mother commits suicide
-
పాపం ఏ కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివాహిత అనుమానాస్పద మృతిమరో ఘటనలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆత్మకూరులోని స్థానిక బీసీకాలనీలో నివాసముంటున్న శ్రావణి(30) సోమవారం మధ్యాహ్నం 3:30గంటల సమయంలో చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.విషయాన్ని గమనించిన భర్త పరశురాములు ఆమెను కిందకి దించి చుట్టుపక్కలవారికి, భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతిరాలికి ఒక కుమారుడు, ఒక కూతరు ఉన్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.భర్తే హతమార్చాడంటూ ఫిర్యాదు తమ కూతురు శ్రావణిని భర్త పరశురాములే హతమార్చాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివమాల దీక్షలో ఉన్న అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు. -
బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
హుకుంపేట(విశాఖపట్నం): మానసిక స్థితి బాగోలేక బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. అందరినీ కంటతడి పెట్టించిన ఈ హృదయవిదారక ఘటన వివరాలు కుటుంబ సభ్యులు, ఎస్ఐ నాయుడు కథనం మేరకు ఇలావున్నాయి. మండలంలోని తడిగిరి పంచాయతీ కేంద్రంలో అరిసేల వాసుదేవ్ భార్య రాధిక (30) మంగళవారం సాయంత్రం ఇంటిలో నాలుగు నెల చిన్నారిని చంపి తాను దూలానికి చీరతో ఉరివేసుకుని మృతి చెందింది. చదవండి: ఆ వీడియో ఒరిజినల్ కాదు వాసుదేవ్ తమ్ముడు గిరి ఆవులు కాసేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఉరివేసుకుని ఉండడంతో భయందోళన చెంది గ్రామస్తులకు తెలిపాడు. దీంతో ఇంటికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాసుదేవ్,రాధికకు వివాహం జరిగి రెండేళ్లు అయింది. ఇంట్లో వాసుదేవ్ తల్లి, ఇద్దరు తమ్ముళ్లు కలిసి బాగానే ఉంటారని, ఇంట్లో ఎటువంటి గొడవలు లేవని బంధువులు తెలిపారు. రాధిక మానసికంగా ఇబ్బంది పడి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకపోయినప్పటికీ గతంలో బిడ్డ పుట్టిన వారం రోజుల తరవాత భర్త, చిన్నారిని వదిలి అర్ధరాత్రి పెదబయలు మండలం ముసిడిపిపుట్టు గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయిందని వారు చెబుతున్నారు. ఈ ఘటనకు మానసిక సమస్యే కారణం కావొచ్చని భర్త వాసుదేవ్ తెలిపాడు. ఎస్ఐ నాయుడు సంఘటన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కూతురు కులాంతర వివాహం.. భవిష్యత్‌పై బెంగతో..
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కులాంతర వివాహం చేసుకున్న కూతురిని అల్లుడు తీసుకెళ్లడం లేదని, కూతురి భవిష్యత్‌పై బెంగతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని లింగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తానాజీనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యపల్లి గ్రామానికి చెందిన గూడ సత్తయ్య, వరలక్ష్మి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు నాగలక్ష్మి ఆరు నెలల క్రితం రోటిగూడకు చెందిన వెంకటేశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కొద్దిరోజులకే ఆమెను ఇంట్లో వదిలి వెళ్లిన అల్లుడు తిరిగి తీసుకెళ్లడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి(48) ఆదివారం రాత్రి ఇంటి పక్క ఉరేసుకుంది. మృతురాలి భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. స్థల వివాదంలో నిండు ప్రాణం బలి సాక్షి, సిరికొండ(బోథ్): చిన్న స్థల వివాదం చిలికిచిలికీ గాలివానగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన మండలంలోని రాంపూర్‌గూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాథోడ్ ఉమ్మజీ(32), రాథోడ్ మహదులు ఇద్దరు వరుసకు బాబాయి, కొడుకులు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. రాథోడ్ మహదు మూడు రోజుల క్రితం మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాడు. కాగా ఈ స్థలంపై ఇరు కుటుంబాలు గొడవకు దిగాయి. ఆదివారం రాత్రి రాథోడ్ మహదు, కుటుంబ సభ్యులతో కలిసి రాథోడ్ ఉమ్మజీపై దాడి చేయగా ఉమ్మజీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాథోడ్ మహదు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ అన్నారు. ఉమ్మజీకి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, రెండు నెలల మగ కవల పిల్లలు ఉన్నారు. -
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య
-
పిల్లలపై కిరోసిన్ పోసి అంటించి.. తల్లి ఆత్మహత్య
వైఎస్ఆర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఓ తల్లి.. తర్వాత తాను కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనలో తల్లి కల్పనతో పాటు కుమార్తె అఖిలేశ్వరి మరణించగా, కుమారుడు విశాల్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాధారణంగా కల్పన కుటుంబంలో పెద్దగా గొడవలు కూడా ఏమీ లేవని గ్రామస్థులు చెబుతున్నారు. కానీ, కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘోరం జరిగి ఉంటుందని కల్పన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పన భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.