సాక్షి, కొత్తకోట: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇక, కారు కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతిచెందిన వారి వివరాలు..
అబ్దుల్ రహమాన్ (62),
సలీమా జీ (85),
చిన్నారులు వాసిర్ రవుత్ (7 నెలలు),
బుస్రా (2),
మరియా (5).
Comments
Please login to add a commentAdd a comment