
సాక్షి, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
మరో ఘటనలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆత్మకూరులోని స్థానిక బీసీకాలనీలో నివాసముంటున్న శ్రావణి(30) సోమవారం మధ్యాహ్నం 3:30గంటల సమయంలో చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
విషయాన్ని గమనించిన భర్త పరశురాములు ఆమెను కిందకి దించి చుట్టుపక్కలవారికి, భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతిరాలికి ఒక కుమారుడు, ఒక కూతరు ఉన్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భర్తే హతమార్చాడంటూ ఫిర్యాదు
తమ కూతురు శ్రావణిని భర్త పరశురాములే హతమార్చాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివమాల దీక్షలో ఉన్న అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment