వైఎస్ఆర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఓ తల్లి.. తర్వాత తాను కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.
వైఎస్ఆర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఓ తల్లి.. తర్వాత తాను కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనలో తల్లి కల్పనతో పాటు కుమార్తె అఖిలేశ్వరి మరణించగా, కుమారుడు విశాల్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సాధారణంగా కల్పన కుటుంబంలో పెద్దగా గొడవలు కూడా ఏమీ లేవని గ్రామస్థులు చెబుతున్నారు. కానీ, కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘోరం జరిగి ఉంటుందని కల్పన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పన భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.