
మండేలా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న గుప్తా, మద్దిలేటి తదితరులు
వనపర్తిటౌన్ : జాతి అహంకార దోపిడీని ధిక్కరించి, సమాన హక్కుల సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన పోరాటయోధుడు నెల్సన్ మండేలా అని తెలంగాణ న నిర్మాణ వేదిక రాష్ట్ర గౌరవా«ధ్యక్షుడు మురళీధర్‌గుప్తా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మండేలా 100వ జయంతి వేడుకలను టీజేఏసీ, నవ నిర్మాణ వేదిక సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 18లో యూరోప్ నుంచి వలస వచ్చిన వర్తకులు, పెట్టుబడిదారులు దక్షిణాఫ్రికాలోని ప్రజలను బానిసలుగా మార్చారని తెలిపారు.
నల్ల జాతీయి ల హక్కులను కాలరాసి వెట్టిచాకిరీ చేయిస్తున్నా రన్నారు. ఆ బానిస సంకెళ్లను విడిపించేందుకు మండేలా శాంతియుత మార్గంలో పోరాడారని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తి ప్ర పంచానికి మార్గదర్శనంలా మారిందని చెప్పారు. బాలుర కళాశాల ప్రిన్సిపాల్ మద్దిలేటి, టీజేఏసీ కన్వీనర్ రాజారాంప్రకాశ్, డీటీఎప్ జిల్లా అధ్యక్షుడు యోసేపు లెక్చలర్ రంగస్వామి, ఖాదర్‌పాష, కళాకారుడు డప్పు నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment