కమల్జిత్ సింగ్ బావా
వాషింగ్టన్: భారత పర్యావరణ శాస్త్రవేత్త కమల్జిత్ సింగ్ బావా ఈ ఏడాది ప్రతిష్టాత్మక మిడోరీ జీవ వైవిధ్యం పురస్కారానికి ఎంపికయ్యారు.60 లక్షల రూపాయల విలువైన ఈ అవార్డుని ఆయన చేసిన పర్యావరణ పరిశోధనలు అందజేయనున్నారు. పర్యావరణంపైన, హిమాలయాల్లో వాతావరణ మార్పులపైన కూడా ఆయన పరిశోధనలు చేశారు. జపాన్లోని ఏఇఓఎన్ పర్యావరణ సంస్థ 2010లో మిడోరి జీవ వైవిధ్యం అవార్డుని ఇవ్వడం మొదలు పెట్టింది. దక్షిణ కొరియాలో వచ్చే నెలలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డుని అందుకుంటారు.
బోస్టన్లోని మసాచ్చూసెట్ విశ్వవిద్యాలయంలో కమల్ బావా దాదాపు 40 ఏళ్లపాటు ప్రొఫెసర్గా పని చేశారు. జీవవైవిధ్యానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గున్నెర్స్ అవార్డుని మొట్టమొదట అందుకున్న ఘతన కూడా కమల్ బావాదే. కమల్జిత్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్, పిహెచ్డి చేశారు. జీవావరణ శాస్త్ర, పర్యావరణ శాస్త్ర పరిశోధనల కోసం ఆయన అశోక్ ట్రస్ట్ను కూడా స్థాపించారు.
**