indian scientist
-
రక్షణ రంగంలో సైంటిస్ట్ సూరి భగవంతం సేవలు అమోఘం
దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్‌లో లేహ్, తేజ్‌పూర్‌లో ప్రయోగశాలను, హైదరాబాద్‌లో డీఆర్డీఎ్ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్ఎస్టీఎల్లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్‌లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. -
Aditi Sen De: అద్వితియ ప్రతిభ
పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్‌లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్‌కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి.... అలహాబాద్‌లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి. కోల్‌కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అదితి పోలాండ్లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. తన థీసీస్‌కు క్వాంటమ్ ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది. ‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్‌ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్‌ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి. ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్‌గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్సిస్టమ్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది. క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. సమన్వయం చేసుకుంటూ... కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. – అదితి సేన్ -
స్వాతి నాయక్‌కు నార్మన్ బోర్లాగ్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. -
Anna Mani: నాన్నా.. నేనెందుకు చదువుకోకూడదు?!
ఒకప్పటి పరిస్థితులు వేరే!. పురుషాధిక్య సమాజంలో పలు రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. అయితే అలాంటి తారతమ్యాలను నిలదీసి.. తాను ఎందులోనూ ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు అన్నా మణి. విచిత్రమేంటంటే.. ఆమె పోరాటం మొదలైంది ఇంటి నుంచే!. అన్నా మణి.. భారత వాతావరణ సూచన తల్లి mother of Indian weather forecast గా పేర్కొంటారు. 1918 కేరళ పీర్మేడ్లో సిరియన్-క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారామె. చాలా ఉన్నత కుటుంబం, విద్యావంతుల కుటుంబం ఆమెది. కానీ, ఆడబిడ్డలు వివాహానికే పరిమితం కావాలనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పే పోరాటం చేసింది అన్నా మణి. తాను చదువుకోవాలని.. చదువు తన హక్కుగా పేర్కొంటూ తండ్రిని ఒప్పించి.. స్కూల్లో చేరింది. బాల మేధావిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా.. అన్నింటికి మించి భారత వాతావరణ శాఖకు ఆమె అందించిన సేవలు.. ఈనాటికీ చిరస్మరణీయం. అన్నా మణి జయంతి నేడు(ఆగస్టు 23). ఈ 104వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్ డూడుల్ రిలీజ్ చేసింది గూగుల్. ► తన ఎనిమిదవ పుట్టినరోజుకు ఇంట్లో వాళ్లు డైమండ్ ఇయర్ రింగ్స్ కానుకగా ఇచ్చారు. కానీ, అన్నా మణి మాత్రం వాటిని తీసుకోలేదు. వాటికి బదులు.. Encyclopædia Britannica కావాలని ఆమె పెద్ద గొడవే చేసిందట. ► పబ్లిక్ లైబ్రరీలో పుస్తకాలను పన్నెండేళ్ల వయసులోనే తిరగేసింది. బాల మేధావిగా గుర్తింపు. ► మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. నారీ శక్తికి ఉదాహరణగా.. దేశభక్తిని ప్రదర్శించింది. ► చెన్నైలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. ► ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో.. రీసెర్చ్ స్కాలర్షిప్ గెల్చుకుంది. ► లండన్ ఇంపీరియల్ కళాశాలలో ఫిజిక్స్ అభ్యసించింది. కానీ, ఆ తర్వాత వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తికనబర్చింది. ► పీహెచ్డీ కల మాత్రం కలగానే మిగిలిపోయింది అన్నా మణికి. ► డబ్యూసీసీలో ఉపన్యాసకురాలిగా పని చేయడంతో పాటు.. సీవీ రామన్ దగ్గర ఐఐఎస్‌లో స్పెక్ట్రోస్కోపీ అభ్యసించారామె. ► 1948లో భారత్‌ను తిరిగొచ్చిన ఆమె.. ఆమె భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. ► వాయు వేగం, సోలార్ ఎనర్జీ కొలమానం కోసం పరికరాలను తయారు చేసి.. వాటితో ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ► పురుషాధిక్య సమాజం.. రంగంలోనూ ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ► భారత వాతావరణ శాఖ ఐఎండీకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఆమె విధులు నిర్వహించారు. ► 1987లో ఐఎన్ఎస్ఏ కేఆర్ రామనాథన్ మెడల్‌తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. ► గుండె సంబంధిత సమస్యలతో.. 2001, ఆగస్టు 16న ఆమె కన్నుమూశారు. ► సోలార్ రేడియేషన్, ఓజోన్, విండ్ ఎనర్జీ కొలమానం కోసం ఎన్నో పరిశోధనలు చేసి.. వ్యాసాలు రాశారు. ► కేవలం తన విద్యా-విజ్ఞాన సుముపార్జన, ఆసక్తి ఉన్న రంగంపైనే దృష్టి పెట్టిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ► ప్రపంచ వాతావరణ సంస్థ 100వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది మరియు అన్నా ఇంటర్వ్యూతో పాటు ఆమె జీవిత ప్రొఫైల్‌ను ప్రచురించింది. -
చైతన్య భారతి: టెస్సీ థామస్ / 1963 అగ్ని పుత్రిక
భువనేశ్వర్. జనవరి 3 మంగళవారం 2012. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్శిటీ క్యాంపస్. భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతున్నారు. పదిహేనువేల మంది సైంటిస్టులు, ఇరవై మంది నోబెల్ గ్రహీతలు, ఐదొందల మంది విదేశీ ప్రతినిధులు, లక్షమంది యువకులు, యువతులు శ్రద్ధగా వింటున్నారు. తొంభై తొమ్మిదవ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ మొదలైన రోజది! సైన్స్ అండ్ టెక్నాలజీలో మనమింకా ఎంతో సాధించాలని అంటున్నారు మన్మోహన్. అంటూ అంటూ... సడెన్‌గా... మిస్సయిల్ ఉమన్ టెస్సీ థామస్‌ను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అన్నారు. సదస్సు ఒక్కసారిగా బర్త్‌డే బెలూన్లా పేలింది. హర్షధ్వానాలు చెమ్కీ ముక్కలై గాల్లో తేలాయి! టెస్సీ థామస్ వంటి కృతనిశ్చయం గల మహిళలు మన అమ్ముల పొదిలో ఉంటే భారత్ ఇలాంటి అగ్నులు ఎన్నింటినైనా అలవోకగా కురిపించగలదనే భావం మన్మోహన్ మాటల్లో ధ్వనించింది. టెస్సీ... అగ్ని ప్రాజెక్టుకు డైరెక్టర్! ఈ అగ్నిపుత్రికకు ఇన్స్పిరేషన్... తుంబా. కేరళ రాజధాని తిరువనంతపురానికి శివార్లలో ఉన్న అరేబియా తీర ప్రాంత గ్రామం ‘తుంబా’కు, టెస్సీ చదువుకున్న తీరప్రాంత పట్టణం అలప్పుళకు మధ్య కొన్ని వందల కి.మీ. దూరం ఉన్నప్పటికీ, ఆ దూరాన్ని ఇప్పుడు మనం... పన్నెండేళ్ల వయసులో టెస్సీ ఏర్పరచుకున్న జీవిత ధ్యేయంతో మాత్రమే కొలవాలి! టెస్సీకి ఇన్స్పిరేషన్ మనుషుల నుంచి రాలేదు. తుంబాలో ఆనాడు తను చూసిన రాకెట్ ఎగిరే ప్రదేశం నుంచి వచ్చింది. సాదా సీదా చీరలో, చిరునవ్వుతో కనిపించే టెస్సీతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు తక్షణ శక్తిలా ఆడపిల్లలకు తక్షణ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. భవిష్యత్తుపై కొత్త ఆశతో వారి కళ్లు మెరుస్తాయి. ఏదైనా సాధించగలను అన్న ధీమా వస్తుంది! 1988లో పుణె నుంచి హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబరేటరీకి బదలీ అయిన కొత్తల్లో ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.పి.జె. కలామ్ ఇదే విధమైన ధీమాను, అత్మవిశ్వాన్ని టెస్సీలో కలిగించారు. ఆమె ప్రావీణ్యాలను మలిచిన మరో గురువు అవినాశ్ చందర్. అనతికాలంలోనే ఈ శిష్యురాలు తన గురువులిద్దరి ప్రఖ్యాతిని, డి.ఆర్.డి.ఓ. ప్రతిష్టను నిలబెట్టగలిగారు. (చదవండి: ఎస్. త్రిపాఠీ నిరాలా / 1897–1961 కాలాతీత కవి) -
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్‌కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సర్వ్‌జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
సైన్స్‌ను జనం దరి చేర్చినవాడు
వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎల్)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం) డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్‌గా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి! - డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి) -
‘కరోనా’ మూలాలపై అన్వేషణ!
జెనీవా: భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్ల గుట్టుని నిగ్గు తేల్చడానికి శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసింది. ఈ బృందం కరోనా వైరస్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్ల పుట్టుకపై అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా ఈ తరహా వైరస్ల పుట్టుకపై అధ్యయనాలు ఎలా చేయాలో సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కొన్ని మార్గదర్శకాలను సైతం రూపొందిస్తుంది. ఈ బృందంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 700 దరఖాస్తులు రాగా, అందులో 25 పేర్లను డబ్ల్యూహెచ్ఓ ఎంపిక చేసింది. బృంద సభ్యుల పేర్లతో త్వరలో తుది జాబితాను వెల్లడించనుంది. ఇదే ఆఖరి అవకాశం డబ్ల్యూహెచ్ఓ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్(సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్తకి సైతం చోటు లభించడం విశేషం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి గత ఏడాదే పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ డబ్ల్యూహెచ్ఓ బృందంలో పని చేసే అవకాశం ఉంది. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా రామన్‌కు పేరుంది. ఐసీఎంఆర్‌లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్‌లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కరోనాతో పాటు వివిధ వైరస్ల గుట్టుమట్లను తెలుసుకునేందుకు సైంటిస్టులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న డబ్ల్యూహెచ్ఓ వారిచ్చే సూచనల మేరకు నడుచుకోనుంది. కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ అధా్నమ్ ఘెబ్రాయసిస్ అన్నారు. గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఈసారి కూడా చోటు కల్పించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ విచారణలో ఏమైనా రాజకీయపరమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని చైనా హెచ్చరించింది. డబ్ల్యూహెచ్ఓ బృందానికి శాస్త్రీయంగా మద్దతు ఇస్తామే తప్ప రాజకీయం చేస్తే ఊరుకోబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ తేల్చి చెప్పారు. -
Gagandeep Kang: వాక్సినాలజిస్ట్ చల్లనమ్మ
థర్డ్ వేవ్ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది! కరోనా వ్యాప్తి ఈ నెల మధ్యలో తగ్గడం ప్రారంభించి, నెలాఖరుకు క్షీణ దశకు చేరుకుంటుందని గగన్‌దీప్ కాంగ్ అనే వ్యాక్సినాలజిస్ట్ గురువారం ఓ వెబినార్‌లో చెప్పారు! ఊరికే ధైర్యం చెప్పడం కోసం ఆమె ఆ మాట అనలేదు. నిరుడు మార్చి నెలలో దేశంలో కరోనా కేసులు అరవైకి చేరి, ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళనకు చేరువవుతున్న దశలో సైతం గగన్‌దీప్ మరీ బెంబేలెత్తి పోనవసరం లేదని భరోసా ఇవ్వడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అలెర్ట్ చేశారు మంచి మాటల చల్లనమ్మ గగన్ దీప్ కాంగ్! గగనదీప్ వైరాలజిస్ట్. వైరస్ల మీద పరిశోధనలు చేస్తుంటారు. ప్రస్తుతం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో ‘గ్యాస్ట్రోఇంటెస్టెనల్ సైన్సెస్’ విభాగం ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. బ్రిటన్‌లోని ‘రాయల్ సొసైటీ’ ఫెలోషిప్‌ను పొందిన తొలి భారతీయ మహిళ గగన్‌దీప్. అయితే ఆమె అసలైన గుర్తింపు మాత్రం ఐదేళ్ల చిన్నారులకు సోకే రోటా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తగానే! రోటా వైరస్ వల్ల వచ్చే డయారియాతో ఏటా లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవారు. ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్టవేశారు గగన్‌దీప్. ఏడాదిన్నరగా ఆమె కరోనా వైరస్ స్వభావాన్ని పరిశోధిస్తున్నారు. ఆ ఫలితాల గురించి ఉమెన్ ప్రెస్ కోర్స్ వెబినార్‌లో చెబుతున్నప్పుడే.. ‘‘ఇప్పుడు మేము పరిశీలిస్తున్న కరోనా వైరస్ గుణాలను బట్టి మే నెల మధ్య నుంచీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని గగన్‌దీప్ చెప్పారు. ∙∙ ఏ విషయాన్నైనా ‘భయం లేదు’ అన్నట్లే ప్రకటిస్తారు గగన్‌దీప్. అదే సమయంలో ‘నిర్లక్ష్యంగా ఉండేందుకూ లేదు’ అని భుజం తట్టినట్లు చెబుతారు. ‘‘శాస్త్రవేత్తలుగా మా దగ్గర పరిష్కారాలు ఉంటాయి. మీ దగ్గర జాగ్రత్తలు ఉండాలి’’ అంటారు. ఇప్పుడీ కరోనా పరిస్థితులకు చక్కగా సరిపోయే మాటే. భయం అక్కర్లేదు. కానీ అతి ధైర్యమూ పనికి రాదు. ఇక ఆమె చెప్పే ఏ మాటైనా మనం నిశ్చింతగా ఎందుకు నమ్మేయాలంటే.. తను వైరాలజిస్ట్, వాక్సినాలజిస్టు కూడా కాబట్టి. గగన్‌దీప్‌కు చిన్నప్పట్నుంచీ.. రూఢీ కానిదేదీ నమ్మదగినది కాదనే నమ్మకం ఉంది. ఆమె తండ్రి రైల్వేస్‌లో మెకానికల్ ఇంజనీరు. తల్లి ఇంగ్లిష్, మేథ్స్ సబ్జెక్టుల టీచర్. íసిమ్లాలో పుట్టారు గగన్‌దీప్. తండ్రి ఉద్యోగంలో ఉండే బదిలీల వల్ల పదో తరగతికి వచ్చేలోగా పది స్కూళ్లు మారారు. దేశమంతటా తిరిగి చదివినట్లు లెక్క. బయాలజీ, ఫిజిక్సు, కెమిస్ట్రీ ఆమెకు ఇష్టమైన పాఠ్యాంశాలు. తండ్రి చేత ఇంట్లోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేయించుకుని పరిశీలనలు, ప్రయోగాలు చేస్తుండేవారు. ఆ ఆసక్తే ఆమె చేత మెడిసిన్ చదివించింది. మైక్రో బయాలజీలో పీహెచ్డీ చేయించింది. ఇక పలు రకాలైన వైరస్లు, బాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు ఆమె చేసిన పరిశోధనలు, వాక్సిన్లు కనిపెట్టేందుకు చేసిన కృషి ఆమెకు 2019లో రాయల్ సొసైటీ గౌరవాన్ని సాధించిపెట్టాయి. గగన్‌దీప్ ప్రస్తుతం వెల్లూరులో ప్రొఫెసర్‌గా ఉంటూనే కరోనాను ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు. -
సైన్స్ శిఖరం.. పీఎమ్ భార్గవ
శాస్త్రీయ ఆలోచనలు శాస్త్రవేత్తలందరికి ఉంటాయనుకోవడం పొరపాటు. తాము చేసిన పరిశోధనలకు దైవ సహకారం ఉందని బహిరంగంగా ప్రకటించుకునే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో ఉపగ్రహాలని అంతరిక్షములోకి పంపించే ముందు, తర్వాత కూడా విధిగా మన శాస్త్ర వేత్తలు పూజలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ నిల్వ చేసే పెట్టెలకు కూడా పూజలు చేసే వాటిని ఓపెన్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథంని కల్గి ఉండటమే కాకుండా, సైన్స్ పరిశోధనల విషయంలో పాలకులు తీసుకునే నిర్ణయాలని ఎప్పటికప్పుడు సహేతుకంగా విమర్శించకల్గిన అతి కొద్దిమంది శాస్త్రవేత్తలలో పీఎమ్ భార్గవ ఒకరు. భార్గవ వంటి వ్యక్తిత్వం కల్గిన శాస్త్రవేత్తలు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 22, 1928న రాజస్థాన్‌లోని ఆజ్మీర్లో రామచంద్ర భార్గవ, గాయత్రి భార్గవ దంపతులకు జన్మించారు. ‘జన్యు ఇంజనీరింగ్’ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. భారతదేశంలో ఆధునిక జీవశాస్త్రం వాస్తుశిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 70లలో బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటులో భార్గవ ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్ లోని సంభావన ట్రస్ట్, భోపాల్‌లో బేసిక్ రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ డెవెలప్మెంట్ సొసైటీ, న్యూఢిల్లీలోని మెడికల్లీ ఎవేర్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ వంటి పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. 2005 నుండి 2007 వరకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛెర్మైన్‌గా కూడా పనిచేశారు. భార్గవ 100 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. అలాగే 1986లో ఆయన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1998లో లెజియన్ డి హొన్నూర్తో తనను సత్కరించారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలను ఆయన అందుకున్నారు. జాతి గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన వివిధ సందర్భాలలో వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు, 550 మంది ప్రముఖుల వ్యాసాల సంపుటి, ఆరు పుస్తకాలు కూడా వెలువరించారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థకి వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సంస్థ వల్లే హైదరాబాద్ బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా పేరు పొందింది. భారతదేశంలో జన్యుమార్పిడి పంటలని వేగంగా, ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేకుండా ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పంటలు అధిక దిగుబడినిస్తాయి గానీ, వాటిలో పోషక విలువలు ఉండవని తెలిపారు. జ్యోతిష్యం అశాస్త్రీయం అని ఆయన తెలిపారు. హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. భోపాల్ గ్యాస్ బాధితులకు అండగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. బయోటెక్నాలజీని వ్యాపారకోణంలో ఉపయోగించడానికి ఆయన అంగీకరించలేదు. ఆయనని ఆధునిక భారతదేశ జీవశాస్త్రపిత అని కూడా పిలుస్తారు. సైన్స్ ఫలాలు పేదవారికి అందాలనేది ఆయన ఆశయం. జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రచార సంస్థలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన 2017 ఆగస్ట్ 1న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సైన్స్ ఉద్యమానికి తీరనిలోటు. - ఎమ్. రామ్‌ప్రదీప్, జనవిజ్ఞానవేదిక, తిరువూరు మొబైల్: 94927 12836 -
కేంబ్రిడ్జి విభాగానికి భారత శాస్త్రవేత్త పేరు
లండన్: కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి భారతీయ శాస్త్రవేత్త, ఔషధ దిగ్గజ కంపెనీ సిప్లా చైర్మన్ యూసుఫ్ హమీద్(84)పేరు పెట్టారు. ఈయన కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన క్రైస్ట్ కాలేజీలో చదివారు. యూసుఫ్ హమీద్ 66 ఏళ్లుగా యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి పెట్టిన ఈయన పేరు 2050 వరకు అమలులో ఉంటుందని యూనివర్సిటీ ప్రకటించింది. యూసుఫ్ 2018లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కెమిస్ట్రీ విభాగంలో ఉన్న పీఠానికి దాతగా ముందుకొచ్చారు. దీన్ని యూసుఫ్ హమీద్ 1702 పీఠంగా పిలుస్తుంటారు. కాగా యూసుఫ్ హమీద్ తండ్రి కె.ఎ.హమీద్ ముంబైలో సిప్లా కంపెనీని ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతి తక్కువ ఖర్చుతో హెచ్ఐవీ ఎయిడ్స్ మందులను సరఫరా చేయడంలో ఈ కంపెనీ అగ్రభాగంలో నిలిచింది. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి ఆయన చేసిన సాయం ఎంతో గొప్పదని, విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయోగపడుతుందని వైస్ చాన్స్‌లర్ స్టీఫెన్ జె టూపే అన్నారు. హమీద్‌ని 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. (చదవండి: నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు) -
జిత్తుల మారి వైరస్
బీజింగ్: కరోనా మహమ్మారి జిత్తులు ఒక్కటొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి. వ్యాధి బారిన పడి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే కనపరిచిన వారికి చికిత్స చేశాక.. ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఎనిమిది రోజుల పాటు వైరస్ వారి శరీరంలోనే ఉన్నట్లు గుర్తించామని భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేశ్ శర్మ చైనాలో నిర్వహించిన ఒక పరిశోధన చెబుతోంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ తాజా సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. బీజింగ్‌లోని పీఎల్ఏ జనరల్ ఆసుపత్రిలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్యకాలంలో కరోనా చికిత్స పొందిన 16 మందిపై తాము పరిశోధనలు చేశామని లోకేశ్ శర్మ తెలిపారు. పదహారు మంది రోగుల నుంచి తాము రోజు విడిచి రోజు నమూనాలు సేకరించామని, చికిత్స తరువాత వైరస్ లేనట్లు పరీక్షలు నిర్ధారించినప్పటికీ సగం మందిలో మరో ఎనిమిది రోజులపాటు వైరస్ వారి శరీరంలో ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని చెప్పారు. (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్) -
భారతీయ శాస్త్రవేత్త కృషి..కరోనాకు వ్యాక్సిన్
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్న విషయం తెలిసిందే. చైనాలో ప్రారంభమయిన కరోనా వైరస్ క్రమక్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ను అరికట్టాలనే సంకల్పంతో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎస్ఎస్ వాసన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా బృందం వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ కనిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ఓ) హై సెక్యూరిటీ ల్యాబ్ పరిశోధనల్లో కరోనాకు విరుగుడు కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనా వ్యప్తంగా 31,000 కరోనా కేసులు నమోదయ్యాయి. సీఎస్ఐఆర్ఓ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనంలో వైరస్ పెరుగుదలను గుర్తించారు. ఈ వ్యాక్సిన్‌పై వాసన్ మాట్లాడుతూ.. రక్త నమూనాల నుంచి వైరస్‌ను డోహెర్టీ ఇన్స్టిట్యూట్ ఉద్యోగులు వేరు చేశారని అన్నారు. ఈ సమాచారాన్ని తమకు అందజేసిన డోహెర్టీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్.. వైరస్ సోకినవారిపై ప్రయోగించి, వ్యాక్సిన్ సమర్ధతను పరీక్షిస్తామని, వేగంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వాసన్ తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో ఆస్ట్రేలియన్ ఎనిమల్ హస్బెండరీ లేబొరేటరీ(ఏఏహెచ్ఎల్) అత్యాధునిక సదుపాయాలు అందించినట్లు సీఎస్ఐఆర్ఓ తెలిపింది. శ్వాసకోశ వ్యవస్థలో ఈ వైరస్ ఏ విధంగా వ్యప్తి చెందుతుందో గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ విషయంలో పూర్తిస్థాయిలో చికిత్సకు అవసరమైన పరిశోధనలు వేగవంతం చేసినట్టు వాసన్ పేర్కొన్నారు వాసన్ బిట్స్ పిలానీ, ఐఐఎస్సీ-బెంగళూరులో తన చదువును పూర్తి చేయగా, రోడ్స్ స్కాలర్షిప్ సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌లోని ట్రినిటీ కాలేజీలో పరిశోధనలు చేశారు. డెంగ్యూ, చికెన్‌గున్యా, జికా లాంటి వైరస్ల అధ్యయనంలో వాసన్ కీలక పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా భయం; వీడియో కాల్లో ఆశీర్వాదాలు -
విలువైన వస్తువులుగా పాడైపోయిన ఫోన్లు
న్యూఢిల్లీ : రోజురోజుకి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. దాంతో పాటు ఈ-వ్యర్థాలు కూడా గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ-వేస్ట్ వల్ల వచ్చే ముప్పు కూడా అత్యధికమే. ఈ ముప్పు భారీ నుంచి పర్యావరణాన్ని రక్షించడానికి, పాడైపోయిన స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లాంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విలువైన వస్తువులుగా మార్చి మళ్లీ వాడుకునేలా చేయడానికి పూర్వ ఐఐటీ విద్యార్థి, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఓ ఇండియన్ సైటిస్ట్ ప్రపంచంలోనే తొలి మైక్రో ఫ్యాక్టరీ రూపకల్పనకు సాయం అందించారు. ఈ ఫ్యాక్టరీ లాంచింగ్‌లో ఆయనదే కీలక పాత్ర. ప్రొఫెసర్ వీణ సహజ్వాలా.... యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్లో మెటీరియల్ సైంటిస్ట్, సిడ్నీ వర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ(ఎస్‌ఎంఏఆర్‌టీ)లో డైరెక్టర్. ఆయన ఒకప్పుడు అంటే 1986లో ఐఐటీ కాన్పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. వీణ సహజ్వాలా ప్రస్తుతం మైక్రో ఫ్యాక్టరీల లాంచింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ఈ-వేస్ట్ మైక్రో ఫ్యాక్టరీ అనేదే ప్రపంచంలో మొదటిదని, యూఎస్ఎస్డబ్ల్యూలో దీన్ని టెస్ట్ చేసినట్టు వీణ చెప్పారు. ఇలాంటి మైక్రో ఫ్యాక్టరీలు గ్లాస్, ప్లాస్టిక్, టింబర్ లాంటి కన్జ్యూమర్ వేస్ట్‌ను కమర్షియల్ మెటీరియల్స్గా, ప్రొడక్ట్‌లుగా మార్చనున్నట్టు తెలిపారు. ఎస్‌ఎంఏఆర్‌టీ సెంటర్లో సుదీర్ఘంగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీలు పర్యావరణానికి ముప్పు కలిగించే పెద్ద మొత్తంలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్మూలించనున్నట్టు తెలిపారు. ఇటీవలే ఎస్‌ఎంఏఆర్‌టీ సెంటర్ ల్యాబోరేటరీస్‌లో ఈ మైక్రో ఫ్యాక్టరీని లాంచ్ చేశారు. మైక్రో ఫ్యాక్టరీలు సమీపంలో ఉన్న ఈ-వ్యర్థాలను సేకరించి, వాటిని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల మాదిరిగా రూపాంతరం చేయనున్నారు. అంతేకాక ఇవి కన్జ్యూమర్ డిమాండ్‌కు తగ్గట్టు ఉండనున్నాయి. కంప్యూటర్ సర్క్యూట్ బోర్డులను విలువైన మెటల్ అలోయ్స్గా, ఈ-డివైజ్‌ల గ్లాస్, ప్లాస్టిక్‌ను ఇండస్ట్రియల్ గ్రేడ్ సెరామిక్స్‌లో వాడే మైక్రో మెటీరియల్స్గా మార్చనున్నారు. 50 చదరపు మీటర్లలో ఈ మైక్రో ఫ్యాక్టరీలు ఆపరేట్ చేయవచ్చు. ఎక్కడ స్టాక్ ఎక్కువగా ఉంటే అక్కడ వాటిని ఏర్పాటు చేయొచ్చు. ద్వీపకల్ప మార్కెట్లకు, మారమూల, స్థానిక ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. వీణ సహజ్వాలా 2005లో ఆయన గ్రీన్ స్టీల్‌ను కనుగొన్నారు. దీంతో రీసైకిల్ ప్లాస్టిక్స్‌ను, రబ్బర్ టైర్లను స్టీల్ మేకింగ్‌లో వాడుతున్నారు. -
భారత శాస్త్రవేత్తకు 14 కోట్ల గ్రాంటు
మంజూరు చేసిన సింగపూర్ ఎన్ఆర్ఎఫ్ న్యూఢిల్లీ: భారత పరిశోధకుడు డాక్టర్ మన్వేంద్ర కె సింగ్‌కు సింగపూర్ జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్ఆర్ఎఫ్) రూ. 14.7 కోట్ల గ్రాంటును బహూకరించింది. పుట్టుకతో సహజసిద్ధంగా వచ్చే వ్యాధులు, హృద్రోగ సమస్యలపై పరిశోధనలు చేసేందుకు ఆయనకు దీన్ని మంజూరు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సింగపూర్ ఎన్ఆర్ఎఫ్ ఫెలోషిప్ అందుకున్న ఏడుగురిలో తాను ఒకరినని మన్వేంద్ర చెప్పారు. 2014లో సింగపూర్‌లో జరిగిన మరణాల్లో దాదాపు 30 శాతం హృద్రోగ సంబంధమైనవని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన మన్వేంద్ర ప్రస్తుతం సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్లో, నేషనల్ హార్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
నోబెల్ బహుమతి రేసులో భారతీయ శాస్త్రవేత్త!
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార బహుమతి రేసులో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రామమూర్తి రమేశ్ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రకటించే నోబెల్ బహుమతికి ఎంపిక చేసిన 27 మంది ఆర్ధికవేత్తలు, శాస్త్రవేత్తల జాబితాలో రామమూర్తి రమేశ్ ఒకరు. ఫిజిక్స్ రంగంలో ఈ సంవత్సరపు నోబెల్ బహుమతి అక్టోబర్ 7 తేదిన ప్రకటించనున్నారు. రామమూర్తి బర్కలీ లోని యూనివర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. ఫెర్రో ఎలెక్రికల్ డివైసెస్ అండ్ మల్టీ ఫెర్రోయిక్ మెటిరియల్ అంశంపై డాక్టర్ రామమూర్తి రమేశ్ సేవలందిస్తున్నారు. -
భారత శాస్త్రవేత్తకు అత్యున్నత జీవవైవిధ్య అవార్డు
వాషింగ్టన్: భారత పర్యావరణ శాస్త్రవేత్త కమల్జిత్ సింగ్ బావా ఈ ఏడాది ప్రతిష్టాత్మక మిడోరీ జీవ వైవిధ్యం పురస్కారానికి ఎంపికయ్యారు.60 లక్షల రూపాయల విలువైన ఈ అవార్డుని ఆయన చేసిన పర్యావరణ పరిశోధనలు అందజేయనున్నారు. పర్యావరణంపైన, హిమాలయాల్లో వాతావరణ మార్పులపైన కూడా ఆయన పరిశోధనలు చేశారు. జపాన్‌లోని ఏఇఓఎన్ పర్యావరణ సంస్థ 2010లో మిడోరి జీవ వైవిధ్యం అవార్డుని ఇవ్వడం మొదలు పెట్టింది. దక్షిణ కొరియాలో వచ్చే నెలలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డుని అందుకుంటారు. బోస్టన్లోని మసాచ్చూసెట్ విశ్వవిద్యాలయంలో కమల్ బావా దాదాపు 40 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పని చేశారు. జీవవైవిధ్యానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గున్నెర్స్ అవార్డుని మొట్టమొదట అందుకున్న ఘతన కూడా కమల్ బావాదే. కమల్జిత్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్, పిహెచ్డి చేశారు. జీవావరణ శాస్త్ర, పర్యావరణ శాస్త్ర పరిశోధనల కోసం ఆయన అశోక్ ట్రస్ట్‌ను కూడా స్థాపించారు. ** -
మొక్కలు.. జన్యువులతోనూ మాట్లాడతాయ్!
మొక్కలకు కూడా ప్రాణం ఉందని, అవి కూడా స్పందిస్తాయని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు. మొక్కలు ఒకదానితో ఒకటి రసాయనాలు వెదజల్లడం ద్వారా మాట్లాడతాయనీ పలువురు శాస్త్రవేత్తలు రుజువు చేశారు. అయితే.. మొక్కలు జన్యువుల ద్వారా సైతం అణుస్థాయిలో సమాచార మార్పిడి చేసుకుంటాయని ఇప్పుడు వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, వర్జీనియా టెక్ వర్సిటీల శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆకులు, వేర్లు లేకుండా పచ్చని తీగల మాదిరిగా ఉండే ‘బదనికభేదము’ అనే పరాన్నజీవ మొక్కకు, ఆవ మొక్కలా ఉండే అరేబిడాప్సిస్, టమాటా మొక్కలకూ మధ్య గల సంబంధంపై వీరు అధ్యయనం జరపగా ఆశ్చర్యకర ఫలితాలు వెలుగుచూశాయి. ఈ మొక్కల మధ్య పరాన్నజీవ సంబంధం కొనసాగుతున్నప్పుడు రెండు మొక్కలూ పెద్ద మొత్తంలో ఎంఆర్ఎన్ఏ అణువులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయట. అయితే పరాన్నజీవ మొక్క తనకు కావాల్సిన ఆహారం పొందేందుకు అతిథేయ మొక్కపై ఈ పద్ధతిలో జులుం ప్రదర్శించి, ఆ మొక్కను సులభంగా లొంగదీసుకుంటోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మొక్కల మధ్య ఎంఆర్ఎన్ఏ సమాచార వ్యవస్థ ఆధారంగానే... ప్రధాన పంటలను పీల్చేస్తున్న పరాన్నజీవ కలుపుమొక్కల నివారణకు తరుణోపాయాలు ఆలోచించవచ్చని భావిస్తున్నారు. అలాగే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా ఇలా అణుస్థాయి కమ్యూనికేషన్‌తోనే మొక్కలపై ఆధిపత్యం చలాయిస్తున్నాయా? అన్న కోణంలోనూ పరిశోధించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ట -
ఇక్రిశాట్ శాస్త్రవేత్తకు ‘క్రాప్ సైన్స్ రీసెర్చ్ అవార్డు’
హైదరాబాద్: అంతర్జాతీయ అర్ధశుష్క, ఉష్ణమండల ప్రాంతీయ పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)కు చెందిన భారతీయ శాస్త్రవేత్త హరి డి. ఉపాధ్యాయకు అమెరికాలోని ఓ పరిశోధన సంస్థ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వివిధ పంటలపై పరిశోధనలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా (సీఎస్ఎస్ఏ) ‘క్రాప్ సైన్స్ రీసెర్చ్ అవార్డు’ను అంద జేసింది. ఫ్లోరిడాలో ఇటీవల సీఎస్ఎస్ఏ వార్షిక సమావేశంలో ఉపాధ్యాయకు అవార్డును ప్రదానం చేశారని ఇక్రిశాట్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.