హడలెత్తిస్తున్న ఇంటి అద్దె!.. నెలకు ఇన్ని లక్షలా.. | Rs 1.35 Lakh Rent Per Month For 2BHK In Mumbai Goes Viral, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

House Rents In Mumbai: హడలెత్తిస్తున్న ఇంటి అద్దె!.. నెలకు ఇన్ని లక్షలా..

Published Sun, Sep 29 2024 2:45 PM | Last Updated on Sun, Sep 29 2024 4:04 PM

Rs 1 35 Lakh Rent For Month 2BHK in Mumbai

భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకుంటోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భూములు, అపార్ట్‌మెంట్ల ధరలు భారీగా ఉన్నాయి. అపార్ట్‌మెంట్స్ అద్దెలు కూడా ఈ నగరాల్లో అమాంతం పెరిగిపోతున్నాయి. ఇటీవల దీనికి సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జైపూర్‌కు చెందిన ఉత్కర్ష్ గుప్తా.. తన ఎక్స్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ముంబైలో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఇందులో 2 బీహెచ్‌కే హౌస్ అద్దె నెలకు రూ.1.35 లక్షలు. దీనికోసం రూ.400000 డిపాజిట్ చేయాలి అని ఉండటం చూడవచ్చు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే.. వాషింగ్ మెషీన్ టాయిలెట్ గదిలోనే ఉండటం చూడవచ్చు.

ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?

ప్రస్తుతం ఈ పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇది బ్రిలియంట్ ఐడియా అని చెబుతుంటే.. మరొకరు ఇది బాత్‌రూమేనా అని అంటున్నారు. మరికొందరు దాని అద్దె కూడా చాలా ఎక్కువని చెబుతున్నారు. మొత్తానికి దీన్ని చూస్తే ముంబైలో అద్దెలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement