Vijayalakshmi Actress Kannada, అద్దె చెల్లించని నటి.. అర్ధరాత్రి నడిరోడ్డుపైకి పడేశారు - Sakshi
Sakshi News home page

అద్దె చెల్లించని నటి.. అర్ధరాత్రి నడిరోడ్డుపైకి పడేశారు

Apr 26 2021 4:25 AM | Updated on Apr 26 2021 11:39 AM

Complaint Against Actress Vijayalakshmi - Sakshi

సాక్షి, చెన్నై: నటి విజయలక్ష్మిని సినిమా కష్టాలు వీడటం లేదు. అద్దె చెల్లించలేదంటూ ప్లాట్‌ మేనేజర్‌ ఆమె సామాన్లు బయట పడేశాడు. రోడ్డున పడ్డ ఆమె అర్ధరాత్రి వేళ చేసిన హంగామాతో చివరకు పోలీసులు ప్రత్యామ్నాయం కల్పించారు. నామ్‌ తమిళర్‌ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్‌ తనను మోసం చేశారంటూ గతంలో నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మహత్యాయత్నాలు చేయడం వంటి పరిణామాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సీమాన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో నామ్‌ తమిళర్‌ కార్యకర్తలు పలుమార్లు ఆమెకు బెదిరింపులు కూడా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అంటూ సినిమా కష్టాలు విజయలక్ష్మిని వీడటం లేదు.   చదవండి: (కారులో నగ్నంగా వీడియో తీసి వేధిస్తున్నాడు!)  

సామాన్లు బయట పడేశారు! 
టీనగర్‌ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో విజయలక్ష్మి, ఆమె సోదరి ఉన్నారు. ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం రాత్రి డిశ్చార్జ్‌ కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు షాక్‌ తప్పలేదు. తమ ప్లాట్‌లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్‌ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్‌లో రాజకీయ నేత హరినాడర్‌ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు.

కాసేపు తన దైన శైలిలో ఆమె హంగామా సృష్టించారు. తామేమీ ఆమె సామాన్లు బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, తమ ప్లాట్‌ సిబ్బంది శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేనేజర్‌ విఘ్నేశ్వరన్‌ పేర్కొన్నారు. హరినాడర్‌కు ఈ ప్లాట్‌కు సంబంధం లేదని, ఆమెను జావెద్‌ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఈ వ్యవహారం ముదరడంతో పాటు సీమాన్‌ నువ్వయినా ఆదుకో అంటూ విజయలక్ష్మి కన్నీటి పర్యంతం కావడంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. తేనాంపేట పోలీసులు విచారించి విజయలక్ష్మికి ప్రత్యామ్నాయం కల్పించారు. అయితే ఇది తాత్కాలికం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సీమాన్‌ను నోటికి వచ్చినట్టు దుమ్మెత్తి పోసిన విజయలక్ష్మి తాజాగా తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతం కావడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement