దుకాణ యజమాని ఏలుమలై భార్య పరమేశ్వరి
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా తగిన ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్న దుకాణదారులకు తన భార్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక నెల అద్దె రద్దు చేసిన యజమాని ఔదార్యాన్ని అందరూ ప్రశంసించారు. చెన్నై మాధవరం నెహ్రు వీధికి చెందిన ఏలుమలై(58) మాధవరం తహసీల్దార్ మండల కార్యాలయం ఎదురుగా అతనికి సొంతంగా నిర్మించబడిన కట్టడాల్లో 14 దుకాణాలు వున్నాయి. వాటిలో టీ దుకాణం, జెరాక్స్ దుకాణం, సెలూన్ దుకాణం, ఫోటోస్టూడియో తదితర దుకాణాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా దుకాణాలకు తాళం వేసి ఉండడంతో వారికి సరైన ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్నారు.
ఈ క్రమంలో యజమాని ఏలుమలై తన భార్య పరమేశ్వరి(49) జన్మదినాన్ని పురస్కరించుకుని దుకాణదారులకు సాయపడాలని ఆలోచనలతో వారికి ఒక నెల అద్దెను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి ఏలుమలై మాట్లాడుతూ దుకాణాల నుంచి తనకు ఒక నెలకు మొత్తం రూ.99,150 వస్తుందని, ప్రస్తుత కాలంలో ఏర్పడిన లాక్‌డౌన్ కాలంలో ఈ మొత్తం తనకు ముఖ్యమైన అవసరమే కానీ, తన భార్యకు 49వ పుట్టిన రోజు కావడంతో కష్టంలో ఉంటున్న వారికి సహాయపడాలనే ఉద్దేశంతో నెల అద్దెను రద్దు చేసినట్లు అతను తెలిపారు. కరోనా నేర్పిన గుణపాఠం అని ప్రతి ఒక్కరూ కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకుంటే కరోనాను తరిమికొట్టవచ్చునని తెలిపారు.
చదవండి: ఇక మరింత కఠినంగా లాక్‌డౌన్..
Comments
Please login to add a commentAdd a comment