birthday celebration
-
కోట్ల మంది గుండె చప్పుడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, విజనరీ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారారని తెలిపారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచి్చన అభిమానుల కోలాహలంగా మధ్య జరిగిన ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు, ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.తాడేపల్లిలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీవైఎస్సార్సీపీ విద్యార్థి – యువజన – సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న.. ప్రజా సేవకా.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాడేపల్లి పురవీధుల్లో ర్యాలీ చేశారు.మేలును గుర్తుచేసుకున్న ప్రజలుగత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‘పేద ప్రజలకు సుపరిపాలన అందించిన ధీరుడు మా అన్న జగన్మోహనుడు.. పారిశ్రామిక ప్రగతిలో తనదైన ముద్ర వేశారు.. రాష్ట్రం ఎయిర్ కండీషన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ హబ్‌లకు వేదికైంది.. చదువుతోనే పేద బిడ్డల తల రాత మారుతుందని నమ్మిన ఏకైక నేత.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారందరికీ ప్రతీ పథకం ఇంటి వద్దనే అందించాలని తపనపడే మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు’ అని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. -
అంబానీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
బిజినెస్‌మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
రక్షణ రంగంలో సైంటిస్ట్ సూరి భగవంతం సేవలు అమోఘం
దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్‌లో లేహ్, తేజ్‌పూర్‌లో ప్రయోగశాలను, హైదరాబాద్‌లో డీఆర్డీఎ్ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్ఎస్టీఎల్లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్‌లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. -
బ్యూటిఫుల్ ఐలాండ్‌లో సుకుమార్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇదేం మాస్ రా మావా..!
-
సీరియల్ యాక్టర్ సునంద మాల శెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పోలీస్ స్టేషన్ లో గల్లీ లీడర్ బర్త్ డే సెలబ్రేషన్స్..
-
Klin Kaara Photos: గ్రాండ్‌గా క్లీంకార ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మండి బిర్యానీ తిని తిరిగొస్తూ..
చాంద్రాయణగుట్ట: బైక్‌పై ట్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ వచ్చి అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక జయప్రకాష్ నగర్‌కు చెందిన అమర్‌సింగ్ కుమారుడు ఠాకూర్ రాధాకిషన్(24) ఏసీ మెకానిక్. స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లేందుకు స్నేహితుడైన రోహన్ చౌకట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున బైక్ తీసుకున్నాడు.అనంతరం ఇదే ప్రాంతానికి చెందిన వైజనాథ్ ఇంగ్లే అలియాస్ సోను(30), మక్దూంపురాకు నిఖిల్(18)తో కలిసి బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ చాంద్రాయణగుట్టలో మండి బిర్యానీ తినేందుకు వెళ్లారు. బిర్యానీ తిన్న తర్వాత తిరిగి వస్తుండగా రాధాకిషన్ బైక్ నడుపుతుండగా, మధ్యలో సోను, వెనుక భాగంలో నిఖిల్ కూర్చున్నారు. తెల్లవారుజామున 3.30 గంటలకు కందికల్ ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి)పై అతివేగంగా బైక్ నడపడంతో డివైడర్‌కు తాకుతూ, ఆపై స్తంభానికి ఢీకొట్టారు. ఈ ఘటనలో వైజనాథ్ ఇంగ్లే అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన రాధాకిషన్‌ను ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలతో నిఖిల్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు యువకుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఎవరి పుట్టిన రోజు లేదని, కేవలం బిర్యానీ తినేందుకు వెళ్లామని క్షతగాత్రుడు నిఖిల్ తెలిపాడని పోలీసులు వెల్లడించారు. -
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
గచ్చిబౌలి: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్‌తో పాటు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్హెచ్ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్ పై కేక్ కట్ చేయగా , మాదాపూర్ ఎస్హెచ్ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్సెక్టర్ సంజయ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ జన్మదిన వేడుకలను శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు కేటీఆర్ ఉదయమే తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల జీవిత బీమా కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలు, పది మంది దివ్యాంగులకు వీల్ చైర్లను కేటీఆర్ పంపిణీ చేశారు. కేసీఆర్ 70వ పుట్టినరోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్‌ను ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి కేటీఆర్ కట్ చేశారు. తర్వాత కేసీఆర్ రాజకీయ జీవితం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రూ పొందించిన ‘అతనే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అలాగే కేసీఆర్ ఉద్యమ ప్రస్తానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు బీఆర్ఎస్ సభ్యత్వం కలిగి.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కో ల్పోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు 70 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నాయకులు సోమా భరత్‌కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, నేతలు అనిల్ కుమార్ కూర్మాచలం, వాసుదేవ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీశ్‌రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వేడుకలు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా అసెంబ్లీ లాబీల్లోని పార్టీ శాసనసభాపక్ష కార్యాల యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని సమర్థవంతగా ఎదుర్కొన్నారని హరీశ్‌రావును పార్టీ ఎమ్మె ల్యేలు అభినందించారు. -
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియో
-
Redin Kingsley-Sangeeta Birthday Photos: పెళ్లయ్యాక నటుడి తొలి బర్త్‌డే.. భార్య సర్ప్రైజ్ పార్టీ (ఫోటోలు)
-
8ఏళ్ల పిల్లాడు,జీవితంలో మొదటిసారి.. క్లాస్‌టీచర్ చేసిన పనికి ఎమోషనల్
జీవితంలో ప్రతి ఒక్కరికి తమ బర్త్‌డేను స్పెషల్‌గా జరుపుకోవాలని కోరిక ఉంటుంది. పుట్టినరోజు వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది. కానీ ఆ పిల్లాడి లైఫ్‌లో మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ పుట్టినరోజుని జరుపుకునే అదృష్టం రాలేదు. విషయం తెలిసి, క్లాస్ టీచర్ అందించిన సర్‌ప్రైజ్‌కి ఆ బాలుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ క్లాస్ టీచర్ ఏం చేసిందంటే.. కొలంబియాకు చెందిన ఏంజెల్ డేవిడ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు జీవితంలో ఇప్పటివరకు పుట్టినరోజును జరుపుకోలేదు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితుల రీత్యా అతని తల్లి డేవిడ్ బర్త్‌డే వేడుకలను ఇంత వరకు సెలబ్రేట్ చేయలేకపోయింది. తండ్రి లేకపోవడం, ఏంజెల్ డేవిడ్ సహా నలుగురు పిల్లల బాధ్యత ఆమె ఒంటరిగా చూసుకునేది. దీంతో పేదరికం కారణంగా డేవిడ్‌కు ఎనిమిదేళ్లు వచ్చినా ఇంతవరకు పుట్టినరోజును నిర్వహించలేకపోయింది. విషయం తెలిసిన డేవిడ్ క్లాస్ టీచర్ అతని బర్త్‌డేను పెద్ద వేడుకలా చేయాలని నిర్ణయించుకుంది. దీంతో కేక్, డెకరేషన్తో క్లాస్ రూమ్‌లోనే డేవిడ్‌కు తెలియకుండా సర్ప్రైజ్గా బర్త్‌డే వేడుకలను ఏర్పాటు చేసింది. క్లాస్‌లోకి డేవిడ్ అడుగుపెట్టగానే క్లాస్ టీచర్ సహా అతని క్లాస్మేట్స్ అందరూ హ్యాపీ బర్త్‌డే అంటూ సాంగ్స్ పాడుతూ అతన్ని క్లాస్‌రూంలోకి వెల్కమ్ చెప్పారు. ఊహించిన ఈ సర్ప్రైజ్తో డేవిడ్ ఆనందంతో ఏడ్చేశాడు. దీంతో పిల్లలంతా ఒక్కచోట చేరి డేవిడ్‌ను కౌగిలించుకొని బర్త్‌డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Hear Her Stories 📣 (@hearherstories) -
Sekhar Master Daughter Sahithi Birthday: శేఖర్ మాస్టర్ కూతురు బర్త్ డే.. ఫోటోలు వైరల్!!
-
'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్‌గా ల్యాప్‌ట్యాప్స్
ప్రముఖ సినీ దర్శకుడు పి.వాసు శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను చైన్నెలోని లైకా సంస్థ కార్యాలయంలో జరుపుకున్నారు. ఈయన గత 40 ఏళ్లుకు పైగా దర్శకుడిగా రాణిస్తున్నారు. వివిధ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన చిత్రం చంద్రముఖి –2. (ఇదీ చదవండి: ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ!) రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'చంద్రముఖి 2'.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో వడివేలు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు జన్మదిన వేడుకలను లైకా సంస్థ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో నటుడు రాఘవ లారెన్స్, లైకా సంస్థ ప్రధాన నిర్వాహకుడు జీకే ఎం తమిళ్ కుమరన్ పాల్గొని పి.వాసుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పి.వాసు తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి ల్యాప్ట్యాప్లని కానుకగా అందించారు. (ఇదీ చదవండి: రైతుబిడ్డకి వార్నింగ్.. రతిక బిహేవియర్‌పై నాగ్ సీరియస్!) -
హ్యాపీ బర్త్‌డే పీచెస్
విశాఖపట్నం: ఇందిరా గాంధీ జూ పార్కులో పీచెస్ అనే ఆడ తెల్ల పులి పుట్టిన రోజు ఘనంగా జరిగింది. తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీఈ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు పులి మాస్క్‌లు ధరించి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్యూరేటర్ నందనీ సలారియా కేకు కట్ చేసి సందర్శకులకు పంచిపెట్టారు. సీపీఈ కళాశాల యాజమాన్యం ఆ పులిని నెల రోజుల పాటు దత్తత తీసుకుంది. పీచెస్ పుట్టి ఐదేళ్లు పూర్తయిందని, ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించామని క్యూరేటర్ తెలిపారు. నెల రోజుల పాటు పీచెస్కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన సీపీఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చ మత్తులో జోగుతున్న ఈనాడు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టనిదే ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు వ్యక్తుల మధ్య ఆవేశకావేశాలతో జరిగిన ఘర్షణకు గంజాయే కారణమని, అది సర్కారు నిర్వాకమని వక్రీకరించింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్టు అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నంచింది. ‘గంజాయి రాజ్యంలో ముఠాల అరాచకం’ శీర్షికన గురువారం దుష్ప్రచారానికి పూనుకుంది. వాస్తవాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని దమ్మాలవీధికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కేశవ రాంబాబు ఈ నెల 23న రాత్రి 8.30 గంటలకు తన బైక్‌పై వెళుతూ మార్గం మధ్యలో కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. దిల్లేశ్వరరావు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫి క్కు అంతరాయం కలిగింది. దీనిపై తన బైక్‌కు దారి ఇవ్వమని రాంబాబు ఆ వేడుకల్లో ఉన్న యువకులను అడిగారు. దాంతో మాధవ్, దేవా, కార్తిక్ అనే యువకులతో రాంబాబుకు వా గ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దాంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇరువర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆ సామాజికవర్గ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ మేరకు రాంబాబు రాజీ లేఖను పోలీసులకు సమర్పంచారు. ఆ లేఖను న్యా యస్థానానికి నివేదించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఈనాడు వక్రీకరించి గంజాయి మత్తు లో ఘర్షణ జరిగిందంటూ దుష్ప్రచారం చేసి, చంద్రబాబుకు అనుకూల వాతావరణం సృష్టించా లని పచ్చపాతాన్ని ప్రదర్శించడం దారుణం. -
Lakshmi Manchu: ఘనంగా మంచు లక్ష్మీ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బర్త్ డే సెలెబ్రేషన్స్ చర్చనీయాంశం
-
అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి..
నల్గొండ: మరో పది రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఐశ్వర్యను అంతలోనే మృత్యువు కబలించింది. పుట్టిన రోజు వేడుక సన్నాహాల్లో భాగంగా షాపింగ్‌కు వెళ్లిన ఐశ్వర్య దుండగుడి తూటాలకు బలికావడం ఆమె కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఐశ్వర్య ఈ నెల 18న పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల నడుమ జరుపుకోవాలని భావించింది. అమెరికాలోని టెక్సాస్ లోని ఎలెన్ సూపర్ మార్కెట్‌కు షాపింగ్ కోసం వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చలాకీగా, సరదాగా ఉండే ఐశ్వర్య ఇక లేదని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆమె చదువు పూర్తి కాగానే అక్కడే ఫర్ఫెక్ట్ జనరల్ కాంటాక్టర్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తోంది. ఇంకో నెల రోజుల్లో అదే కంపెనీకి సీఈవోగా నియమించేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఉద్యోగోన్నతి పొందకుండానే ఆమె కానరాని లోకాలకు వెళ్లిపో యింది. ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40 గంటలకు తల్లిదండ్రులు తాటికొండ నర్సిరెడ్డి–అరుణతో తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా షాపింగ్‌కు వెళ్తున్న విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. తల్లి దండ్రులతో అవే చివరి మాటలు. కాగా, ఐశ్వర్య భౌతికకాయం బుధవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేల పరామర్శ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దుండుగల తూటాలకు బలైన నేరేడుచర్ల మున్సిపాలిటీలోని పాత నేరేడుచర్లకు చెందిన ఐశ్వర్య కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని వారి నివాసంలో మంగళవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పరామర్శించారు. ఐశ్వర్య భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. -
రిషబ్ శెట్టి బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. కూతురి బర్త్‌డేలో కన్నడతారల సందడి (ఫొటోలు)