బల్మూర్: మద్యం తాగి నిత్యం వేధిస్తున్న భర్తను కుమారుడితో కలిసి కట్టుకున్న భర్త హతమార్చిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలో సోమవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎండి మహమూద్ (45) తాపీమేసీ్త్రగా, భార్య నిరంజన్‌బీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా కుమార్తె వివాహం జరిగింది.
మహమూద్ నిత్యం మద్యం తాగొచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఘర్షణకు దిగి భార్యపై గొడ్డలితో దాడి చేయగా.. ఆమె ఎదురుతిరిగి కుమారుడు పాషాతో కలిసి అదే గొడ్డలి తీసుకొని కొట్టగా తల, గొంతుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఖైరున్‌బీ ఫిర్యాదు మేరకు నిరంజన్‌బీ, కుమారుడు పాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment