
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ రవి గాంధారి మండల కేంద్రంలో విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం వేగంగా దూసుకొచ్చిన కారు అక్కడే ఉన్న రవిని ఢీకొట్టింది. ఈ క్రమంలో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో రవితో పాటు విధులు నిర్వహిస్తున్న సుభాష్ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment