దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్‌లో లేహ్, తేజ్‌పూర్‌లో ప్రయోగశాలను, హైదరాబాద్‌లో డీఆర్‌డీఎ్‌ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్‌ఎస్‌టీఎల్‌లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్‌లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment