబుతాం. పిల్లలు ఆసక్తి చూపుతుండటంతో మాకు మరింత ఉత్సాహంగా ఉంటోంది. భావితరాలకు నాకు తోచినది చెప్పాలనేది కూడా నా ఆకాంక్ష’’ అన్నారు విజయలక్ష్మి. ‘‘ఈ పది రోజులు మా అపార్ట్మెంట్ అంతా సందడిసందడిగా ఉంటుంది. పిల్లలే కాకుండా పెద్ద వాళ్లు కూడా వస్తారు. ఉదయాన్నే ప్రసాదం చేసి ఇంటికి వచ్చినవారికి పెడతాను. సాయంత్రం వాయనాలు ఇస్తాను’’ అని ఆమె తెలిపారు. బొమ్మలను అందంగా అమర్చడం చాలా కష్టంతో కూడిన పని. అయితే అందరూ వచ్చి ప్రశంసిస్తూంటే కష్టం మరచిపోతామంటారు విజయలక్ష్మి. ‘‘పది రోజులు పూర్తయ్యాక బొమ్మలను తీసేటప్పుడు మనసుకి కష్టంగా ఉంటుంది. కాని తప్పదు కదా, బొమ్మలను తీసి ముందుగా పేపర్లో చుట్టి, ఆ పైన గడ్డితో చుట్టి, వాటిని అట్టపెట్టెలలో భద్రపరుస్తాం’’ అని ఆమె చెప్పారు. ‘మరపొచ్చి’ తప్పనిసరి తమిళనాడు సంప్రదాయం ప్రకారం అతిథులు ఒక కొత్త బొమ్మ తెచ్చి, బొమ్మల కొలువు పెట్టిన వారికి ఇస్తారు. అలా ఇంట్లో బొమ్మల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇక్కడ అటువంటి సంప్రదాయం లేదు. అన్నీ నేను కొన్న బొమ్మలే. అరేంజ్మెంట్ ప్రతి సంవత్సరం మారుస్తాను. ‘మరపాచ్చి’ అని చెక్క బొమ్మలు ఉంటాయి. అవి బొమ్మల కొలువులో తప్పనిసరి. ఈ బొమ్మలను పది రోజులు ఉంచి పదకొండో నాడు తీసేస్తాం. నవమి రోజున బొమ్మలను పడుకోబెడతాం. విజయదశమి రోజున నిలబెట్టి, ఆ మరుసటి రోజున తీసేస్తాం. బొమ్మల కొలువు తత్త్వగుణానికి ప్రతీక.– విజయలక్ష్మి – వైజయంతి పురాణపండ -
గడ్డినీ తినేశారు..
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాల చిట్టాలో పశువులు తినే గడ్డీ చేరిపోయింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో ఆయన కుమార్తె కాజేసిన చిల్లర వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోడెల శివప్రసాద్ కుమార్తెకు ఔషధాల తయారీ కంపెనీతోపాటు సాయికృప అనే ఓ సంస్థ ఉంది. కరవు కాలంలో పశువులకు సైలేజీ (మాగుడు) గడ్డి పంపిణీ చేయడం ఈ కంపెనీ ఉద్దేశాలలో ఒకటి. పచ్చి గడ్డిని కోసి శుద్ధి చేసి కార్బోహైడ్రేట్లను సేంద్రియ ఆమ్లాలుగా మార్పు చేసి పోషక విలువలకు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మేతగా ఉపయోగిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ సంస్థ సైలేజీ గడ్డి పంపిణీకి పశు సంవర్థక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల తదితర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలకు గడ్డి సరఫరా చేసే బాధ్యత స్వీకరించి నిధులు కాజేసేందుకు పథక రచన చేసింది. భారీ ఇండెంట్‌తో ఖజానాకు చిల్లు నిబంధల ప్రకారం ఒక్కో గ్రామంలో 5 ఎకరాల్లో సైలేజీ గడ్డి పెంపకానికి తొలుత అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత ఈ నిబంధనను మార్చేస్తూ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ గడ్డి పెంపకానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు పశు సంవర్థక శాఖ ఎకరానికి రూ.10 వేలు కౌలు ఇస్తుంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కూడా రూ.11 నుంచి 12 వేల వరకు కరవు పనుల కింద ఇచ్చేది. పంపిణీ కంపెనీలు సైలేజీ యంత్రం ద్వారా 50 కిలోల నుంచి గరిష్టంగా 400 కిలోల వరకు గాలి చొరబడడానికి వీలు లేకుండా గడ్డిని చుట్ట చుట్టి మోపు (బేల్స్)గా తయారు చేస్తాయి. ఈ గడ్డికి కిలో రూ.6.80 చొప్పున (రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కలుపుకుంటే కేజీ రూ.9 నుంచి రూ.11 వరకు) ప్రభుత్వం పశు సంవర్థక శాఖతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు ఇస్తుంది. ఇందులో లబ్ధిదారుడు భరించాల్సింది కిలో గడ్డికి రూ.2 మాత్రమే. ఈ నేపథ్యంలో అప్పట్లో గుంటూరు జిల్లా జేడీ రజనీ కుమార్, డైరెక్టర్ సోమశేఖర రావు సత్తెనపల్లి నియోజకవర్గానికి 200 టన్నులతో ఇండెంట్ ప్రారంభించి 500, 1000, 1500 టన్నులకు పెంచి కోడెల కుమార్తె కంపెనీ సాయికృపకు ఇచ్చారు. ఒక్క 2017–18లోనే ఈ సంస్థ 20 వేల టన్నుల గడ్డిని రైతులకు పంపిణీ చేసినట్టు లెక్కలు చూపి కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది. తమకింకా 2,800 టన్నులకు బిల్లులు రావాల్సి ఉందని పశు సంవర్థక శాఖకు లేఖ రాయడం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడంతో విషయం బయటకు పొక్కింది. లబ్ధిదారు నుంచి కిలో గడ్డికి రూ.2 చొప్పున వసూలు చేయాల్సిన మొత్తాన్ని కోడెల ఆయా గ్రామాల్లోని అనుచరులతో కట్టించి.. ఆ గడ్డి రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కూడా వారే చేసినట్లు రాతకోతలు పూర్తి చేసే వారని సమాచారం. -
కోడెల బండారం బట్టబయలు
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దౌర్జన్యాలను ప్రశ్నిస్తే దాడులే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల శివరాం, విజయలక్ష్మి చెలరేగిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అప్పట్లో రాజ్యాంగబద్ధమైన పదవిలో కోడెల శివప్రసాదరావు తన కుమారుడు, కుమార్తెకు సంపూర్ణంగా సహకరించారు. వారి ఇలాకాలో ల్యాండ్ కన్వర్షన్ జరగాలన్నా, అపార్టుమెంట్ నిర్మాణాలకు అనుమతులు రావాలన్నా కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్) చెల్లించాల్సిందే. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకూ ఎవరినీ వదల్లేదు. దౌర్జన్యాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగేవారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి, బాధితులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసేవారు. కోడెల కుటుంబంపై విచారణకు ‘సిట్’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల కుటుంబం వల్ల నష్టపోయిన వారంతా ధైర్యంగా ముందుకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పుతున్నారు. నేరుగా పోలీసు స్టేషన్లకు వెళ్లి, కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేటలో కోడెల కుమారుడు, కుమార్తెలపై దాదాపు 10 కేసులు నమోదు కావడం గమనార్హం. కోడెల కుటుంబం చేసిన అన్యాయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడితే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని బాధితులు చెబుతున్నారు. కోడెల కుటుంబంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. రంజీ క్రికెటర్ నుంచి రూ.15 లక్షలు వసూలు నరసరావుపేట టౌన్: స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షల వసూలు చేసిన కోడెల శివరాం ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని ఆంధ్ర రంజీ జట్టు క్రీడాకారుడు బుడుమూరు నాగరాజు శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ రామవర్మకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి బుడుమూరు నాగరాజు ఆంధ్ర రంజీ జట్టు తరఫున ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరాం పరిచయమయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఏఎల్పీ ఉద్యోగం ఇప్పిస్తానని శివరాం నమ్మబలికాడు. దాంతో నాగరాజు అతడికి 2018 ఫిబ్రవరి 27న రూ.15 లక్షలు సమర్పించుకున్నాడు. నాగరాజు నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక ధ్రువపత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌కు వెళ్లమని శివరాం చెపాడు. శివరాం చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్‌కు వెళ్లాడు. అక్కడ శివరాంకు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేప్పుడు నీకు కబురు చేస్తామని చెప్పాడు. దీంతో నాగరాజు వెనక్కి వచ్చేశాడు. కోడెల కుటుంబంపై ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసులు చూసి తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2వ తేదీన నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అక్కడ నాగరాజుపై కోడెల అనుచరులు దాడి చేశారు. బలవంతంగా బాండ్ పేపరు లాక్కొని చించేశారు. తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు చెప్పడంతో శుక్రవారం డబ్బులు తిరిగి ఇస్తానని అతడిని నరసరావుపేటకు రప్పించారు. గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని నాగరాజుకు చెప్పారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నాగరాజు చివరకు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీని కలిసి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. శివప్రసాదరావు, శివరాంపై కేసు నమోదు బాధితుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాంలపై చీటింగ్, ఫోర్జరీ డాక్యుమెంట్ తయారీ, సెక్షన్ 420, 468, 472, 477, 387, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. -
కోడెల కుమార్తెపై మరో కేసు
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది. నరసరావుపేటలో ఓ లేఔట్ అనుమతి కోసం రూ. 15 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారని బాధితుడు, రియల ఎస్టేట్ వ్యాపారి కోటిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. మొదటగా రూ. 10 లక్షలకు సెటిల్మెంట్ అయిందని, మళ్లీ ఇప్పుడు మిగతా ఐదు లక్షలు కూడా ఇవ్వాలని విజయలక్ష్మీ బెదిరిస్తున్నారని కోటిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా విజయలక్ష్మీపై గతంలో కూడా ఒక కేసు నమోదైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. (చదవండి : కోడెల ట్యాక్స్ వెనక్కి ఇప్పించండి) -
కోడెల కుమార్తెపై ఫిర్యాదు
-
కోడెల కుమార్తెపై కేసు
నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం సాగించిన అరాచక పర్వం మరొకటి వెలుగు చూసింది. సోదరుడిని మించిన సోదరిగా కోడెల కుమార్తె అవినీతి వ్యవహారం బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడింది. చదవండి: (కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు) రెండేళ్ల కిందట ఆమె ఆంతరంగికుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు. ముందుగానే సృష్టించిన నకిలీ పత్రాలను చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, మరోమారు భూమి వద్దకు వస్తే హతమారుస్తామని బెదిరించారు. విజయలక్ష్మి వద్దకు వెళ్లి ముడుపులు (కే ట్యాక్స్) చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని, లేకుంటే పొలానికి ఫెన్సింగ్ వేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమెను పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి, ఆమె భర్త వెళ్లగా రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని, లేకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్ మహ్మద్ షఫీ తెలిపారు. -
అన్నా.. అందుకే వెళ్లిపోతున్నా...
‘అన్నా.. నేను ఇక టీచర్‌ను కాలేను. ఈ ప్రభుత్వానికి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేనట్లుంది. మళ్లీ నోటిఫికేషన్ విడుదలలోనూ జాప్యం జరుగుతుందని పేపర్లు, టీవీల్లో చూశాను. ఇక నేను ఈ ప్రపంచంలో ఉండలేను. నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి’ – బుధవారం కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న విజయలక్ష్మి తన అన్నతో చెప్పిన చివరి మాటలివి.. టీచర్ కావాలన్నది ఆమె కల. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో.. తన చిరకాల స్వప్నం సాకారం కానుందని సంబరపడింది. మొక్కవోని స్థైర్యంతో రేయింబవళ్లు కష్టపడి చదివింది. ఓ పక్క కోచింగ్ కోసం అమ్మ.. అన్న.. భర్త.. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఉద్యోగం సాధించగలనన్న ఆత్మవిశ్వాసంతో ఆమె చదువును కొనసాగించింది. అయితే ప్రభుత్వం ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైంది. తిరిగి అక్టోబర్ 10న నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం.. మళ్లీ మొండిచేయి చూపడంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక ఎప్పటికీ తన కల నెరవేరదేమోనన్న ఆందోళనతో అన్నకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కర్నూలు /దేవనకొండ : కోడుమూరు మండలం వలుకూరుకు చెంది న చంద్రప్ప, లక్ష్మీదేవి కుమార్తె విజయలక్ష్మి. పదో తరగతి వరకు కోడుమూరు జెడ్పీ హెచ్ఎస్, ఇంటర్ కర్నూలు కేవీఆర్‌లో పూర్తి చేసింది. ఇంకా చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినకుండా పెళ్లి చేశారు. 2008లో దేవనకొండ మండలం కరివేములకు చెందిన ఆటో డ్రైవర్ గిడ్డయ్యతో వివాహం జరిపించారు. వారికి తరుణ్‌తేజ, ప్రహాసిని సంతానం. దేవనకొండ మండలంలో పోస్టుమాస్టర్‌గా పనిచేసే విజయలక్ష్మి తండ్రి చంద్రప్ప గతేడాది గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, అన్న ఓబులేష్ శారదానగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. టీచర్ కావాలన్నది విజయలక్ష్మి కల. వివాహం చేయడంతో తన కల నెరవేరదేమోనని బెంగపడింది. అయితే.. భర్త సహకారంతో కర్నూలు లక్ష్మీ కళాశాలలో టీటీసీ పూర్తిచేసింది. ఏడేళ్ల నుంచి డీఎస్సీ కోచింగ్. టీటీసీ పూర్తవగానే విజయలక్ష్మి డీఎస్సీ కోచింగ్ కోసం కర్నూలులోని తల్లి, అన్న వద్దకు చేరింది. 2011 నుంచే ఓ కోచింగ్ సెంటర్లో టెట్, డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంది. 2012లో జరిగిన టెట్ కమ్ టీఆర్టీలో తక్కువ మార్కులు రావడంతో మళ్లీ గట్టిగా పోరాడాలని నిర్ణయం తీసుకుంది. 2014లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినా అప్పుడు పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. వచ్చే డీఎస్సీలో కచ్చితంగా ఉద్యోగం సాధించాలని 2014 నుంచి రేయింబవళ్లు చదివేది. 2017 డిసెంబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎంతో సంతోషపడింది. అయితే నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రూ.15 వేలు ఖర్చు చేసి డీఎస్సీ కోచింగ్ కూడా తీసుకుంది. అయితే.. నోటిఫికేషన్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేసింది. ముచ్చటగా మూడోసారి అక్టోబర్ 10న నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన ప్రభుత్వం.. దానిని విడుదల చేయకపోవడంతో విజయలక్ష్మి తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక నోటిఫికేషన్ రాదేమోనని భయపడింది. అమ్మ, అన్న, భర్త తన కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టారని.. వారందరికీ ఏం చెప్పుకోవాలని తలచి చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. నోటిఫికేషన్ రాదేమోనన్నబెంగతో ప్రాణాలు తీసుకుంది నా భార్యకు చాలా ఆత్మవిశ్వాసం. లక్షల మందిలో మనకు ఉద్యోగం ఎలా వస్తుందని నేను ప్రశ్నిస్తే.. చదివితే ఎవరికైనా వస్తుందనేది. రేయింబవళ్లు కష్టపడేది. అక్టోబర్ 10వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మళ్లీ ఇవ్వకపోవడంతో తాను టీచర్ కాలేనేమోనని భయపడిపోయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులం అందరం ధైర్యం చెప్పాం. అయినా ఇక నోటిఫికేషన్ రాదేమోనని మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. – గిడ్డయ్య, విజయలక్ష్మి భర్త ప్రభుత్వం నాటకాలాడుతోంది.. డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో ప్రభు త్వం నాటకాలాడుతోంది. పేపర్లు, టీవీల్లో ప్రకటనలతో సరిపెడుతోంది. టీచర్, విద్యార్థి నిష్పత్తి అంటూనే ఉద్యోగాల్లో కోత పెడుతోంది. డీఎస్సీ, టెట్ కోసం చదివిన నిరుద్యోగులు ప్రభుత్వ నిర్వాకంతో అసహనానికి లోనవుతున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – రామశేషయ్య, యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు -
కాగితాలు ఏరుకునే చిన్నారిని లాలించిన పద్మారావు!
అది సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతం. అప్పుడు సమయం రాత్రి సుమారు ఏడెనిమిది గంటలు కావస్తోంది. వాహనాలు రొద చేస్తూ రోడ్డుపై వెళ్తున్నాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదే రహదారిలో ఓ చిన్నారి చిత్తు కాగితాలను ఏరుకుని వాటిని రిక్షాలో వేసుకుని తోసుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో పాత జైలు సమీపంలోని ఓ కళ్లద్దాల దుకాణంలో కూర్చుని ఉన్న మంత్రి పద్మారావు ఆ చిన్నారి కష్టాన్ని కళ్లారా చూశారు. ఆ దృశ్యం ఆయన మనసును కదిలించింది. వెంటనే తన భద్రతా సిబ్బందితో బాలికను పిలుచుకు రమ్మని ఆదేశించారు. వారు ఆమెను మంత్రి చెంతకు తీసుకువచ్చారు. పద్మారావు తన సొంత కూతురిలా ఒడిలో కూర్చోపెట్టుకుని మరీ ఆ చిన్నారిని లాలించారు. ఆమె కుటుంబానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేరు విజయలక్ష్మి అని.. సికింద్రాబాద్ తుకారాంగేట్ వద్ద ఉంటున్నామని చెప్పింది. తల్లి సరోజ నిత్యం మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తోందని వివరించింది. తాను సికింద్రాబాద్ సుభాష్ రోడ్‌లోని నాగెల్లి దుర్గయ్య స్మారక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నానంది. చదువుకుంటూనే నిత్యం తల్లి ఏరితెచ్చే చిత్తు కాగితాలను దుకాణంలో విక్రయిస్తుంటానని చెప్పింది. మోండా మార్కెట్ వద్ద తల్లి పోగుచేసిన చిత్తు కాగితాల మూటలను ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో మూడు చక్రాల బండిలో వేసుకుని రాంగోపాల్‌పేట్‌లోని ఓ దుకాణానికి తీసుకెళ్లి అమ్ముతానంది. పదకొండేళ్ల చిన్న వయసులోనే బతుకు బండిని లాగడంలో తల్లికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న విజయలక్ష్మిని మంత్రి పద్మారావు అభినందించారు. ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తానన్నారు. ఈ ఉదంతం శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మంత్రి చలించిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. – బన్సీలాల్‌పేట్ -
స్థానిక నివాసాలపైనే దృష్టి
విజయనగరం ఫోర్ట్: అంతా ఆరోగ్యం గా ఉండాలంటే అందుబాటులో సి బ్బంది ఉండాలి. పనిచేసే చోట నివా సం ఉండకుండా ఎక్కడో ఉంటూ రాకపోకలు చేయడంవల్ల ఒక్కోసారి అర్ధరాత్రి సేవలు అందించలేకపోవచ్చు. అందుకే ఉద్యోగం ఎక్కడో అక్కడే నివాసం ఉండాలన్నది నా ఉద్దేశం. సిబ్బంది కచ్చితంగా దీనిని పాటించాలి. దీనిపైనే దృష్టి పెడుతున్నాను. ఇంకా శాఖాపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కొత్తగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి చెప్పారు. సాక్షితో శనివారం ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ♦ ఇంటర్వ్యూల సమయంలో స్థానికంగా ఉంటామని చెబితేనే ఉద్యోగాలకు ఎంపిక చేస్తాం. కానీ ఏఎన్ఎం, రెండో ఏఎన్ఎం, ఇతర ఉద్యోగులు చాలా మంది స్థానికంగా నివాసం ఉండట్లేదని నా దృష్టికి వచ్చింది. అలాంటివారిపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడానికైనా వెనుకాడేది లేదు. కచ్చితంగా వారు స్థానికంగా నివాసం ఉండాల్సిందే. ♦ జిల్లాలో ఏదైనా ప్రాంతంలో డెంగీవ్యాధి ఉన్నట్టు తెలిస్తే తక్షణం దానికి గల కారణాలను ఆరా తీస్తాం. అసలు ఇలాంటివాటిని ముందస్తుగానే నియంత్రించేందుకు చర్యలు చేపడతాం. ప్రజలకు ఆరోగ్యంపైనా... పారి శుద్ధ్యంపైనా అవగాహన కల్పి స్తాం. పంచాయతీరాజ్, మున్సి పాలిటీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సహకారంతో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. ♦ గిరిజన ప్రాంత ప్రజలు కొంతమంది అవగాహన లేక ప్రభుత్వం అందించిన దోమతెరలను వినియోగించడం లేదు. అటువంటి వారితో నేరుగా మాట్లాడి, వారిని చైతన్యపరచి దోమ తెరలు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. ♦ వాతావరణ మార్పులవల్ల అక్కడక్కడా జ్వరా లు ప్రబలుతున్నాయి. ఎక్కడైనా అలాంటి సమ స్య ఉన్నట్టు తెలిస్తే వెంటనే అదుపునకు చర్యలు తీసుకుంటాం. వైద్యశిబిరాలు వెనువెంటనే ఏర్పా టు చేసి చికిత్సలు అందిస్తాం. రక్తనమూనాలు సేకరించి మలేరియా వంటివి సోకినట్టయితే పర్యవేక్షణ పెంచి మందులు అందిస్తాం. గ్రామంలో క్లోరినేషన్, స్ప్రేయింగ్ వంటివి చేపడతాం. ♦ జిల్లాలో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు పూర్తిస్థాయిలో అందకపోవడానికి వాహనాలు చాలక పోవడమే కారణం. దీనివల్ల సేవలు పూర్తి స్థాయిలో అందకపోవచ్చు. వాటి సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకుంటాం. ♦ ఇంకా ఇళ్లల్లోనే గిరిజన ప్రాంతాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. మూఢ నమ్మకాల కారణంగానే వారు ఆస్పత్రులకు చివరివరకూ తరలించేందుకు సుముఖత చూపడంలేదు. వారిని సిబ్బంది ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేరేలా చైతన్యపరిచేలా చూస్తాం. ఇటీవల ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేశాం. దీనివల్ల కొంతవరకూ రవాణాకు ఇబ్బంది ఉండకపోవచ్చు. -
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేసిన ఘటన గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బి.పుష్పంకుమార్ తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 15 ఏళ్ల కిందట ఖమ్మంకు చెందిన విజయలక్ష్మీతో వివాహమైంది. వీరికి సంతానం కలగకపోవడంతో ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా జీవనం సాగించటంతో పాటు విడాకులు తీసుకొనేందుకు కోర్టుకు వెళ్లారు. కేసు కోర్టులో ఉండగా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్యాభర్తల బంధువుల మధ్య వాగ్వాదం జరగటంతో విజయలక్ష్మీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి
ధనుష్ చాలా పాపులర్. ఇది మనందరికీ తెలుసు. మరీ ఇంత పాపులర్ అనుకోలేదు. ‘నా కొడుకంటే నా కొడుకు’ అని కొట్టుకునేంత పాపులర్! ఎన్డీ తివారీని ‘మా డాడీ.. మా డాడీ’ అని ఒకబ్బాయన్నాడు. కోర్టులు తేల్చాయి. ఇప్పుడు ధనుష్‌ను నా కొడుకంటే... నా కొడుకని లొల్లి చేస్తున్నారు ఇద్దరు నాన్నలు. కోర్టులు తేల్చాలి. ఇదీ సంగతి. ఎవర్ని ముంచుతారో... ఎవర్ని తేలుస్తారో? ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూసి ఎంజాయ్ చేసినవాళ్లు ‘కొడుకుకు ప్రేమతో’ అన్న ఈ సినిమా చదివి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం... ధనుష్ ఎవరు? సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు. ఒకప్పటి తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు. తెలుగులో ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలు తీసిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తమ్ముడు. మనకు ఇంతవరకే తెలుసు. అయితే ఇవన్నీ అబద్ధాలు అంటోంది ఓ వృద్ధ తమిళ జంట. ‘అతడు మా రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డ’ అంటున్నారు. అంతే కాదు... ‘కావాలంటే పుట్టుమచ్చలు పరీక్షించుకోండి. డీఎన్ఏ టెస్టులు చేసుకోండి. ధనుష్ ముమ్మాటికీ మా బిడ్డే’ అంటూ న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆ దంపతుల పేర్లు ఆర్. కదిరేశన్, మీనాక్షి. కోర్టు ఈ వృద్ధ దంపతుల వాదనను అర్థం చేసుకుని, ధనుష్‌కి సమన్లు జారీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరీ కదిరేశన్?? ధనుష్ మామగారైన సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరో కాకముందు బస్ కండక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. యాదృచ్ఛికమో.. మరొకటో... కదిరేశన్ కూడా కండక్టరే. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు. ఇటీవలే రిటైర్ అయ్యారు. చెన్నైకు సుమారు 500 కిలోమీటర్లు దూరంలో మధురై జిల్లాలోని మేలూర్ ఆయన స్వగ్రామం. కదిరేశన్‌కు ముగ్గురు పిల్లలు. ముగ్గురిలో ధనుష్ చిన్నోడని ఆయన చెబుతున్నారు. ‘‘ధనుష్ అసలు పేరు కలైసెల్వన్. మేలూర్‌లో రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించాడు. పదవ తరగతి వరకూ నగరంలోని ఆర్.సి. హయ్యర్ సెకండరీ స్కూల్, గవర్నమెంట్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్స్‌లో చదువుకున్నాడు. 12వ తరగతి కోసం శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్‌లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాం. కానీ, చదువు మధ్యలోనే మానేసి, సినిమా పిచ్చితో చెన్నై చేరుకున్నాడు. కçస్తూరి రాజాతో చేతులు కలిపాడు. అప్పట్నుంచీ మాకు దూరమయ్యాడు. మా కుమారుణ్ణి కలవాలని మేము చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మీరే మాకు న్యాయం చేయాలి’’ అని కదిరేశన్ దంపతులు కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. నెలకు 65 వేలు కావాలి! కదిరేశన్ కోర్టులో ధనుష్ మా కుమారుడే అని పేర్కొనడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు 65 వేలు ఇప్పించాల్సిందిగా కోరారు. మరో ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ, వాళ్లు తమ ఆరోగ్యానికీ ఇతర నెలవారీ ఖర్చులకు సరిపడా డబ్బులు ఏర్పాటు చేయలేకపోతున్నారని తెలిపారు. కదిరేశన్, మీనాక్షి దంపతుల వాదనలు విన్న తర్వాత జనవరి 12లోపు న్యాయస్థానం ముందు హాజరు కావాలని ధనుష్‌ని న్యాయమూర్తి ఆదేశించారు. గతేడాది నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది. ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్లను సమర్పించారు. ధనుష్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘తుళ్లువదో ఇళమై’ 2002 మేలో విడుదలైంది. తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లో ధనుష్‌ను చూసి గుర్తు పట్టామని కదిరేశన్ దంపతులు చెబుతున్న మాట. అయితే చిత్ర పరిశ్రమలో ఇటువంటి కేసులు కొత్తేమీ కాదు. ‘నేనే చిరంజీవి పెద్ద కుమారుణ్ణి’ అంటూ గతంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్, ‘నేను ఫలనా సినీ ప్రముఖుడికి ఫలానా’ అని మరికొందరు మీడియా, మానవ హక్కుల సంఘాలు, న్యాయస్థానాల ముందుకు వచ్చి తమ వాదనలు వినిపించారు. సదరు కేసులన్నీ కొన్ని రోజులకే కంచికి చేరుకున్నాయి. ధనుష్ కేసు మాత్రం కోర్టు సాక్షిగా కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. దీనిపై పలు వాదనలు జరిగాయి. మేలూర్ కోర్టులో కేసు కొట్టేయవలసిందిగా ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. బర్త్ సర్టిఫికేట్లో పేరు లేదా? న్యాయస్థానంలో ధనుష్ సమర్పించిన బర్త్ సర్టిఫికేట్ జూన్ 21, 1993లో ఇష్యూ చేసినట్టు ఉందని కదిరేశన్ పేర్కొన్నారు. అందులో ఉన్నట్టు జూలై 28, 1983న ధనుష్ జన్మించాడనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ‘అయినా... పదేళ్ల తర్వాత ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్లో పిల్లాడి పేరు ఎందుకు లేదు? అప్పటికి అతను ఐదవ తరగతికి వచ్చుంటాడు కదా?’ అని ప్రశ్నించారు. ఆర్.కె. వెంకటేశ్ ప్రభు రాజాగా ఉన్న తన పేరును ధనుష్‌గా 2003లో మార్చుకున్నట్టు ఈ హీరో విన్నవించగా, 2002లోనే ధనుష్‌గా తన పేరును ఈ హీరో పేర్కొన్నట్టు స్పష్టం చేసే పేపర్లను కదిరేశన్ దంపతులు న్యాయస్థానం ముందుంచారు. దాంతో కేసు జటిలమైంది. పుట్టుమచ్చ... తప్పలేదు రచ్చ! కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే... కదిరేశన్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా... అసలు కదిరేశన్ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్‌కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. అప్పుడు పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి 28లోపు న్యాయస్థానం ముందు ధనుష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దాంతో మంగళవారం విజయలక్ష్మి, కస్తూరి రాజాలతో కలసి ధనుష్ మేలూర్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు రిజిస్టార్ సమక్షంలో మేలూర్ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్ ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించారు. అనంతరం ఈ కేసు వాదనను గురువారానికి వాయిదా వేశారు. అయితే గురువారం నాడు డీఎన్ఎ టెస్ట్ కోసం కదిరేశన్ దంపతులు కోర్టుకు సమర్పించాల్సిన నివేదికలను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని న్యాయస్థానం కేసుని మార్చి 9కి వాయిదా వేసింది. కోర్టులో ఏం తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధనుష్... కస్తూరి రాజా కొడుకే – విసు కస్తూరి రాజా దర్శకత్వం వహించిన తొలి తమిళ చిత్రం ‘ఎన్ రాసావిన్ మనసిలే’ పాతికేళ్ల క్రితం విడుదలైంది. అంతకుముందు ఆయన దర్శక–నిర్మాత–నటుడు విసు దగ్గర 16 సినిమాలకు పని చేశారు. ఆ విధంగా విసుతో కస్తూరి రాజా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ‘ధనుష్ తమ కుమారుడే’ అని కదిరేశన్ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో విసు పెదవి విప్పారు. ‘‘కస్తూరి రాజా కుటుంబం నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. ధనుష్ పుట్టినప్పుడు కస్తూరి రాజా నా దగ్గరే పని చేస్తున్నాడు. ధనుష్... కస్తూరి రాజా–విజయలక్ష్మిదంపతుల కొడుకే. అందులో సందేహం లేదు’’ అంటూ తన కుటుంబంతో కలసి చిన్నప్పుడు ధనుష్ దిగిన ఫొటోను బయటపెట్టారాయన. సిక్స్ ఇయర్స్... స్వీట్ మెమరీ! కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ చిన్నప్పటి ఫొటోలు... అంటూ కొన్ని ఫొటోలను బయటపెడితే... ధనుష్ కూడా తన చిన్న నాటి ఫొటోను ఆ మధ్య ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో తన సిస్టర్స్ విమల గీత, కార్తీకా దేవితో కలసి ఉన్నాడు బుజ్జి ధనుష్. అప్పుడు తన వయసు ఆరేళ్లని ఈ హీరో పేర్కొన్నారు. ‘అవి గోల్డెన్ డేస్. మరచిపోలేనివి’ అని కూడా అన్నారు. మరి.. పదో తరగతి వరకూ తమ దగ్గరే ఉన్నాడని కదిరేశన్ దంపతులు చెబుతున్న నేపథ్యంలో ఆరేళ్ల వయసులో సోదరీమణులతో కలసి ధనుష్ దిగిన ఫొటో ఎక్కణ్ణుంచి వచ్చింది? – సత్య పులగం -
మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి మడకశిర : మున్సిపల్ రీజనల్ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న 38 మున్సిపాలిటీలకు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 2016 - 17వ ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపాలిటీలకు మంజూరయ్యాయన్నారు. ఆమె సోమవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధుల్లో ఎస్సీల అభివృద్ధికి రూ.77.65 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.59.63 కోట్లు కేటాయించారన్నారు. 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101.60 కోట్లు, సబ్‌ప్లాన్ నిధులు రూ.333.36 కోట్లు కూడా మున్సిపాలిటీలకు వచ్చాయన్నారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలో గత డిసెంబరుకు రూ.212.35 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, రూ.109.84 కోట్లు(52శాతం) మాత్రమే వసూలైనట్లు తెలిపారు. పన్ను వసూళ్లను 75శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రీజనల్ పరిధిలోని కర్నూలు, తాడిపత్రి, కడప, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలకు మొదటి విడతలో ఏహెచ్‌పీ కింద రూ.27,900 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా హౌసింగ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు బీఎల్సీ కింద 17,470 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 38 మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛభారత్ కింద 56,333 మరుగుదొడ్లను నిర్మించామన్నారు. 162 కమ్యూనిటీ మరుగుదొడ్లను మంజూరు చేశామని, ఇందులో 68 పూర్తి చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 84,677 కుక్కలు ఉంటే అందులో 42,247 కుక్కలకు ఆపరేషన్లు చేయించామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ - ఆఫీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇంతవరకు రీజనల్ పరిధిలో 3,485 ఫైళ్లను ఈ - ఆఫీస్ ద్వారా నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రవేశపెట్టిన ‘పురసేవ’ యాప్‌ద్వారా 5,200 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 4,500 పరిష్కరించామని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్వైపింగ్ మిషన్ల కోసం 3,700 దరఖాస్తులు రాగా 960 మిషన్లను సరఫరా చేశామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, కమిషనర్ నయీద్అహమ్మద్ పాల్గొన్నారు. -
బాంబే గ్రూపు రక్తం కోసం ఎదురుచూపులు..
అరుదైన బాంబే గ్రూపు రక్తం కోసం ప్రాణాపాయస్ధితిలో రోగి ఎదురుచూస్తోంది. మిలియన్ ప్రజల్లో కేవలం నలుగురికి మాత్రమే ఉంటే ఈ రకం బ్లడ్‌గ్రూపు రక్తం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అరుదైన బాంబే గ్రూపు రక్తాన్ని సేకరించి రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమారం గ్రామానికి చెందిన విజయలక్ష్మీ, ఆదంలు భార్యభర్తలు. రెండో సారి గర్భం దాల్చిన విజయలక్ష్మీకి స్థానిక జిల్లా వైద్యులు వైద్యసేవలు అందించారు. అమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్గ్రూపని తేలడంలో ఈనెల 13వ తేదిన గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడడంతో శస్ర్తచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీశారు. అప్పటికే శిశువు మృతి చెందింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమైంది. తక్షణమే రెండు బ్యాటిళ్ల రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. అయితే అమె రక్తానికి మ్యాచ్ అయ్యే బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అందుబాటులో లేదు. శతవిధాల ప్రయత్నించగా చార్మినార్ తలసేమియా బ్లడ్‌బ్యాంకులో ఒక బ్యాటిల్ రక్తం ఉందని తెలుసుకుని తక్షణమే అక్కడి నుంచి కొలుగోలు చేశారు. మరో బ్యాటిల్ రక్తం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలోనే విజయలక్ష్మీ మోకాలిచిప్పకు శస్ర్తచికిత్స అవసరమైన నేపధ్యంలో ఆమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌గ్రూపు రక్తంగా వైద్యులు గుర్తించారు. నిమ్స్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు వేచిఉన్న తర్వాత బాంబే బ్లడ్‌గ్రూపు రక్తాన్ని ముంబై నుంచి సేకరించిన అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి అధికారులు ముంబైలోని మహాత్మగాంధీ సేవసమితి బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న విజయలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు తమవంతు కషిచేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. ఈ రకం రక్తాన్ని గుర్తించేందుకు గాంధీ బ్లడ్‌బ్యాంకులో తగిన వైద్యపరికరాలు ఉన్నాయని, ఇక్కడకు వచ్చే రక్తదాతల్లో బాంబే బ్లడ్‌గ్రూప్ రక్తం ఉన్నవారు ఎవరూలేరని గాంధీ బ్లడ్‌బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ భీష్మ తెలిపారు. బాంబే బ్లడ్ గ్రూప్ అంటే... జన్యుపరంగా సంక్రమించే ఈ రకం బ్లడ్‌గ్రూప్‌ను ముంబై(ఒకప్పటి బొంబాయ్)కు చెందిన డాక్టర్ వైఎం బెండీ 1952లో గుర్తించారు. దీంతో ఈ రకం రక్తానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని నామకరణం చేశారు. అత్యంత అరుదైన ఈ రక్తం ఓ నెగిటివ్ గ్రూప్‌లోని మరో సబ్టైప్. దీనికి వైద్యపరిభాషలో ‘ఓహెచ్’గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం మిలియన్ మందిలో నలుగురికి మాత్రమే ఉండే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు. దేశంలో తొమ్మిది మందికి అవసరం... దేశంలో తొమ్మిది మందికి బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరం ఉందని తేలింది. కొంతమంది కలిసి బాంబే బ్లడ్‌గ్రూప్ డాట్ ఓఆర్జీ పేరిట ఓ వైబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బ్లడ్ అవసరమైన వారు ఈ వైబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే డోనర్లను వెతికి పట్టుకుని అవసరమైన రక్తాన్ని అందిస్తారు. ప్రస్థుతం ఈ వెబ్సైట్లో తొమ్మిది మంది తమకు బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమని తమపేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బేబీ సరియాఅమీన్, అనంతపురంకు చెందిన శైలజలు ఉండడం గమనార్హం. ఈ వెబ్సైట్ విశ్లేషణ ప్రకారం మహారాష్ట్రలోనే ఈ బ్లడ్‌గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
కేసీఆర్ స్ఫూర్తితోనే దత్తత
జిల్లాపరిషత్ : హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, ఆయన స్ఫూర్తితోనే జెడ్పీ ఆవరణలో గార్డెన్‌ను దత్తత తీసుకున్నామని జిల్లా సహాయ ఆడిట్ అధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం నగరంలోని సుభాష్‌నగర్‌లో గల జెడ్పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గార్డెన్‌ను తమ కార్యాలయ సిబ్బంది అందరం కలిసి దత్తత తీసుకున్నామని తెలిపారు. గార్డెన్లో దాదాపు 100కు పైగా మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.