హైదరాబాద్: అంతర్జాతీయ అర్ధశుష్క, ఉష్ణమండల ప్రాంతీయ పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)కు చెందిన భారతీయ శాస్త్రవేత్త హరి డి. ఉపాధ్యాయకు అమెరికాలోని ఓ పరిశోధన సంస్థ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వివిధ పంటలపై పరిశోధనలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు క్రాప్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా (సీఎస్‌ఎస్‌ఏ) ‘క్రాప్ సైన్స్ రీసెర్చ్ అవార్డు’ను అంద జేసింది. ఫ్లోరిడాలో ఇటీవల సీఎస్‌ఎస్‌ఏ వార్షిక సమావేశంలో ఉపాధ్యాయకు అవార్డును ప్రదానం చేశారని ఇక్రిశాట్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.