
హుకుంపేట(విశాఖపట్నం): మానసిక స్థితి బాగోలేక బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. అందరినీ కంటతడి పెట్టించిన ఈ హృదయవిదారక ఘటన వివరాలు కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ నాయుడు కథనం మేరకు ఇలావున్నాయి. మండలంలోని తడిగిరి పంచాయతీ కేంద్రంలో అరిసేల వాసుదేవ్ భార్య రాధిక (30) మంగళవారం సాయంత్రం ఇంటిలో నాలుగు నెల చిన్నారిని చంపి తాను దూలానికి చీరతో ఉరివేసుకుని మృతి చెందింది.
చదవండి: ఆ వీడియో ఒరిజినల్ కాదు
వాసుదేవ్ తమ్ముడు గిరి ఆవులు కాసేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఉరివేసుకుని ఉండడంతో భయందోళన చెంది గ్రామస్తులకు తెలిపాడు. దీంతో ఇంటికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాసుదేవ్,రాధికకు వివాహం జరిగి రెండేళ్లు అయింది. ఇంట్లో వాసుదేవ్ తల్లి, ఇద్దరు తమ్ముళ్లు కలిసి బాగానే ఉంటారని, ఇంట్లో ఎటువంటి గొడవలు లేవని బంధువులు తెలిపారు.
రాధిక మానసికంగా ఇబ్బంది పడి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకపోయినప్పటికీ గతంలో బిడ్డ పుట్టిన వారం రోజుల తరవాత భర్త, చిన్నారిని వదిలి అర్ధరాత్రి పెదబయలు మండలం ముసిడిపిపుట్టు గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయిందని వారు చెబుతున్నారు. ఈ ఘటనకు మానసిక సమస్యే కారణం కావొచ్చని భర్త వాసుదేవ్ తెలిపాడు. ఎస్‌ఐ నాయుడు సంఘటన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment