house rent
-
క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?
షాపింగ్ చేయాలన్నా..నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా.. టికెట్ బుకింగ్స్ కోసం, ఇంటి అద్దె చెల్లించడం కోసం, ఇలా అవీ ఇవీ అని తేడా లేకుండా క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాడకం మంచిదే కానీ.. కొన్నిసార్లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్రెడిట్ కార్డును ఉపయోగించి రెంట్ (అద్దె) కట్టడం మంచిదేనా? దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం.. రివార్డ్ పాయింట్లను కూడబెట్టుకోవడానికి లేదా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి మంచి వ్యూహం కావచ్చు. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపుప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించినప్పుడు, కొంతమంది ఓనర్స్ లేదా ఏజెన్సీలు ప్రాసెసింగ్ ఛార్జీలను సైతం వసూలు చేస్తారు. ఈ ఛార్జి మీరు చెల్లించే అద్దెలో రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది.క్యాష్ అడ్వాన్స్ ఫీజు: అద్దె చెల్లింపులను సాధారణ లావాదేవీలుగా పరిగణించడానికి బదులు.. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు వాటిని క్యాష్ అడ్వాన్స్‌లుగా పరిగణిస్తారు. దీనికి సాధారణ వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.గత బకాయి చెల్లింపులపై వడ్డీ: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించకపోతే.. అది తప్పకుండా మీ మీద ఆర్ధిక భారం పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అద్దె చెల్లిస్తే.. వడ్డీ మరింత ఎక్కువవుతుంది.క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించే ముందు తెలుసుకోవసిన అంశాలుఫీజులు: అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల.. ప్రాసెసింగ్ ఫీజు కొంత ఎక్కువగా ఉంటుంది.వడ్డీ ఆధారిత ఫీజులు: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడాం వల్ల లాభాలురివార్డ్లను సంపాదించవచ్చు: క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లిస్తే.. క్యాష్ బ్యాక్ లేదా క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లను పొందవచ్చు. ఇది షాపింగ్ వంటి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి షాపింగ్ సమయంలో కొంత డబ్బు ఆదా అవుతుంది.క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేయడం వల్ల.. క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.అద్దె చెల్లించడంలో ఆలస్యం నివారించవచ్చు: చేతిలో డబ్బు లేకపోయినా.. మీరు క్రెడిట్ కార్డు ద్వారా సకాలంలో అద్దె చెల్లించవచ్చు. ఒకవేళా ఇంటి ఓనర్.. అద్దె ఆలస్యం చేస్తే విధించే ఫెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు.పేమెంట్ సెక్యూరిటీ: క్రెడిట్ కార్డు హిస్టరీ వల్ల మిమ్మల్ని ఎవరూ మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి మీ చెల్లింపులకు ఇక్కడ భద్రత లభిస్తుంది. -
హడలెత్తిస్తున్న ఇంటి అద్దె!.. నెలకు ఇన్ని లక్షలా..
భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకుంటోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భూములు, అపార్ట్మెంట్ల ధరలు భారీగా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అద్దెలు కూడా ఈ నగరాల్లో అమాంతం పెరిగిపోతున్నాయి. ఇటీవల దీనికి సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జైపూర్‌కు చెందిన ఉత్కర్ష్ గుప్తా.. తన ఎక్స్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ముంబైలో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఇందులో 2 బీహెచ్‌కే హౌస్ అద్దె నెలకు రూ.1.35 లక్షలు. దీనికోసం రూ.400000 డిపాజిట్ చేయాలి అని ఉండటం చూడవచ్చు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే.. వాషింగ్ మెషీన్ టాయిలెట్ గదిలోనే ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?ప్రస్తుతం ఈ పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇది బ్రిలియంట్ ఐడియా అని చెబుతుంటే.. మరొకరు ఇది బాత్రూమేనా అని అంటున్నారు. మరికొందరు దాని అద్దె కూడా చాలా ఎక్కువని చెబుతున్నారు. మొత్తానికి దీన్ని చూస్తే ముంబైలో అద్దెలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.Only in Mumbai, you can front load your washing machine while top loading your commode.At an affordable price of 1.35L per month! pic.twitter.com/texU5hUwMC— Utkarsh Gupta (@PaneerMakkhani) September 22, 2024 -
1 BHK రూ.70 వేలు! ఇది రెంటా లేక ఈఎంఐనా? పోస్ట్ వైరల్
అత్యంత రద్దీ నగరమైన ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదైన ఇక్కడి హౌసింగ్ మార్కెట్ నివాసితులకు ఒక ప్రధాన సవాలుగా కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలతో అందుబాటు అద్దెలో ఇళ్లు దొరకడం కష్టంగా మారింది. ఇటీవల విటా అనే ఒక లాయర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ విపరీతమైన ఖర్చులను ఎత్తిచూపడంతో పాటు ఆన్లైన్లో విస్తృత చర్చకు దారితీసింది.ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో 1 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల అద్దె నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటోందని విటా తన ట్వీట్లో పేర్కొన్నారు. విడిగా ఉండేందుకు బయటకు వెళ్లకుండా తమ జీవన ఏర్పాట్లను పునఃపరిశీలించుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి నివసించాలని తోటి యూజర్లకు ఆమె సూచించారు. "ముంబైలో 1 బీహెచ్‌కే అద్దె రూ.50,000-70,000 ఉంటోంది. మీ అమ్మానాన్నలతో మంచి సంబంధాలు పెట్టుకోండి. స్వతంత్రంగా ఉండటానికి ఇంటి నుంచి బయటకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు" అని ఆమె రాసుకొచ్చారు.ఈ ట్వీట్ వెంటనే వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ముంబైలో అధిక జీవన వ్యయం నుంచి పలువురు యూజర్లు తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. అప్పుల భారం లేకుండా ఇల్లు, మంచి వైద్యం, నాణ్యమైన విద్య పొందడం చాలా మందికి అసాధ్యమైన కలలా కనిపిస్తోందంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. 'ఇది 70 వేల అద్దె లేదా ఈఎంఐనా?' అని ప్రశ్నిస్తూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "నేను ఈ నగరం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. ఈ అద్దెను నేను భరించలేను" అంటూ ఇంకొక యూజర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. -
ఐటీ సిటీలో డబుల్ ట్యాక్స్.. ఇంటి అద్దెలు మరింత పెరుగుతాయా?
బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది. కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది. కొత్త ఆస్తి పన్ను విధానం ఇదీ.. ప్రస్తుత పన్ను విధానంలో పీజీలు, కన్వెన్షన్ హాళ్లు, లేదా మాల్స్ వంటి అద్దె ఆస్తులకు ఏడు సుంకాలు ఉన్నాయి. అయితే ఎయిర్ కండీషనర్ లేదా ఎస్కలేటర్లు ఉన్న భవనాలకు ప్రత్యేకంగా పన్నులేమీ విధించడం లేదు. గైడెన్స్ విలువను 33 శాతం పెంచినందున వ్యాపారులు, ఆస్తి యజమానులు వార్షిక బీబీఎంపీ పన్నులో కనీసం 40 శాతం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే బీబీఎంపీ కొత్త నోటిఫికేషన్లో ఆస్తి పన్ను పెంపును 20 శాతానికి పరిమితం చేసింది. బెంగళూరు నగరంలోని అద్దె ఇళ్లు, ఫ్లాట్లపై బీబీఎంపీ రెట్టింపు పన్నులు వేస్తోందని, అయినప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని నగరంలో అద్దె నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కొత్త పన్ను నియమంతో అద్దెదారులు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుందని వాపోతున్నారు. అయితే ఆస్తి పన్ను 5 శాతానికి మించి పెరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. -
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా?అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
గతవారం స్థిరాస్తి అద్దెకిచ్చినప్పుడు ఓనర్‌గారికి ఆ ఆదాయం ఎలా లెక్కించాలి .. మినహాయింపులేమిటి? మొదలైన విశేషాలు తెలుసుకున్నాం. ఈసారి మీరు అద్దె చెల్లించే వారయితే .. అంటే మీరు కిరాయిదారైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన విషయాలు, ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి తెలుసుకుందాం. ♦మీరు ఇచ్చే రెంటుకి అగ్రిమెంటు రాసుకోండి. దయచేసి రెంటును నగదు రూపంలో ఇవ్వకండి. చెక్కు ద్వారా, డ్రాఫ్ట్ ద్వారా, బదిలీ ద్వారా రెంటు ఇవ్వండి. ♦కొంత నగదు, కొంత బ్యాంకు అని ఒప్పుకోకండి. రెంటు ఇవ్వగానే రసీదు పుచ్చుకోండి. కనీసం ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారానైనా తీసుకోండి. సత్సంబంధాలు కొనసాగినన్నాళ్లూ రసీదు లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ జాతివైరం సహజం. ముందుగా ఆలోచించి ఒక అలవాటుగా అనుసరించండి. ♦ప్రత్యేకించి నగదు పుస్తకం, లెడ్జర్లో పద్దులు రాయకపోయినా, ఈ వ్యవహారాలను అన్ని వివరాలతో సహా ఒక పుస్తకంలో రాయండి. ♦మీరు ఉద్యోగైనా, వ్యాపారస్తులైనా, వృత్తి నిపుణులైనా ఇలా చెల్లించే అద్దెను ఖర్చుగా భావించి, మినహాయింపు పొందాలంటే కాగితాలు కావాలి. ♦మీ ఓనర్ పాన్ నంబరు, బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని భద్రపర్చుకోండి. ♦ఇల్లు ఒకరి పేరు మీద ఉంటే మరొకరి పేరు మీద అద్దె వసూలయ్యే సందర్భాలూ ఉంటాయి. భార్యాభర్తలు, మామా అల్లుళ్లు, అన్నదమ్ములు, ఇలాంటి అతి తెలివి వారుంటారు. మీకు సంబంధం లేకపోయినా, మీరు గట్టిగా అడగలేకపోయినా.. కాగితాలు, రసీదు లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ♦194– ఐ సెక్షన్ కొన్ని బాధ్యతలను అంటకట్టింది. అదే టీడీఎస్. ♦చెల్లించే వార్షిక అద్దె రూ. 2,40,000 దాటితే ప్రతి చెల్లింపునకు టీడీఎస్ కట్ చేసి, ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖాతాలో చెల్లించి ఆ మేరకు ఫారం 16 అని మీ యజమానికి ఇవ్వాలి. ♦194– ఐ వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ♦మరో సెక్షన్ 194 ఐఆ ఉందండోయ్. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తుంది. ♦వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, ‘ట్యాక్స్ ఆడిట్’ అవసరం లేని వారు, వర్తించనివారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది. ♦అద్దె నెలకి రూ. 50,000 దాటిన వారికే వర్తిస్తుంది. నెలలో కొంత వ్యవధికి అయినా వర్తిస్తుంది. ♦నెలకి రూ. 50,000 అంటున్నారు, సంవత్సరానికి అని అనడం లేదు.. మీరు వారం రోజులకు అద్దె ఇచ్చి రూ. 50,000 దాటి పుచ్చుకుంటే చాలు. ♦ఇలా అద్దె ఇచ్చేటప్పుడు పన్ను రికవరీ చేసి మిగతా మొత్తమే ఇవ్వాలి. ట్యాక్సును సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, ఆ మేరకు టీడీఎస్ సర్టిఫికెట్ 16 ఇ ద్వారా ఇవ్వాలి. ♦పన్ను వసూలు చేయకపోయినా, వసూలు చేసిన మొత్తం సకాలంలో చెల్లించకపోయినా, సకాలంలో టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా .. వడ్డీ, పెనాల్టీలు భరించాలి. ♦ఏతావతా.. రెంటు చెల్లించిన వారికి మాత్రమే టీడీఎస్ బరువు, బాధ్యతలు ఉన్నాయి. -
దేశంలోని ఈ నగరాల్లో చుక్కలు చూపిస్తున్న అద్దె ఇళ్లు.. మరి హైదరాబాద్‌లో
దేశంలో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో నెల సంపాదనలో సగం అద్దింటికే చెల్లించాల్సి వస్తుందని చిరుద్యోగులు వాపోతున్నారు. పైగా పెరిగిపోతున్న అద్దె ఇళ్ల ధరలు సంపాదనలో కొంత మొత్తాన్ని దాచి పెట్టుకోవాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ ఓ నివేదికను విడుదల చేసింది. అందులో దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అద్దె ఇళ్ల ధరలు పెరిగినట్లు తెలిపింది. 🏘️వెయ్యి చదరపు అడుగులో డబుల్ బెడ్రూం ఇల్లు సగటున నెలవారీ అద్దె గత ఏడాది రూ.24,600 ఉండగా.. ఇప్పుడు అదే రెంట్ 2023 సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ28,500కి చేరింది. 🏘️ముఖ్యంగా బెంగళూరులోని ప్రముఖ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ రెంట్లు దాదాపూ 30 శాతం పెరగ్గా.. వైట్ ఫీల్డ్ ఏరియాలో 31శాతం పెరిగాయి. ఆ తర్వాతి స్థానంలో సర్జాపూర్ రోడ్డు ప్రాంతంలోని అద్దె ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు అనరాక్ తన నివేదికలో వెల్లడించింది. 🏘️సర్జాపూర్ రోడ్లో నెలవారీ సగటు అద్దె ఇల్లు ధర 2022 ఏడాది ముగిసే సమయానికి రూ.24,000 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి అదే రెంట్ ధర రూ.30,500కి చేరింది. 🏘️ఇక 9 నెలల కాలంలో హైదరాబాద్‌లో రెంట్ ధరలు 24 శాతం పెరగ్గా.. పూణేలో 17 శాతం పెరిగాయి. హైదరాబాద్ గచ్చీబౌలి ప్రాంతంలో అద్దె ఇల్లు ధరలు 2022 ముగిసే సమయానికి రూ.23,400 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ.29,000కి చేరింది. 🏘️ అదే పూణేలో 2022 ముగిసే సమయానికి రూ.21,000 ఉన్న అద్దె ఇల్లు ధర ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ.24,500కి చేరింది. 🏘️బళ్లారిలో 2బీహెచ్‌కే అద్దె రూ.24,600 నుంచి రూ.28,500కు పెరిగింది. 🏘️వైట్ ఫీల్డ్ ప్రాంతంలో వెయ్యి చదరపు చదరపు అడుగుల్లో ఉన్న 2 బీహెచ్‌కే ఇంటి సగటు నెలవారీ అద్దె 2022 ఏడాది చివరి నాటికి రూ.24,600 ఉండగా 2023, సెప్టెంబర్ నెల ముగిసే సయానికి రూ.28,500కి పెరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతాలో అద్దె ఇల్లు ధర 9 శాతంనుంచి 14 శాతానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రస్తుత త్రైమాసికంలో చాలా నగరాల్లో అద్దె ఇంటి ధరలు స్థిరంగా ఉండొచ్చు. ఎందుకంటే? అద్దె సాధారణంగా సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తక్కువగా ఉంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో నియామకాలు పెరిగిన నేపథ్యంలో భారతీయులు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. కాబట్టే జనవరి-మార్చి కాలంలో అద్దెలు మళ్లీ పెరుగుతాయి' అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి అన్నారు. -
అద్దె విషయంలో అవకతవకలు.. ఇలా చేయకండి!
యజమాని చెల్లించే జీతభత్యాల్లో ‘‘ఇంటద్దె అలవెన్సు’’ ఒక ముఖ్యమైన అంశం. పెద్ద అంశం. దీని వెనుక రహస్యం ఏమిటంటే ‘‘ఇంటద్దె అలవెన్స్’’తో పన్నుపరంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇతర అలవెన్సుల కన్నా ఇక్కడ అవకాశమూ, వెసులుబాటు ఎక్కువ. తండ్రి పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో ఉంటూ, తండ్రికి అద్దె ఇచ్చినట్లు రసీదు చూపించి, ఇంటద్దె అలవెన్స్‌కి పూర్తిగా మినహాయింపు పొందే సుపుత్రులు ఎందరో. ఈ కట్టుకథని నిజం చేయాలంటే నిజంగానే తండ్రి అకౌంటులో అద్దె జమ చేయండి. తండ్రి ఆదాయంలో ఈ మొత్తాన్ని ఆదాయంగా చూపించి బైటపడండి. ఇలా అద్దె పుచ్చుకున్న వారు ట్యాక్స్ లిమిట్స్‌లోకి రాకుండా జాగ్రత్త పడండి.. నాన్నకు ప్రేమతో నమస్కారం పెట్టండి. ‘‘ఇల్లరికంలో ఉంది మజా’’ అంటూ మావగారింట్లో పూర్తిగా తిష్టవేసిన అల్లుళ్లు ఉన్నారు. ‘‘అల్లుడా ..మజాకా’’ అని మావగారు భయపడకుండా పైన చెప్పినట్లు చేయండి. అలా చేస్తే ఉభయకుశలోపరి. ఆఫీసులోని అధికారితో గల ప్రేమో, అభిమానమో, నాటకమో, చొరవో, చనువో .. దొంగ రసీదు ఇచ్చి క్లెయిం చేసే ప్రబుద్ధులెందరూ. స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యుల పేరుతో రసీదు, లేని ఇంటి నంబరుతో రసీదు, తప్పుడు ఇంటి పేరు మీద రసీదు, నాన్ రెసిడెంటు సంతానం పేరున రసీదు, భార్యభర్తలు కలిసి ఉంటూ ఒక ఇంటి మీద చెరొక రసీదు లేదా చెరొక ఇంటి నంబరుతో రసీదు, కుడి చేత్తో ఒక రసీదు .. ఎడమ చేత్తో ఒక రసీదుపై సంతకాలు పెట్టడం .. తన పేరు మీద ఇల్లున్నా ఏదో ఒక నంబరుపై రసీదు చూపించడం వంటివి ఎన్నో జరుగుతుంటాయి. హైదరాబాదులో అసలే ఇంటి నంబర్లు పది అంకెలు దాటి ఉంటాయి. ఒకో నంబరుకు నాలుగు బైలు(/) .. రెండేసి ఇంగ్లీషు అక్షరాలు కూడా ఉంటాయి. పోస్ట్‌మ్యాన్‌కి దొరక్కపోవచ్చు. గూగుల్ మ్యాప్‌కి కూడా అందకపోవచ్చు. కానీ డిపార్టుమెంటుకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా? ఈ డమ్మీ ఆటకు పేకాటలో ‘‘రమ్మీ’’లో జోకర్లాంటి వెసులుబాటు ఉంది. మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. మీరు ఎవరినైతే సృష్టించారు ఆ వ్యక్తి నిజంగానే ఉండాలి. ఆ ఇల్లు ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి. అప్పుడు అద్దెను వారు తమ ఆదాయంగా డిక్లేర్ చేసి, ఇన్‌కంట్యాక్సు రిటర్నుల్లో ఇన్కమ్గా వేయాలి. పన్ను పరిధిలోకి రాకపోతే సమస్య లేదు. తక్కువ శ్లాబులు పడ్డా మీకు లాభమే. పన్ను భారం తగ్గకపోతే ఆ జోలికి వెళ్లకండి. లక్ష రూపాయల్లోపల రసీదులు అడగరు. బీ హ్యాపీ. ఇదీ చదవండి: ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. దీర్ఘకాలంలో తిరుగులేని పనితీరు! జీవిత భాగస్వామి పేరు మీద ఇల్లు ఉండి, ఆ వ్యక్తి పన్ను పరిధిలోకి రాకపోతే ఈ ప్లానింగ్ చేయండి. కానీ నిజంగా చెల్లించడం, అటు పక్క వ్యక్తికి ఆదాయంగా చూపించడం, నిజమైన రసీదు, నిజమైన డిక్లరేషన్స్తో అంతా నిఖార్సయిన వ్యవహారంగా ఉండాలి. ఎందుకంటే, డిపార్ట్మెంట్ వారి దగ్గర దొంగ రశీదుల వ్యవహారం రుజువులతో సహా ఉంది. అద్దె విషయంలో అవకతవకలకు పాల్పడకండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఇక ఇల్లు కొనడం కష్టమేనా? పోల్‌లో నిపుణుల అంచనాలు!
దేశంలో రానున్న రోజుల్లో మధ్య తరగతి వర్గాలు ఇల్లు కొనడం కష్టంగా మారొచ్చు. రాయిటర్స్ ప్రాపర్టీ అనలిస్ట్స్ పోల్ (Reuters poll of property analysts) ప్రకారం.. భారత్‌లో ఇల్లు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత క్షీణిస్తుంది. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న ప్రాపర్టీ అనలిస్టులు ఇళ్ల ధరలు ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో సగటున 7 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పోల్‌లో ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే ఏడాది 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయగా ఈసారి ఆ అంచనాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇళ్ల ధరలు తగ్గుముఖం పడతాయని లేదా స్తబ్దుగా అయినా ఉంటాయని వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయితే భారత్‌లో మాత్రం గత మూడు సంవత్సరాలలో విపరీతమైన ప్రాపర్టీ కొనుగోళ్లు జరగలేదు. వార్షికంగా సగటున 2-3 శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటిసారి ఇల్లు కొనేవారిపై ప్రభావం అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా హౌసింగ్ సప్లయిలో సవాళ్లు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధర ఇళ్ల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇళ్ల డిమాండ్ ఎప్పుడూ సమస్య కానప్పటికీ సప్లయి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పోల్‌లో అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు స్పందిస్తూ మెజారిటీ మంది మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత రాబోయే సంవత్సరంలో మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. పెరగనున్న ఇంటి అద్దెలు ఇళ్ల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు స్థోమత తగ్గి చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు స్పందిస్తూ పోల్‌లో పాల్గొన్నవారంతా ఇళ్ల అద్దెలు పెరుగుతాయని అంగీకరించారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల కారణంగా ఇళ్ల అద్దెల్లో గణనీయమైన పెరుగుదలను అంచనా వేశారు. -
ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?
మంచి ఉద్యోగం రావాలంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మంచి మార్కులుంటేనే ఇల్లు అద్దెకు లభిస్తుంది. వినటానికి ఇది కొత్తగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. ఈ సంఘటన ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన సంఘటనలో హౌస్ బ్రోకర్, హౌస్ ఓనర్, రెంట్ కోసం వచ్చిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ట్విటర్ అకౌంట్ ద్వారా వైరల్ అయింది. ఇందులో 'మీ మార్కులు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయో లేదో తెలియదు కానీ బెంగళూరులో అద్దెకి ఉండాలంటే మాత్రమే నిర్ణయించేది మీ మార్కులే' అని శుభ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంతో బెంగళూరులో ఒక ఇంటి ఓనర్ మా కజిన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వలేదని, ఇది అస్సలు నమ్మలేకపోతున్నానని శుభ్ ట్వీట్ చేశారు. నిజానికి యోగేష్ అనే వ్యక్తి అద్దె ఇంటికోసం బ్రోకర్ ని సంప్రదించాడు. అతడి ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసిన హౌస్ ఓనర్ లింక్డ్ఇన్, ట్విట్టర్ వంటి ఫ్రొఫైల్స్ తో పాటు పదవతరగతి, ఇంటర్ మార్క్స్ కార్డ్స్, పాన్, ఆధార్ కార్డుతో పాటు 150 నుంచి 200 పదాల్లో తన గురించి ఇంట్రో రాసి పంపాలని చెప్పాడు. (ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..) హౌస్ ఓనర్ చెప్పినవన్నీ యోగేష్ చేశారు. అయితే ఇంటర్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ఇప్పటికి 15 లక్షల మందికి పైగా చూసారు. కొంతమంది రాబోయే రోజుల్లో బెంగళూరులో అద్దె ఇంటికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా పెడతారేమో అంటూ కామెంట్ చేసాడు. "Marks don't decide your future, but it definitely decides whether you get a flat in banglore or not" pic.twitter.com/L0a9Sjms6d — Shubh (@kadaipaneeeer) April 27, 2023 ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
సర్వీస్ ఛార్జీల మోత : ‘ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్’
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు కార్డు వినియోగదారులకు సమాచారం అందించింది. కస్టమర్లకు ఎస్బీఐ పంపిన మెసేజ్ ప్రకారం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా రెంటు పే చేస్తే.. ఆ రెంటుపై రూ.99+ జీఎస్టీ 18శాతం వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ నెలనుంచి అమల్లోకి రానున్నట్లు అందులో పేర్కొంది. ఉదాహరణకు.. సురేష్ తన ఇంటిరెంట్ రూ.12వేలను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లించేవారు. బ్యాంకు సైతం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేసేవి కావు. కానీ తాజాగా ఎస్బీఐ తెచ్చిన నిబంధన మేరకు..సురేష్ తన ఇంటి రెంటును రూ.12వేలు చెల్లించడంతో పాటు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.99, జీఎస్టీ 17.82 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ప్రాసెసింగ్ ఫీజును పెంచింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే .. ఆ వస్తువు ధర ప్రాసెసింగ్ ఫీజు రూ.199 (అంతకు ముందు రూ.99 ఉంది), 18శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంది. -
వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
సాధారణంగా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులను చాలా సేవలకు కస్టమర్లు ఉపయోగిస్తుంటారు. అందులో ప్రధానంగా క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె కడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే ఫీజులు వసూలు చేయనుంది. అక్టోబర్ 20 నుంచి ఈ పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్‌లు ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఐసీఐ వసూలు చేయనున్న రుసుముకి ఇది అదనం కానుంది. ప్రస్తుతానికైతే ఈ ఫీజు వసూలు చేసే జాబితాలో ఐసీఐసీఐ మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మిగతా బ్యాంకులు ఈ తరహా నిర్ణయాన్నే తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వెనక ఇంత కథ జరుగుతుందా! అందుకే.. అసలు కథేంటంటే.. క్రెడ్( Cred), రెడ్ గిరాఫీ( RedGiraffe), మైగేట్( Mygate), పేటీఎం( Paytm) మ్యాజిక్ బ్రిక్స్( Magicbricks) వంటి ప్లాట్‌ఫాంలో ఇంటి అద్దెను క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించే వెసలుబాటు ఉంటుంది. ఈ ప్లాట్‌ఫాంలో కస్టమర్లు తమ కుటుంబాన్ని లేదా స్నేహితులను ఇంటి ఓనర్లుగా చేర్చుకుని, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డుని ఉపయోగించడం ద్వారా నగదు పొందుతున్నారు. సాధారణంగా అయితే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం( ATM) నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే 2.5-3% వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెడ్ గిరాఫీ( RedGiraffe) మినహా ఈ సేవలను అందిస్తున్న అన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రెంట్ పేమెంట్ ధృవీకరించే అద్దె ఒప్పందాన్ని అడగడం లేదు. దీంతో క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఫీచర్ ద్వారా అద్దె చెల్లింపు పేరుతో కొందరు కస్టమర్లు సులభంగా, ఏ ఫీజులు లేకుండా నగదుని పొందే అవకాశం ఉంది. ఇటీవల ఈ తరహా చెల్లింపులు ఎక్కువ కావడంతో బోగస్ పేమెంట్లను ఆపేందుకే ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
అద్దె పెరిగి ఎవరూ రాకపోయేసరికి జీఎస్టీ వారికే ఫ్రీగా ఇచ్చేశా!
అద్దె పెరిగి ఎవరూ రాకపోయేసరికి జీఎస్టీ వారికే ఫ్రీగా ఇచ్చేశా! -
ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో వ్యభిచారం.. ఐదుగురు అరెస్టు
సాక్షి, పటాన్చెరు(మెదక్): విశ్వసనీయ సమాచాం మేరకు ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసి ముగ్గురు నిర్వాహకులను, ఇద్దరు మహిళలను, అరెస్టుచేశారు. ఈ సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాలు. జనగామ జిల్లా చిన్నరాంచెర్లకు చెందిన సాదుపల్లి శంకర్ ప్రసాద్,భార్య ప్రతిభ, బావమరిది దీపక్ కలిసి ఆరునెలల క్రితం అమీన్పూర్ మండల పరిధిలో మెట్రో న్క్లేవ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వైజాగ్ కు చెందిన ముష్కాన్ ఫాతిమా, అస్సాంకు చెందిన మొంజిల ఖాతూన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేసి ముగ్గురు నిర్వాహకులను ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
Hyderabad: ఇల్లు ఇప్పిస్తానంటూ స్నేహితులతో కలిసి..
సాక్షి, గోల్కొండ (హైదరాబాద్): ఇల్లు ఇప్పిస్తానంటూ ఓ మహిళపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాలెనగర్ కంచెకు చెందిన ఓ మహిళ (28) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది. ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆమెను కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఉండే రఫీక్ పరిచయం చేసుకున్నాడు. షాహిన్ నగర్లో ఇల్లు ఇప్పిస్తానంటూ ఒక రోజు ఆమెను కార్లో ఎక్కించుకుని పాతనగరం తీసుకెళ్లాడు. అక్కడ బంధించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. ఫొటోలు కూడా తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేశాడు. కాగా ఈ ఘటనపై గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. దీనిపై వివరణ కోరగా..బాధితురాలి ఫిర్యాదుపై శుక్రవారం కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చదవండి: (చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు) -
తల్లిదండ్రుల మీద బతికేటోళ్లకు బంపరాఫర్
తల్లిదండ్రులకు పిల్లలు భారమా?.. ఓ వయసుకి వచ్చేసరికి పిల్లలు తమ కాళ్ల మీద తాము బతకాలని ప్రతీ తల్లీతండ్రి కొరుకుంటారు. కానీ, ఆ వయసు దాటిన తర్వాత కూడా గడపదాటకుండా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతుంటారు కొందరు. కారణాలు ఏవైనా.. ఈ కల్చర్‌ను తగ్గించేందుకు నాలుగున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న స్పెయిన్ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా.. దూరంగా బతికే పిల్లలకు నెలకు 250 పౌండ్లు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాన్షెజ్(49) స్వయంగా జాతిని ఉద్దేశించి మంగళవారం ఈ ప్రకటన చేశారు. 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు పిల్లలు.. పేరెంట్స్‌కు దూరంగా, విడిగా ఉంటే నెలకు 250 పౌండ్లు(290 డాలర్లు.. మన కరెన్సీలో 21 వేల రూపాయలకు పైనే) ఇస్తామని ప్రకటించారాయన. అయితే ఇందుకు కొన్ని కండిషన్ కూడా పెట్టారు. కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు.. ఏదైనా పని చేసుకుంటూ ఉంటేనే ఈ అమౌంట్ ఇస్తారట. అందులో ఏడాదికి 23 వేల పౌండ్లు సంపాదిస్తేనే.. ఈ బంపరాఫర్ వర్తిస్తుందని ప్రకటించారాయన. పైగా ప్రభుత్వం ఇచ్చే ఆ 250 పౌండ్లను అద్దె కోసమే ఖర్చు చేయాలని, అదీ రెండేళ్లపాటు ఇవ్వనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్‌లో గత కొన్నేళ్లుగా నిరక్షరాస్యత, నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. ఉద్యోగాలు లేక బద్ధకంగా మారిపోతోంది యువత. దీంతో 30 పడిలో పడ్డా కూడా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. విశేషం ఏంటంటే.. సంపాదించే స్తోమత ఉన్నవాళ్లు సైతం అద్దెను తప్పించుకునేందుకు తమ భార్యాపిల్లలతో తల్లిదండ్రుల ఇళ్లలోకి చేరిపోతున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్లు సైతం అద్దెను మిగిల్చుకునేందుకు ఇలా తల్లిదండ్రుల పంచన చేరుతున్నారు. సొంత ఇళ్ల కొనుగోళ్ల సంగతి సరేసరి. ఈ కారణాలతో ‘ఇళ్ల మార్కెట్’ సైతం దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితి ఒక్క స్పెయిన్లోనేకాదు.. ఇటలీ, గ్రీస్ ఇలా దాదాపు ఈయూ దేశాల్లో ఇలాంటి సినారియోనే కనిపిస్తోంది. అందుకే స్పెయిన్ ప్రధాని పెడ్రో ‘హౌజింగ్ ప్లాన్’ రూపొందించి.. ఇలా ఆఫర్ల ద్వారా ఆకట్టుకుని హౌజ్ మార్కెటింగ్ ఆదాయం పెంచుకునేందుకు, యువతకు పట్టిన బద్ధకాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పోర్న్ వీడియోలు.. న్యాయం చేయమంటే ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి? -
అద్దెకిస్తాం! అమ్మేస్తాం!!
బహుశా ఇది కనివిని ఎరుగని విషయం. ఇంకా చెప్పాలంటే, ఊహకైనా అందని అంశం. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి (పీఎం) అధికారిక నివాస భవనాన్ని అద్దెకిస్తామని ఓ ప్రభుత్వం ప్రకటించడం ఎక్కడైనా విన్నారా? కార్ల మొదలు పాడి గేదెల దాకా ప్రభుత్వమే అమ్మేయడం ఎక్కడైనా కన్నారా? అవి ఇప్పుడు మన సోదరదేశం పాకిస్తాన్లో చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లోని తన అధికారిక నివాస భవనాన్ని ఇప్పుడు విందు వినోదాలు, వివిధ విద్యా, సాంస్కృతిక, ఫ్యాషన్ ప్రదర్శనలకు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా వచ్చే డబ్బు కొంతలో కొంతయినా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలను తగ్గిస్తే అదే పదివేలని భావిస్తున్నారు. కానీ, అధికారిక నివాసాలకు వచ్చే కిరాయి డబ్బులతో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు తీరతాయా అన్నది ప్రశ్న. ఇమ్రాన్ సారథ్యంలోని పాలక ‘పాకిస్తాన్ తెహరీక్–ఎ–ఇన్సాఫ్’ (పీటీఐ) సర్కార్ 2019 ఆగస్టులోనే అధికారిక నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించింది. అప్పట్లోనే అలాగే, వివిధ రాష్ట్రాల గవర్నర్లు సైతం అధికారిక నివాసాలలో కాకుండా, మామూలు ఇళ్ళలో ఉంటూ ఖర్చు తగ్గిస్తామన్నారు. అధికారిక నివాసాన్ని వదిలేసి, మరో ఇంటికి ఆ ఏడాదే ఆయన మారిపోయారు. పీఎం నివాసాన్ని నిర్వహించడానికి ఏటా రూ. 47 కోట్లు ఖర్చవుతాయి. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆ ఇల్లు ఖాళీ చేస్తే, ఖర్చు కలిసొస్తు్తందన్నది ఆలోచన. అంతకు ముందు 2018 సెప్టెంబర్‌లోనూ ఇమ్రాన్ ఇలాంటి పనే చేశారు. అంతకు ముందు ప్రధాని నవాజ్ షరీఫ్ పీఎం నివాసంలో పెట్టుకున్న ఎనిమిది పాడిగేదెల్ని రూ. 23 లక్షలకు అమ్మేశారు. గత వారమేమో 61 లగ్జరీ కార్లు అమ్మేసి, రూ. 20 కోట్లు ఆర్జించారు. ఇంకా 102 కార్లు, నాలుగు హెలికాప్టర్లను వేలం వేయాలని ప్లాన్. వీటి వల్ల కలిసొచ్చిన ఖర్చు, చేతికొచ్చిన సొమ్మెంతో కానీ, నెగిటివ్‌గానో, పాజిటివ్‌గానో ఇమ్రాన్‌కు ప్రచారమైతే దక్కింది. ఇవన్నీ పొదుపు చర్యలని పాలకులంటే, వట్టి జిమ్మిక్కులన్నది ప్రతిపక్ష వాదన. వర్ధమాన దేశమైన పాక్ కొండంత అప్పుల్లో ఉంది. అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం సాక్షాత్తూ ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ సంస్థ (ఐఎంఎఫ్) ఇచ్చిన ప్యాకేజీలో ఆ దేశం ఇప్పటికే భాగం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, నిరుడు మొదలైన కరోనా ఆ దేశం నడ్డి విరిచింది. పంచదార, గోదుమల మొదలు టమోటాలు, ఉల్లిపాయలు, మాంసం, కోడిగుడ్లు – నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. ఒకదశలో అక్కడ డజను కోడిగుడ్లు రూ. 200 నుంచి 240 దాకా పలికాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టడానికి తగినంత డబ్బు లేదని మూడేళ్ళ క్రితం ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడే ఇమ్రాన్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. కానీ, పేరుకున్న అప్పులలో ఓ పంటి కిందకు కూడా రాని తాజా పొదుపు చర్యలు ఆ దేశ ఆర్థిక దురవస్థకు మచ్చుతునకలు. అంతర్జాతీయ సమాజంలో మర్యాదను తగ్గించే మరకలు. అసమర్థ నాయకత్వం, అవినీతి, అనవసరమైన యుద్ధ ప్రియత్వం, అంతకంతకూ పెరుగుతున్న జనాభా, ఆర్థిక రంగంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, పెంచిపోషిస్తున్న తీవ్రవాదం లాంటివన్నీ పాకిస్తాన్ ప్రస్తుత దుఃస్థితికి కారణాల్లో కొన్ని. వాటిని సరిదిద్దుకోకుండా, అప్పుల కోసం చైనాతో దోస్తీ కడుతూ, అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు తానాతందానా అంటూ, భారత్‌తో కయ్యానికి దిగుతూ... పాకిస్తాన్ మరింత ఊబిలోకి దిగబడిపోతుండడమే విచిత్రం. గాయం ఒకచోటైతే, మందు మరొకచోట రాయడమంటే ఇదే! పాకిస్తాన్‌ను దిగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా 2008 నుంచి వర్గీకరించారు. ఉపఖండంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటున్నదీ పాక్‌లోనే! అలాగే, ప్రపంచంలోకెల్లా అధిక జనాభా ఉన్న దేశాల్లో అయిదో స్థానమూ పాక్‌దే. 1951 నుంచి 2017 మధ్య కాలంలో పాక్ జనాభా ఆరు రెట్లు పెరిగింది. 3.4 కోట్ల నుంచి 20.8 కోట్లు అయింది. జనాభా పెరుగుదలను అరికట్టి, సరైన చర్యలు తీసుకోకపోతే 2017 నుంచి 2050 మధ్య జనాభా ఏకంగా 84 శాతం మేర పెరుగుతుందని ఊహ. అదే సమయంలో ఆర్థిక వృద్ధి ఏమో కనాకష్టం. కనీసం మరో నాలుగైదేళ్ళ పాటు పరిస్థితి దయనీయంగా ఉంటుందని అంచనా. విద్య, ఉపాధిలోనే కాదు... చివరకు మహిళలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాల్లోనూ పాక్ వెనుకబడి ఉంది. ఉన్నంతలో సేవారంగాల్లో ఉపాధి దొరుకుతోంది కానీ, పారిశ్రామిక, వస్తూత్పత్తి రంగాలు బలహీనమే. ఇవన్నీ పాక్‌ను పట్టిపీడిస్తున్న పెను సమస్యలు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వీటిని చక్కదిద్దడంలో సఫలం కాలేదు. అందుకు సరైన ప్రయత్నమూ చేసినట్టు కనిపించలేదు. చివరకు, ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్) దేశాల ‘గ్రే లిస్టు’ నుంచైనా ఆ దేశం బయట పడనే లేదు. ఇలా చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉంటే, అద్దెలు, అమ్మకాల కంటితుడుపు చర్యలతో ఏం లాభం? మొత్తం మీద క్రికెట్ కెప్టెన్సీ కన్నా దేశనాయకత్వం కష్టమని 1992లో పాక్‌కు ఏకైక క్రికెట్ వరల్డ్ కప్ సాధించి పెట్టిన సారథి ఇమ్రాన్‌కు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆర్థికంగా దేశం గాడిన పడాలంటే ప్రచారం కోసం చేసే ప్రతీకాత్మక చర్యలు చాలవని ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. తీసుకోవాల్సిన అసలు చర్యలు, చేపట్టాల్సిన ఆర్థిక వ్యూహాలు, మార్చుకోవాల్సిన రాజకీయ వైఖరుల మీద ఇప్పటికైనా దృష్టి పెడితే పాకిస్తాన్‌కు మంచిది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్నా దాయాది దేశం ఇలా మిగలడం మాత్రం ఇప్పటికీ సోదరభావం ఉన్నవారికి విచారకరమే. -
అద్దె చెల్లించని నటి.. అర్ధరాత్రి నడిరోడ్డుపైకి పడేశారు
సాక్షి, చెన్నై: నటి విజయలక్ష్మిని సినిమా కష్టాలు వీడటం లేదు. అద్దె చెల్లించలేదంటూ ప్లాట్ మేనేజర్ ఆమె సామాన్లు బయట పడేశాడు. రోడ్డున పడ్డ ఆమె అర్ధరాత్రి వేళ చేసిన హంగామాతో చివరకు పోలీసులు ప్రత్యామ్నాయం కల్పించారు. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్ తనను మోసం చేశారంటూ గతంలో నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మహత్యాయత్నాలు చేయడం వంటి పరిణామాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సీమాన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో నామ్ తమిళర్ కార్యకర్తలు పలుమార్లు ఆమెకు బెదిరింపులు కూడా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అంటూ సినిమా కష్టాలు విజయలక్ష్మిని వీడటం లేదు. చదవండి: (కారులో నగ్నంగా వీడియో తీసి వేధిస్తున్నాడు!) సామాన్లు బయట పడేశారు! టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్మెంట్లో విజయలక్ష్మి, ఆమె సోదరి ఉన్నారు. ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం రాత్రి డిశ్చార్జ్ కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు షాక్ తప్పలేదు. తమ ప్లాట్‌లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్‌లో రాజకీయ నేత హరినాడర్ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. కాసేపు తన దైన శైలిలో ఆమె హంగామా సృష్టించారు. తామేమీ ఆమె సామాన్లు బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, తమ ప్లాట్ సిబ్బంది శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేనేజర్ విఘ్నేశ్వరన్ పేర్కొన్నారు. హరినాడర్‌కు ఈ ప్లాట్‌కు సంబంధం లేదని, ఆమెను జావెద్ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఈ వ్యవహారం ముదరడంతో పాటు సీమాన్ నువ్వయినా ఆదుకో అంటూ విజయలక్ష్మి కన్నీటి పర్యంతం కావడంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. తేనాంపేట పోలీసులు విచారించి విజయలక్ష్మికి ప్రత్యామ్నాయం కల్పించారు. అయితే ఇది తాత్కాలికం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సీమాన్‌ను నోటికి వచ్చినట్టు దుమ్మెత్తి పోసిన విజయలక్ష్మి తాజాగా తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. -
భార్య పుట్టినరోజు.. దుకాణదారులకు అద్దె రద్దు
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తగిన ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్న దుకాణదారులకు తన భార్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక నెల అద్దె రద్దు చేసిన యజమాని ఔదార్యాన్ని అందరూ ప్రశంసించారు. చెన్నై మాధవరం నెహ్రు వీధికి చెందిన ఏలుమలై(58) మాధవరం తహసీల్దార్ మండల కార్యాలయం ఎదురుగా అతనికి సొంతంగా నిర్మించబడిన కట్టడాల్లో 14 దుకాణాలు వున్నాయి. వాటిలో టీ దుకాణం, జెరాక్స్ దుకాణం, సెలూన్ దుకాణం, ఫోటోస్టూడియో తదితర దుకాణాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా దుకాణాలకు తాళం వేసి ఉండడంతో వారికి సరైన ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో యజమాని ఏలుమలై తన భార్య పరమేశ్వరి(49) జన్మదినాన్ని పురస్కరించుకుని దుకాణదారులకు సాయపడాలని ఆలోచనలతో వారికి ఒక నెల అద్దెను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి ఏలుమలై మాట్లాడుతూ దుకాణాల నుంచి తనకు ఒక నెలకు మొత్తం రూ.99,150 వస్తుందని, ప్రస్తుత కాలంలో ఏర్పడిన లాక్డౌన్ కాలంలో ఈ మొత్తం తనకు ముఖ్యమైన అవసరమే కానీ, తన భార్యకు 49వ పుట్టిన రోజు కావడంతో కష్టంలో ఉంటున్న వారికి సహాయపడాలనే ఉద్దేశంతో నెల అద్దెను రద్దు చేసినట్లు అతను తెలిపారు. కరోనా నేర్పిన గుణపాఠం అని ప్రతి ఒక్కరూ కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకుంటే కరోనాను తరిమికొట్టవచ్చునని తెలిపారు. చదవండి: ఇక మరింత కఠినంగా లాక్డౌన్.. -
మూడు నెలల అద్దె రద్దు.. దుకాణదారుల్లో హర్షం
సాక్షి, తమిళనాడు : పట్టుకోటైలో ఓ డాక్టర్ దుకాణాల అద్దెలను రద్దు చేసి వ్యాపారులకు అండగా నిలిచారు. తంజావూరు జిల్లా పట్టుకోటైకు చెందిన కనకరత్నం (91). అతని భార్య రాజ్యలక్ష్మి. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. కుమారుడు స్వామనాథన్ కోడలు వర్ష డాక్టర్‌గా పని చేస్తున్నారు. రత్నం తనకు సొంతమైన స్థలంలో ఆరు కట్టడాలు నిర్మించి అద్దెకు ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా దుకాణాలకు తాళం వేయబడి ఉంది. ఈ అద్దెదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో నెలకు రూ.1.5 లక్షల చొప్పున మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల మొత్తం రూ.4.5 లక్షలు రద్దు చేశాడు. చదవండి: అక్కడబ్బాయి..ఇక్కడమ్మాయి.. నడిరోడ్డుపై పెళ్లి దీనిపై దుకాణదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మానవ దృక్ఫథంతో డాక్టరు చేసిన ఈ పనికి పలువురు అభినందనలు తెలిపారు. దీనిపై కనకరత్నం మాట్లాడుతూ.. లాక్డౌన్లో వ్యాపారులు ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం అందించారని, వారు ఇబ్బంది పడకుండా అద్దె రద్దు చేసినట్లు తెలిపారు. దీని గురించి వ్యాపారులు మాట్లాడుతూ తన వద్దకు చికిత్సకు వచ్చే రోగుల వద్ద ఇప్పటి వరకు రూ.10 ఫీజు వసూలు చేసినట్లు చెప్పారు. కుమారుడు, కోడలు రూ.50 తీసుకుని వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. చైనా యుద్ధం జరిగిన సమయంలో తన కుమార్తె వివాహం దాచిన 83 సవర్ల నగలను కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా అందచేసినట్లు తెలిపారు. చదవండి: 32 మంది రైతులపై కేసు -
3 నెలలు ఇంటి అద్దెలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అద్దె వసూళ్లను ఈ ఏడాది మార్చి నుంచి మూడు నెలల పాటు వాయిదా వేసుకోవాలని ఇంటి యజమానులను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీఎస్ ఆదేశించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అద్దె వసూళ్లను వాయిదా వేయాలని, ఆ తర్వాతి కాలంలో వాయిదాల పద్ధతిలో ఈ అద్దెలను వడ్డీ లేకుండా వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విపత్తుల నివారణ చట్టం, అంటురోగాల నియంత్రణ చట్టాలు కల్పిస్తున్న విశేష అధికారాలను ఉపయోగిస్తూ పురపాలక శాఖ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. శాశ్వత, సగం శాశ్వత, తాత్కాలిక కట్టడాలను అద్దెకు ఇచ్చిన వారికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించిన అధికారాలను జీహెచ్ఎంసీ కమిషనర్‌తో సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లకు జిల్లా విపత్తుల నివారణ కమిటీ చైర్మన్లు అయిన జిల్లా కలెక్టర్లు కట్టబెట్టాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి అద్దెలు వసూలు చేస్తే అంటురోగాల నివారణ చట్టంతో పాటు విపత్తుల నివారణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనాను అరికట్టే నేపథ్యంలో.. కరోనా వైరస్ నిర్మూలన కోసం మార్చి 22 నుం చి రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తుండటంతో అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. (ప్రభు త్వ, ప్రైవేటు) జీతాలు చెల్లించడం కూడా కష్టం గా మారింది. కొందరి వ్యక్తుల జీతాల్లో 40 శాతం వరకు ఇంటి అద్దెలే ఉంటున్నాయి. ఈ క్రమంలో అద్దె ఇళ్లలో నివాసముండే పెద్ద సం ఖ్యలోని జనాభా అద్దెలు చెల్లించలేక ఇబ్బందు లు ఎదుర్కొంటోంది. అద్దె చెల్లించలేదనే కారణంతో వారిని ఇంటి యజమానులు ఖాళీ చేయించే ప్రమాదముంది. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితిలో ఇలా నిరాశ్రయులైన కుటుంబాలు, వ్యక్తు లు బహిరంగ ప్రదేశాల్లో నివాసముంటే వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదముంది. దీంతో వైరస్ వ్యాప్తి మరింత పెరగనుంది. ఈ కారణాల నేపథ్యంలో అద్దెల వసూళ్లను వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది. -
3నెలల అద్దె వద్దన్న యజమాని
భాగ్యనగర్‌కాలనీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదల జీవితాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు ఏర్పాడ్డాయి. గత నెల రోజులుగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంతో ఎవరూ పనులు చేసుకోలేక ఇంటికే పరిమితమయ్యారు. అయితే నెల రోజులుగా పని చేయకపోవడంతో ఇంటి అద్దె, నిత్యావసరాలకు ఇబ్బందులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇంటి అద్దె విషయంలో ఇళ్ల యజమానులు కిరాయిదార్లను ఇబ్బందులు పెట్టొదని కోరారు. హైదర్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డికి తులసినగర్‌లో సొంత ఇల్లు ఉంది. అందులో 10 పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి పరిస్థితి తెలిసిన దామోదర్‌రెడ్డి మూడు నెలల వరకు అద్దె చల్లించాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆ పది కుటుంబాలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాయి.(ప్రార్థనలు ఇలా..) -
అద్దె మాఫీ
మనిషి జీవితం సంక్షోభంలో పడినప్పుడు మానవత్వం పరిమళిస్తుంది. వ్యాపారికి డబ్బే ప్రధానం అని మనందరిలో ఒక అభిప్రాయం కరడుగట్టి పోయి ఉంటుంది. అలాంటిది ఓ వ్యాపారి చిరు వ్యాపారుల కోసం ఉదారమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో దుకాణాలన్నీ మూతపడ్డాయి. వ్యాపారమే జరగనప్పుడు దుకాణం అద్దెలు చెల్లించడం కూడా బరువే. అందుకే వాళ్లకు ఒక నెల రోజులపాటు షాపుల అద్దె మాఫీ చేశాడు కేరళ, కోళికోద్లోని సి.ఈ. చక్కున్ని. సి.ఈ చక్కున్నికి దాదాపు అరవై ఏళ్ల వ్యాపార అనుభవం ఉంది. పాలక్కాడ్‌కు చెందిన చక్కున్ని ఎస్ఎస్ఎల్సి చదివిన తర్వాత కోళికోద్లోని విజయ ట్రేడర్స్‌లో సేల్స్‌బాయ్‌గా ఉద్యోగంలో చేరాడు. పనిలో మెలకువలు నేర్చుకున్న తర్వాత 1968లో ‘చక్కున్ని అండ్ కంపెనీ’ పేరుతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారం విస్తరించింది. క్రమంగా చక్కున్ని షాపింగ్ కాంప్లెక్స్‌ల మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు కోళికోద్ పట్టణంలో ప్రముఖ వాణిజ్య సముదాయాల్లో సింహభాగం ఆయనదే. అన్నింటిలో కలిపి చక్కున్నికి వంద దుకాణాలున్నాయి. కష్టం తెలిసిన మనిషి చక్కున్ని ఇప్పటి దుర్భర పరిస్థితులను వివరిస్తూ ‘‘నేను సేల్స్‌బాయ్‌గా జీవితాన్ని ప్రారంభించి, క్రమంగా సొంత వ్యాపారం మొదలుపెట్టాను. వ్యాపారి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఈ మధ్య మా భవనాల్లో దుకాణాలను అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్న మా అద్దెదారులు కొందరు... ఫోన్ చేసి పరిస్థితి గడ్డుగా ఉందని అద్దె మాఫీ చేయమని కోరారు. మా అబ్బాయిని పిలిచి బయట ఎలా ఉందని అడిగితే... దుకాణాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అద్దె కట్టడం కష్టంగానే ఉందని, కొంతమంది వాయిదా అడుగుతున్నారని చెప్పాడు. ఆ తర్వాత రోజు నేనే స్వయంగా వెళ్లాను. ఒక దుకాణానికి రోజంతా తెరిచినా ఒక్క కస్టమర్ మాత్రమే వచ్చాడని తెలిసింది. కొందరికి అసలే బేరం జరగలేదు. వాళ్ల దుకాణంలో పని చేసేసేల్స్బాయ్లకు జీతాలివ్వడానికే కష్టంగా ఉంది. నాకు అద్దె కూడా చెల్లిస్తే... ఇక ఇంటికి పట్టుకెళ్లడానికి వాళ్లకేమీ మిగలదు. ఇంటికి వచ్చి నా భార్య, పిల్లలతో మాట్లాడి... ఒక నెల అద్దె మాఫీ చేశాను. ఒక నెల అద్దె పన్నెండు లక్షలు. భగవంతుని దయ వల్ల ఒక నెల అద్దెలు రాకపోయినా ఇబ్బంది కలగని స్థితిలోనే ఉన్నాను. ఈ కరోనా ఉత్పాతం... దేశ ఆర్థిక పరిస్థితినే సంక్షోభంలోకి నెట్టి వేస్తోంది. అలాంటిది ఈ చిన్న దుకాణదారులైతే చిగురుటాకుల్లా వణికిపోవాల్సిందే. అందుకే చేయగలిగిన సహాయం చేశాను’’ అన్నారాయన. తోటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఉంటే ఎడారిలోనైనా సరే జీవితం మీద ఆశ చిగురిస్తుంది. ఎదుటి వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద చదువులు అవసరం లేదు. జీవితాన్ని చదివిన అనుభవం, ఎదుటి వాళ్ల ఇబ్బందికి స్పందించే ఆర్ద్రమైన మనసు ఉంటే చాలని నిరూపించాడు ఈ కరోనా హీరో. – మంజీర -
హైదరాబాద్ నగరంలో ఖరీదైన ప్రాంతం ఇదే..!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె ఎంత ఉంటుంది..? ఏ పది వేలో.. లేక పదిహేను వేల రూపాయలో అనుకుంటాం. కానీ నగరంలోని ఓ ప్రాంతంలో మాత్రం కనీసం రూ.25 వేలకు పైనే పెట్టనిదే అద్దె ఇల్లు దొరకదు. ఎందుకంటే ప్రముఖులు, వీవీఐపీలు ఉండే ప్రాంతమది. సకల హంగుల చోటది. అదే బంజారాహిల్స్. ‘హిల్స్’ అన్నందుకు కొండలంత ఉన్నతంగా ఖర్చు కూడా ఉంటుంది ఇక్కడ. జూబ్లీహిల్స్ కూడా కాస్త అటుఇటుగా ఇంతే ఖరీదైన ప్రాంతం. ‘అనరాక్ ప్రాపర్టీస్’ సంస్థ చేపట్టిన ఖరీదైన ప్రాంతాల అధ్యయనంలో బంజారాహిల్స్ టాప్‌లో నిలవగా జూబ్లీహిల్స్ రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్లో సంపన్నుల నివాసం ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు నాడూ.. నేడూ ఖరీదైన నివాస ప్రాంతాలుగా గుర్తింపును నిలుపుకొన్నాయి. ప్రధానంగా ఇంటి అద్దె విషయంలో గత రికార్డులను సుస్థిరం చేసుకొని ఎవర్ గ్రేట్‌గా వెలుగొందుతున్నాయి. నివాస వ్యయం పరంగా చూస్తే కొన్ని దశాబ్దాలుగా అద్దెల విషయంలోనూ ఈ ప్రాంతాలు ఆల్‌టైమ్ రికార్డును నిలబెట్టుకున్నాయి. తాజాగా ఈ ఏడాది సైతం ఇదే ట్రెండ్ కొనసాగించడం గమనార్హం. కాస్మొపాలిటన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతాల్లో సినీ, రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ముఖ్యులు, ఎన్ఆర్ఐలు స్థిర, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ ప్రాంతాల్లో సువిశాల ప్రాంగణాల్లో అత్యాధునిక వసతులున్న భవంతులు అందుబాటులో ఉండటం, ఆయా నివాస సముదాయాల ప్రాంగణాల్లోనే ఐటీ, బీపీఓ, కేపీఓ, బీమా, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఫార్మా ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాలకు సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో ఆ సంస్థల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులు, ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నివాస సముదాయాలకు గిరాకీ అమాంతం పెరగుతోంది. గ్రేటర్ పరిధిలో అత్యధిక ఇంటి అద్దెలున్న ప్రాంతాలపై ఇటీవల అనరాక్ ప్రాపర్టీస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. మహానగరంలో ఈ రెండు ప్రాంతాలతో పాటు హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, బేగంపేట్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగి, మియాపూర్, ఎల్బీనగర్ ప్రాంతాలు టాప్ టెన్ స్థానాల్లో నిలవడం గమనార్హం. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో సరాసరిన వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దెలను ప్రామాణికంగా తీసుకొని తాజా అంచనాలు రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే ఇంటి అద్దెలు సరాసరి తొమ్మిది శాతానికి పైగానే పెరిగినట్లు ఈ తాజా నివేదిక వెల్లడించింది. అద్దె పెరుగుదలకు కారణాలివీ.. ♦ ఐటీ, బీపీఓ, కేపీఓ, వాణిజ్య, బీమా, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ తదితర సేవారంగాలతో పాటు ఫార్మా తదితర రంగాల కార్పొరేట్ కార్యాలయాలకు కేంద్రాలుగా ఉండడం. ♦ ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలు, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు, ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపడం. ♦ కార్పొరేట్ పాఠశాలలు, ఆస్పత్రులకు ఈ ప్రాంతాలు నిలయంగా మారడం. అత్యాధునిక వైద్య, విద్య సదుపాయాలు వీటి సొంతం కావడం. ♦ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, పబ్‌లు, బార్లు, లిక్కర్ మాల్స్, గేమింగ్ జోన్స్, దేశ విదేశీ వస్త్ర బ్రాండ్లు, బంగారు వజ్రాభరణాలు, లెదర్, అత్యాధునిక ఇంపోర్టెడ్ ఫర్ణిచర్ షోరూమ్‌లు ఇతర షాపింగ్ అవసరాలతో పాటు ఆకాశమే హద్దుగా వినోదాన్ని పంచే రిక్రియేషన్ జోన్లు అత్యధికంగా కొలువుదీరడం. ♦ ఇళ్లలో అత్యాధునిక ఇంటిరీయర్, వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్, ఇతర వసతులు ఉద్యోగులను విశేషంగా ఆకర్షిస్తుండటం. ♦ ఈ ప్రాంతాల్లో నివాసం ఉండటంతో తమ సోషల్ స్టేటస్ పెరుగుతుందని కొందరు భావించడం. -
‘నాకు ఇళ్లు అద్దెకివ్వడానికి భయపడ్డారు’
ఒకానొక సమయంలో నాకు ఉండటానికి ఇళ్లు కూడా దొరకలేదు అంటున్నారు హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సీ.. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకున్నారు. ‘ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించే రోజుల్లో ఎన్నో కష్టాలు చవి చూశాను. ముఖ్యంగా నాకు ఎక్కడా ఇళ్లు అద్దెకు దొరకలేదు. కారణం నేను సినిమాల్లో నటిస్తానని చెప్పడం. సినిమా రంగం వారు అంటే జనాలకు పెద్దగా నమ్మకం ఉండదు. 500 ఖర్చు చేసి థియేటర్‌కు వచ్చి మమ్మల్ని చూడ్డానికి ఇష్టపడతారు కానీ మేం కూడా వారితో పాటు కలిసి ఉండటానికి వారు ఒప్పుకోరు. ఈ విషయంలో నేను చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముంబైలో నాకు ఇళ్లు దొరకడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింద’న్నారు. అదే హైదరాబాద్‌లో ఇంటి విషయంలో తనకు ఎలాంటి సమయ్యలు ఎదురుకాలేదని తెలిపారు. ‘నేను ఢిల్లీ అమ్మాయిని. ఆలోచన విధానంలో హైదరాబాద్, ఢిల్లీ రెండు ఒకేలా ఉంటాయి. ఈ ప్రదేశం నాకు ఎంతో నచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఇక్కడ కుదురుకున్నాను. ప్రస్తుతం ఓ అపార్ట్మెంట్లో నా చెల్లితో కలిసి సంతోషంగా ఉంటున్నాను. నా తల్లిదండ్రులు ఢిల్లీలోనే ఉంటున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం తాప్సీ అక్షయ్ కుమార్‌తో కలిసి మిషన్ మంగళ్ చిత్రంలో నటిస్తున్నారు. -
అద్దె ఇవ్వకుండా యజమానితో గొడవ పడిన నటుడు
యశవంతపుర : ఇంటి యజమానికి అద్దె ఇవ్వకుండా ఆయనతో గొడవ పడిన శాండిల్‌వుడ్ నటుడు ఆదిత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు ఆదిత్య సదాశివనగరలోని ఆర్‌ఎంవీ ఎక్స్టెన్షన్లో ప్రసన్న అనే వ్యక్తికి చెందిన ఇంటిలో నాలుగేళ్ల నుంచి తల్లిదండ్రులు, చెల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గత ఏడు మాసాలుగా అద్దె ఇవ్వటం మానేశాడు. దీంతో యజమాని వాదనకు దిగాడు. అద్దె బకాయి రూ. 2 లక్షల 88 వేలు చెల్లించాలి. దీంతో బాధితుడు కోర్టులో కేసు దాఖలు చేశాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఆదిత్య తిట్టిన మాటలను రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమల్లో వైరల్‌గా మారింది.