
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది. నరసరావుపేటలో ఓ లేఔట్ అనుమతి కోసం రూ. 15 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారని బాధితుడు, రియల ఎస్టేట్ వ్యాపారి కోటిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. మొదటగా రూ. 10 లక్షలకు సెటిల్‌మెంట్ అయిందని, మళ్లీ ఇప్పుడు మిగతా ఐదు లక్షలు కూడా ఇవ్వాలని విజయలక్ష్మీ బెదిరిస్తున్నారని కోటిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా విజయలక్ష్మీపై గతంలో కూడా ఒక కేసు నమోదైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు.
(చదవండి : కోడెల ట్యాక్స్ వెనక్కి ఇప్పించండి)
Comments
Please login to add a commentAdd a comment